సన్యాసము.
ఉంచుట - మంత్రము జపించినపుడు దేహముయొక్క అవయవములందు మంత్ర బీజాక్షరములనుంచుట.
న్యాసము రెండు విధములు - అంగన్యాసము, కరన్యాసము. పాదాద్యంగుష్టేషు న్యాసం, విపర్యయంయథా - భవతి - ఏవం శిర ఆది పాదాంతం వా -
(పాదములు మొదలుకొని శిరసువరకు అంగములను మంత్రములు చెప్పుతూ స్పృశించుట - లేక శిరస్సు మొదలు పాదములవఱకు అట్లే స్పృశించుట).
(ఓం కారముతో సంపుటమైన మంత్రములోని ఒక్కొక్క అక్షరమును కుడిచేతి తర్జని మొదలుకొని ఎడమ తర్జని వరకు వేళ్ళయందు నాలుగు అక్షరములను ఉంచుట).
షకారంతుభ్రువోర్మధ్యేణకారం శిఖి శిఖయాన్యసేత్ |
వేకారం నేత్రయోర్యుం జాన్, ణకారం సర్వ సంధిషు |
మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిః భవేద్బుధాః |
సవిసర్గం షడం తంతు సర్వదిక్షు వినిర్దిశేత్ ||”
(ఓం నమోనారాయణాయ అనుమంత్రమునకు న్యాసము - హృదయమందు ఓం కారమును, వికారమును మూర్థమందును, షకారమును కనుబొమలమధ్యమందును, ణకారమును శిఖయందును, వేకారము కండ్లయందును నకారము సర్వ సంధులయందును, మకారము అస్త్రమునందును న్యాసముచేసి దిగ్బంధము చేయవలెను - ఇట్లు చేసిన ఏ దేవత గుఱించి చేసెనో - ఆ దేవతా మూర్తి తానేయగును - ‘ఓం విష్ణువేనమః’ అను మంత్రమును ఇట్లు చేసిన ఆ మంత్ర దేవత అయిన విష్ణువు తానే యగును).
(రెండుచేతుల వ్రేళ్ళయందు పంచభూతాత్మకమైన మూలమంత్రముయొక్క పదములతోగాని, అక్షరములతో గాని న్యాసము చేయవలెను - ఇట్లు చేయుటవలన సాధకునకు ఆ మంత్ర దేవతతో తాదాత్మ్యముసిద్ధించును - అట్లు చేసిన తర్వాత ఆ ఇష్ట దేవతమయమైన తేజస్సు సాధకుని శరీరమందు, లోపల,పైన వ్యాపించునని భావించవలెను).
(ఓం కారముతో కూడిన ఒక మంత్రమును - (ఓం విష్ణువేనమః) చదువుచు దానిలోని ఒక్కొక్కఅక్షరమును తన శరీరములోని అంగముల తాకుచు ఉచ్చరించుటవలన తన శరీరమును భగవంతునికి సమర్పించుట యగును - భగవంతుని యధీనములో నుంచుట యగును - తన రక్షణభారముభగవంతునిమీద నుంచుట).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 8 - 299)
sanyāsamu.
uṃcuṭa - maṃtramu japiṃcinapuḍu dēhamuyokka avayavamulaṃdu maṃtra bījākṣaramulanuṃcuṭa.
nyāsamu reṃḍu vidhamulu - aṃganyāsamu, karanyāsamu. pādādyaṃguṣṭēṣu nyāsaṃ, viparyayaṃyathā - bhavati - ēvaṃ śira ādi pādāṃtaṃ vā -
(pādamulu modalukoni śirasuvaraku aṃgamulanu maṃtramulu cepputū spṛśiṃcuṭa - lēka śirassu modalu pādamulavaṟaku aṭlē spṛśiṃcuṭa).
(ōṃ kāramutō saṃpuṭamaina maṃtramulōni okkokka akṣaramunu kuḍicēti tarjani modalukoni eḍama tarjani varaku vēḷḷayaṃdu nālugu akṣaramulanu uṃcuṭa).
ṣakāraṃtubhruvōrmadhyēṇakāraṃ śikhi śikhayānyasēt |
vēkāraṃ nētrayōryuṃ jān, ṇakāraṃ sarva saṃdhiṣu |
makāramastramuddiśya maṃtramūrtiḥ bhavēdbudhāḥ |
savisargaṃ ṣaḍaṃ taṃtu sarvadikṣu vinirdiśēt ||”
(ōṃ namōnārāyaṇāya anumaṃtramunaku nyāsamu - hṛdayamaṃdu ōṃ kāramunu, vikāramunu mūrthamaṃdunu, ṣakāramunu kanubomalamadhyamaṃdunu, ṇakāramunu śikhayaṃdunu, vēkāramu kaṃḍlayaṃdunu nakāramu sarva saṃdhulayaṃdunu, makāramu astramunaṃdunu nyāsamucēsi digbaṃdhamu cēyavalenu - iṭlu cēsina ē dēvata guṟiṃci cēsenō - ā dēvatā mūrti tānēyagunu - ‘ōṃ viṣṇuvēnamaḥ’ anu maṃtramunu iṭlu cēsina ā maṃtra dēvata ayina viṣṇuvu tānē yagunu).
(reṃḍucētula vrēḷḷayaṃdu paṃcabhūtātmakamaina mūlamaṃtramuyokka padamulatōgāni, akṣaramulatō gāni nyāsamu cēyavalenu - iṭlu cēyuṭavalana sādhakunaku ā maṃtra dēvatatō tādātmyamusiddhiṃcunu - aṭlu cēsina tarvāta ā iṣṭa dēvatamayamaina tējassu sādhakuni śarīramaṃdu, lōpala,paina vyāpiṃcunani bhāviṃcavalenu).
(ōṃ kāramutō kūḍina oka maṃtramunu - (ōṃ viṣṇuvēnamaḥ) caduvucu dānilōni okkokkaakṣaramunu tana śarīramulōni aṃgamula tākucu uccariṃcuṭavalana tana śarīramunu bhagavaṃtuniki samarpiṃcuṭa yagunu - bhagavaṃtuni yadhīnamulō nuṃcuṭa yagunu - tana rakṣaṇabhāramubhagavaṃtunimīda nuṃcuṭa).
(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 8 - 299)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.