← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్గుణబ్రహ్మోపాసన nirguṇabrahmōpāsana

Original — తెలుగు
  1. అన్నింటిలోను వ్యాపించియున్నను ఆకారము లేకుందుటచేత ఇంద్రియములకు గోచరముకాని పరబ్రహ్మయొక్క ఉపాసన.

  2. "యే త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే |

సర్వత్రగమ చింత్యంచ కూటస్థ మఖిలం ధ్రువం |

నం నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమ బుద్ధయః |

తేప్రాస్ను నంతి మామేవ సర్వభూతహితే రతాః |

క్లేశో(అ)ధికత రస్తేషా మవ్యక్తాసక్త చేతసాం |

అవ్యక్తాహి గతిర్దుఃఖం దేవ వద్భిరి వాప్యతే || (శ్రీమద్భగవద్గీత -12 - 3, 4, 5)

"సర్వత్రం కం యతో వ్యాపి సర్వకారణమద్వయం |

పరిచ్ఛిన్నస్య కార్యస్య జాత్యా దేర్యోగ దర్శనాత్ |

అపరిచ్ఛిన్న ఛిద్థాతో ర్నాస్తి తద్యోగ ఇత్యతః |

అచింత్యం తన్మనో వృత్తే రప్యగోచర మక్షరం |

మాయా తత్కార్యరూపే యత్కూటే (అ)ధిష్టాన భావతః |

తిష్టత్యాధ్యాసి కేనైవ సంబంధేనా వికారిచ |

కూటస్థత్వేన సర్వేషాం దోషా ణాం హరణం కృతం |

అతో మాయా వికారాణా మధిష్ఠాన తయాచలం |

అత ఏవ ధ్రువం నిత్యం పరిణామ వివర్జితం |

శుద్ధ యేతా దృశం బ్రహ్మ వేదాంత శ్రవణా దిభిః |

ఉపాస్యార్థం యథా శాస్త్రం విషయీకృత్య నంతతం |

తుల్య ప్రత్యయ సంతత్యా తైల ధారవదాసనం |

యదస్త్యుపాసనం తేన నిధి ధ్యాసన సం జ్ఞినా |

సాక్షాత్కుర్వంతిమాం ప్రత్యగభిన్నం చిద్ఘనం సుఖం ||" (గీతాభావప్రకాశము - 12 - 25 #తొ# 31)

(నిర్గుణ బ్రహ్మ అనిర్దేశ్యము - (అనగా, ఇటువంటిది యని నిర్దేశింపరానిది); అవ్యక్తము (కంటికి కనబడనిది కావుననే అనిర్దేశ్యము); నిర్విశేషము; అంతటను, అన్నివస్తువులలోను వ్యాపించి యున్నది; అన్నింటికి కారణమైనది; కారణములకు కారణమైనది; అందుచేతనే మూలకారణమైనది; మనసుచేత ఆలోచించుటకు కూడ అలవికానిది; అందుచేత అచింత్యము; ప్రపంచము మిథ్యాభూతమైనను లోకులు సత్యముగా భావించుదురు, అందుచేత కూటము (అబద్ధము) అని చెప్పబడినది. అట్టి కూటమున అధ్యాసరూపముగా అధిష్ఠానమై యున్నది కూటస్థము. కూటము అవికారి, అనగా - మార్పు చెందనిది. అందుచేతనే అచలము. చలము అనగా వికారము నొందునది. చలనము లేనిది కనుక అచలము. అచలము కనుక ధ్రువము - అనగా, ఎప్పుడు పరిణామము (మార్పు) చెందనిది. శుద్ధము - ఇటువంటిది నిర్గుణబ్రహ్మయని శాస్త్రములో చెప్పబడినది. ఇటువంటి నిర్గుణబ్రహ్మను ధ్యానము చేయుటకై శాస్త్రములో చెప్పబడిన ప్రకారము ధ్యానము చేయుటకు విషయముగా చేసుకొని ఉపాసన చేయువారు నిర్గుణ బ్రహ్మసాక్షాత్కారమును పొంది అతనినే చేరుదురు. పరబ్రహ్మ యీ ప్రకారము నిర్గుణుడు అని తెలుసుకొని ఆ అభిప్రాయము మనసులో నిలుపుకొని అతనినే నిరంతరము ధ్యానము ద్వారా ఉపాసన చేయుట నిర్గుణబ్రహ్మోపాసన).

