← Back to న · Booklets 21–30 (digitized file 3)

నమస్కారము namaskāramu

Original — తెలుగు
  1. శరీరముతో చేయు అర్చన.

  2. స్వాప కర్షస్య స్వాభీష్ట దేవతా గుర్వాదేః ఉత్కర్షస్యచ మనసా చింతనం, వాచా కీర్తనం, తధా ఉత్కృష్ట దేవతా గుర్వాదీన్ ప్రతికాయేన ప్రణిపాతాది కరణం చ నమస్కారః -

(తన నికృష్టతను తనకు ఇష్టమైన దైవము యొక్కగాని, గురువుయొక్క గాని ఉత్కృష్టతను మనస్సులో చింతించుట, మాటలటో కీర్తించుత, ఆ యిష్టదేవతా గురువులకు శరీరమును వంచుట, మొదలగునవి చేయట నమస్కారము).

  1. “నమస్తు జీవపరయోః వాక్యార్థ త్యాగ పూర్వకం” “నమస్త్వైక్యం ప్రవదేత్” - ఇత్యత్ర తత్వం పదలక్ష్య యోః ఐక్యం సూత్రం.

(తత్వమసి అను మహావాక్యములోని - జీవపరమాత్మల వాచ్యార్థమును వదలి లక్ష్యార్థమునే తీసుకొని ఆ రెండింటికి ఐక్యము నమస్కారము చెప్పును - నమస్కారముచేయు జీవుడు -నమస్కారము చేయబడు పరమాత్మ ఒక్కడేయని తెలుపును).

  1. ‘న మః’ = న + మః = నావాడనుకాను. పరమాత్మకు సంబంధించినవాడను, అతని స్వాధీనములోనివాడను అని భగవంతునకు మనవి చేయుట - నేను చేయు కార్యములన్నియు నాచేత భగవంతుడే చేయించుచున్నాడు. ఆ కార్యముల ఫలము నాదికాదు).

  2. “ధన్యం తదేవ లగ్నం తన్నక్షత్రాం తదేవ పుణ్యమాహుః |

కరణస్య చ సాద్ధిర్యత్ర హరిః ప్రాజ్ఞమస్క్రియతే ||”

ఇతి స్మృతి వాక్యం.

(ముందుగా శ్రీహరికి నమస్కారము చేసి ప్రారంభించినచో అదియే మంచిలగ్నము, అదియే మంచి నక్షత్రము, అదియే మంచిరోజు, అదియే మంచి కరణము అని స్మృతి చెప్పుచున్నది).

  1. “ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |

సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి ||“.

(ఆకాశమునుండి వర్షరూపములో భూమిమీద పడిననీరు ఎక్కడపడినను పల్లపు ప్రదేశమగు సముద్రమునే చేరునట్లు భూమిలోపలి మధ్యభాగములోనుండు ఆకర్షణశక్తి ఆ నీరును తన దగ్గరగా లాగుకొనుటవలన, సముద్రము ఇతర ప్రదేశములకంటె పల్లముగా నుండుటవలన, ఎక్కడపడిన నీరైనను - ఆటంకము లేనియెడల - సముద్రమునకే చేరును. ఆ ప్రకారముగానే భావంతుడు అన్ని దేవతా స్వరూపములు తానే అయియుండుటవలన ఏ దేవునికి నమస్కరించినను ఆ నమస్కారము భగవంతునికే చేరును).

  1. నమస్కారము మూడు విధములు - ఉత్తమము, మధ్యమము, కనిష్టము. మనసులో నమస్కరించుట ఉత్తమము నోటితో నమస్కారమని చెప్పుట మధ్యమము. శరీరముతో నమస్కారమని చెప్పుట కనిష్టము.
Transliteration
  1. śarīramutō cēyu arcana.

  2. svāpa karṣasya svābhīṣṭa dēvatā gurvādēḥ utkarṣasyaca manasā ciṃtanaṃ, vācā kīrtanaṃ, tadhā utkṛṣṭa dēvatā gurvādīn pratikāyēna praṇipātādi karaṇaṃ ca namaskāraḥ -

(tana nikṛṣṭatanu tanaku iṣṭamaina daivamu yokkagāni, guruvuyokka gāni utkṛṣṭatanu manassulō ciṃtiṃcuṭa, māṭalaṭō kīrtiṃcuta, ā yiṣṭadēvatā guruvulaku śarīramunu vaṃcuṭa, modalagunavi cēyaṭa namaskāramu).

  1. “namastu jīvaparayōḥ vākyārtha tyāga pūrvakaṃ” “namastvaikyaṃ pravadēt” - ityatra tatvaṃ padalakṣya yōḥ aikyaṃ sūtraṃ.

(tatvamasi anu mahāvākyamulōni - jīvaparamātmala vācyārthamunu vadali lakṣyārthamunē tīsukoni ā reṃḍiṃṭiki aikyamu namaskāramu ceppunu - namaskāramucēyu jīvuḍu -namaskāramu cēyabaḍu paramātma okkaḍēyani telupunu).

  1. ‘na maḥ’ = na + maḥ = nāvāḍanukānu. paramātmaku saṃbaṃdhiṃcinavāḍanu, atani svādhīnamulōnivāḍanu ani bhagavaṃtunaku manavi cēyuṭa - nēnu cēyu kāryamulanniyu nācēta bhagavaṃtuḍē cēyiṃcucunnāḍu. ā kāryamula phalamu nādikādu).

  2. “dhanyaṃ tadēva lagnaṃ tannakṣatrāṃ tadēva puṇyamāhuḥ |

karaṇasya ca sāddhiryatra hariḥ prājñamaskriyatē ||”

iti smṛti vākyaṃ.

(muṃdugā śrīhariki namaskāramu cēsi prāraṃbhiṃcinacō adiyē maṃcilagnamu, adiyē maṃci nakṣatramu, adiyē maṃcirōju, adiyē maṃci karaṇamu ani smṛti ceppucunnadi).

  1. “ākāśātpatitaṃ tōyaṃ yathā gacchati sāgaraṃ |

sarva dēva namaskāraḥ kēśavaṃ prati gacchati ||“.

(ākāśamunuṃḍi varṣarūpamulō bhūmimīda paḍinanīru ekkaḍapaḍinanu pallapu pradēśamagu samudramunē cērunaṭlu bhūmilōpali madhyabhāgamulōnuṃḍu ākarṣaṇaśakti ā nīrunu tana daggaragā lāgukonuṭavalana, samudramu itara pradēśamulakaṃṭe pallamugā nuṃḍuṭavalana, ekkaḍapaḍina nīrainanu - āṭaṃkamu lēniyeḍala - samudramunakē cērunu. ā prakāramugānē bhāvaṃtuḍu anni dēvatā svarūpamulu tānē ayiyuṃḍuṭavalana ē dēvuniki namaskariṃcinanu ā namaskāramu bhagavaṃtunikē cērunu).

  1. namaskāramu mūḍu vidhamulu - uttamamu, madhyamamu, kaniṣṭamu. manasulō namaskariṃcuṭa uttamamu nōṭitō namaskāramani ceppuṭa madhyamamu. śarīramutō namaskāramani ceppuṭa kaniṣṭamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.