ఆత్మలు పలువురు అనువాదము -
అనేకత్వం - (అనేకముగానుండుట; ఒకటికంటె ఎక్కువగానుండుట - ఈ ప్రపంచములో అనేక వస్తువులున్నాయి యని భ్రమపడుట). ప్రపంచమునకు ముందు ఏవస్తువును లేదుకనుక యదార్ధముగా ఈ ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే కనుక, అతనే ఈ వస్తువులన్నింటిగా మారెను కనుక ఈ వస్తువులన్నీ ఒకే ఒక భగవంతుడు, ఈ వస్తువులన్నియు కలసి ఒకే భగవంతుడు రెండవ భగవంతుడుగాని, రెండవ ఇతర వస్తువుగాని లేదు - అయినను భ్రాంతిచేత ఈ వస్తువులు వేరు వేరని, భగవంతుడు వేరని కనబడుచున్నవి; ఇట్లు ఇవి వేరుగానున్నట్లు తలంచుట నానాత్వము-).
"నేహనానాస్తి కించన - మృత్యోస్సమృత్యు మాప్నోతి య ఇహ నానే వవశ్యతి"
(ఈ ప్రపంచకములో అనేకమగు వస్తువులున్నవి అని అనేకవస్తువులుగా చూచునో అట్టివాడు అనేక జన్మల నెత్తుచు చచ్చుచు సంసారములో పడి తిరుగుచుండును - అందుచేత ఈ సృష్టి అంతటిలోను పరబ్రహ్మ కాక ఏ కొంచెమైనదైనను రెండవ వస్తువుననుది లేదు).
"మనసైవాను ద్రష్టవ్యం నేహ నానా సి కించన |
మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానే వ వశ్యతి ||".
"బ్రహ్మ దర్శనే సాధనముచ్యతే - మనసైవ పరమార్థజ్ఞాన సంస్కృతేన ఆచార్యోపదేశపూర్వకం చ అను ద్రష్టవ్యం తత్ర చ దర్శన విషయే బ్రహ్మణి న ఇహ నానా అస్తికించన | నకించినవ్యస్తి. అనానత్వే నానాత్వ మధ్యారోపయత్య విద్యయా నమృత్యుః మరణాత్ మృత్యుం మరణం ఆప్నోతి, కో(అ)సౌ నానేవ పశ్యతి అవిద్యయా మిధ్యారోపణ వ్యతిరేకేణ నాస్తి పరమార్థతో ద్వైతమిత్యర్థః".
(బ్రహ్మను దర్శించుటకు సాధనము చెప్పబడినది - సూక్ష్మాతిసూక్ష్మమైన కనుగొనుటకు సాధనము చెప్పబడినది. గురువు వలన పొందిన ఉపదేశము ప్రకారము పరమార్థజ్ఞానముతోనిండిన మనస్సుచేత పరబ్రహ్మను చూడవలెను - పరబ్రహ్మను చూచు విషయములో - ఈ ప్రపంచములో అనేకత్వములేదు. అంతా ఒక్కటే, అంతా ఆ పరబ్రహ్మమే యని చూడవలెను. నానాత్వములేనపుడు నానాత్వమున్నదని మాయచేత ఎవరు ఆలోచించెదరో వారు మరణము తర్వాత మరణమును పొందుదురు. పరమార్థ దృష్టిలో ద్వైతము అనునది - రెండవ వస్తువు - లేనే లేదు).
"ఏకస్సన్ బహుధా విచ చార" (పరబ్రహ్మ ఒకడే అయినను అనేకముగా చరించుచున్నాడు).
