← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిమిత్త కారణము nimitta kāraṇamu

Original — తెలుగు
  1. కార్యోత్పత్తి మాత్ర కారణత్వం నిమిత్త కారణస్య లక్షణం.

(కార్యమును పుట్టించుటకు మాత్రమే కారణమై యుండుట నిమిత్తకారణముయొక్క లక్షణము).

  1. యత్కార్య స్వరూపేన ప్రవిశతి, కింతు కార్యాత్ పృధిక్ స్థితం, సత్కార్యముత్పాదయతి. యస్యనాశేన కార్యం న నశ్యతి. తత్ నిమిత్త కారణమిత్యభిధీయతే - యథా ఘటస్య కులాలోదండ చక్రాదయశ్చ నిమిత్తకారణాని న కులా లాదయః ఘటస్వరూపే ప్రవిశంతి, ఘటాత్ పృధక్ భూతా ఘటముత్పాదయంతి. ఘటోత్పత్యనంతరం కులాలాదీనాం నాశోపి ఘటా న నశ్యంతి.

(ఏ కారణము కార్యముయొక్క రూపములో కనుపించదో - ఉండదో, కార్యముకన్న వేరుగా నుండునో, కార్యమును మట్టుకు పుట్టించునో, కార్యము నశించినను కారణము నశించదో అట్టి కారణము నిమిత్త కారణము అని చెప్పబడుచున్నది. కుమ్మరివాడు కుండచేయునపుడు చక్రము, దండము, కుండలో కనబడరు - అవి కుండకన్న వేరుగానుండిపోవుచు కుండను చేయుచున్నవి. కుండ చేయబడిన తర్వాత (కులాలుడు) కుమ్మరివాడు నశించినను కుండనశించదు. అట్టి కుమ్మరివాడు కుండకు నిమిత్తకారణము. కుండను చేయు విషయములో కుమ్మరివాడేకాక, చక్రము దండము కూడ నిమిత్త కారణములు. బంగారముతో నగలు చేయుటలో స్వర్ణకారుడేకాక - బంగారపు పనివాడే కాక - సుత్తి మొదలగు పరికరములుకూడ నిమిత్త కారణములే.

  1. కారణవస్తువునుండి కార్యవస్తువు పుట్టినపుడు ఏ కారణము నిమిత్తమాత్రమైయుండునో అది నిమిత్తకారణము -

