← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిధి ధ్యాసనం nidhi dhyāsanaṃ

Original — తెలుగు
  1. నితరాం చింతా. (తదేక నిష్టతో ధ్యానించుట; మరల మరల చింతించుట).

  2. ధ్యాతుమిచ్ఛా దిధ్యాస,నితరాం దిధ్యాసా నిధిధ్యాసా.( ధ్యానము చేయుటకు కలిగిన ఇచ్ఛ (కోరిక) దిధ్యాస.నితరాం =ఎల్లపుడుదిధ్యాస కలిగియుండుట నిధిధ్యాస)

  3. "శ్రవణమనన నిర్విచికిత్సే అర్ధే వస్తుని ఏకతానతయా చేతస్థాపనం నిధిధ్యాసనం భవతి" (పైంగలోపనిషత్)

(శ్రవణమననముల చేత నిశ్చయాభిప్రాయముగల వస్తువునందు - ఒకే దానియందు - చిత్తము నిలుపుట).

"శ్రవణమననంబుల నిశ్చితంబునగు నర్ధంబుల చిత్తము నిశ్చలమై యుండుట నిధి ధ్యానం బనంబడు" (వివేకచింతామణి - 1 - )

  1. "నిధి ధ్యాసనం నామ అనాది దుర్వాసనయా విషయే ష్వాకృష్యమాణ చిత్తస్య విషయేభ్యో (అ)సకృష్యాత్మ విషయక స్థైర్యానుకూలో మనసో వ్యాపారః". (వేదాంత పరిభాషా)

(జన్మ జన్మలనుండి వచ్చుచున్న దుష్కర్మ వాసనలవలన విషయములప్రక్క లాగబడుచున్న చిత్తమును విషయములనుండి మళ్ళించి ఆత్మ ధ్యానమునందు స్థిరముగా నిల్పుటకు అనుకూలమైన మనోవ్యాపారము).

  1. "నిధి ధ్యాసనం నామ అనాది దుర్వాసనా కలుతష్య చిత్తస్య దుర్విషయేషు స్వచ్చందేన ప్రవర్తమానస్య తత్ ఆచ్చిద్యస్య ఆత్మైక తానతా సంపాదనానుకూలో మానస వ్యాపరః"

(నిధిధ్యాసమనగా జన్మ జన్మలనుండి వచ్చుచున్న కర్మ వాసనలచేత కలుషితమై దుర్విషయముల యడల ఇష్టానుసారము ప్రవర్తించుచున్న చిత్తమును లాగి మళ్ళించి ఆత్మ ఒక్కదానియందే ఉండుటకు అనుకూలముగానుండు మనో వ్యాపారము).

  1. "శ్లో.|| తాభ్యాం నిర్విచికిత్సే అర్ధే చేతనః స్థాపితస్య యత్ |

ఏక తానత్వమే తద్ధి నిధిధ్యాసనముచ్యతే ||". (ఆధ్యాత్మోపనిషత్)

("తత్వమసి" - ఆ బ్రహ్మ నీవే అయితివి - అను మొదలగు మహావాక్యములవలన ఉపనిషదర్థమును బాగుగా తెలుసుకొనుటచేత ఆ పరబ్రహ్మయందనుమానము లేక దానియందే - ఆ ఒక్క దానియందే మనస్సు నిలిపి ఉంచుట నిధి ధ్యాసనము).

  1. "దేహాది దృశ్యప్రపంచః సర్వోపి సత్యః, జీవ బ్రహ్మణోర్భే దశ్చ సత్యః" ఇతి ధీః విపరీత భావనా. సాచ సాచ నిధి ధ్యాసనేన నివార్యతే. ఏవం సంశయ ద్వయే నివృత్తే అపి. సాక్షాత్కారాత్ పూర్వం అవిద్యాయాః సత్వాత్ - "అహం బ్రహ్మ న భవామి, జీవ ఏవాహం మత్తో భిన్నమేవ బ్రహ్మా, దేహాని జగత్ సత్యం" ఇత్యవం విధానేన సంశయాః - విపర్యాయాః - పునః పునః జాయేరన్. తన్నివృత్తయే సదా నిధి ధ్యాసితవ్యమేవ" (విచారసాగరము).