  1. "క్లేశో (అ)ధిక తరస్తేషా మవ్యక్తా సక్త చేతసాం |

అవ్యక్తా హి గతిర్దుఃఖం వద్భిరవాప్యతే || (శ్రీమద్భగవద్గీత - 12 - 5)

(సాకారబ్రహ్మోపాసనలో - సగుణబ్రహ్మోపాసనలో క్లేశము అధికము - ఎందుచేతననగా ఇదివరకు తాము అనుభవించుచున్న భోగములనుండి మనసును మరలించి సాకారమైన (సగుణుడు అయిన) - ఒక ఆకారముగల - ఒక రూపముగల - బ్రహ్మమందు మనస్సు నిరంతరము ఉంచుట కష్టము. అటువంటిది నిర్గుణపరబ్రహ్మమందు మనస్సును నిలుపుట అంతకన్న కష్టము. సగుణబ్రహ్మోపాసకులకు నిర్గుణబ్రహ్మోపాసకులకు ఫలము ఒకటే అయినను సగుణబ్రహ్మోపాసకులకు ఉపాయము సులభము - అందుచేత అది శ్రేష్టము - నిర్గుణోపాసకులకు బ్రహ్మజ్ఞానమువలన ఆత్మసాక్షాత్కారము కలుగుట ద్వారా ముక్తి కలుగును. ఆ ప్రకారముగానే సగుణోపాసకులకు భగవదా రాధనచేత ముక్తి కలుగును. ఏ విధమైన ప్రతిబంధకములు (అడ్డులు) లేక, గురూపదేశము లేకనే, శ్రవణము మననము మొదలగునవి భగవంతుని ఆరాధనచేత అతనియందు భక్తి కలిగియుండుటవలన తత్వజ్ఞానోదయము కలిగి ప్రహ్లాదుడు మొదలగువారివలె వీరికి కూడ కైవల్యము దానంతట అదియే కలుగును. వీరు బ్రహ్మలోకమునకు (సగుణబ్రహ్మలోకమునకు) వెళ్ళిన తర్వాత భోగములు, ఐశ్వర్యములు అనిభవించినతర్వాత బ్రహ్మవిద్యవలన - బ్రహ్మజ్ఞానమువలన - కలుగు ఫలము అయిన కైవల్యము కలుగును).

  1. నిర్గుణం పరమాత్మానం స్వయం సగుణః అహంకారాది విశిష్టః పురుషః కథం చక్షుషా పశ్యతి ? న కథమపి ఇత్యర్థః. తస్మాత్ యోగ్య తా భావాత్ సగుణమేవ అధికార ప్రాప్తి పర్యంతం చేతసా నంవిచార యోసాస్వ ".

(అహంకారము మొదలైనవి కలిగియుండు సగుణుడైన పురుషుడు – త్రిగుణ ములచేతను చేయబడిన శరీరము - మనస్సు, ఇంద్రియములు కలవాడు - నిర్గుణుడై రూపములేని పరమాత్మను ఎట్లు చూడగలడు? చూడలేడు. అందుచేత నిర్గుణపరబ్రహ్మను చూడలేడుకనుక - అట్టి యోగ్యత లేనందున - అందుకు అధికారి కాడు కనుక - అట్టి అధికారము కలుగువరకు సగుణ బ్రహ్మోపాసనయే చేయవలయును).

  1. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారవతస్తు న లోకాంతరగమనం - "న తస్య ప్రాణా ఉత్క్రమంతి" ఇతి శ్రుతేః. కింతు యత్ప్రారబ్ధకర్మ క్షయం సుఖదుః ఖే అనుభూయ పశ్చా దవ ప్రజ్యతే - (అజ్ఞానప్రాప్త్యుత్తరక్షణే తస్య విదేహ కైవల్యం)

("నిర్గుణ బ్రహ్మోపాసకుని ప్రాణములు అతని శరీరమును వదలి వెళ్ళవు" అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత నిర్గుణ బ్రహ్మోపాసకునకు లోకాంతరగమనములేదు. ఫలమునిచ్చుటకు ఆరంభించిన కర్మ పూర్తిగా అనుభవమువలన క్షీణించును - అటు తర్వాత బ్రహ్మజ్ఞానము కలిగిన ఉత్తరక్షణము అతనికి విదేహముక్తి కలుగును).

