← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిమిత్తమాత్రము nimittamātramu

Original — తెలుగు
  1. కారణము మాత్రమైనది.

  2. "కాలపక్వమిదం మన్యే సర్వం పక్వం జనార్దన". (మహాభారతము - ఉ -127 - 32)

(ప్రపంచములోని ప్రతి వస్తువు కాలము గడిచిన కొలది మార్పు చెందును - అందుచేతనే దీనిని జగత్తు అని చెప్పియుండిరి. పుట్టినవస్తువునకు ఆఖరిమార్పు మరణము - ఇది కాలపరిపాకము వలననే కలుగును. అందుచేత ఒక దుష్టుడు ఇంకొకరిచేత చంపబడిన ఆ దుష్టుడు కాలపరిపక్వమువలన మరిణించెననుటయే - అతనిని చంపినవాడు నిమిత్తమాత్రుడే - "కాలోస్మిలోక క్షయకృత్ ప్రవద్దో"

(శ్రీమద్భగవద్గీత - 4 - 32)

(నేను - భగవంతుడనగునేను - లోకములను వాటికాల పరిపక్వమును బట్టి నశింపచేయు కాలుడను - కాలరూపుడను). మహాభారతయుద్ధములో శ్రీకృష్ణ భగవానుడు - తాను వైరి శైన్యములను - కాలరూపములో - చంపి, వారిని చంపుటకు అర్జునుడు నిమిత్తమాత్రముగా నుండుమని చెప్పెను. అందుచేత ఎవరిచేత ఎవరు చంపబడినను ఆ చంపబడినవారు కాలము - జీవితకాలము - తీరిపోయినందున చనిపోయిరిగాని ఒకరిచే చంపబడలేదు - చంపినవారు నిమిత్తమాత్రులే - "మృత్యుః సర్వ హరిశ్చాహం" (అందఱిని చంపు మృత్యువును నేనే (శ్రీమద్భగవద్గీత - 10 - 34)

"ఋతేపిత్వాం న భవిష్యంతి సర్వే యే(అ)వస్థితాః ప్రత్యనీకేషు యోధాః |

- - మయై వేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||" (శ్రీమద్భగవద్గీత - 11 - 33)

(నీవు లేకపోయినను - నీవు వీరిని చంపకపోయినను - ఈ శత్రు సైన్యములోనున్నవారిని నీవు చంపకపోయినను - వారు జీవించియుండరు - వారి కాలముచెల్లినది కనుక వారు చనిపోవువారు - అందుచేత వారి మరణమునకు నీవు నిమిత్తమాత్రుడవగుము - వారి మరణము నీకు నీవు నామమాత్రముగ కారకుడవగుము).

"క. కర్మమున పుట్టు జంతువు

కర్మమునను వృద్ధిపొందు కర్మమున జెడున్

కర్మమె కారణమంతకు

కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా" (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )

అందుచేత జీవులకు కష్టసుఖములు ఇంకొకరివలన కలుగవు. అవి వారి కర్మఫలమే. వాటిని కలిగించినవారు నిమిత్తమాత్రులే –

"తోడం బుట్టినవాని భంగమునకున్ దుఃఖించి, మా కృష్ణునె

గ్గడం జూడకు మమ్ము; పూర్వభవకర్మాధీనమై ప్రాణులం

గీడున్ మేలును జెందు; లేడొకడు శిక్షింపంగ రక్షింప, నీ

తోడం బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యె నెడియ్యడన్" (శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - పూ - భా- )

"భూతములచేత నెప్పుడు

భూతములకు జన్మ మరణపోషణములు ని

ర్ణీతములు చేయుచుండును

భూతమయుండీశ్వరుండు భూత శరణ్యా" (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )

(భూతములకు వారి వారి కర్మల ప్రకారము సుఖ దుఃఖములను ఒక భూతముచేత నింకొక భూతముద్వారా కలుగచేయుచుండును - అందుచేత సుఖదుఃఖములను కలుగచేయు భూతములు నిమిత్త మాత్రములే).

Transliteration
  1. kāraṇamu mātramainadi.

