← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరవద్యః niravadyaḥ

Original — తెలుగు
  1. రాగాది దోష శూన్యం. (రాగము - విషయములందను రాగము - మొదలగు దోషములు లేనివాడు).

  2. నిరస్త సమస్త దోషః (ఏ విధమైన దోషము లేనివాడు).

  3. శుద్ధ సత్వమయత్వేన రజస్తమస్త త్కార్య రాహిత్యం.

(శుద్ధ సత్వగుణములతో నిండి యుండుటచేత రజోగుణము, తమోగుణము, వాటివలన కలుగు దోషములు లేకుండుట నిరవద్యత్వము - అట్టి దోషములు లేనివాడు, కేవలము సత్వగుణమే గలవాడు).

  1. కర్మ సంబంధ తత్ఫల రహితం. (కర్మతో గాని, దాని ఫలముతోగాని ఏ విధమైన సంబంధము లేనివాడు).

  2. అహంకార రూప కారణా భావాత్ తత్కృత దోష రహితః.

(అహంకారమను కారణము లేకుండుటవలన దాని వలన కలుగు దోషము లేనివాడు).

  1. అగర్హణీయః స్వాభావిక దోషరహిత మిత్యర్థః. (గర్హించ తగనివాడు, స్వాభావికమైన దోషము లేనివాడు).

  2. నిశాది రహితః (నాశము మొదలగునవి లేనివాడు).

  3. అవిద్యాన్నరకా న్నిర్గతా యత్ ప్రసాదాత్. (తన ప్రసాదమువలన (దయవలన) భక్తులను అవిద్య యనెడి నరకమునుండి తొలగించువాడు).

  4. స్వాతిరిక్తా భావాదేవ నిరవద్యం, స్వావద్యహేతోః శాంతత్వాత్ నిరవద్యం, నిష్ప్రతి యోగిక సన్మాత్ర మిత్యర్థః.

(తానుకానిది - భగవంతుడుకానిది - మఱివేరే లేదుకనుక నిరవద్యుడు, శాంతుడగుటవలన ద్యత్వము, సత్తామాత్రుడు, శాశ్వతుడు అగుటవలన నిరవద్యుడు).

  1. పవిత్రమైనది.
Transliteration
  1. rāgādi dōṣa śūnyaṃ. (rāgamu - viṣayamulaṃdanu rāgamu - modalagu dōṣamulu lēnivāḍu).

  2. nirasta samasta dōṣaḥ (ē vidhamaina dōṣamu lēnivāḍu).

  3. śuddha satvamayatvēna rajastamasta tkārya rāhityaṃ.

(śuddha satvaguṇamulatō niṃḍi yuṃḍuṭacēta rajōguṇamu, tamōguṇamu, vāṭivalana kalugu dōṣamulu lēkuṃḍuṭa niravadyatvamu - aṭṭi dōṣamulu lēnivāḍu, kēvalamu satvaguṇamē galavāḍu).

  1. karma saṃbaṃdha tatphala rahitaṃ. (karmatō gāni, dāni phalamutōgāni ē vidhamaina saṃbaṃdhamu lēnivāḍu).

  2. ahaṃkāra rūpa kāraṇā bhāvāt tatkṛta dōṣa rahitaḥ.

(ahaṃkāramanu kāraṇamu lēkuṃḍuṭavalana dāni valana kalugu dōṣamu lēnivāḍu).

  1. agarhaṇīyaḥ svābhāvika dōṣarahita mityarthaḥ. (garhiṃca taganivāḍu, svābhāvikamaina dōṣamu lēnivāḍu).

  2. niśādi rahitaḥ (nāśamu modalagunavi lēnivāḍu).

  3. avidyānnarakā nnirgatā yat prasādāt. (tana prasādamuvalana (dayavalana) bhaktulanu avidya yaneḍi narakamunuṃḍi tolagiṃcuvāḍu).

  4. svātiriktā bhāvādēva niravadyaṃ, svāvadyahētōḥ śāṃtatvāt niravadyaṃ, niṣprati yōgika sanmātra mityarthaḥ.

(tānukānidi - bhagavaṃtuḍukānidi - maṟivērē lēdukanuka niravadyuḍu, śāṃtuḍaguṭavalana dyatvamu, sattāmātruḍu, śāśvatuḍu aguṭavalana niravadyuḍu).

  1. pavitramainadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.