(దేహము మొదలగు ఈ కనబడు ప్రపంచమంతయు సత్యమైనది, జీవాత్మల భేదము సత్యము అని తలంచుట విపరీత భావన. అట్టి విపరీత భావన నిధి ధ్యాసము చేత నివారింపబడును. ఇట్లు ఈ రెండు సంశయములు తీరినప్పటికి ఆత్మ సాక్షాత్కారమునకు ముందు మాయా శక్తి చేత " నేను బ్రహ్మను కాను, నేను జీవుడను మాత్రమే. నాకన్న వేరైనది పరబ్రహ్మ. దేహము మొదలగు ఈ జగత్తు సత్యము " అను సంశయములు మరల మరల పుట్టును. వాటి నివృత్తి కొఱకే ఎల్లపుడూ నిధి ధ్యాసము చేయవలసినది).

  1. "తాభ్యాం నిర్విచికిత్సే అర్థే చేతనః స్థాపితస్య యత్ |

ఏక తానత్వమే తద్ధి నిధి ధ్యాసనముచ్యతే ||" (ఆధ్యాత్మోపనిషత్)

("తత్వమసి" - ఆ బ్ర హ్మవునీవే అయితివి - అను మొదలగు మహా వాక్యములవలన ఉపనిషదర్థమును బాగుగా తెలుసుకొనుటచేత ఆ బ్రహ్మ వస్తువు నందనుమానము లేకుయుండి ఆ ఒక్కదానియందే మనస్సునుంచుట నిధి ధ్యాసము).

  1. అనాది భేదవాసనా నిరసనాయ అస్త్యైవ అర్థస్య అనవరత భావనా నిధి ధ్యాసనం.

(పరబ్రహ్మ వేరు, జీవుడు వేరు, పరబ్రహ్మ వేరు ప్రపంచము వేరు అను బుద్ధి అనేక జన్మలనుండి వాసనరూప ముగా వచ్చుచున్నదానిని నిరసించుటకు పరమార్థరూపమైన పరబ్రహ్మను అనవరతము - ఎల్లపుడు - ధ్యానించుట నిధి ధ్యాసనము).

  1. తత్ర నిధి ధ్యాసనం బ్రహ్మ సాక్షాత్కారే సాక్షాత్కారణం - " తే ధ్యాన యోగానుగతిం అపశ్యన్ దేవాత్మ శక్తి స్వగుణైర్నిగూఢాం" ఇతి శ్రుతేః.

(బ్రహ్మ సాక్షాత్కారమును పొందుటకు నిధి ధ్యాసనము సాక్షాత్కారణము - సాక్షాత్సాధనము - త్రిగుణములచేత ఆవరింపబడి కనబడకనుండు అత్మశక్తిని ధ్యానయోగము చేయువారు - నిధి ధ్యాసనము చేయువారు - చూచెదరు అని శ్రుతి చెప్పుచున్నది).

  1. నిధి ధ్యాసనేచ మననం హేతుః, అకృత మనసస్యార్ధ దార్ఢ్యా భావేన తద్విషయే నిధి ధ్యాసనా యోగాత్. మననేచ శరణం హేతుః, శ్రవణాభావే తాత్పర్య నిశ్చయేవ శబ్ద జ్ఞానా భావేన శ్రుతార్థ విషయక యుక్తత్వా యుక్తత్వ నిశ్చయానుకూల మననా యోగాత్. ఏతాని త్రీణ్యపి జ్ఞానోత్పత్తౌ కారణా నీతికే చిదాచార్యాః ఊచిరే " ఇత్యాచర్య వాచస్పతి మతిః.

(నిధి ధ్యాసనమునకు మననము కారణము, మనస్సును వశములోనుంచుకోలేనిచో ధ్యానించు వస్తువునందు నిధి ధ్యాసనము కుదరదు. మననమునకు శ్రవణము కారణము. శ్రవణము లేనియెడల వేదార్థము తెలియకుండుటచేత వినిన విషయము మంచిదా, చెడ్డదా, నిజమా, అబద్దమా అను సంశయము పోగొట్టుకొనుటకు అనుకూలమైన వివేక శక్తి లేకుండును - ఈ మూడు - అనగా , నిధి ధ్యాసనము, మననము, శ్రవణము - జ్ఞానము కలుగుటకు - బ్రహ్మజ్ఞానము కలుగుటకు - కారణములని కొందఱు ఆచార్యులు చెప్పియున్నారు).

  1. ధ్యానము - ప్రత్యక్షముగా ధ్యానించు వస్తువును సాక్షాత్కరింప చేయునది.