"అనేన జీవే నాను ప్రవిశ్య - -", "తదను ప్రవిశ్య నచ్చ త్యచ్చ అభావత్"
(ఈ జీవరూపములో అన్నింటిలోనూ ప్రవేశించెను - - అట్లు ప్రవేశించి 'సత్', 'త్యత్' తానే ఆయెను - ఆత్మవస్తువుగాను, అనాత్మవస్తువుగాను తానే ఆయెను. అనగా చైతన్యమున్న వస్తువు చైతన్యములేని వస్తువు గానే ఆయెను -)
ప్రపంచము వేరు, భగవంతుడు వేరు అని స్పురించును - భగవంతుడు ఈ ప్రపంచమును సృష్టించుచున్నాడు కనుక అతను వేరు ప్రపంచమువేరు అని స్పురించును - కాని సృష్టిప్రకారము ఎట్లంటే భగవంతునిలోనుండి ఒకటి, దానిలోనుండి మఱియొకటి, దానిలోనుండి మఱియొకటి పుట్టుచున్నవి. భగవంతునిలోనుండి పుట్టినవన్నియు భగవంతుని రూపములే, భగవంతుడేగాని వేరుకాదు - బంగారముతో చేయబడిన వస్తువులు బంగారు వస్తువులే కాని, ఇత్తడి వస్తువులు, ఇనపవస్తువులు , ఇతరవస్తువులు కావు. అందుచేత ప్రపంచమంతా, అందులోనున్న వస్తువులన్నియు భగవంతుడే, అతని రూపములే. అందుచేత అంతా భగవంతుడే, అన్నీ భగవంతుడే, అతనికన్న వేరేమియులేదు –
"సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును లేదు ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 65)
"ఇదం సర్వం యదయమాత్మా" (ఈ ప్రపంచమంతయు ఆత్మయే).
"యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కిం పశ్యేత్" ఇతి భేద నిషేధో బహుధా దృశ్యతే –”
(ఈ కనబడు ప్రపంచమంతయు చూచువానికి ఆత్మవలెనే కనబడినయడల అంతా భగవంతుడే అయినయడల ఎవడు ఎవనుని చూచును - భగవంతుడే భగవంతుని చూచును - భగవంతుడు కానిదిలేదు కనుక - భగవంతుడుకాక చూచువాడుకాని, చూడబడువస్తువుకాని మరి వేఱే వస్తువులేదు కనుక - "ఇతి తత్కృస్నస్య జగతో బ్రహ్మకార్యతయా, తదంతర్యామి తయాచ తదాత్మకత్వే నైక్యాత్ తత్ప్రత్యనీక నానాత్వం ప్రతిషిద్ధ్యతే". (ప్రపంచములోని అన్ని వస్తువులలోను అంతర్యామిగా పరబ్రహ్మయే యుండుటచేత, ప్రపంచమంతయు బ్రహ్మయొక్క కార్యమేయగుటచేత ప్రపంచమే పరబ్రహ్మ, పరబ్రహ్మయే ప్రపంచముగుటచేతను ఈ ప్రపంచములో అనేక వస్తువులు లేవు అని అనేకత్వము నానాత్వమని షేధించబడినది).
ātmalu paluvuru anuvādamu -
anēkatvaṃ - (anēkamugānuṃḍuṭa; okaṭikaṃṭe ekkuvagānuṃḍuṭa - ī prapaṃcamulō anēka vastuvulunnāyi yani bhramapaḍuṭa). prapaṃcamunaku muṃdu ēvastuvunu lēdukanuka yadārdhamugā ī prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka, atanē ī vastuvulanniṃṭigā mārenu kanuka ī vastuvulannī okē oka bhagavaṃtuḍu, ī vastuvulanniyu kalasi okē bhagavaṃtuḍu reṃḍava bhagavaṃtuḍugāni, reṃḍava itara vastuvugāni lēdu - ayinanu bhrāṃticēta ī vastuvulu vēru vērani, bhagavaṃtuḍu vērani kanabaḍucunnavi; iṭlu ivi vērugānunnaṭlu talaṃcuṭa nānātvamu-).
"nēhanānāsti kiṃcana - mṛtyōssamṛtyu māpnōti ya iha nānē vavaśyati"
(ī prapaṃcakamulō anēkamagu vastuvulunnavi ani anēkavastuvulugā cūcunō aṭṭivāḍu anēka janmala nettucu caccucu saṃsāramulō paḍi tirugucuṃḍunu - aṃducēta ī sṛṣṭi aṃtaṭilōnu parabrahma kāka ē koṃcemainadainanu reṃḍava vastuvunanudi lēdu).
"manasaivānu draṣṭavyaṃ nēha nānā si kiṃcana |
mṛtyōssa mṛtyumāpnōti ya iha nānē va vaśyati ||".
"brahma darśanē sādhanamucyatē - manasaiva paramārthajñāna saṃskṛtēna ācāryōpadēśapūrvakaṃ ca anu draṣṭavyaṃ tatra ca darśana viṣayē brahmaṇi na iha nānā astikiṃcana | nakiṃcinavyasti. anānatvē nānātva madhyārōpayatya vidyayā namṛtyuḥ maraṇāt mṛtyuṃ maraṇaṃ āpnōti, kō(a)sau nānēva paśyati avidyayā midhyārōpaṇa vyatirēkēṇa nāsti paramārthatō dvaitamityarthaḥ".
