← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామకీర్తనము nāmakīrtanamu

Original — తెలుగు
  1. "శ్రీకృష్ణ నామకీర్తనంబు జగన్మంగళంబనియు, జగన్మోహనంబనియు, జగజ్జేగీయమానంబనియునిఖిల పాపైక నిష్కృతియనియును, నిఖిల దుఃఖ నివారణంబనియును, నిఖిల దారిద్ర్య నిర్మూలనంబనియు, నిఖిలమాయాగుణ విచ్ఛేదకంబనియు యమధర్మరాజు చేత కీర్తింపబడియె". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 192)

  2. "శ్రద్ధా భక్త్యో రభావే (అ)పి నామ సంకీర్తనం సమస్తం దురితం నాశయతి, కిముత శ్రద్ధాపూర్వకం సహస్ర నామ సంకీర్తనం నాశయతీతి"

(శ్రీశంకరః)

(శ్రద్ధతోను, భక్తితోను చేయనప్పటికీ, భగవంతుని నామసంకీర్తనము సమస్తమైన పాపములను నశింపచేయుచున్నది. శ్రద్ధతోను భక్తితో నామ సంకీర్తనము చేసినయడల సమస్త పాపములను నశింపచేయునని వేరే చెప్పనేల).

  1. "జ్ఞానతో అజ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ |

తత్సర్వం (కిల్బిషం) విలయం యాతి తో యస్థ లవణం యథా ||".

(తెలిసికాని, తెలియకకాని వాసుదేవుని ఎట్లైన కీర్తించిన నీటియందు పడిన ఉప్పువలె కిల్బిషము - పాపము లయమై పోవును).

  1. "ధ్యాయన్ కృతేయజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్ |

యదాప్నోతి తదాప్నోతి కరౌ సంకీర్త్య కేశవం||". (విష్ణుపురాణం - )

(కృతయుగమున ఘోరమగు తపస్సు చేయుటచేతను, త్రేతాయుగములో యజ్ఞయాగములు చేయుటచేతను, ద్వాపరయుగమున భగవానుని పూజనము చేయుటచేతను - మనుజుడు సంపాదించిన దానిని ఈ కలియుగములో అతని నామ సంకీర్తనము చేయుటచేతనే పొందగలుగును).

  1. "మనసా వా అగ్రే సంకల్ప యత్య ధవా చ - వ్యాహరతి - యద్ధి మనసా ధ్యాయతి తద్వా చా భవతి" ఇతిశ్రుతిభ్యాం స్మరణం ధ్యానంచ నామ సంకీర్తనే అంతర్భూతం". (శ్రీశంకరః)

(మొదట మనసులో సంకల్పించడమగును, తరువాత వాక్కుతో ఆచరించును అనిన్నీ, "దేనిని మనసులో ధ్యానించిన అదియే వాగ్రూపముగానగును" అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత భగవంతుని స్మరించుట, ధ్యానించుట అనునవి భగవంతుని నామ సంకీర్తనములోనివే, స్మరణమువలన ధ్యానమువలన వాగ్రూపముగా భగవంతుని నామ కీర్తనము జరుగుచున్నది).

  1. "తజ్జ పస్త దర్ధ భావనం" (పతంజలి యోగసూత్రములు - 1 - 28)

(పరమత్మయొక్క నామజపము చేయుటయనగా ఆనామముల అర్థము తెలిసి అట్టిపరమాత్మను మనసులోభావించుట).

  1. "క. - - -

- - -శ్రీ పతి పేరే

చందముననైన బలికిన

నందక ధరడందుగలడు నాధుండగుచున్".

