← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామ మాహాత్మ్యము nāma māhātmyamu

Original — తెలుగు
  1. "హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ |

ఇతీరయంతి యే నిత్యం నహితాన్ బంధతే కలిః ||". (నారద పురాణము - 41 - 100)

(హరీ, కేశవా, గోవిందా, వాసుదేవా, జగన్మయ | అని ఎవరు నిత్యము భగవన్నామము పలుకుదురో వారిని కలి బాధించదు - వారికి కలిదోషము అంటదు).

  1. "నారకుడైన మనంబులో భవన్నామము చింతచేసిన ననంత సుఖస్థితి నొందకుండునే" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 116)

  2. "రామ రామ, తవనామ జపం తః పామరా అపి తరంతి భవాబ్ధిం |

అంగి నంగి భవదంగుళి ముద్రః - కిం విచిత్రమతరత్కపి రబ్ధిం ||". (శ్రీరామకర్ణామృతం - 4 - 77)

(రామా ! నీనామము జపించువారు సంసారసాగరమును తరింతురు - అటువంటిది నీచేతి ఉంగరము ధరించిన హనుమంతుడు సముద్రమును దాటెననుటలో ఏమివింత ?)

  1. "నజానే జానకీజానే! రామత్వన్నామ వైభవం |

సర్వేశో, భగవాన్ శంభుః వాల్మీకిర్వేత్తి వానవా ||". (శ్రీరామకర్ణామృతం - 3 - 89)

(రామా! నీనామ వైభవము నాకు తెలియదు. సర్వేశ్వరుడు, భగవంతుడు అయిన ఈశ్వరునకుగాని, శ్రీమద్రామాయణమును వ్రాసిన వాల్మీకికిగాని తెలియునో తెలియదో).

  1. "ప్రాతార్నదామ వచసా రఘునాధనామ, వాగ్దోషహరి సకలం కలుషం నిహంతౄ |

యత్పార్వతీ స్వపతినాసహ భోక్తు కామం ప్రీత్యా |

సహస్రహరినామ సమం జజావ | (శ్రీరామకర్ణామృతం - 4 - 71)

(హరియొక్క వేయినామములతో సమానమైన రామనామమును శ్రీపార్వతీదేవి, తన భర్త అయిన శివునితో కలిసి భక్తితో జపించెను - అట్టి మహిమగల శ్రీరామనామము వాగ్దోష హారిన్నీ, సమస్త కల్మషములను హరింపచేయు దానిని నేను ప్రాతః కాలమందు జపించుచుందును).

  1. “హరేర్నామైన నామైవ మమ జీవనం |

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా ||". (నారదపురాణము - 41 - 115)

Transliteration
  1. "harē kēśava gōviṃda vāsudēva jaganmaya |

itīrayaṃti yē nityaṃ nahitān baṃdhatē kaliḥ ||". (nārada purāṇamu - 41 - 100)

(harī, kēśavā, gōviṃdā, vāsudēvā, jaganmaya | ani evaru nityamu bhagavannāmamu palukudurō vārini kali bādhiṃcadu - vāriki kalidōṣamu aṃṭadu).

  1. "nārakuḍaina manaṃbulō bhavannāmamu ciṃtacēsina nanaṃta sukhasthiti noṃdakuṃḍunē" (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 116)

  2. "rāma rāma, tavanāma japaṃ taḥ pāmarā api taraṃti bhavābdhiṃ |

aṃgi naṃgi bhavadaṃguḷi mudraḥ - kiṃ vicitramataratkapi rabdhiṃ ||". (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 77)

(rāmā ! nīnāmamu japiṃcuvāru saṃsārasāgaramunu tariṃturu - aṭuvaṃṭidi nīcēti uṃgaramu dhariṃcina hanumaṃtuḍu samudramunu dāṭenanuṭalō ēmiviṃta ?)

  1. "najānē jānakījānē! rāmatvannāma vaibhavaṃ |

sarvēśō, bhagavān śaṃbhuḥ vālmīkirvētti vānavā ||". (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 89)

(rāmā! nīnāma vaibhavamu nāku teliyadu. sarvēśvaruḍu, bhagavaṃtuḍu ayina īśvarunakugāni, śrīmadrāmāyaṇamunu vrāsina vālmīkikigāni teliyunō teliyadō).

  1. "prātārnadāma vacasā raghunādhanāma, vāgdōṣahari sakalaṃ kaluṣaṃ nihaṃtṝ |

yatpārvatī svapatināsaha bhōktu kāmaṃ prītyā |

sahasraharināma samaṃ jajāva | (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 71)

(hariyokka vēyināmamulatō samānamaina rāmanāmamunu śrīpārvatīdēvi, tana bharta ayina śivunitō kalisi bhaktitō japiṃcenu - aṭṭi mahimagala śrīrāmanāmamu vāgdōṣa hārinnī, samasta kalmaṣamulanu hariṃpacēyu dānini nēnu prātaḥ kālamaṃdu japiṃcucuṃdunu).

  1. “harērnāmaina nāmaiva mama jīvanaṃ |

kalau nāstyēva nāstyēva nāstyēva gatiranyathā ||". (nāradapurāṇamu - 41 - 115)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.