మోక్షము;ముక్తిమార్గము; జ్ఞానమార్గము;నిష్కామమార్గము;సన్యాసమార్గము; మోక్షహేతువు.
అపునరావృత్తి. (తిరిగి జన్మ లేకుండుట).
విషయములయెడల ప్రవృత్తి లేకుండుట - అప్రవృత్తి.
విడిచిపెట్టవలసిన కర్మలను విడుచుట.
సర్వ కర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నాస్యతః నివృత్తిః.
(సమస్తకర్మలను సన్యసించినతర్వాత ఆత్మజ్ఞానముకలుగుటవలననే నివృత్తి- ఇంకొకవిధముగాకాదు).
- “నివృత్త కర్మ నిష్టుండయినవాడు జ్ఞానదీప్తంబులయిన యింద్రియంబులందు క్రియా యజ్ఞంబులు
యజించియింద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబయిన మనంబునందు వికారయుక్తంబయినమనంబును, వాక్కునందు
విద్యావిలక్షణమయిన వాక్కును, వర్ణసముదాయమునందు వర్ణసముదాయంబును ఆకారాదిసర్వత్రయాత్మకంబయిన
యోంకారంబునందు నోంకారంబును, బిందువందు బిందువును, నాదంబునందు నాదంబును, బ్రాణంబునందు
బ్రాణంబును బ్రహ్మమందు నిలుపవలయును. దేవమార్గంబున ఉత్తరాయణశుక్లపక్షదివా ప్రాహ్ణపూర్ణిమా రాకలవలన
సూర్యద్వారంబున బ్రహ్మలోకంబునందు జేరి భోగావసానంబున స్థూలోపాధియైన విశ్వుండై స్థూలంబును,
సూక్ష్మంబునందు లయించి, సూక్ష్మోపాధియైన తైజసుండై సూక్ష్మంబును కారణంబునందు లయించి, కారణోపాధియైన
ప్రాజ్ఞుండై కారణంబును సాక్షి స్వరూపంబునందులయించి, తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై
యివ్విధింబున ముక్తుండగును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -15 - 467)
Transliteration
mōkṣamu;muktimārgamu; jñānamārgamu;niṣkāmamārgamu;sanyāsamārgamu;
mōkṣahētuvu.
apunarāvṛtti. (tirigi janma lēkuṃḍuṭa).
viṣayamulayeḍala pravṛtti lēkuṃḍuṭa - apravṛtti.
viḍicipeṭṭavalasina karmalanu viḍucuṭa.
sarva karma sanyāsa pūrvakāt ātmajñānāt nāsyataḥ
nivṛttiḥ.
(samastakarmalanu sanyasiṃcinatarvāta ātmajñānamukaluguṭavalananē
nivṛtti- iṃkokavidhamugākādu).
- “nivṛtta karma niṣṭuṃḍayinavāḍu jñānadīptaṃbulayina yiṃdriyaṃbulaṃdu
kriyā yajñaṃbulu yajiṃciyiṃdriyaṃbula darśanādi saṃkalpa mūlaṃbayina
manaṃbunaṃdu vikārayuktaṃbayinamanaṃbunu, vākkunaṃdu
vidyāvilakṣaṇamayina vākkunu, varṇasamudāyamunaṃdu varṇasamudāyaṃbunu
ākārādisarvatrayātmakaṃbayina yōṃkāraṃbunaṃdu nōṃkāraṃbunu, biṃduvaṃdu
biṃduvunu, nādaṃbunaṃdu nādaṃbunu, brāṇaṃbunaṃdu brāṇaṃbunu brahmamaṃdu
nilupavalayunu. dēvamārgaṃbuna uttarāyaṇaśuklapakṣadivā prāhṇapūrṇimā
rākalavalana sūryadvāraṃbuna brahmalōkaṃbunaṃdu jēri bhōgāvasānaṃbuna
sthūlōpādhiyaina viśvuṃḍai sthūlaṃbunu, sūkṣmaṃbunaṃdu layiṃci,
sūkṣmōpādhiyaina taijasuṃḍai sūkṣmaṃbunu kāraṇaṃbunaṃdu layiṃci,
kāraṇōpādhiyaina prājñuṃḍai kāraṇaṃbunu sākṣi svarūpaṃbunaṃdulayiṃci,
turyuṃḍai sūkṣmalayaṃbunaṃdu śuddhātmuṃḍai yivvidhiṃbuna muktuṃḍagunu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 -15 - 467)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.