ఆకారము లేనివాడు, రూపము లేనివాడు. కరచరణాది అవయవములు గల రూపము సత్వ రజస్తమోగుణముల వలన కలుగును. ఈ త్రిగుణములు ప్రకృతి గుణములు - ప్రకృతి భగవంతునినుండి పుట్టినది. అందుచేత భగవంతుని కంటె ముందునుండి ఉన్నవాడు, త్రిగుణాతీతుడు, అందుచేత ఆకారములేనివాడు.
"న స్థాన తోపి పరస్య ఉభయ లింగం సర్వత్రహి". (బ్రహ్మసూత్రములు - 3 - 2 - 11)
(పరబ్రహ్మకు ఉపాధివలన నయినను రెండురూపములు - సాకారము, నిరాకారము - లేవు. ఒకే ఒక పరబ్రహ్మకు యథార్థముగా విరుద్ధములగు రెండు రూపములుండుట అసంభవము - అతనిది ఒకే రూపము - అది సాకారమా లేక నిరాకారమా ? అనిన అది నిరాకారమే - ఉపషత్తులలో నిరాకార పరబ్రహ్మమే ప్రతి పాదించబడినది - ఎట్లనగా –
"అశబ్దమస్పర్శ మరూపమవ్యయం" (కాఠికము - 3 - 15)
(పరబ్రహ్మ శబ్ద, స్పర్శ, రూప వ్యయములు లేనివాడు) అని నిరాకారమే ముఖ్యముగా నిరూపింపబడినది).
(ఉప్పుగడ్డ ఏట్లు లోపల పైన అంతటను ఒకే రసముతో నిండియున్నదో చైతన్యైక రసస్వరూపుడు - చైతన్య మాత్రుడే, చైతన్య ఘనమే. పరమాత్మ - చైతన్యము మరి యేదియు తనలో లేనివాడు - "ఆహ చ తన్మాత్రం"- (బ్రహ్మసూత్రములు - 3 - 2 - 10)
(పరబ్రహ్మ చైతన్యమాత్రమే అని శ్రుతి చెప్పుచున్నది."స ఎష నేతి నేతి". (బృహదారణ్యకోపనిషత్ - 3 - 9 - 20)
(అదికాదు, అది కాదు అన్నివస్తువులను నిరాకరించి నిరాకారచైతన్యము తప్ప మఱేదీ లేదని శ్రుతి చెప్పు చున్నది ." అన్యదేవ తద్విదితా దదో అది దితాదవధి " (ఉపనిషత్ - 1 - 3)
(ఇదికాక ఇంకొకరీతిగా - నిరాకారముగా కాక ఇంకొకరీతిగా (పరబ్రహ్మను తెలుసుకొనినవాడు అధోగతికి పోవును; అట్లు తెలుసుకొననివాడు ఊర్థ్వగతికి పోవును)). స్మృతికూడ ఈ ప్రకారముగానే చెప్పుచున్నది : -
జ్ఞేయం యత్తత్ప్రక్ష్యామి యథ్జాత్వా (అ)మృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే ||" (శ్రీమద్భగవద్గీత - 13 - 12)
(తెలుసుకొనవలసిన పరబ్రహ్మను చెప్పుచున్నాను. దానిని తెలుసుకొనిన మోక్షమును పొందును - ఆ పరబ్రహ్మ జన్మరహితుడు - సత్తు అనిగాని అసత్తు అని గాని చెప్పుటకు వీలుకానిది, అందుచేత నిరాకారము).
"యథా హ్యయం జ్యోతిరాత్మా వివస్వాన్ ఆపోభిన్నా బహుదైకో(అ)నుగచ్చన్ ఉపాధినా క్రియతే భేదరూపో దేవః క్షేత్రే తమజోయమాత్మా" (జలములో ప్రతిబింబించిన సూర్యుడు ఉపాధిభూతమైన జలము చలించిన చలించును, జలమే యాకారముగనున్న నా యాకారము కలిగియుండును, కాని, సహజముగా సూర్యునికీ చలనము ఆకారభేదమును లేదు. అట్లే పరమాత్మకును ఉపాధివలన కలిగిన భేదమేకాని వాస్తవ ముగా భేదములేదు - నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు నీటిలో నుండుట వలన నీటికి చెందిన వృద్ధి, హ్రస, చలనాదులను నతడు పొందినట్లుండును గాని వాస్తవముగా సూర్యునికి వృద్ధి హ్రాస చలనాదులు లేనట్లు దేహా ద్యుపాదులలో నుండుటవలన దేహాది గత వృద్ధి హ్రాసాదులు ఆత్మ కున్నట్లుండునే కాని సహజముగా నిరాకారుడగు పరమాత్మకు ఉపాధుల వలన కలుగు వృద్ధి హ్రాసాదులు లేవు.
పరబ్రహ్మ రూపములేనిది కనుకనే 'అవ్యక్తము' - ఇంద్రియములకు గోచరముకానిది. కనుకనే నిరాకారమని చెప్పబడినది.
“యేత్వక్షర్ఫమనిర్దేశ్యమవ్యక్తం వర్యుపాసతే |" (శ్రీమద్భగవద్గీత - 12 - 3 , 4)
(పరమాత్మ ఇటువంటిది అని నిర్దేశింపరానిదిన్నీ, అవ్యక్తము – కనబడని దిన్నీ - అయినందున నిరాకారుడని చెప్పబడినది).