  2. "kālapakvamidaṃ manyē sarvaṃ pakvaṃ janārdana". (mahābhāratamu - u -127 - 32)

(prapaṃcamulōni prati vastuvu kālamu gaḍicina koladi mārpu ceṃdunu - aṃducētanē dīnini jagattu ani ceppiyuṃḍiri. puṭṭinavastuvunaku ākharimārpu maraṇamu - idi kālaparipākamu valananē kalugunu. aṃducēta oka duṣṭuḍu iṃkokaricēta caṃpabaḍina ā duṣṭuḍu kālaparipakvamuvalana mariṇiṃcenanuṭayē - atanini caṃpinavāḍu nimittamātruḍē - "kālōsmilōka kṣayakṛt pravaddō"

(śrīmadbhagavadgīta - 4 - 32)

(nēnu - bhagavaṃtuḍanagunēnu - lōkamulanu vāṭikāla paripakvamunu baṭṭi naśiṃpacēyu kāluḍanu - kālarūpuḍanu). mahābhāratayuddhamulō śrīkṛṣṇa bhagavānuḍu - tānu vairi śainyamulanu - kālarūpamulō - caṃpi, vārini caṃpuṭaku arjunuḍu nimittamātramugā nuṃḍumani ceppenu. aṃducēta evaricēta evaru caṃpabaḍinanu ā caṃpabaḍinavāru kālamu - jīvitakālamu - tīripōyinaṃduna canipōyirigāni okaricē caṃpabaḍalēdu - caṃpinavāru nimittamātrulē - "mṛtyuḥ sarva hariścāhaṃ" (aṃdaṟini caṃpu mṛtyuvunu nēnē (śrīmadbhagavadgīta - 10 - 34)

"ṛtēpitvāṃ na bhaviṣyaṃti sarvē yē(a)vasthitāḥ pratyanīkēṣu yōdhāḥ |

- - mayai vētē nihatāḥ pūrvamēva nimittamātraṃ bhava savyasācin ||" (śrīmadbhagavadgīta - 11 - 33)

(nīvu lēkapōyinanu - nīvu vīrini caṃpakapōyinanu - ī śatru sainyamulōnunnavārini nīvu caṃpakapōyinanu - vāru jīviṃciyuṃḍaru - vāri kālamucellinadi kanuka vāru canipōvuvāru - aṃducēta vāri maraṇamunaku nīvu nimittamātruḍavagumu - vāri maraṇamu nīku nīvu nāmamātramuga kārakuḍavagumu).

"ka. karmamuna puṭṭu jaṃtuvu

karmamunanu vṛddhipoṃdu karmamuna jeḍun

karmame kāraṇamaṃtaku

karmame sukhaduḥkhamulaku kāraṇamanaghā" (śrīmadāṃdhramahābhāgavatamu - - - )

aṃducēta jīvulaku kaṣṭasukhamulu iṃkokarivalana kalugavu. avi vāri karmaphalamē. vāṭini kaligiṃcinavāru nimittamātrulē –

"tōḍaṃ buṭṭinavāni bhaṃgamunakun duḥkhiṃci, mā kṛṣṇune

ggaḍaṃ jūḍaku mammu; pūrvabhavakarmādhīnamai prāṇulaṃ

gīḍun mēlunu jeṃdu; lēḍokaḍu śikṣiṃpaṃga rakṣiṃpa, nī

tōḍaṃ buṭṭuvu karmaśēṣa paribhūtuṃḍayye neḍiyyaḍan" (śrīmadāṃdhramahābhāgavatamu -10 - pū - bhā- )

"bhūtamulacēta neppuḍu

bhūtamulaku janma maraṇapōṣaṇamulu ni

rṇītamulu cēyucuṃḍunu

bhūtamayuṃḍīśvaruṃḍu bhūta śaraṇyā" (śrīmadāṃdhramahābhāgavatamu - - - )

(bhūtamulaku vāri vāri karmala prakāramu sukha duḥkhamulanu oka bhūtamucēta niṃkoka bhūtamudvārā kalugacēyucuṃḍunu - aṃducēta sukhaduḥkhamulanu kalugacēyu bhūtamulu nimitta mātramulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.