← Back to న · Booklets 21–30 (digitized file 3)

నరః naraḥ

Original — తెలుగు
  1. నరీయతే, నక్షీయతే ఇతి నరః. (క్షీణించనివాడు, నశించనివాడు).

  2. రిక్ష్యతే, క్షీయతే ఇతరః - రిజ్ క్షయే ధాతుః -నభవతీతి నరః.

(రిజ్ అను ధాతువునకు క్షయించుట, క్షీణించుట యనియర్థము - క్షీణించుటలేనివాడు నరుడు, నాశములేనివాడు - పరబ్రహ్మ, భగవంతుడు).

  1. నయతీతి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః| ఇతి వ్యాస వచనాత్ -” (శ్రీశంకరః)

(పరమపదమును పొందించువాడు, పరమపదమునకు తీసుకొనివెళ్ళువాడు - పరమాత్మయని వ్యాసమహర్షి చెప్పియున్నాడు - అందుచేత అందఱిలోను అంతరాత్మగానుండి వారిని పనులలో ప్రేరేపించువాడు).

  1. విద్యా విరుద్ధేషు కర్మ ఫలేషు నరమతే ఇతి నరః.

(విద్యకు, బ్రహ్మ విద్యకు, విరుద్ధమైన కర్మఫలమందాసక్తి లేనివాడు).

  1. సర్వయుగేషు త్రివిధా - నరాః సంతి - సాధవః, అసాధవః మధ్యమాశ్చి - తత్రసతాం సర్వం యుగం సత్యయుగమేవ. అసతాం సర్వం యుగం కలిరేవ, యస్మిన్ యుగే క్రియాయోగౌ వ్యవస్థితౌ స మధ్యమః కాలః ద్వాపర త్రేతాత్మకో మధ్యమానాం భవతి. తథా చ యే సాధవో మధ్యమాశ్చ తదాశ్రయేణ ధర్మః స్థాస్యతి.

(అన్నియుగములందు నరులుమూడువిధములవారుందురు - సాధువులు, దుష్టులు, మధ్యములు - అందులో సత్పురుషులకు - సాధువులకు - అన్నియుగములు సత్యయుగమే - దుర్మార్గులకు అన్ని యుగములు కలియుగమే. ఏ యుగములో క్రియ యోగములు రెండునూ ఉండునో అదిమధ్యమయుగము. మధ్యములకు ద్వాపరయుగము, త్రేతాయుగముగా నుండును - ఈ సాదువులను మధ్యములను ఆశ్రయించియే ధర్మముండును - వీరివలననే ధర్మము నశించకుండ నిలుచును).

  1. “నరాణాం చ నరాధిపం” (శ్రీమద్భగవద్గీత - 10 - 27)

(నరులందరిలోన వారికి అధిపతి అయిన రాజును నేనే - జగత్తు అంతటికీ అధిపతిని నేనే - భగవంతుడే).

“నా విష్ణుః పృధివీపతిః” - విష్ణువుకాని రాజులేడు. రాజు అగువాడు విష్ణుని అంశలో పుట్టినవాడే - నరులను పుట్టించి పాలించువాడు భగవంతుడే)

  1. “జంతూనాం నరజన్మ దుర్లభతః పుం స్త్వం”

(జంతుజాలములలో - జన్మముకలవాటిలో - నరుడై పుట్టుట దుర్లభము - అందులోను పురుషుడై పుట్టుట అంతకంటె దుర్లభము -” ఆహారనిద్రా భయ మైధునంచ సామాన్య మేతత్పశు భిర్నిరాణాం| జ్ఞానం నరాణా మధికో విశేషః జ్ఞానే విహీనః పశుభేస్సమానః|.

(పశువులకు నరులకు ఆహారము, నిద్ర, భయము, మైధునము సామాన్యమే - కాని నరులకు జ్ఞానము అధికము - ఇదియే ఇద్దరికీ గల తారతమ్యము- నరులకు జ్ఞానము విశేషము - జ్ఞానము లేని నరుడు పశువుతో సమానము).