  2. బ్రహ్మ ప్రపంచమునకు కారణము - కుండ విషయములో కుమ్మరివాడు వేరు, మట్టి వేరు - శ్రీమద్భగవద్గీతలో భగవంతునికి రెండు శక్తులున్నవని చెప్పబడినది - ఒకటి ఎనిమిది విధములైన ప్రకృతి - అపరాప్రకృతి, అపరాశక్తి. ఇది జడము, ఏ పనియు స్వయముగా చేయలేనిది - కుమ్మరివానికి కుండ చేయుటలో మట్టి వంటిది. ఈ జడశక్తి అయిన ప్రకృతిలో భగవంతుడు తనరెండవ శక్తి అయిన చిచ్ఛక్తి - చైతన్య శక్తితో పరాశక్తితో ప్రవేశించి ఆ జడ శక్తిని చైతన్యవంతముగా చేసెను. దీని ఫలితముగా ఆ జడశక్తి అయిన ప్రకృతి మహత్తత్త్వముగా మారెను - మట్టి కుండగా మారినట్లు. ఇదియే సృష్టి ప్రారంభం - పురుషుడు అయిన భగవంతుడు తన చిచ్ఛక్తితో ప్రకౄతితో కలియుటచేత ప్రకృతినుండి మరియొక వస్తువు పుట్టినది. ఇట్లు పుట్టిన మహత్తత్వములో భగవంతుని చిచ్ఛక్తి, జడశక్తి - భగవంతుడు, ప్రకృతి - రెండునూ కలిసియే యున్నవి. ఇట్లు రెండునూ కలిసియుండుటవలన ఆ మహత్తత్వములోనుండి ఇంకొక వస్తువు - తత్వము - అహంకారము పుట్టినది - అనగా ఈ ప్రకారముగానే భగవంతుని రెండు శక్తులు కలియుటచేతనే ప్రపంచములోని ప్రతి వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది.నేటిశాస్త్రజ్ఞులు కూడ సృష్టి క్రమము విషయములో ఈ సిద్ధాంతమునే బలపరచియున్నారు - (creation is the result of the combination of matter) ( జడప్రకృతి) and energy (భగవంతుని చిచ్ఛక్తి). జడశక్తియగు అపరాప్రకృతి - matter - భగవంతునిలోనుండి పుట్టినవే - అతని శక్తి అతనినుండి వేరుచేయుటకు వీలులేనిదికదా ! (Matter is born out of pure Energy - శుద్ధసత్వము). ( ప్రపంచములోని వస్తువులన్నియు ప్రకృతి రూపములే - పరిణామములే. ప్రకృతియే ఉపాదానకారణము - కాని ప్రకృతి కూడ భగవంతునినుండి పుట్టినది కనుక భగవంతుడే ఉపాదానకారణము. తన చిచ్ఛక్తియే లేక ఆ శక్తిగల భగవంతుడే సృష్టికి నిమిత్తకారణముకూడ. సృష్టిలోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటి పుట్టినవి కనుక ప్రతివస్తువులోను ఈ రెండునూ - చిచ్ఛక్తి గల భగవంతుడు, జడశక్తి అయిన ప్రకృతి - ఈ రెండు అంశలు ఉన్నవి. ఎంత పెద్ద వస్తువులోనైనను, ఎంత చిన్నవస్తువులోనైనను ఈ రెండునూ ఒకదానినుండి రెండవదానిని విడదీయుటకు వీలుకాని పరిస్థితిలోనున్నవి. ఇదియే వాటి అవినాభావసంబంధము - " ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - ). దీనినిబట్టి సృష్టి అంతటికీ, సృష్టిలోనున్న ప్రతి వస్తువు నకు భగవంతుడు నిమిత్తకారణము, ఉపాదానకారణము కూడా అయి యున్నాడనుట సిద్దాంతమే - భగ వంతుడు తనచిచ్చక్తి రూపముతోలేని యే వస్తువులోనుండి అయినను ఇంకొకవస్తువు పుట్టుట జరగదు).

Transliteration
  1. kāryōtpatti mātra kāraṇatvaṃ nimitta kāraṇasya lakṣaṇaṃ.

(kāryamunu puṭṭiṃcuṭaku mātramē kāraṇamai yuṃḍuṭa nimittakāraṇamuyokka lakṣaṇamu).

  1. yatkārya svarūpēna praviśati, kiṃtu kāryāt pṛdhik sthitaṃ, satkāryamutpādayati. yasyanāśēna kāryaṃ na naśyati. tat nimitta kāraṇamityabhidhīyatē - yathā ghaṭasya kulālōdaṃḍa cakrādayaśca nimittakāraṇāni na kulā lādayaḥ ghaṭasvarūpē praviśaṃti, ghaṭāt pṛdhak bhūtā ghaṭamutpādayaṃti. ghaṭōtpatyanaṃtaraṃ kulālādīnāṃ nāśōpi ghaṭā na naśyaṃti.

(ē kāraṇamu kāryamuyokka rūpamulō kanupiṃcadō - uṃḍadō, kāryamukanna vērugā nuṃḍunō, kāryamunu maṭṭuku puṭṭiṃcunō, kāryamu naśiṃcinanu kāraṇamu naśiṃcadō aṭṭi kāraṇamu nimitta kāraṇamu ani ceppabaḍucunnadi. kummarivāḍu kuṃḍacēyunapuḍu cakramu, daṃḍamu, kuṃḍalō kanabaḍaru - avi kuṃḍakanna vērugānuṃḍipōvucu kuṃḍanu cēyucunnavi. kuṃḍa cēyabaḍina tarvāta (kulāluḍu) kummarivāḍu naśiṃcinanu kuṃḍanaśiṃcadu. aṭṭi kummarivāḍu kuṃḍaku nimittakāraṇamu. kuṃḍanu cēyu viṣayamulō kummarivāḍēkāka, cakramu daṃḍamu kūḍa nimitta kāraṇamulu. baṃgāramutō nagalu cēyuṭalō svarṇakāruḍēkāka - baṃgārapu panivāḍē kāka - sutti modalagu parikaramulukūḍa nimitta kāraṇamulē.