  1. "ఉ. కారణకార్య హేతువగు కంజదళాక్షునికంటె నన్యులె

వ్వారును లేరు; తండ్రి! భగవంతు విశ్వభావనో

దారుని నద్గుణావళులుదాత్త మతిం గొనియాడ కుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 21)

  1. "గుణమయంబును స్థూలరూపంబును నయిన శ్రీహరి శరీరంబగు నీ లోకంబునందు నిలిపిన చిత్తంబగుణంబును, సూక్ష్మంబును , నాత్మజ్యోతియు బ్రహ్మంబును నైన వాసుదేవుని యందు నిల్చుంగావున - - -". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 14)
Transliteration
  1. anniṃṭilōnu vyāpiṃciyunnanu ākāramu lēkuṃduṭacēta iṃdriyamulaku gōcaramukāni parabrahmayokka upāsana.

  2. "yē tvakṣaramanirdēśya mavyaktaṃ paryupāsatē |

sarvatragama ciṃtyaṃca kūṭastha makhilaṃ dhruvaṃ |

naṃ niyamyēṃdriyagrāmaṃ sarvatra sama buddhayaḥ |

tēprāsnu naṃti māmēva sarvabhūtahitē ratāḥ |

klēśō(a)dhikata rastēṣā mavyaktāsakta cētasāṃ |

avyaktāhi gatirduḥkhaṃ dēva vadbhiri vāpyatē || (śrīmadbhagavadgīta -12 - 3, 4, 5)

"sarvatraṃ kaṃ yatō vyāpi sarvakāraṇamadvayaṃ |

paricchinnasya kāryasya jātyā dēryōga darśanāt |

aparicchinna chidthātō rnāsti tadyōga ityataḥ |

aciṃtyaṃ tanmanō vṛttē rapyagōcara makṣaraṃ |

māyā tatkāryarūpē yatkūṭē (a)dhiṣṭāna bhāvataḥ |

tiṣṭatyādhyāsi kēnaiva saṃbaṃdhēnā vikārica |

kūṭasthatvēna sarvēṣāṃ dōṣā ṇāṃ haraṇaṃ kṛtaṃ |

atō māyā vikārāṇā madhiṣṭhāna tayācalaṃ |

ata ēva dhruvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ |

śuddha yētā dṛśaṃ brahma vēdāṃta śravaṇā dibhiḥ |

upāsyārthaṃ yathā śāstraṃ viṣayīkṛtya naṃtataṃ |

tulya pratyaya saṃtatyā taila dhāravadāsanaṃ |

yadastyupāsanaṃ tēna nidhi dhyāsana saṃ jñinā |

sākṣātkurvaṃtimāṃ pratyagabhinnaṃ cidghanaṃ sukhaṃ ||" (gītābhāvaprakāśamu - 12 - 25 #to# 31)

(nirguṇa brahma anirdēśyamu - (anagā, iṭuvaṃṭidi yani nirdēśiṃparānidi); avyaktamu (kaṃṭiki kanabaḍanidi kāvunanē anirdēśyamu); nirviśēṣamu; aṃtaṭanu, annivastuvulalōnu vyāpiṃci yunnadi; anniṃṭiki kāraṇamainadi; kāraṇamulaku kāraṇamainadi; aṃducētanē mūlakāraṇamainadi; manasucēta ālōciṃcuṭaku kūḍa alavikānidi; aṃducēta aciṃtyamu; prapaṃcamu mithyābhūtamainanu lōkulu satyamugā bhāviṃcuduru, aṃducēta kūṭamu (abaddhamu) ani ceppabaḍinadi. aṭṭi kūṭamuna adhyāsarūpamugā adhiṣṭhānamai yunnadi kūṭasthamu. kūṭamu avikāri, anagā - mārpu ceṃdanidi. aṃducētanē acalamu. calamu anagā vikāramu noṃdunadi. calanamu lēnidi kanuka acalamu. acalamu kanuka dhruvamu - anagā, eppuḍu pariṇāmamu (mārpu) ceṃdanidi. śuddhamu - iṭuvaṃṭidi nirguṇabrahmayani śāstramulō ceppabaḍinadi. iṭuvaṃṭi nirguṇabrahmanu dhyānamu cēyuṭakai śāstramulō ceppabaḍina prakāramu dhyānamu cēyuṭaku viṣayamugā cēsukoni upāsana cēyuvāru nirguṇa brahmasākṣātkāramunu poṃdi ataninē cēruduru. parabrahma yī prakāramu nirguṇuḍu ani telusukoni ā abhiprāyamu manasulō nilupukoni ataninē niraṃtaramu dhyānamu dvārā upāsana cēyuṭa nirguṇabrahmōpāsana).

