← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య నైమిత్తిక కర్మలు nitya naimittika karmalu

Original — తెలుగు
  1. నిత్యనైమిత్తిక కర్మానుష్టేన –

"శ్లో|| శుధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పితకర్మభిః |

వైరాగ్యం బ్రహ్మలోకాదౌవ్య నక్త్యధను నిర్మలం ||

(నిత్యనైమిత్తిక కర్మలనాచరించి వానియొక్క ఫలమును పరమేశ్వరునికొఱకు సమర్పించినట్టి పురుషునియొక్క చిత్తమును ఆ కర్మలు మిక్కిలి నిర్మలముగా చేయును - అట్లు నిర్మలమైన చిత్తము ఇహలోక సుఖములందువలె బ్రహ్మలోకాది సుఖములనును వైరాగ్యము కలదై యుండును - కావున నిత్య కర్మలు వైరాగ్యోత్పత్తిద్వారా మోక్షమునకుపకరించును).

"యస్మాత్ రజస్తమోమలోపసం సృష్టమేవ చిత్తం కామ బడిశేనా కృష్య విషయ దురంత సూనా స్థానేషు నిక్షిప్తయతే, తస్మా నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన పరిమార్జినేవ అపవిద్ధ రజస్తమోమలం ప్రసన్నమనానులం సమ్మర్జిత స్ఫటికశిలాకల్పం, బాహ్య విషయహేతుకేన అతిగ్రహ బడిశేన అనాకృష్యమాణం, విధూతా శేషకల్మషం ప్రత్యజ్మాత్ర ప్రవణం చిత్త దర్పణ మవతిష్టతే"

(రజోగుణతమోగుణములనే మాలిన్యముచేత సర్వదా సం యుక్తమైయున్న చిత్తము విషయాసక్తిచేత నాకర్షింపబడి, నిత్య నైమిత్తిక కర్మలచేత రజోగుణ తమోగుణములయొక్క మాలిన్యము వదలినవై, శుద్ధమై, నిశ్చలమై ఆత్మ స్వరూపమునందాసక్తి గలదై యుండును).

"ప్రత్యక్ప్రవణతాం బుద్ధేః కర్మాణ్యుపాద్య శుద్ధితః |

కృతార్దా న్యస్త మాయాంతి ప్రావృడంతే ఘనా ఇవ ||"

(నిత్య నైమిత్తిక కర్మలు బుద్ధికి పారిశుద్ధ్యమును సంపాదించి చిదాత్మయందాసక్తి కలుగచేసి, చేయవలసిన పనులన్నియు చేసినవై వర్షాకాలముయొక్క పర్యవసానకాలమందు మేఘములవలె అస్తమించును).

"తన్మాన్ముముక్షుభిః కార్యమాత్మ జ్ఞానాభిలాషిభిః |

నిత్యం నైమిత్తికం కర్మ సదైవాత్మ శుద్ధయే ||"

(ఆత్మజ్ఞానమందభిలాషగల ముముక్షువులు ఆత్మ శుద్ధికొఱకు నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు ఎల్లపుడును చేయవలసినవి).

"నిత్యకర్మానుష్ఠానాత్ ధర్మోత్పత్తిః, ధర్మోత్పత్తేః పాపహానిః తతః చిత్తశుద్ధిః తతః సంసారయాధాత్మ్యవబోధః, తతో వైరాగ్యం, తతో ముముక్షత్వం, తతః తదుపాయపర్యేషణ, తతోయోగాభ్యాసః తతః చిత్తస్య ప్రత్యక్ప్రవణతా, తతః తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం, తతో అవిద్యోచ్ఛేదః, తతః ఆత్మన్యేవ అవసాధనం"

(నిత్య కర్మల ననుష్టించుటవలన ధర్మము - ధర్మబుద్ధి - జనించును. దానివలన పాపములు నశించును. దానివలన చిత్తశుద్ధికలుగును. అందువలన సంసారముయొక్క వాస్తవస్థితి తెలియును).

  1. "నిత్య నైమిత్తికైరేవ కుర్వాణో దురితక్షయం"(నిత్య నైమిత్తికకర్మలను చేయుటవలననే పాపము క్షీణించును).

  2. "ఏ తే అపిలౌకికం వైదికంచ విధిమనుశ్రుత్యఫలాసక్తం త్యక్త్వా, కేవల భగవదాజ్ణానుసారేణ భగవత్ప్రీత్యర్థం కరణీయే| భగవత్ప్రీత్యర్ధాని తాన్యేవకర్మాణి భవంతి యాని భగవంతం ప్రతి ప్రేమవర్థకాని భవేయుః".

(నిత్య నైమిత్తిక కర్మలు ఎల్లపుడు ఆత్మశుద్ధికొఱకు చేయవలెను. ఇవి లౌకికములు, వైదికములు అని రెండు విధములు - వీటిని కేవలము వాటి ఫలముకొఱకు కాక భగవంతుని ఆజ్ఞానుసారము, భగవంతుని ప్రీతికొఱకే చేయవలెను. భగవంతుని ప్రీతికొఱకు చేసినపనులు భగవంతుని యందు భక్తిని వృద్ధిచేయును).