  1. kāraṇavastuvunuṃḍi kāryavastuvu puṭṭinapuḍu ē kāraṇamu nimittamātramaiyuṃḍunō adi nimittakāraṇamu -

  2. brahma prapaṃcamunaku kāraṇamu - kuṃḍa viṣayamulō kummarivāḍu vēru, maṭṭi vēru - śrīmadbhagavadgītalō bhagavaṃtuniki reṃḍu śaktulunnavani ceppabaḍinadi - okaṭi enimidi vidhamulaina prakṛti - aparāprakṛti, aparāśakti. idi jaḍamu, ē paniyu svayamugā cēyalēnidi - kummarivāniki kuṃḍa cēyuṭalō maṭṭi vaṃṭidi. ī jaḍaśakti ayina prakṛtilō bhagavaṃtuḍu tanareṃḍava śakti ayina cicchakti - caitanya śaktitō parāśaktitō pravēśiṃci ā jaḍa śaktini caitanyavaṃtamugā cēsenu. dīni phalitamugā ā jaḍaśakti ayina prakṛti mahattattvamugā mārenu - maṭṭi kuṃḍagā mārinaṭlu. idiyē sṛṣṭi prāraṃbhaṃ - puruṣuḍu ayina bhagavaṃtuḍu tana cicchaktitō prakṝtitō kaliyuṭacēta prakṛtinuṃḍi mariyoka vastuvu puṭṭinadi. iṭlu puṭṭina mahattatvamulō bhagavaṃtuni cicchakti, jaḍaśakti - bhagavaṃtuḍu, prakṛti - reṃḍunū kalisiyē yunnavi. iṭlu reṃḍunū kalisiyuṃḍuṭavalana ā mahattatvamulōnuṃḍi iṃkoka vastuvu - tatvamu - ahaṃkāramu puṭṭinadi - anagā ī prakāramugānē bhagavaṃtuni reṃḍu śaktulu kaliyuṭacētanē prapaṃcamulōni prati vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi.nēṭiśāstrajñulu kūḍa sṛṣṭi kramamu viṣayamulō ī siddhāṃtamunē balaparaciyunnāru - (creation is the result of the combination of matter) ( jaḍaprakṛti) and energy (bhagavaṃtuni cicchakti). jaḍaśaktiyagu aparāprakṛti - matter - bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē - atani śakti ataninuṃḍi vērucēyuṭaku vīlulēnidikadā ! (Matter is born out of pure Energy - śuddhasatvamu). ( prapaṃcamulōni vastuvulanniyu prakṛti rūpamulē - pariṇāmamulē. prakṛtiyē upādānakāraṇamu - kāni prakṛti kūḍa bhagavaṃtuninuṃḍi puṭṭinadi kanuka bhagavaṃtuḍē upādānakāraṇamu. tana cicchaktiyē lēka ā śaktigala bhagavaṃtuḍē sṛṣṭiki nimittakāraṇamukūḍa. sṛṣṭilōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭi puṭṭinavi kanuka prativastuvulōnu ī reṃḍunū - cicchakti gala bhagavaṃtuḍu, jaḍaśakti ayina prakṛti - ī reṃḍu aṃśalu unnavi. eṃta pedda vastuvulōnainanu, eṃta cinnavastuvulōnainanu ī reṃḍunū okadāninuṃḍi reṃḍavadānini viḍadīyuṭaku vīlukāni paristhitilōnunnavi. idiyē vāṭi avinābhāvasaṃbaṃdhamu - " ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu ". (śrīmadāṃdhramahābhāgavatamu - - - ). dīninibaṭṭi sṛṣṭi aṃtaṭikī, sṛṣṭilōnunna prati vastuvu naku bhagavaṃtuḍu nimittakāraṇamu, upādānakāraṇamu kūḍā ayi yunnāḍanuṭa siddāṃtamē - bhaga vaṃtuḍu tanaciccakti rūpamutōlēni yē vastuvulōnuṃḍi ayinanu iṃkokavastuvu puṭṭuṭa jaragadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.