(ప్రకృతితోడి సంబంధము అను దోషము లేకుండుటచేత పరమాత్మ, లేక పరబ్రహ్మ, అంతటిలోను, అన్నింటి లోను సమముగానే యుండువాడు - ఏ ఉపాధితో కూడియున్నను దానిని, దాని దోషములను అంటనివాడు,వాటి అన్నింటికి, మంచిది చెడ్డది అను విచక్షణలేక తన సత్తాస్ఫూర్తినిచ్చువాడు. ప్రకృతితో కలియకముందు -సృష్టికి పూర్వము సత్వరజస్తమములు లేవుకనుకవాటి వలన కలుగు ఏ విధమైన దోషము లేనివాడు).
(మూఢులు దోషములేనివాటియందు దోషమునే చూతురు. దోషములు లేకుండుట నిర్దోషము - పరబ్రహ్మనిర్గుణుడు - త్రిగుణములు లేనివాడు, త్రిగుణములకు అతీతుడు. అందుచేత దోషములు లేనివాడు - నిర్దోషి. పరబ్రహ్మ చైతన్యమాత్రుడు, ఇతర విశేషములు లేనివాడు. అందుచేత ఒకడే అయినపరబ్రహ్మ అన్నింటిలోను సమముగానే యున్నాడు. త్రిగుణములవలన కలుగు దోషములు లేనివాడు. బ్రహ్మ చైతన్యమున్న ఉపాధిలోని త్రిగుణదోషములవలన బ్రహ్మ దోషములు గలవాడని తోచును వస్తువు యొక్క దోషములు ప్రకృతి దోషములు కాని ఆత్మదోషములు కావు. ఆత్మ నిర్దోషి).
(prakṛtitōḍi saṃbaṃdhamu anu dōṣamu lēkuṃḍuṭacēta paramātma, lēka parabrahma, aṃtaṭilōnu, anniṃṭi lōnu samamugānē yuṃḍuvāḍu - ē upādhitō kūḍiyunnanu dānini, dāni dōṣamulanu aṃṭanivāḍu,vāṭi anniṃṭiki, maṃcidi ceḍḍadi anu vicakṣaṇalēka tana sattāsphūrtiniccuvāḍu. prakṛtitō kaliyakamuṃdu -sṛṣṭiki pūrvamu satvarajastamamulu lēvukanukavāṭi valana kalugu ē vidhamaina dōṣamu lēnivāḍu).
(mūḍhulu dōṣamulēnivāṭiyaṃdu dōṣamunē cūturu. dōṣamulu lēkuṃḍuṭa nirdōṣamu - parabrahmanirguṇuḍu - triguṇamulu lēnivāḍu, triguṇamulaku atītuḍu. aṃducēta dōṣamulu lēnivāḍu - nirdōṣi. parabrahma caitanyamātruḍu, itara viśēṣamulu lēnivāḍu. aṃducēta okaḍē ayinaparabrahma anniṃṭilōnu samamugānē yunnāḍu. triguṇamulavalana kalugu dōṣamulu lēnivāḍu. brahma caitanyamunna upādhilōni triguṇadōṣamulavalana brahma dōṣamulu galavāḍani tōcunu vastuvu yokka dōṣamulu prakṛti dōṣamulu kāni ātmadōṣamulu kāvu. ātma nirdōṣi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.