  2. నిధి ధ్యాసనముయొక్క పరాకాష్టయే సమాది.

  3. "ఆత్మవా, అరే, ద్రష్టవ్యః, శ్రోతవ్యో, నిధి ధ్యాసితవ్యః -" ఇతి శ్రుతిః.

(ఆత్మను సాక్షాత్కరింపచేసుకొనవలెను - ఆత్మను గుఱించి వినవలెను, ఆత్మ గుఱించి నిధి ధ్యాసము చేసుకొనవలెను).

Transliteration
  1. nitarāṃ ciṃtā. (tadēka niṣṭatō dhyāniṃcuṭa; marala marala ciṃtiṃcuṭa).

  2. dhyātumicchā didhyāsa,nitarāṃ didhyāsā nidhidhyāsā.( dhyānamu cēyuṭaku kaligina iccha (kōrika) didhyāsa.nitarāṃ =ellapuḍudidhyāsa kaligiyuṃḍuṭa nidhidhyāsa)

  3. "śravaṇamanana nirvicikitsē ardhē vastuni ēkatānatayā cētasthāpanaṃ nidhidhyāsanaṃ bhavati" (paiṃgalōpaniṣat)

(śravaṇamananamula cēta niścayābhiprāyamugala vastuvunaṃdu - okē dāniyaṃdu - cittamu nilupuṭa).

"śravaṇamananaṃbula niścitaṃbunagu nardhaṃbula cittamu niścalamai yuṃḍuṭa nidhi dhyānaṃ banaṃbaḍu" (vivēkaciṃtāmaṇi - 1 - )

  1. "nidhi dhyāsanaṃ nāma anādi durvāsanayā viṣayē ṣvākṛṣyamāṇa cittasya viṣayēbhyō (a)sakṛṣyātma viṣayaka sthairyānukūlō manasō vyāpāraḥ". (vēdāṃta paribhāṣā)

(janma janmalanuṃḍi vaccucunna duṣkarma vāsanalavalana viṣayamulaprakka lāgabaḍucunna cittamunu viṣayamulanuṃḍi maḷḷiṃci ātma dhyānamunaṃdu sthiramugā nilpuṭaku anukūlamaina manōvyāpāramu).

  1. "nidhi dhyāsanaṃ nāma anādi durvāsanā kalutaṣya cittasya durviṣayēṣu svaccaṃdēna pravartamānasya tat āccidyasya ātmaika tānatā saṃpādanānukūlō mānasa vyāparaḥ"

(nidhidhyāsamanagā janma janmalanuṃḍi vaccucunna karma vāsanalacēta kaluṣitamai durviṣayamula yaḍala iṣṭānusāramu pravartiṃcucunna cittamunu lāgi maḷḷiṃci ātma okkadāniyaṃdē uṃḍuṭaku anukūlamugānuṃḍu manō vyāpāramu).

  1. "ślō.|| tābhyāṃ nirvicikitsē ardhē cētanaḥ sthāpitasya yat |

ēka tānatvamē taddhi nidhidhyāsanamucyatē ||". (ādhyātmōpaniṣat)

("tatvamasi" - ā brahma nīvē ayitivi - anu modalagu mahāvākyamulavalana upaniṣadarthamunu bāgugā telusukonuṭacēta ā parabrahmayaṃdanumānamu lēka dāniyaṃdē - ā okka dāniyaṃdē manassu nilipi uṃcuṭa nidhi dhyāsanamu).

  1. "dēhādi dṛśyaprapaṃcaḥ sarvōpi satyaḥ, jīva brahmaṇōrbhē daśca satyaḥ" iti dhīḥ viparīta bhāvanā. sāca sāca nidhi dhyāsanēna nivāryatē. ēvaṃ saṃśaya dvayē nivṛttē api. sākṣātkārāt pūrvaṃ avidyāyāḥ satvāt - "ahaṃ brahma na bhavāmi, jīva ēvāhaṃ mattō bhinnamēva brahmā, dēhāni jagat satyaṃ" ityavaṃ vidhānēna saṃśayāḥ - viparyāyāḥ - punaḥ punaḥ jāyēran. tannivṛttayē sadā nidhi dhyāsitavyamēva" (vicārasāgaramu).

