← Back to న · Booklets 21–30 (digitized file 3)

నశ్వరం naśvaraṃ

Original — తెలుగు
  1. క్షణికం, నశ్యతీతి నశ్వరం, వినాశి. (క్షణకాలము మాత్రముండునది; నశించునది).

  2. నాశ శీలం, వినాశయుక్తం. (నశించు స్వభావము కలది, వినాశముకలది).

  3. కర్మ నిర్మితత్వాత్ నశ్వరం. (తాను చేసిన కర్మఫలముగా కలిగినది నశ్వరము-).

  4. బ్రహమాది తృణపర్యంతం సర్వం ప్రకౄతికం భవేత్ |

యద్యత్ప్రాకృతికం సృష్టం సర్వం నశ్వరమేవచ ||“. (శ్రీ దేవీ భాగవతము)

(చాతుర్ముఖబ్రహ్మ మొదలు గడ్డిపోచవరకు ఉన్నవన్నియు ప్రకౄతివలన కలిగినవే - ప్రకృతిలోనుండి పుట్టినవే, ప్రకృతికి సంబంధించినవే. ఏది ప్రకౄతిలోనుండి పుట్టినదో అది అంతయు నశించునదియే. పరమాత్మ దేనిలోనుండి పుట్టినవాడు కాడు. అతనికి జన్మ అనునది లేదు - అజుడు. జన్మ లేదుకనుక నశించుట లేదు. అందుచేత శాశ్వతుడు - ఎల్లకాలములందు ఉండువాడు, సత్యుడు. పరమాత్మ గాక మిగిలినవన్నియు - ఈ సృష్టిలోని వస్తువులన్నియు జన్మకలవే, అందుచేత నశించునవియే - నశ్వరములే).

  1. ’మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యిమాణంబగు వస్తుజాతంబెల్ల నశ్వరంబుగా నెఱుంగుము“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 91)

  1. “నిఖిలం జగదేవ నశ్వరం” (జగత్తు అంతయు నశ్వరమే).

  2. “కామంబులును, నింద్రియంబులును, మనశ్శరీర ధైర్యంబులును, మనీషా ప్రాణ ధర్మంబులును, లజ్జాస్మరణ లక్ష్మీ సత్యతేజో విశేషంబులును నశించు”. (అందుచేత అవి నశ్వరములు) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 10 - 371)

  3. “యథా ద్రవ్య వికారేషు - మృత్సువర్ణాదికార్యేషు, ఘట కుండలాదిషు, నశ్వరేషు (నాస శరీరేషు) ద్రవ్యమాత్రం - మృత్సువర్ణమాత్రం - అనశ్వరం యథాభవతి, తథా నశ్వరేషు భావేషు యత్ అనశ్వరం (అవశిష్యమాణం రూపం) తత్ పరమేశ్వరః”.

(ఒక ద్రవ్యముయొక్క కార్యములు నశించిపోగా వాటికి కారణమైన ద్రవ్యము మాత్రము నశించక యుండును - మట్టి కారణము దానితో చేయబడిన కుండలు, కూజాలు మొదలగునవి నశించినను - విరిగిపోయినను -మట్టిగామారును - ఆప్రకారముగానే బంగారము కారణము దానితో చేయబడిన ఆభరణములు నశించినను - రూపు మారిపోయినను, అవి బంగారముగానే ఉండిపోవును - వాటికి కారణమైన బంగారము నశించదు. ఆప్రకారముగానే పరమాత్మలోనుండి పుట్టిన కార్యజాతమంతయు - ప్రపంచమంతయు, దానిలో ఉండిన వస్తులన్నియు - నశించినను, వాటికి కారణమైన పరమాత్మలో ప్రపంచమునకు కారణమైన పరమాత్మలో లీనమైపోయి కనబడకపోయినను - పరమాత్మ మాత్రము నశించక శాశ్వతముగా నుండును.- ” ఉండేదీ రాముడొకడు ఊరక చేడిపోకె మనసా“).

