← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిస్త్రైగుణ్యుడు nistraiguṇyuḍu

Original — తెలుగు
  1. అసంసారీ, నిష్కామః

(సంసారములో లేనివాడు, కోరికలు లేనివాడు, సత్వ రజస్తమోగుణముల వలన కలుగు పుణ్య పాపములు నానాటి వలన కలుగు సంసారమునందు కోరికలేనివాడు)

(త్రిగుణముల వలన విషయములయడల కలుగు వాంచ లేనివాడు).

  1. “సంసారస్య ప్రకాశః ఏ భిః గుణైరేవ - త్రిగుణైరేవ - భవతి. గుణానామేవ కార్యమిదం జగదస్తి.అత ఏవ అస్య జగతః పదార్ధేషు అనాసక్తిః, తేభ్యో విరక్తిరేవ వా నిస్త్రైగుణ్యీ భవనం, అ సంసారిభవనం వా అస్తి. యో మనుష్యో విషయాసక్తో విషయ కామశ్చాస్తి. స ఏవ గుణైర్బద్ధో అస్తి. తధా యోభగవదాసక్తో భగవత్ప్రేమీ చాస్తి స ఏవ నిస్త్రైగుణ్యోఅస్తి”.

(సత్వ రజ స్తమములను త్రిగుణములచేతనే జనమరణ రూపమైన సంసారము కలుగుచున్నది. ఈ త్రిగుణముల కార్యమే జగత్తు - త్రిగుణములవలన కలిగినదే జగత్తు. అందుచేత ఈ జగత్తులోనుండువస్తువులందు - విషయములందు - ఆసక్తి లేకుండుటయే నిస్త్రైగుణ్యభావము, నిస్త్రైగుణుడుగానుండుట, లేక సంసారికాకుండనుండుట. ఎవడు విషయములందాసక్తి కలిగియుండునో, విషయానుభవము కోరునో అతడు త్రిగుణములచేత బద్దుడగును - త్రిగుణములవలన కలుగుఫలమును అనుభవించును. ఆ ప్రకారముగానే భగవంతునియందాసక్తిగలవాడు భగవద్భక్తుడు అగును, భగవంతునికి ప్రియుడగును.అట్టివాడే నిస్త్రైగుణుడు).

  1. త్రైగుణ్యవిషయాః వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున (శ్రీమద్భగవద్గీత - 2 - 45)

(సత్వ రజ స్తమములను త్రిగుణకార్యము త్రైగుణ్యము - కోరికలు కలుగచేసి సంసారములో దింపునది.వేదములోని కర్మకాండలో చెప్పబడిన కర్మలు సంసారమునే కలుగచేయును. అందుచేత ఆ కర్మకాండను భోధించు వేదములను వదలి, జ్ఞానకాండయగు ఉపనిషత్తులలో భోధించినదానిని - (బ్రహ్మజ్ఞానమును) అవలంభించుము).

Transliteration
  1. asaṃsārī, niṣkāmaḥ

(saṃsāramulō lēnivāḍu, kōrikalu lēnivāḍu, satva rajastamōguṇamula valana kalugu puṇya pāpamulu nānāṭi valana kalugu saṃsāramunaṃdu kōrikalēnivāḍu)

(triguṇamula valana viṣayamulayaḍala kalugu vāṃca lēnivāḍu).

  1. “saṃsārasya prakāśaḥ ē bhiḥ guṇairēva - triguṇairēva - bhavati. guṇānāmēva kāryamidaṃ jagadasti.ata ēva asya jagataḥ padārdhēṣu anāsaktiḥ, tēbhyō viraktirēva vā nistraiguṇyī bhavanaṃ, a saṃsāribhavanaṃ vā asti. yō manuṣyō viṣayāsaktō viṣaya kāmaścāsti. sa ēva guṇairbaddhō asti. tadhā yōbhagavadāsaktō bhagavatprēmī cāsti sa ēva nistraiguṇyōasti”.

(satva raja stamamulanu triguṇamulacētanē janamaraṇa rūpamaina saṃsāramu kalugucunnadi. ī triguṇamula kāryamē jagattu - triguṇamulavalana kaliginadē jagattu. aṃducēta ī jagattulōnuṃḍuvastuvulaṃdu - viṣayamulaṃdu - āsakti lēkuṃḍuṭayē nistraiguṇyabhāvamu, nistraiguṇuḍugānuṃḍuṭa, lēka saṃsārikākuṃḍanuṃḍuṭa. evaḍu viṣayamulaṃdāsakti kaligiyuṃḍunō, viṣayānubhavamu kōrunō ataḍu triguṇamulacēta badduḍagunu - triguṇamulavalana kaluguphalamunu anubhaviṃcunu. ā prakāramugānē bhagavaṃtuniyaṃdāsaktigalavāḍu bhagavadbhaktuḍu agunu, bhagavaṃtuniki priyuḍagunu.aṭṭivāḍē nistraiguṇuḍu).

  1. traiguṇyaviṣayāḥ vēdāḥ nistraiguṇyō bhavārjuna (śrīmadbhagavadgīta - 2 - 45)

(satva raja stamamulanu triguṇakāryamu traiguṇyamu - kōrikalu kalugacēsi saṃsāramulō diṃpunadi.vēdamulōni karmakāṃḍalō ceppabaḍina karmalu saṃsāramunē kalugacēyunu. aṃducēta ā karmakāṃḍanu bhōdhiṃcu vēdamulanu vadali, jñānakāṃḍayagu upaniṣattulalō bhōdhiṃcinadānini - (brahmajñānamunu) avalaṃbhiṃcumu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.