← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవద్వీపములు navadvīpamulu

Original — తెలుగు

“ప్రియవ్రతుండే కాదశార్భుద పరి వత్సరంబులు రాజ్యంబు సేసి యొక్కనాడు మేరునగంబుప్రదక్షణంబు సేయు సూర్యునకు నపరభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపబూని భగవదుపా సనా జనితాతి పురుష ప్రభావుండై సపితృ రధ సదృశ వేగంబు గలిగి తేజోమయంబైన రధంబు నారోహణంబుసేసి రాత్రులనెల్ల దివంబులొనర్తునని సప్త రాత్రంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు వఱపుటయు, నారధినేమి మార్గంబులు సప్త సముద్రంబులును, నామధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె. అందు –

“సీ. వరుసజంబూ పక్ష వరకుశ క్రౌంచముల్ శాకశాల్మలు పుష్కరముననగ

నలరు నాద్వీంబులందు జంబూ ద్వీపమొనరంగ లక్షయోజనములయ్యె

నటనుత్తరోత్తరాయత సంఖ్యదా ద్విగుణితమయి యొండొంటి కతిశయిల్లు

- - - ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 1 - 18, 19)

Transliteration

“priyavratuṃḍē kādaśārbhuda pari vatsaraṃbulu rājyaṃbu sēsi yokkanāḍu mērunagaṃbupradakṣaṇaṃbu sēyu sūryunaku naparabhāgaṃbunaṃ bravartiṃcu naṃdhakāraṃbu nivartiṃpabūni bhagavadupā sanā janitāti puruṣa prabhāvuṃḍai sapitṛ radha sadṛśa vēgaṃbu galigi tējōmayaṃbaina radhaṃbu nārōhaṇaṃbusēsi rātrulanella divaṃbulonartunani sapta rātraṃbulu dvitīya tapanuṃḍunuṃ bōle naradaṃbu vaṟapuṭayu, nāradhinēmi mārgaṃbulu sapta samudraṃbulunu, nāmadhya bhūsaṃdhulu saptadvīpaṃbulu nayye. aṃdu –

“sī. varusajaṃbū pakṣa varakuśa krauṃcamul śākaśālmalu puṣkaramunanaga

nalaru nādvīṃbulaṃdu jaṃbū dvīpamonaraṃga lakṣayōjanamulayye

naṭanuttarōttarāyata saṃkhyadā dviguṇitamayi yoṃḍoṃṭi katiśayillu

- - - ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 1 - 18, 19)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.