(brahmanu darśiṃcuṭaku sādhanamu ceppabaḍinadi - sūkṣmātisūkṣmamaina kanugonuṭaku sādhanamu ceppabaḍinadi. guruvu valana poṃdina upadēśamu prakāramu paramārthajñānamutōniṃḍina manassucēta parabrahmanu cūḍavalenu - parabrahmanu cūcu viṣayamulō - ī prapaṃcamulō anēkatvamulēdu. aṃtā okkaṭē, aṃtā ā parabrahmamē yani cūḍavalenu. nānātvamulēnapuḍu nānātvamunnadani māyacēta evaru ālōciṃcedarō vāru maraṇamu tarvāta maraṇamunu poṃduduru. paramārtha dṛṣṭilō dvaitamu anunadi - reṃḍava vastuvu - lēnē lēdu).
"ēkassan bahudhā vica cāra" (parabrahma okaḍē ayinanu anēkamugā cariṃcucunnāḍu).
"anēna jīvē nānu praviśya - -", "tadanu praviśya nacca tyacca abhāvat"
(ī jīvarūpamulō anniṃṭilōnū pravēśiṃcenu - - aṭlu pravēśiṃci 'sat', 'tyat' tānē āyenu - ātmavastuvugānu, anātmavastuvugānu tānē āyenu. anagā caitanyamunna vastuvu caitanyamulēni vastuvu gānē āyenu -)
prapaṃcamu vēru, bhagavaṃtuḍu vēru ani spuriṃcunu - bhagavaṃtuḍu ī prapaṃcamunu sṛṣṭiṃcucunnāḍu kanuka atanu vēru prapaṃcamuvēru ani spuriṃcunu - kāni sṛṣṭiprakāramu eṭlaṃṭē bhagavaṃtunilōnuṃḍi okaṭi, dānilōnuṃḍi maṟiyokaṭi, dānilōnuṃḍi maṟiyokaṭi puṭṭucunnavi. bhagavaṃtunilōnuṃḍi puṭṭinavanniyu bhagavaṃtuni rūpamulē, bhagavaṃtuḍēgāni vērukādu - baṃgāramutō cēyabaḍina vastuvulu baṃgāru vastuvulē kāni, ittaḍi vastuvulu, inapavastuvulu , itaravastuvulu kāvu. aṃducēta prapaṃcamaṃtā, aṃdulōnunna vastuvulanniyu bhagavaṃtuḍē, atani rūpamulē. aṃducēta aṃtā bhagavaṃtuḍē, annī bhagavaṃtuḍē, atanikanna vērēmiyulēdu –
"sī. viṣṇuṃḍu viśvaṃbu viṣṇunikaṃṭenu vēṟēmiyunu lēdu ". (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 65)
"idaṃ sarvaṃ yadayamātmā" (ī prapaṃcamaṃtayu ātmayē).
"yatratvasya sarvaṃ ātmaivābhūt tatkēna kiṃ paśyēt" iti bhēda niṣēdhō bahudhā dṛśyatē –”
(ī kanabaḍu prapaṃcamaṃtayu cūcuvāniki ātmavalenē kanabaḍinayaḍala aṃtā bhagavaṃtuḍē ayinayaḍala evaḍu evanuni cūcunu - bhagavaṃtuḍē bhagavaṃtuni cūcunu - bhagavaṃtuḍu kānidilēdu kanuka - bhagavaṃtuḍukāka cūcuvāḍukāni, cūḍabaḍuvastuvukāni mari vēṟē vastuvulēdu kanuka - "iti tatkṛsnasya jagatō brahmakāryatayā, tadaṃtaryāmi tayāca tadātmakatvē naikyāt tatpratyanīka nānātvaṃ pratiṣiddhyatē". (prapaṃcamulōni anni vastuvulalōnu aṃtaryāmigā parabrahmayē yuṃḍuṭacēta, prapaṃcamaṃtayu brahmayokka kāryamēyaguṭacēta prapaṃcamē parabrahma, parabrahmayē prapaṃcamuguṭacētanu ī prapaṃcamulō anēka vastuvulu lēvu ani anēkatvamu nānātvamani ṣēdhiṃcabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.