Transliteration
  1. nityanaimittika karmānuṣṭēna –

"ślō|| śudhyamānaṃtu taccittaṃ īśvarārpitakarmabhiḥ |

vairāgyaṃ brahmalōkādauvya naktyadhanu nirmalaṃ ||

(nityanaimittika karmalanācariṃci vāniyokka phalamunu paramēśvarunikoṟaku samarpiṃcinaṭṭi puruṣuniyokka cittamunu ā karmalu mikkili nirmalamugā cēyunu - aṭlu nirmalamaina cittamu ihalōka sukhamulaṃduvale brahmalōkādi sukhamulanunu vairāgyamu kaladai yuṃḍunu - kāvuna nitya karmalu vairāgyōtpattidvārā mōkṣamunakupakariṃcunu).

"yasmāt rajastamōmalōpasaṃ sṛṣṭamēva cittaṃ kāma baḍiśēnā kṛṣya viṣaya duraṃta sūnā sthānēṣu nikṣiptayatē, tasmā nitya naimittika karmānuṣṭhāna parimārjinēva apaviddha rajastamōmalaṃ prasannamanānulaṃ sammarjita sphaṭikaśilākalpaṃ, bāhya viṣayahētukēna atigraha baḍiśēna anākṛṣyamāṇaṃ, vidhūtā śēṣakalmaṣaṃ pratyajmātra pravaṇaṃ citta darpaṇa mavatiṣṭatē"

(rajōguṇatamōguṇamulanē mālinyamucēta sarvadā saṃ yuktamaiyunna cittamu viṣayāsakticēta nākarṣiṃpabaḍi, nitya naimittika karmalacēta rajōguṇa tamōguṇamulayokka mālinyamu vadalinavai, śuddhamai, niścalamai ātma svarūpamunaṃdāsakti galadai yuṃḍunu).

"pratyakpravaṇatāṃ buddhēḥ karmāṇyupādya śuddhitaḥ |

kṛtārdā nyasta māyāṃti prāvṛḍaṃtē ghanā iva ||"

(nitya naimittika karmalu buddhiki pāriśuddhyamunu saṃpādiṃci cidātmayaṃdāsakti kalugacēsi, cēyavalasina panulanniyu cēsinavai varṣākālamuyokka paryavasānakālamaṃdu mēghamulavale astamiṃcunu).

"tanmānmumukṣubhiḥ kāryamātma jñānābhilāṣibhiḥ |

nityaṃ naimittikaṃ karma sadaivātma śuddhayē ||"

(ātmajñānamaṃdabhilāṣagala mumukṣuvulu ātma śuddhikoṟaku nityakarmalu naimittika karmalu ellapuḍunu cēyavalasinavi).

"nityakarmānuṣṭhānāt dharmōtpattiḥ, dharmōtpattēḥ pāpahāniḥ tataḥ cittaśuddhiḥ tataḥ saṃsārayādhātmyavabōdhaḥ, tatō vairāgyaṃ, tatō mumukṣatvaṃ, tataḥ tadupāyaparyēṣaṇa, tatōyōgābhyāsaḥ tataḥ cittasya pratyakpravaṇatā, tataḥ tatvamasyādi vākyārtha parijñānaṃ, tatō avidyōcchēdaḥ, tataḥ ātmanyēva avasādhanaṃ"

(nitya karmala nanuṣṭiṃcuṭavalana dharmamu - dharmabuddhi - janiṃcunu. dānivalana pāpamulu naśiṃcunu. dānivalana cittaśuddhikalugunu. aṃduvalana saṃsāramuyokka vāstavasthiti teliyunu).

  1. "nitya naimittikairēva kurvāṇō duritakṣayaṃ"(nitya naimittikakarmalanu cēyuṭavalananē pāpamu kṣīṇiṃcunu).

  2. "ē tē apilaukikaṃ vaidikaṃca vidhimanuśrutyaphalāsaktaṃ tyaktvā, kēvala bhagavadājṇānusārēṇa bhagavatprītyarthaṃ karaṇīyē| bhagavatprītyardhāni tānyēvakarmāṇi bhavaṃti yāni bhagavaṃtaṃ prati prēmavarthakāni bhavēyuḥ".

(nitya naimittika karmalu ellapuḍu ātmaśuddhikoṟaku cēyavalenu. ivi laukikamulu, vaidikamulu ani reṃḍu vidhamulu - vīṭini kēvalamu vāṭi phalamukoṟaku kāka bhagavaṃtuni ājñānusāramu, bhagavaṃtuni prītikoṟakē cēyavalenu. bhagavaṃtuni prītikoṟaku cēsinapanulu bhagavaṃtuni yaṃdu bhaktini vṛddhicēyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.