← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వికారః nirvikāraḥ

Original — తెలుగు
  1. వికారాభావాత్ నిర్వికారః. (వికారములు లేకపోవుటచేత నిర్వికారుడు).

  2. జనన మరణాది షడ్భావ వికార రహితః.

(జననము, మరణము మొదలగు ఆరువిధములగు వికారములులేనివాడు - జాయతే = పుట్టుచున్నాడు; అస్తి = ఉంటున్నాడు; వర్థతే = వృద్ధిపొందుచున్నాడు, విపరిణమతే = పరిణామము - మార్పు చెందుచున్నాడు; అపక్షీయతే = క్షీణించుచున్నాడు; నశ్యతే = నశించుచున్నాడు అను ఆరు విధములగువికారములు లేనివాడు. జన్మ లేనివానికి మిగిలినవి ఉండవు. భగవంతుడు జన్మ లేనివాడు కనుక మిగిలిన పరిణామములుండవు. అవ్యక్తము, మహత్తత్వము జన్మ కలవి, అందుచేత మార్పులు గలవి).

  1. “అవికృత చిత్తః” = (శ్రీమాన్ రామనుజః) (అవికారము చెందని చిత్తము గలవాడు).

  2. కేవలం శాస్త్ర ప్రమాణేన ప్రయుక్తః, సఫలరాగాదినాయః సః నిర్వికారః (శ్రీశంకరః)

(కర్మ ఫలమందలి ఆశచే కాక కేవలము శాస్త్రము చెప్పిన ప్రకారము కర్మలు చేయువాడు నిర్వికారుడు. అట్లు కర్మలు చేయువాడు వాటివలన కలుగు మార్పులను చెందడు).

Transliteration
  1. vikārābhāvāt nirvikāraḥ. (vikāramulu lēkapōvuṭacēta nirvikāruḍu).

  2. janana maraṇādi ṣaḍbhāva vikāra rahitaḥ.

(jananamu, maraṇamu modalagu āruvidhamulagu vikāramululēnivāḍu - jāyatē = puṭṭucunnāḍu; asti = uṃṭunnāḍu; varthatē = vṛddhipoṃducunnāḍu, vipariṇamatē = pariṇāmamu - mārpu ceṃducunnāḍu; apakṣīyatē = kṣīṇiṃcucunnāḍu; naśyatē = naśiṃcucunnāḍu anu āru vidhamulaguvikāramulu lēnivāḍu. janma lēnivāniki migilinavi uṃḍavu. bhagavaṃtuḍu janma lēnivāḍu kanuka migilina pariṇāmamuluṃḍavu. avyaktamu, mahattatvamu janma kalavi, aṃducēta mārpulu galavi).

  1. “avikṛta cittaḥ” = (śrīmān rāmanujaḥ) (avikāramu ceṃdani cittamu galavāḍu).

  2. kēvalaṃ śāstra pramāṇēna prayuktaḥ, saphalarāgādināyaḥ saḥ nirvikāraḥ (śrīśaṃkaraḥ)

(karma phalamaṃdali āśacē kāka kēvalamu śāstramu ceppina prakāramu karmalu cēyuvāḍu nirvikāruḍu. aṭlu karmalu cēyuvāḍu vāṭivalana kalugu mārpulanu ceṃdaḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.