← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యవైరి nityavairi

Original — తెలుగు
  1. కామము.

  2. "కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః |

"బలానర్ధమార్గే (అ)స్మిన్ కామ ఏష ప్రవర్తకః |

సర్వానర్ధ పరిప్రాప్తి నిమిత్తం శత్రురాత్మనః |

కేనచిద్ధేతునా కామః ప్రతిబద్ధః స ఏవహి |

క్రోధః పరిణతో భాతి తస్మిన్ కామే నివారితే |

సర్వశ్రేయః పరిప్రాప్తిః తతో (అ)న్యశృణు కారణం |

చలప్రవృత్తి దుఃఖాత్మా యస్య హేతూ రజోగుణః |

యద్వా రజగుణస్యాయం కారణం లోభరూపధృక్ |

నాయం సామాది గుణస్యా సాధ్యో హంతవ్యో దండతో రిపుః |

మహా శనత్వాద్దానేన సంథాతుం నైష శక్యతే |

యత్పృధి వ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవః స్త్రియః |

నాలమేకస్య తత్సర్వమితి మత్వా శమం వ్రజేత్ |

సంధా తుం సామభేధాభ్యాయత్యు గ్రత్వాన్న శక్యతే |

తేనాయం ప్రేరితో జంతుః మహాపాపే ప్రవర్తతే |

అతో జానీహి సంసారే కామమేనం హి వైరిణం ||" (గీతాభావప్రకాశము - 3 - 239 to247)

(అనర్థమార్గములలో మానవుని ప్రవర్తింపచేసి సర్వానర్థములు ప్రాప్తించుటకు కారణమగుటచేత కామము ఆత్మకు వైరి - శత్రువు. ఏకారణముచేతనైనను కామమునకు అడ్డుతగిలిన యెడల ఆ కామమే క్రోధముగామారును. అందుచేత సర్వానర్థములకు మూలమైన కామమును నివారించినచో అన్ని విధముల శ్రేయస్సు కలుగును - ఇందుకు కారణమేమనగా చలప్రకృతిగల రజోగుణము దీనికి హేతువు. శత్రువును గెలుచుటకు సామ దాన భేదదండోపాయములనునవి నాలుగు గలవు. ఈ కామమను మహా శత్రువు సామ భేదములచే గెలుచుటకు వీలుకాదు.దానముచే గెలుచుటకునూ అవకాశము లేదు. ఎందుచేతననగా ఈ కామము మహాశనము - గొప్ప తిండిపోతు.సృష్టిలోనున్న సమస్తమైన ధనధాన్యములు, స్త్రీలు, రాజ్య భోగములు ఎన్ని విధములైనవి ఎన్ని ఉన్నను - చాలును అని సంతుష్టిపొందదు, ఇంకను కావలెను అనును. అగ్నిలో నేయి ఎంతవేసినను అగ్ని మఱింత ప్రజ్వలించుచుండునేగాని చాలును అని అనదు. అందుచేతనే అగ్ని అనలము - న + అలం = చాలదు - అని చెప్పబడినది. ఆ ప్రకారముగానే కామము కూడా కోరికలు ఎన్ని నెరవేరినను తృప్తిని చెందదు.ఆ కామము నెరవేర్చుకొనుటకు పాపకర్మలను చేయించును - అందుచేత కామము ఆత్మకు నిత్య వైరియనిచెప్పియున్నారు - చూడుము - 'కామము')

"ఇంద్రియాణి మనో బుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే |

ఏ తైర్విమోహ యత్యేష జ్ఞాన మావృత్య దేహినః || (శ్రీమద్భగవద్గీత - 3 - 20)

"ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణా |

కామ రూపేణ కౌంతేయ దుష్పూరేణా నలేనచ || " (శ్రీమద్భగవద్గీత - 3 - 39)

(ఈ కామములకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అధిష్ఠానములు - అనగా వాటిని ఆశ్రయించుకొనియుండి వాటి చేత తనకు కావలసిన పనులు చేయించుకొనుచుండును - - - జ్ఞానుల జ్ఞానము నిత్య వైరి అయిన ఈ కామము అను నిత్య వైరి చేత ఆవరించబడినది - సంతోషములేని అగ్నివలె)

Transliteration
  1. kāmamu.

