← Back to న · Booklets 21–30 (digitized file 3)

నియతకర్మ niyatakarma

Original — తెలుగు
  1. "నియతం శాస్త్రీయం కర్మ" (శ్రీ అభినవగుప్తాచార్యః)

(శాస్త్రములో నియమింపబడిన కర్మ).

  1. స్వవర్ణాశ్రిమోచితం నిత్యం కర్మ. (భాష్యోత్కర్ష దీపికా)

(వారి వారి వర్ణములకు, ఆశ్రమములకు తగిన - ఉచితమైన - కర్మ).

  1. నియతం విద్ధ్యుద్దేశేహలసంబంధ శూన్యతయ నియతనిమిత్తేన కర్మ - శ్రౌతం స్మార్తంచ నిత్యం ఇతిప్రసిద్ధః.

(శాస్త్రములో ఉద్దేశించిన ప్రకారము ఫలముతో సంబంధములేక, శాస్త్రము విధించినదను కారణముచేత చేయబడు శ్రౌతకర్మ, స్మార్తకర్మ).

  1. "సంధ్యోపాసనాది కర్మ, యద్వా నియతం నియమేనకర్మ నిత్యకామ్యసాధారణం యత్పాపనివర్తక స్వభావం తత్".

(సంధోపాసన మొదలగు కర్మ; లేక, నిత్యము సాధారణముగా చేయు కామ్యకర్మ; నియమముగా చేయబడు కర్మ - పాపమును పోగొట్టు స్వభావము కలది).

  1. పుణ్య పాప లక్షణం కర్మ. (పుణ్య పాప లక్షణముగల కర్మ).

  2. యద్విహితం విధినైవ తత్ నియతం కర్మ. (శాస్త్రములో విధించబడిన కర్మ).

(విధి విదానమున నియమించిన కర్మ).

  1. నియతం వ్యాప్తం ప్రకృతి సం సృష్టేన హి వ్యాప్తం కర్మ. ప్రకృతి సంసృష్టం అనాది వాసనయా.

(ప్రకృతివలన కలిగి అనాది కర్మవాసనల చేత నిర్మింపబడిన కర్మ).

  1. "నియతం నిత్యం యోయస్మిన్ కర్మణి అధికృతః. ఫలాయచ అశ్రుతం, తత్ నియతం కర్మ." (శ్రీశంకరః)

(ఫలమందాసక్తి లేక నిత్యము దానిలోనే నిమగ్నమై యుండు కర్మ).

  1. "నియతం కురు కర్మత్వం" (శ్రీమద్భగవద్గీత - 3 - 9)

(నియతకర్మ చేయుము ).

  1. మనసుచేత ఇంద్రియములను నిగ్రహించి చేయుకర్మ - విహితమైన కర్మ.

  2. కర్మణః నియతత్వం స్వభావతః, శాస్త్రతః, వాస్యాత్, ఉభయతోవా.

(స్వభావము వలనగాని, శాస్త్రములో విధించబడియుండుట చేతగాని, రెండింటిచేతగాని కర్మ నిర్మించబడును).

Transliteration
  1. "niyataṃ śāstrīyaṃ karma" (śrī abhinavaguptācāryaḥ)

(śāstramulō niyamiṃpabaḍina karma).

  1. svavarṇāśrimōcitaṃ nityaṃ karma. (bhāṣyōtkarṣa dīpikā)

(vāri vāri varṇamulaku, āśramamulaku tagina - ucitamaina - karma).

  1. niyataṃ viddhyuddēśēhalasaṃbaṃdha śūnyataya niyatanimittēna karma - śrautaṃ smārtaṃca nityaṃ itiprasiddhaḥ.

(śāstramulō uddēśiṃcina prakāramu phalamutō saṃbaṃdhamulēka, śāstramu vidhiṃcinadanu kāraṇamucēta cēyabaḍu śrautakarma, smārtakarma).

  1. "saṃdhyōpāsanādi karma, yadvā niyataṃ niyamēnakarma nityakāmyasādhāraṇaṃ yatpāpanivartaka svabhāvaṃ tat".

(saṃdhōpāsana modalagu karma; lēka, nityamu sādhāraṇamugā cēyu kāmyakarma; niyamamugā cēyabaḍu karma - pāpamunu pōgoṭṭu svabhāvamu kaladi).

  1. puṇya pāpa lakṣaṇaṃ karma. (puṇya pāpa lakṣaṇamugala karma).

  2. yadvihitaṃ vidhinaiva tat niyataṃ karma. (śāstramulō vidhiṃcabaḍina karma).

(vidhi vidānamuna niyamiṃcina karma).

  1. niyataṃ vyāptaṃ prakṛti saṃ sṛṣṭēna hi vyāptaṃ karma. prakṛti saṃsṛṣṭaṃ anādi vāsanayā.

(prakṛtivalana kaligi anādi karmavāsanala cēta nirmiṃpabaḍina karma).

  1. "niyataṃ nityaṃ yōyasmin karmaṇi adhikṛtaḥ. phalāyaca aśrutaṃ, tat niyataṃ karma." (śrīśaṃkaraḥ)

(phalamaṃdāsakti lēka nityamu dānilōnē nimagnamai yuṃḍu karma).

  1. "niyataṃ kuru karmatvaṃ" (śrīmadbhagavadgīta - 3 - 9)

(niyatakarma cēyumu ).

  1. manasucēta iṃdriyamulanu nigrahiṃci cēyukarma - vihitamaina karma.

  2. karmaṇaḥ niyatatvaṃ svabhāvataḥ, śāstrataḥ, vāsyāt, ubhayatōvā.

(svabhāvamu valanagāni, śāstramulō vidhiṃcabaḍiyuṃḍuṭa cētagāni, reṃḍiṃṭicētagāni karma nirmiṃcabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.