  1. “దిశోపిన దృశ్యంతే దేశో ప్యన్యోపదేశ కృత్ |

శైలా అపి విశీర్యంతే శీర్యంతే తారకాలపి |

శుష్యం త్యపి సముద్రాశ్చ ధ్రువోప్యధ్రువ జీవనః |

సిద్ధా అపి వినశ్యంతి జీర్యంతే దాన వాదయః |

పరమేష్ట్యపి నిష్టావాన్ హెయతే హరి రప్యజః |

భవోప్య భావమాయాతి జీర్యంతే వైదిగేశ్వరాః |

బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వావా భూతజాతయః |

నాశమే వానుధావంతి సలిలానీవ బాడబం |

ఆపదః క్షణమాయాంతి క్షణమాయాతి సంపదః |

క్షణం జన్మాధమరణం సర్వం నశ్వరమేవతత్ ||” (మహోపనిషత్)

(దిక్కులు నశించును - కనబడకపోవును; కొండలు తరిగి పోవును; నక్షత్రములు అంతరించిపోవును - సముద్రములు ఇంకిపోవును - సిద్ధులు నశించుచున్నారు, దానవులు నశించుచున్నారు - నిష్టలోనుండు పరమేష్టి - చతుర్ముఖబ్రహ్మ - నశించిపోవును - శివుడు లేకుండా యగును - దిక్పాలకులు జీర్ణమై పోవు దురు - త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు, పంచభూతములు, వాటిలోనుండి పుట్టినవన్నియు నాశమైపోవును - బడబాగ్నిలో పడిన జలము నశించినట్లు ఒక క్షణమునకు ఆపద వచ్చును; ఒక క్షణమునకు సంపద వచ్చును. క్షణములో పుట్టుక, క్షణములో మరణము - ఈ ప్రకారముగా అన్నియు నశించునవియే).

Transliteration
  1. kṣaṇikaṃ, naśyatīti naśvaraṃ, vināśi. (kṣaṇakālamu mātramuṃḍunadi; naśiṃcunadi).

  2. nāśa śīlaṃ, vināśayuktaṃ. (naśiṃcu svabhāvamu kaladi, vināśamukaladi).

  3. karma nirmitatvāt naśvaraṃ. (tānu cēsina karmaphalamugā kaliginadi naśvaramu-).

  4. brahamādi tṛṇaparyaṃtaṃ sarvaṃ prakṝtikaṃ bhavēt |

yadyatprākṛtikaṃ sṛṣṭaṃ sarvaṃ naśvaramēvaca ||“. (śrī dēvī bhāgavatamu)

(cāturmukhabrahma modalu gaḍḍipōcavaraku unnavanniyu prakṝtivalana kaliginavē - prakṛtilōnuṃḍi puṭṭinavē, prakṛtiki saṃbaṃdhiṃcinavē. ēdi prakṝtilōnuṃḍi puṭṭinadō adi aṃtayu naśiṃcunadiyē. paramātma dēnilōnuṃḍi puṭṭinavāḍu kāḍu. ataniki janma anunadi lēdu - ajuḍu. janma lēdukanuka naśiṃcuṭa lēdu. aṃducēta śāśvatuḍu - ellakālamulaṃdu uṃḍuvāḍu, satyuḍu. paramātma gāka migilinavanniyu - ī sṛṣṭilōni vastuvulanniyu janmakalavē, aṃducēta naśiṃcunaviyē - naśvaramulē).

  1. ’mānasa vāgakṣi śrōtra ghrāṇēṃdriya gṛhyimāṇaṃbagu vastujātaṃbella naśvaraṃbugā neṟuṃgumu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 91)

  1. “nikhilaṃ jagadēva naśvaraṃ” (jagattu aṃtayu naśvaramē).