(సాకారము - ఆకారము గలది అనృతము - నిరాకార బ్రహ్మ నిశ్చలమైనది - చలింపనిది, మార్పులేనిది).
ākāramu lēnivāḍu, rūpamu lēnivāḍu. karacaraṇādi avayavamulu gala rūpamu satva rajastamōguṇamula valana kalugunu. ī triguṇamulu prakṛti guṇamulu - prakṛti bhagavaṃtuninuṃḍi puṭṭinadi. aṃducēta bhagavaṃtuni kaṃṭe muṃdunuṃḍi unnavāḍu, triguṇātītuḍu, aṃducēta ākāramulēnivāḍu.
"na sthāna tōpi parasya ubhaya liṃgaṃ sarvatrahi". (brahmasūtramulu - 3 - 2 - 11)
(parabrahmaku upādhivalana nayinanu reṃḍurūpamulu - sākāramu, nirākāramu - lēvu. okē oka parabrahmaku yathārthamugā viruddhamulagu reṃḍu rūpamuluṃḍuṭa asaṃbhavamu - atanidi okē rūpamu - adi sākāramā lēka nirākāramā ? anina adi nirākāramē - upaṣattulalō nirākāra parabrahmamē prati pādiṃcabaḍinadi - eṭlanagā –
"aśabdamasparśa marūpamavyayaṃ" (kāṭhikamu - 3 - 15)
(parabrahma śabda, sparśa, rūpa vyayamulu lēnivāḍu) ani nirākāramē mukhyamugā nirūpiṃpabaḍinadi).
(uppugaḍḍa ēṭlu lōpala paina aṃtaṭanu okē rasamutō niṃḍiyunnadō caitanyaika rasasvarūpuḍu - caitanya mātruḍē, caitanya ghanamē. paramātma - caitanyamu mari yēdiyu tanalō lēnivāḍu - "āha ca tanmātraṃ"- (brahmasūtramulu - 3 - 2 - 10)
(parabrahma caitanyamātramē ani śruti ceppucunnadi."sa eṣa nēti nēti". (bṛhadāraṇyakōpaniṣat - 3 - 9 - 20)
(adikādu, adi kādu annivastuvulanu nirākariṃci nirākāracaitanyamu tappa maṟēdī lēdani śruti ceppu cunnadi ." anyadēva tadviditā dadō adi ditādavadhi " (upaniṣat - 1 - 3)
(idikāka iṃkokarītigā - nirākāramugā kāka iṃkokarītigā (parabrahmanu telusukoninavāḍu adhōgatiki pōvunu; aṭlu telusukonanivāḍu ūrthvagatiki pōvunu)). smṛtikūḍa ī prakāramugānē ceppucunnadi : -
jñēyaṃ yattatprakṣyāmi yathjātvā (a)mṛtamaśnutē |
anādimatparaṃ brahma nasattannā saducyatē ||" (śrīmadbhagavadgīta - 13 - 12)
(telusukonavalasina parabrahmanu ceppucunnānu. dānini telusukonina mōkṣamunu poṃdunu - ā parabrahma janmarahituḍu - sattu anigāni asattu ani gāni ceppuṭaku vīlukānidi, aṃducēta nirākāramu).
"yathā hyayaṃ jyōtirātmā vivasvān āpōbhinnā bahudaikō(a)nugaccan upādhinā kriyatē bhēdarūpō dēvaḥ kṣētrē tamajōyamātmā" (jalamulō pratibiṃbiṃcina sūryuḍu upādhibhūtamaina jalamu caliṃcina caliṃcunu, jalamē yākāramuganunna nā yākāramu kaligiyuṃḍunu, kāni, sahajamugā sūryunikī calanamu ākārabhēdamunu lēdu. aṭlē paramātmakunu upādhivalana kaligina bhēdamēkāni vāstava mugā bhēdamulēdu - nīṭilō pratibiṃbiṃcina sūryuḍu nīṭilō nuṃḍuṭa valana nīṭiki ceṃdina vṛddhi, hrasa, calanādulanu nataḍu poṃdinaṭluṃḍunu gāni vāstavamugā sūryuniki vṛddhi hrāsa calanādulu lēnaṭlu dēhā dyupādulalō nuṃḍuṭavalana dēhādi gata vṛddhi hrāsādulu ātma kunnaṭluṃḍunē kāni sahajamugā nirākāruḍagu paramātmaku upādhula valana kalugu vṛddhi hrāsādulu lēvu.
parabrahma rūpamulēnidi kanukanē 'avyaktamu' - iṃdriyamulaku gōcaramukānidi. kanukanē nirākāramani ceppabaḍinadi.
“yētvakṣarphamanirdēśyamavyaktaṃ varyupāsatē |" (śrīmadbhagavadgīta - 12 - 3 , 4)
(paramātma iṭuvaṃṭidi ani nirdēśiṃparānidinnī, avyaktamu – kanabaḍani dinnī - ayinaṃduna nirākāruḍani ceppabaḍinadi).
(sākāramu - ākāramu galadi anṛtamu - nirākāra brahma niścalamainadi - caliṃpanidi, mārpulēnidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.