← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య ప్రాప్తి nitya prāpti

Original — తెలుగు

ఇంటిలో పాతిపెట్టబడియున్న నిధి (ధనము, ఆభరణములు మొదలగునవి) పొందుటకు అవకాశమున్నను దానిని తెలియకయుండి, తర్వాత అంజనము మొదలగు సాధనములచేత అది తెలుసుకొని దానిని పొందవచ్చు - ఇట్లు ఈ నిధి నిత్యప్రాప్తము. అట్లే పరమానందస్వరూపుడైన బ్రహ్మ జీవునియొక్క ఆత్మ యగుటవలన జీవునికి పరమానందము నిత్యప్రాప్తము . అయినను అజ్ఞానమువలన ఆ విషయము తెలుసుకొనలేక అప్రాప్తమని యనుకొనును - తర్వాత " అహం బ్రహ్మాస్తి " (నేను బ్రహ్మను అయితిని) అను మహావాక్యార్ధము తెలుసుకొనిన తర్వాత అది నిత్య ప్రాప్తమే యగును.

Transliteration

iṃṭilō pātipeṭṭabaḍiyunna nidhi (dhanamu, ābharaṇamulu modalagunavi) poṃduṭaku avakāśamunnanu dānini teliyakayuṃḍi, tarvāta aṃjanamu modalagu sādhanamulacēta adi telusukoni dānini poṃdavaccu - iṭlu ī nidhi nityaprāptamu. aṭlē paramānaṃdasvarūpuḍaina brahma jīvuniyokka ātma yaguṭavalana jīvuniki paramānaṃdamu nityaprāptamu . ayinanu ajñānamuvalana ā viṣayamu telusukonalēka aprāptamani yanukonunu - tarvāta " ahaṃ brahmāsti " (nēnu brahmanu ayitini) anu mahāvākyārdhamu telusukonina tarvāta adi nitya prāptamē yagunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.