  2. “kāmaṃbulunu, niṃdriyaṃbulunu, manaśśarīra dhairyaṃbulunu, manīṣā prāṇa dharmaṃbulunu, lajjāsmaraṇa lakṣmī satyatējō viśēṣaṃbulunu naśiṃcu”. (aṃducēta avi naśvaramulu) (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 10 - 371)

  3. “yathā dravya vikārēṣu - mṛtsuvarṇādikāryēṣu, ghaṭa kuṃḍalādiṣu, naśvarēṣu (nāsa śarīrēṣu) dravyamātraṃ - mṛtsuvarṇamātraṃ - anaśvaraṃ yathābhavati, tathā naśvarēṣu bhāvēṣu yat anaśvaraṃ (avaśiṣyamāṇaṃ rūpaṃ) tat paramēśvaraḥ”.

(oka dravyamuyokka kāryamulu naśiṃcipōgā vāṭiki kāraṇamaina dravyamu mātramu naśiṃcaka yuṃḍunu - maṭṭi kāraṇamu dānitō cēyabaḍina kuṃḍalu, kūjālu modalagunavi naśiṃcinanu - virigipōyinanu -maṭṭigāmārunu - āprakāramugānē baṃgāramu kāraṇamu dānitō cēyabaḍina ābharaṇamulu naśiṃcinanu - rūpu māripōyinanu, avi baṃgāramugānē uṃḍipōvunu - vāṭiki kāraṇamaina baṃgāramu naśiṃcadu. āprakāramugānē paramātmalōnuṃḍi puṭṭina kāryajātamaṃtayu - prapaṃcamaṃtayu, dānilō uṃḍina vastulanniyu - naśiṃcinanu, vāṭiki kāraṇamaina paramātmalō prapaṃcamunaku kāraṇamaina paramātmalō līnamaipōyi kanabaḍakapōyinanu - paramātma mātramu naśiṃcaka śāśvatamugā nuṃḍunu.- ” uṃḍēdī rāmuḍokaḍu ūraka cēḍipōke manasā”).

  1. “diśōpina dṛśyaṃtē dēśō pyanyōpadēśa kṛt |

śailā api viśīryaṃtē śīryaṃtē tārakālapi |

śuṣyaṃ tyapi samudrāśca dhruvōpyadhruva jīvanaḥ |

siddhā api vinaśyaṃti jīryaṃtē dāna vādayaḥ |

paramēṣṭyapi niṣṭāvān heyatē hari rapyajaḥ |

bhavōpya bhāvamāyāti jīryaṃtē vaidigēśvarāḥ |

brahma viṣṇuśca rudraśca sarvāvā bhūtajātayaḥ |

nāśamē vānudhāvaṃti salilānīva bāḍabaṃ |

āpadaḥ kṣaṇamāyāṃti kṣaṇamāyāti saṃpadaḥ |

kṣaṇaṃ janmādhamaraṇaṃ sarvaṃ naśvaramēvatat ||” (mahōpaniṣat)

(dikkulu naśiṃcunu - kanabaḍakapōvunu; koṃḍalu tarigi pōvunu; nakṣatramulu aṃtariṃcipōvunu - samudramulu iṃkipōvunu - siddhulu naśiṃcucunnāru, dānavulu naśiṃcucunnāru - niṣṭalōnuṃḍu paramēṣṭi - caturmukhabrahma - naśiṃcipōvunu - śivuḍu lēkuṃḍā yagunu - dikpālakulu jīrṇamai pōvu duru - trimūrtulaina brahma viṣṇumahēśvarulu, paṃcabhūtamulu, vāṭilōnuṃḍi puṭṭinavanniyu nāśamaipōvunu - baḍabāgnilō paḍina jalamu naśiṃcinaṭlu oka kṣaṇamunaku āpada vaccunu; oka kṣaṇamunaku saṃpada vaccunu. kṣaṇamulō puṭṭuka, kṣaṇamulō maraṇamu - ī prakāramugā anniyu naśiṃcunaviyē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.