  1. "klēśō (a)dhika tarastēṣā mavyaktā sakta cētasāṃ |

avyaktā hi gatirduḥkhaṃ vadbhiravāpyatē || (śrīmadbhagavadgīta - 12 - 5)

(sākārabrahmōpāsanalō - saguṇabrahmōpāsanalō klēśamu adhikamu - eṃducētananagā idivaraku tāmu anubhaviṃcucunna bhōgamulanuṃḍi manasunu maraliṃci sākāramaina (saguṇuḍu ayina) - oka ākāramugala - oka rūpamugala - brahmamaṃdu manassu niraṃtaramu uṃcuṭa kaṣṭamu. aṭuvaṃṭidi nirguṇaparabrahmamaṃdu manassunu nilupuṭa aṃtakanna kaṣṭamu. saguṇabrahmōpāsakulaku nirguṇabrahmōpāsakulaku phalamu okaṭē ayinanu saguṇabrahmōpāsakulaku upāyamu sulabhamu - aṃducēta adi śrēṣṭamu - nirguṇōpāsakulaku brahmajñānamuvalana ātmasākṣātkāramu kaluguṭa dvārā mukti kalugunu. ā prakāramugānē saguṇōpāsakulaku bhagavadā rādhanacēta mukti kalugunu. ē vidhamaina pratibaṃdhakamulu (aḍḍulu) lēka, gurūpadēśamu lēkanē, śravaṇamu mananamu modalagunavi bhagavaṃtuni ārādhanacēta ataniyaṃdu bhakti kaligiyuṃḍuṭavalana tatvajñānōdayamu kaligi prahlāduḍu modalaguvārivale vīriki kūḍa kaivalyamu dānaṃtaṭa adiyē kalugunu. vīru brahmalōkamunaku (saguṇabrahmalōkamunaku) veḷḷina tarvāta bhōgamulu, aiśvaryamulu anibhaviṃcinatarvāta brahmavidyavalana - brahmajñānamuvalana - kalugu phalamu ayina kaivalyamu kalugunu).

  1. nirguṇaṃ paramātmānaṃ svayaṃ saguṇaḥ ahaṃkārādi viśiṣṭaḥ puruṣaḥ kathaṃ cakṣuṣā paśyati ? na kathamapi ityarthaḥ. tasmāt yōgya tā bhāvāt saguṇamēva adhikāra prāpti paryaṃtaṃ cētasā naṃvicāra yōsāsva ".

(ahaṃkāramu modalainavi kaligiyuṃḍu saguṇuḍaina puruṣuḍu – triguṇa mulacētanu cēyabaḍina śarīramu - manassu, iṃdriyamulu kalavāḍu - nirguṇuḍai rūpamulēni paramātmanu eṭlu cūḍagalaḍu? cūḍalēḍu. aṃducēta nirguṇaparabrahmanu cūḍalēḍukanuka - aṭṭi yōgyata lēnaṃduna - aṃduku adhikāri kāḍu kanuka - aṭṭi adhikāramu kaluguvaraku saguṇa brahmōpāsanayē cēyavalayunu).

  1. nirguṇa brahma sākṣātkāravatastu na lōkāṃtaragamanaṃ - "na tasya prāṇā utkramaṃti" iti śrutēḥ. kiṃtu yatprārabdhakarma kṣayaṃ sukhaduḥ khē anubhūya paścā dava prajyatē - (ajñānaprāptyuttarakṣaṇē tasya vidēha kaivalyaṃ)

("nirguṇa brahmōpāsakuni prāṇamulu atani śarīramunu vadali veḷḷavu" ani śruti ceppucunnadi. aṃducēta nirguṇa brahmōpāsakunaku lōkāṃtaragamanamulēdu. phalamuniccuṭaku āraṃbhiṃcina karma pūrtigā anubhavamuvalana kṣīṇiṃcunu - aṭu tarvāta brahmajñānamu kaligina uttarakṣaṇamu ataniki vidēhamukti kalugunu).

  1. "u. kāraṇakārya hētuvagu kaṃjadaḷākṣunikaṃṭe nanyule

vvārunu lēru; taṃḍri! bhagavaṃtu viśvabhāvanō

dāruni nadguṇāvaḷuludātta matiṃ goniyāḍa kuṃḍinan

jēravu cittamul prakṛti ceṃdani nirguṇamaina brahmamun. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 21)

  1. "guṇamayaṃbunu sthūlarūpaṃbunu nayina śrīhari śarīraṃbagu nī lōkaṃbunaṃdu nilipina cittaṃbaguṇaṃbunu, sūkṣmaṃbunu , nātmajyōtiyu brahmaṃbunu naina vāsudēvuni yaṃdu nilcuṃgāvuna - - -". (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 14)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.