"ఆ. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ

కేళినైన మిగులగేలినయిన

- - -

గమలనయను దలప గలుష హరము". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 121, 122)

  1. "ఉ. కూలిన చోట, గొట్టు వడి కుందినచోట, మహాజ్వరాదులం

బ్రేలినచోట సర్వముఖపీడలనందినచోటనార్తులై

తూలినచోట విష్ణుభవదూరుని బేర్కొనిరేని మీదన

క్కాలుని యాతనావితతి గానరు పూనరు దుఃఖ భావముల్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 123)

  1. "సీ. బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్నికీలలు హరినామకీర్తనములు

గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు (నెమళ్ళు) హరినామకీర్తనములు

తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామకీర్తనములు

మధుపాన కిల్బిష మదనాగ సమితికి గేసరుల్ హరినామ కీర్తనములు

తే. మహిత యోగోగ్ర నిధుల సమాధివిధుల

నలరు బ్రహ్మాది సురలకు నందరాని

భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య

ఖేలనంబులు హరినామకీర్తనములు ".

"సీ. ముక్తికాం తైకాం తమోహన కృత్యముల్ గేలిమై హరినామ కీర్తనములు

సత్యలోకానంద సౌభాగ్య యుక్తముల్ గేలిమై - - -

మహితనిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ గేలిమై - -

బహుకాలజనిత తపః ఫలసారముల్ గేలిమై - -

తే. పుణ్యమూలంబులనపాయ పోషకంబు

లభిమతార్థంబు లజ్ఞాన హరణకరము

లాగమాంతోపలబ్దంబు లమృతసేవ

లార్త శుభములు హరినామ కీర్తనములు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 118, 119)

  1. "ఏకం విధిస్యాపి నరక దుఃఖస్య హరినామ కీర్తనమేవ పరిహరకమివ తదేవ మహత్ప్రాయశ్చిత్తం త్రివిధానామపి పాపానాం ఇతి సంతం ఆదరేణ అనుష్టేయు" -

(నరకబాధలకు శ్రీ భగవంతుని నామకీర్తనమే పరిహారమని, అదియే మూడు విధములగు పాపములకు గొప్ప ప్రాయశ్చిత్తమని ఎల్లపుడు దానినే - హరినామకీర్తనమునే అనుష్టింపవలయును).

Transliteration
  1. "śrīkṛṣṇa nāmakīrtanaṃbu jaganmaṃgaḷaṃbaniyu, jaganmōhanaṃbaniyu, jagajjēgīyamānaṃbaniyunikhila pāpaika niṣkṛtiyaniyunu, nikhila duḥkha nivāraṇaṃbaniyunu, nikhila dāridrya nirmūlanaṃbaniyu, nikhilamāyāguṇa vicchēdakaṃbaniyu yamadharmarāju cēta kīrtiṃpabaḍiye". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 192)

  2. "śraddhā bhaktyō rabhāvē (a)pi nāma saṃkīrtanaṃ samastaṃ duritaṃ nāśayati, kimuta śraddhāpūrvakaṃ sahasra nāma saṃkīrtanaṃ nāśayatīti"

(śrīśaṃkaraḥ)

(śraddhatōnu, bhaktitōnu cēyanappaṭikī, bhagavaṃtuni nāmasaṃkīrtanamu samastamaina pāpamulanu naśiṃpacēyucunnadi. śraddhatōnu bhaktitō nāma saṃkīrtanamu cēsinayaḍala samasta pāpamulanu naśiṃpacēyunani vērē ceppanēla).

  1. "jñānatō ajñānatō vāpi vāsudēvasya kīrtanāt |

tatsarvaṃ (kilbiṣaṃ) vilayaṃ yāti tō yastha lavaṇaṃ yathā ||".

(telisikāni, teliyakakāni vāsudēvuni eṭlaina kīrtiṃcina nīṭiyaṃdu paḍina uppuvale kilbiṣamu - pāpamu layamai pōvunu).

  1. "dhyāyan kṛtēyajan yajñaiḥ trētāyāṃ dvāparē arcayan |

yadāpnōti tadāpnōti karau saṃkīrtya kēśavaṃ||". (viṣṇupurāṇaṃ - )

(kṛtayugamuna ghōramagu tapassu cēyuṭacētanu, trētāyugamulō yajñayāgamulu cēyuṭacētanu, dvāparayugamuna bhagavānuni pūjanamu cēyuṭacētanu - manujuḍu saṃpādiṃcina dānini ī kaliyugamulō atani nāma saṃkīrtanamu cēyuṭacētanē poṃdagalugunu).

