← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య సన్యాసీ nitya sanyāsī

Original — తెలుగు
  1. ఎల్లపుడు సన్యాసిగానుండువాడు - నిత్యం సన్యాసీ.

  2. "యః కర్మణివర్తమానోపి నద్వేష్టి, నకించిత్ కాంక్షతి, సుఖ దుఃఖే తత్సాధనేచ", (శ్రీశంకరః)

(ఎవడు కర్మలు చేయుచున్నను సుఖ దుఃఖములలో దేనిని ద్వేషింపడో , ఏ విధమైన కోరిక లేక యుండునో అట్టివాడు నిత్య సన్యాసి).

  1. యః కర్మయోగీ తదంతర్గిత్మానుభవ తృప్తః, తద్వ్యతిరిక్తం కిమపి నకాంక్షతి, తతః ఏవ కిమపి న ద్వేష్టి, తతః ఏవ ద్వంద్వ సహశ్చ, సః నిత్య సన్యాసీ నిత్య జ్ఞాన నిష్ఠః" (శ్రీమాన్ రామానుజః)

(ఎవడు కర్మ యోగము చేయుచు దాని వలన కలుగు ఆత్మానుభవము చేత తృప్తుడగుచు, దానికి వ్యతిరిక్తమైన వాటిని కోరడో, అందువలననే దేనిని ద్వేషించక అందువలన శీతోష్ణములను సుఖ దుఃఖములను మొదలగు ద్వంద్వములను సహించునో వాడు నిత్య సన్యాసి, నిత్యము జ్ఞానమందే నిష్ఠగలవాడు).

  1. "స్వ కర్మణి ప్రవృత్తోపి కర్మయోగీ (అ)నహంకృతిః |

జ్ఞాతవ్యో నిత్య సన్యాసీ యో నద్వేష్టి పరిశ్రమః ||"

(తన కర్మను చేయుచున్నప్పటికీ ఎవడు అహంకారములేనివాడై, తన స్వధర్మమును ద్వేషింపకుండునో, స్వర్గాది ఫలములనుకోరక భగవదారాధన చేయుచు ఎవరిని ద్వేషించక, దేనిని కోరకుండునో అట్టివాడు నిత్య సన్యాసి).

Transliteration
  1. ellapuḍu sanyāsigānuṃḍuvāḍu - nityaṃ sanyāsī.

  2. "yaḥ karmaṇivartamānōpi nadvēṣṭi, nakiṃcit kāṃkṣati, sukha duḥkhē tatsādhanēca", (śrīśaṃkaraḥ)

(evaḍu karmalu cēyucunnanu sukha duḥkhamulalō dēnini dvēṣiṃpaḍō , ē vidhamaina kōrika lēka yuṃḍunō aṭṭivāḍu nitya sanyāsi).

  1. yaḥ karmayōgī tadaṃtargitmānubhava tṛptaḥ, tadvyatiriktaṃ kimapi nakāṃkṣati, tataḥ ēva kimapi na dvēṣṭi, tataḥ ēva dvaṃdva sahaśca, saḥ nitya sanyāsī nitya jñāna niṣṭhaḥ" (śrīmān rāmānujaḥ)

(evaḍu karma yōgamu cēyucu dāni valana kalugu ātmānubhavamu cēta tṛptuḍagucu, dāniki vyatiriktamaina vāṭini kōraḍō, aṃduvalananē dēnini dvēṣiṃcaka aṃduvalana śītōṣṇamulanu sukha duḥkhamulanu modalagu dvaṃdvamulanu sahiṃcunō vāḍu nitya sanyāsi, nityamu jñānamaṃdē niṣṭhagalavāḍu).

  1. "sva karmaṇi pravṛttōpi karmayōgī (a)nahaṃkṛtiḥ |

jñātavyō nitya sanyāsī yō nadvēṣṭi pariśramaḥ ||"

(tana karmanu cēyucunnappaṭikī evaḍu ahaṃkāramulēnivāḍai, tana svadharmamunu dvēṣiṃpakuṃḍunō, svargādi phalamulanukōraka bhagavadārādhana cēyucu evarini dvēṣiṃcaka, dēnini kōrakuṃḍunō aṭṭivāḍu nitya sanyāsi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.