← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారయణ ఋషి nārayaṇa ṛṣi

Original — తెలుగు
  1. "స ఏవ విష్ణుః సమభూద్బదర్యాం నారాయణాహ్వః శ్యామలాయాం యమాచ్చ |

తపస్తప్తుం శిక్ష యితుం ఋషీణాం తరస్కర్తుం అప్సరసాం సహస్రం" (గరుడపురాణము - 15 - 11)

(తాను తపస్సు చేసి, ఋషులకు తపస్సు చేయుటలో శిక్షనిచ్చుటకున్నూ, తన తపస్సునకు విఘ్నము కలిగించుటకు ఇంద్రునిచే పంపబడిన వేలకొలది అయిన స్త్రీలను తిరస్కరించి, వారి కంటె అందమైన అప్సరసలను ఊర్వసియనునామెను తనతొడనుండి సృష్టించి వారికిచ్చుటకును శ్రీమహావిష్ణువే బదరికారణ్యములో నారాయణ ఋషిగా అవతరించెను).

  1. "ఆత్మ సృష్టంబైన మనంబున పంచభూత నికరంబను పురంబొనరించి యందు నిజాంశంబునం బ్రవేశించి సగుణ నిష్టుండై నారాయణాభిదానంబుగల ఋషీశ్వరుండగు పరమేశ్వరుండు వెలుగొందె నతని దశేంద్రియంబులచే బాలితంబులైన దేహంబులు ధరించి జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటంజేసి గుణనిష్టుండై రజస్సత్వ తమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులనంబర్ అగి త్రిగుణాత్మకుండనంబడు - - - అమ్మునీశ్వరుండు పరమాశ్చర్య నిధానంబుగా నిజతనూరుహంబుల నుద్భవింపంజేసిన గంధర్వ విబుధ కామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులంబొడమ సన్నుతించి యవ్విలాసినీ సమూహంబులో యూర్వశియను దానింగొని చని - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 -

(బ్రదరికాశ్రమము = బదర్యాఖ్యాం ఆశ్రమం) (బదరికావనము - శ్రీమన్నారయణ ఋషి యుండెడిది)

Transliteration
  1. "sa ēva viṣṇuḥ samabhūdbadaryāṃ nārāyaṇāhvaḥ śyāmalāyāṃ yamācca |

tapastaptuṃ śikṣa yituṃ ṛṣīṇāṃ taraskartuṃ apsarasāṃ sahasraṃ" (garuḍapurāṇamu - 15 - 11)

(tānu tapassu cēsi, ṛṣulaku tapassu cēyuṭalō śikṣaniccuṭakunnū, tana tapassunaku vighnamu kaligiṃcuṭaku iṃdrunicē paṃpabaḍina vēlakoladi ayina strīlanu tiraskariṃci, vāri kaṃṭe aṃdamaina apsarasalanu ūrvasiyanunāmenu tanatoḍanuṃḍi sṛṣṭiṃci vārikiccuṭakunu śrīmahāviṣṇuvē badarikāraṇyamulō nārāyaṇa ṛṣigā avatariṃcenu).

  1. "ātma sṛṣṭaṃbaina manaṃbuna paṃcabhūta nikaraṃbanu puraṃbonariṃci yaṃdu nijāṃśaṃbunaṃ bravēśiṃci saguṇa niṣṭuṃḍai nārāyaṇābhidānaṃbugala ṛṣīśvaruṃḍagu paramēśvaruṃḍu velugoṃde natani daśēṃdriyaṃbulacē bālitaṃbulaina dēhaṃbulu dhariṃci jagadrakṣakatva saṃhārakatvādi guṇaṃbulu galuguṭaṃjēsi guṇaniṣṭuṃḍai rajassatva tamō guṇaṃbula brahma viṣṇu rudramūrtulanaṃbar agi triguṇātmakuṃḍanaṃbaḍu - - - ammunīśvaruṃḍu paramāścarya nidhānaṃbugā nijatanūruhaṃbula nudbhaviṃpaṃjēsina gaṃdharva vibudha kāminī samudayaṃbulu paramādbhuta bhayaṃbulaṃboḍama sannutiṃci yavvilāsinī samūhaṃbulō yūrvaśiyanu dāniṃgoni cani - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 -

(bradarikāśramamu = badaryākhyāṃ āśramaṃ) (badarikāvanamu - śrīmannārayaṇa ṛṣi yuṃḍeḍidi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.