  1. "manasā vā agrē saṃkalpa yatya dhavā ca - vyāharati - yaddhi manasā dhyāyati tadvā cā bhavati" itiśrutibhyāṃ smaraṇaṃ dhyānaṃca nāma saṃkīrtanē aṃtarbhūtaṃ". (śrīśaṃkaraḥ)

(modaṭa manasulō saṃkalpiṃcaḍamagunu, taruvāta vākkutō ācariṃcunu aninnī, "dēnini manasulō dhyāniṃcina adiyē vāgrūpamugānagunu" ani śruti ceppucunnadi. aṃducēta bhagavaṃtuni smariṃcuṭa, dhyāniṃcuṭa anunavi bhagavaṃtuni nāma saṃkīrtanamulōnivē, smaraṇamuvalana dhyānamuvalana vāgrūpamugā bhagavaṃtuni nāma kīrtanamu jarugucunnadi).

  1. "tajja pasta dardha bhāvanaṃ" (pataṃjali yōgasūtramulu - 1 - 28)

(paramatmayokka nāmajapamu cēyuṭayanagā ānāmamula arthamu telisi aṭṭiparamātmanu manasulōbhāviṃcuṭa).

  1. "ka. - - -

- - -śrī pati pērē

caṃdamunanaina balikina

naṃdaka dharaḍaṃdugalaḍu nādhuṃḍagucun".

"ā. biḍḍa pēru peṭṭi pilucuṭa viśrāma

kēḷinaina migulagēlinayina

- - -

gamalanayanu dalapa galuṣa haramu". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 121, 122)

  1. "u. kūlina cōṭa, goṭṭu vaḍi kuṃdinacōṭa, mahājvarādulaṃ

brēlinacōṭa sarvamukhapīḍalanaṃdinacōṭanārtulai

tūlinacōṭa viṣṇubhavadūruni bērkonirēni mīdana

kkāluni yātanāvitati gānaru pūnaru duḥkha bhāvamul". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 123)

  1. "sī. brahmahatyānēka pāpāṭavula kagnikīlalu harināmakīrtanamulu

gurutalpa kalmaṣa krūra sarpamulaku gēkulu (nemaḷḷu) harināmakīrtanamulu

tapanīya caurya saṃtamasaṃbunaku sūryakiraṇamul harināmakīrtanamulu

madhupāna kilbiṣa madanāga samitiki gēsarul harināma kīrtanamulu

tē. mahita yōgōgra nidhula samādhividhula

nalaru brahmādi suralaku naṃdarāni

bhūri nirvāṇa sāmrājya bhōga bhāgya

khēlanaṃbulu harināmakīrtanamulu ".

"sī. muktikāṃ taikāṃ tamōhana kṛtyamul gēlimai harināma kīrtanamulu

satyalōkānaṃda saubhāgya yuktamul gēlimai - - -

mahitanirvāṇa sāmrājyābhiṣiktamul gēlimai - -

bahukālajanita tapaḥ phalasāramul gēlimai - -

tē. puṇyamūlaṃbulanapāya pōṣakaṃbu

labhimatārthaṃbu lajñāna haraṇakaramu

lāgamāṃtōpalabdaṃbu lamṛtasēva

lārta śubhamulu harināma kīrtanamulu". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 118, 119)

  1. "ēkaṃ vidhisyāpi naraka duḥkhasya harināma kīrtanamēva pariharakamiva tadēva mahatprāyaścittaṃ trividhānāmapi pāpānāṃ iti saṃtaṃ ādarēṇa anuṣṭēyu" -

(narakabādhalaku śrī bhagavaṃtuni nāmakīrtanamē parihāramani, adiyē mūḍu vidhamulagu pāpamulaku goppa prāyaścittamani ellapuḍu dāninē - harināmakīrtanamunē anuṣṭiṃpavalayunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.