← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యవిభూతి nityavibhūti

Original — తెలుగు

భగవంతుని నిత్యైశ్వర్యము - శ్రీమదాంధ్ర మహాభాగవతములో ద్వితీయ స్కందములో తొమ్మిదవ అధ్యాయములో శ్రీ భగవంతుని నిత్య విభూతి వర్ణించబడినది. దానిలోని సారాంశము ఈ క్రిందవిధముగానున్నది - వైకుంఠపురము అను దివ్యధామము, పరంధామమునందు సునందుడు, నందుడు, అర్హణుడు మొదలగు పార్శ్వచరులు భక్తితో భజనచేయుచుండ, సకల లోకములకు తల్లియగు శ్రీ ఆదిలక్ష్మి తన పాదములొత్తుచుండ పీతవాసుడు, కనుక కిరీటకుండలములు మొదలగు దివ్యభూషణములు గలిగి - - - -

"అనర్ఘ్యరత్నమయ సింహాసనాసీనుండును, సునంద నంద కుముదాది సేవితుండును, బ్రకృతి పురుషమహదహంకారంబులను చతుశ్శక్తులును, గర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనోమహాభూతంబులను శోడశ శక్తులును, బంచ తన్మాత్రంబులునుం బరివేష్టింప, గోట్యర్కప్రభా విభాసితుండును స్వేతరాలభ్యస్వాభావిక సమస్త భాగ్యోదయుండునై స్వస్వరూపంబున గ్రీడించు సర్వేశ్వరుడైన పరమ పురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి - - - బ్రహ్మ నమస్కరించెను". (చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము -2 - 9 - 227 to 239)

Transliteration

bhagavaṃtuni nityaiśvaryamu - śrīmadāṃdhra mahābhāgavatamulō dvitīya skaṃdamulō tommidava adhyāyamulō śrī bhagavaṃtuni nitya vibhūti varṇiṃcabaḍinadi. dānilōni sārāṃśamu ī kriṃdavidhamugānunnadi - vaikuṃṭhapuramu anu divyadhāmamu, paraṃdhāmamunaṃdu sunaṃduḍu, naṃduḍu, arhaṇuḍu modalagu pārśvacarulu bhaktitō bhajanacēyucuṃḍa, sakala lōkamulaku talliyagu śrī ādilakṣmi tana pādamulottucuṃḍa pītavāsuḍu, kanuka kirīṭakuṃḍalamulu modalagu divyabhūṣaṇamulu galigi - - - -

"anarghyaratnamaya siṃhāsanāsīnuṃḍunu, sunaṃda naṃda kumudādi sēvituṃḍunu, brakṛti puruṣamahadahaṃkāraṃbulanu catuśśaktulunu, garmēṃdriya, jñānēṃdriya manōmahābhūtaṃbulanu śōḍaśa śaktulunu, baṃca tanmātraṃbulunuṃ barivēṣṭiṃpa, gōṭyarkaprabhā vibhāsituṃḍunu svētarālabhyasvābhāvika samasta bhāgyōdayuṃḍunai svasvarūpaṃbuna grīḍiṃcu sarvēśvaruḍaina parama puruṣuṃ buruṣōttamuṃ buṃḍarīkākṣu nārāyaṇuṃ jūci - - - brahma namaskariṃcenu". (cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu -2 - 9 - 227 to 239)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.