(dēhamu modalagu ī kanabaḍu prapaṃcamaṃtayu satyamainadi, jīvātmala bhēdamu satyamu ani talaṃcuṭa viparīta bhāvana. aṭṭi viparīta bhāvana nidhi dhyāsamu cēta nivāriṃpabaḍunu. iṭlu ī reṃḍu saṃśayamulu tīrinappaṭiki ātma sākṣātkāramunaku muṃdu māyā śakti cēta " nēnu brahmanu kānu, nēnu jīvuḍanu mātramē. nākanna vērainadi parabrahma. dēhamu modalagu ī jagattu satyamu " anu saṃśayamulu marala marala puṭṭunu. vāṭi nivṛtti koṟakē ellapuḍū nidhi dhyāsamu cēyavalasinadi).

  1. "tābhyāṃ nirvicikitsē arthē cētanaḥ sthāpitasya yat |

ēka tānatvamē taddhi nidhi dhyāsanamucyatē ||" (ādhyātmōpaniṣat)

("tatvamasi" - ā bra hmavunīvē ayitivi - anu modalagu mahā vākyamulavalana upaniṣadarthamunu bāgugā telusukonuṭacēta ā brahma vastuvu naṃdanumānamu lēkuyuṃḍi ā okkadāniyaṃdē manassunuṃcuṭa nidhi dhyāsamu).

  1. anādi bhēdavāsanā nirasanāya astyaiva arthasya anavarata bhāvanā nidhi dhyāsanaṃ.

(parabrahma vēru, jīvuḍu vēru, parabrahma vēru prapaṃcamu vēru anu buddhi anēka janmalanuṃḍi vāsanarūpa mugā vaccucunnadānini nirasiṃcuṭaku paramārtharūpamaina parabrahmanu anavaratamu - ellapuḍu - dhyāniṃcuṭa nidhi dhyāsanamu).

  1. tatra nidhi dhyāsanaṃ brahma sākṣātkārē sākṣātkāraṇaṃ - " tē dhyāna yōgānugatiṃ apaśyan dēvātma śakti svaguṇairnigūḍhāṃ" iti śrutēḥ.

(brahma sākṣātkāramunu poṃduṭaku nidhi dhyāsanamu sākṣātkāraṇamu - sākṣātsādhanamu - triguṇamulacēta āvariṃpabaḍi kanabaḍakanuṃḍu atmaśaktini dhyānayōgamu cēyuvāru - nidhi dhyāsanamu cēyuvāru - cūcedaru ani śruti ceppucunnadi).

  1. nidhi dhyāsanēca mananaṃ hētuḥ, akṛta manasasyārdha dārḍhyā bhāvēna tadviṣayē nidhi dhyāsanā yōgāt. mananēca śaraṇaṃ hētuḥ, śravaṇābhāvē tātparya niścayēva śabda jñānā bhāvēna śrutārtha viṣayaka yuktatvā yuktatva niścayānukūla mananā yōgāt. ētāni trīṇyapi jñānōtpattau kāraṇā nītikē cidācāryāḥ ūcirē " ityācarya vācaspati matiḥ.

(nidhi dhyāsanamunaku mananamu kāraṇamu, manassunu vaśamulōnuṃcukōlēnicō dhyāniṃcu vastuvunaṃdu nidhi dhyāsanamu kudaradu. mananamunaku śravaṇamu kāraṇamu. śravaṇamu lēniyeḍala vēdārthamu teliyakuṃḍuṭacēta vinina viṣayamu maṃcidā, ceḍḍadā, nijamā, abaddamā anu saṃśayamu pōgoṭṭukonuṭaku anukūlamaina vivēka śakti lēkuṃḍunu - ī mūḍu - anagā , nidhi dhyāsanamu, mananamu, śravaṇamu - jñānamu kaluguṭaku - brahmajñānamu kaluguṭaku - kāraṇamulani koṃdaṟu ācāryulu ceppiyunnāru).

  1. dhyānamu - pratyakṣamugā dhyāniṃcu vastuvunu sākṣātkariṃpa cēyunadi.

  2. nidhi dhyāsanamuyokka parākāṣṭayē samādi.

  3. "ātmavā, arē, draṣṭavyaḥ, śrōtavyō, nidhi dhyāsitavyaḥ -" iti śrutiḥ.

(ātmanu sākṣātkariṃpacēsukonavalenu - ātmanu guṟiṃci vinavalenu, ātma guṟiṃci nidhi dhyāsamu cēsukonavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.