← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామ మహిమ nāma mahima

Original — తెలుగు
  1. "జానాతి రామ తవనామ రుచిం మహేశో". (శ్రీరామ కర్ణామౄతం - 1 - 36)

  2. (శ్రీరామా ! నీ నామమురుచి మహేశ్వరునకు తెలుసును. అట్లు తెలియుట చేతనే మహేశ్వరుడు పార్వతీదేవికి 'శ్రీరామ రామ రామ' అను తారకమంత్రమునుపదేశించెను –

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే ||" –

(శ్రీరామ రామ రామ అనినేను రాముని యందు రమించుదును - ఎందుచేతననగా రామనామము భగవంతుని ఇతర నామములు వేయింటితో సమానము).

"యన్నామైవ సహస్రనామ సదృశం" –

(భగవంతుని రామనామము వేయి ఇతరనామములతో సమాన శక్తి, ఫలముగలది).

  1. "మ. ఒకమాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్

సకలాఘంబులు పల్లటిల్లి తొలగునం ప్రీతితో నట్టి స

త్సుకరన్ మంగళతీర్థపాదు హరి, విష్ణున్ దేవ దేవేశునిన్

అకలంకస్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 5 - 142)

  1. “ఉ - - - నారకుడైన మనంబులో భవ

న్నామము చింత చేసిన ననంత సుఖస్థితి నొందకుండునే" (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 9 - 5 = 116)

(చూడుము - ' నామకీర్తనము ')

Transliteration
  1. "jānāti rāma tavanāma ruciṃ mahēśō". (śrīrāma karṇāmṝtaṃ - 1 - 36)

  2. (śrīrāmā ! nī nāmamuruci mahēśvarunaku telusunu. aṭlu teliyuṭa cētanē mahēśvaruḍu pārvatīdēviki 'śrīrāma rāma rāma' anu tārakamaṃtramunupadēśiṃcenu –

"śrīrāma rāma rāmēti ramē rāmē manōramē |

sahasranāma tastulyaṃ rāmanāma varānanē ||" –

(śrīrāma rāma rāma aninēnu rāmuni yaṃdu ramiṃcudunu - eṃducētananagā rāmanāmamu bhagavaṃtuni itara nāmamulu vēyiṃṭitō samānamu).

"yannāmaiva sahasranāma sadṛśaṃ" –

(bhagavaṃtuni rāmanāmamu vēyi itaranāmamulatō samāna śakti, phalamugaladi).

  1. "ma. okamāṭevvani pēru karṇamulalō noyyāramai sōkinan

sakalāghaṃbulu pallaṭilli tolagunaṃ prītitō naṭṭi sa

tsukaran maṃgaḷatīrthapādu hari, viṣṇun dēva dēvēśunin

akalaṃkasthiti golcu bhaktulaku lēdaḍḍaṃbu rājāgraṇī". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 5 - 142)

  1. “u - - - nārakuḍaina manaṃbulō bhava

nnāmamu ciṃta cēsina nanaṃta sukhasthiti noṃdakuṃḍunē" (śrīmadāṃdhra mahābhāgavatamu - 9 - 5 = 116)

(cūḍumu - ' nāmakīrtanamu ')

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.