  2. "kāma ēṣa krōdha ēṣa rajōguṇa samudbhavaḥ |

"balānardhamārgē (a)smin kāma ēṣa pravartakaḥ |

sarvānardha pariprāpti nimittaṃ śatrurātmanaḥ |

kēnaciddhētunā kāmaḥ pratibaddhaḥ sa ēvahi |

krōdhaḥ pariṇatō bhāti tasmin kāmē nivāritē |

sarvaśrēyaḥ pariprāptiḥ tatō (a)nyaśṛṇu kāraṇaṃ |

calapravṛtti duḥkhātmā yasya hētū rajōguṇaḥ |

yadvā rajaguṇasyāyaṃ kāraṇaṃ lōbharūpadhṛk |

nāyaṃ sāmādi guṇasyā sādhyō haṃtavyō daṃḍatō ripuḥ |

mahā śanatvāddānēna saṃthātuṃ naiṣa śakyatē |

yatpṛdhi vyāṃ vrīhi yavaṃ hiraṇyaṃ paśavaḥ striyaḥ |

nālamēkasya tatsarvamiti matvā śamaṃ vrajēt |

saṃdhā tuṃ sāmabhēdhābhyāyatyu gratvānna śakyatē |

tēnāyaṃ prēritō jaṃtuḥ mahāpāpē pravartatē |

atō jānīhi saṃsārē kāmamēnaṃ hi vairiṇaṃ ||" (gītābhāvaprakāśamu - 3 - 239 to247)

(anarthamārgamulalō mānavuni pravartiṃpacēsi sarvānarthamulu prāptiṃcuṭaku kāraṇamaguṭacēta kāmamu ātmaku vairi - śatruvu. ēkāraṇamucētanainanu kāmamunaku aḍḍutagilina yeḍala ā kāmamē krōdhamugāmārunu. aṃducēta sarvānarthamulaku mūlamaina kāmamunu nivāriṃcinacō anni vidhamula śrēyassu kalugunu - iṃduku kāraṇamēmanagā calaprakṛtigala rajōguṇamu dīniki hētuvu. śatruvunu gelucuṭaku sāma dāna bhēdadaṃḍōpāyamulanunavi nālugu galavu. ī kāmamanu mahā śatruvu sāma bhēdamulacē gelucuṭaku vīlukādu.dānamucē gelucuṭakunū avakāśamu lēdu. eṃducētananagā ī kāmamu mahāśanamu - goppa tiṃḍipōtu.sṛṣṭilōnunna samastamaina dhanadhānyamulu, strīlu, rājya bhōgamulu enni vidhamulainavi enni unnanu - cālunu ani saṃtuṣṭipoṃdadu, iṃkanu kāvalenu anunu. agnilō nēyi eṃtavēsinanu agni maṟiṃta prajvaliṃcucuṃḍunēgāni cālunu ani anadu. aṃducētanē agni analamu - na + alaṃ = cāladu - ani ceppabaḍinadi. ā prakāramugānē kāmamu kūḍā kōrikalu enni neravērinanu tṛptini ceṃdadu.ā kāmamu neravērcukonuṭaku pāpakarmalanu cēyiṃcunu - aṃducēta kāmamu ātmaku nitya vairiyaniceppiyunnāru - cūḍumu - 'kāmamu')

"iṃdriyāṇi manō buddhi rasyādhiṣṭhāna mucyatē |

ē tairvimōha yatyēṣa jñāna māvṛtya dēhinaḥ || (śrīmadbhagavadgīta - 3 - 20)

"āvṛtaṃ jñānamētēna jñāninō nitya vairiṇā |

kāma rūpēṇa kauṃtēya duṣpūrēṇā nalēnaca || " (śrīmadbhagavadgīta - 3 - 39)

(ī kāmamulaku iṃdriyamulu, manassu, buddhi adhiṣṭhānamulu - anagā vāṭini āśrayiṃcukoniyuṃḍi vāṭi cēta tanaku kāvalasina panulu cēyiṃcukonucuṃḍunu - - - jñānula jñānamu nitya vairi ayina ī kāmamu anu nitya vairi cēta āvariṃcabaḍinadi - saṃtōṣamulēni agnivale)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.