  1. క. “- - - క్రూరులు బహుదుఃఖరోగ కుత్సితబుద్ధుల్

నీరసులు నరులు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 40)

Transliteration
  1. narīyatē, nakṣīyatē iti naraḥ. (kṣīṇiṃcanivāḍu, naśiṃcanivāḍu).

  2. rikṣyatē, kṣīyatē itaraḥ - rij kṣayē dhātuḥ -nabhavatīti naraḥ.

(rij anu dhātuvunaku kṣayiṃcuṭa, kṣīṇiṃcuṭa yaniyarthamu - kṣīṇiṃcuṭalēnivāḍu naruḍu, nāśamulēnivāḍu - parabrahma, bhagavaṃtuḍu).

  1. nayatīti naraḥ prōktaḥ paramātmā sanātanaḥ| iti vyāsa vacanāt -” (śrīśaṃkaraḥ)

(paramapadamunu poṃdiṃcuvāḍu, paramapadamunaku tīsukoniveḷḷuvāḍu - paramātmayani vyāsamaharṣi ceppiyunnāḍu - aṃducēta aṃdaṟilōnu aṃtarātmagānuṃḍi vārini panulalō prērēpiṃcuvāḍu).

  1. vidyā viruddhēṣu karma phalēṣu naramatē iti naraḥ.

(vidyaku, brahma vidyaku, viruddhamaina karmaphalamaṃdāsakti lēnivāḍu).

  1. sarvayugēṣu trividhā - narāḥ saṃti - sādhavaḥ, asādhavaḥ madhyamāści - tatrasatāṃ sarvaṃ yugaṃ satyayugamēva. asatāṃ sarvaṃ yugaṃ kalirēva, yasmin yugē kriyāyōgau vyavasthitau sa madhyamaḥ kālaḥ dvāpara trētātmakō madhyamānāṃ bhavati. tathā ca yē sādhavō madhyamāśca tadāśrayēṇa dharmaḥ sthāsyati.

(anniyugamulaṃdu narulumūḍuvidhamulavāruṃduru - sādhuvulu, duṣṭulu, madhyamulu - aṃdulō satpuruṣulaku - sādhuvulaku - anniyugamulu satyayugamē - durmārgulaku anni yugamulu kaliyugamē. ē yugamulō kriya yōgamulu reṃḍunū uṃḍunō adimadhyamayugamu. madhyamulaku dvāparayugamu, trētāyugamugā nuṃḍunu - ī sāduvulanu madhyamulanu āśrayiṃciyē dharmamuṃḍunu - vīrivalananē dharmamu naśiṃcakuṃḍa nilucunu).

  1. “narāṇāṃ ca narādhipaṃ” (śrīmadbhagavadgīta - 10 - 27)

(narulaṃdarilōna vāriki adhipati ayina rājunu nēnē - jagattu aṃtaṭikī adhipatini nēnē - bhagavaṃtuḍē).

“nā viṣṇuḥ pṛdhivīpatiḥ” - viṣṇuvukāni rājulēḍu. rāju aguvāḍu viṣṇuni aṃśalō puṭṭinavāḍē - narulanu puṭṭiṃci pāliṃcuvāḍu bhagavaṃtuḍē)

  1. “jaṃtūnāṃ narajanma durlabhataḥ puṃ stvaṃ”

(jaṃtujālamulalō - janmamukalavāṭilō - naruḍai puṭṭuṭa durlabhamu - aṃdulōnu puruṣuḍai puṭṭuṭa aṃtakaṃṭe durlabhamu -” āhāranidrā bhaya maidhunaṃca sāmānya mētatpaśu bhirnirāṇāṃ| jñānaṃ narāṇā madhikō viśēṣaḥ jñānē vihīnaḥ paśubhēssamānaḥ|.

(paśuvulaku narulaku āhāramu, nidra, bhayamu, maidhunamu sāmānyamē - kāni narulaku jñānamu adhikamu - idiyē iddarikī gala tāratamyamu- narulaku jñānamu viśēṣamu - jñānamu lēni naruḍu paśuvutō samānamu).

  1. ka. “- - - krūrulu bahuduḥkharōga kutsitabuddhul

nīrasulu narulu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 40)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.