← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పదం padaṃ

Original — తెలుగు
  1. స్థానము, నివాసస్థానము, చోటు; పాదము; భాగము

  2. పద్యతే ఇతిపదం, స్థానం, పదనీయం. (పొంద తగినది, పొందవలసిన స్థానము).

  3. “పద్యతే గమ్యతే ముముక్షుభిః ఇదిపదం”; “ప్రాప్యతే ముముక్షుభిః ఇతిపదం”. (శ్రీ అనందగిరి)

  4. పద్యతే ప్రాప్యతే చేతసా ఇతి పదం. (మనసు చేతనే, ధ్యానము చేతన పొందతగినది).

“పద్యతే ప్రాప్యతే జ్ఞాని భిః ఇతి పదం”

(జ్ఞానులచేత - బ్రహ్మజ్ఞానులచేత - పొందబడునది, పొంద తగినది).

  1. పద్యతే జ్ఞాయతే బ్రహ్మ ఇతి పదం. (బ్రహ్మను తెలియచేయుఇనది - బ్రహ్మ జ్ఞానము కలుగచేయునది).

  2. స్వమాత్ర తయా పద్యతే ఇతి పదం.

(స్వస్వరూపముతో పొందతగినది) (భగవంతుని అంశరూపముగనే పొందతగినది - భగవంతునితో ఐక్యమగుట).

  1. ముక్త పురుషైః ప్రాప్యత్వేన మతం పదం. (గీతాభావప్రకాశము - 8 - 78)

(మోక్షమును పొందినవారికి ప్రాప్తించునదగుటచేత పదము).

  1. “పద్యతే గమ్యతే ఇతివ్యుత్పత్యాపదశబ్దః ప్రాప్య స్వరూపవాచీ” (శ్రీరంగ రామానుజః)

సమస్త హేయరహితం విష్ణ్వాఖ్యం పరమం పదం ఇత్యాదివత్.

(పొందబడుచున్నది గనుక పదము అను వ్యుత్పత్యర్థమును బట్టి ప్రాప్య వస్తువు - పొంద తగినవస్తువు - పొందబడునది - అని అర్థము. హేయమైన ఎటువంటి వస్తువులు లేనిది. విష్ణువు అను పేరుగల పరమ పదము, అత్యుత్కృష్టసాధనము. వైకుంఠము - వైకుంఠమే విష్ణువు (వైకుంఠుడు),విష్ణువే (వైకుంఠుడే) వైకుంఠము - ఇదియే ప్రాప్య వస్తువు).

  1. పదనీయం గమనీయం, దేహోదౌ అహం బుద్ధిం విహాయ ముముక్షుభిః బ్రహ్మైవ ప్రత్యగాత్మతయాగం తవ్య మిత్యర్థః.

దేహము మొదలగు అనాత్మ వస్తువులందు అవి నేను అహంకారమును వదలి మోక్షమును కోరువారిచేప్రత్యగాత్మయే బ్రహ్మ అను బుద్ధితో పొందతగినది).

  1. “తదేత ద్పదనీయమస్య సర్వస్య” ఇతి శ్రుతేః -

(ఈ సమస్తమునకు జగత్తు అంతటికీ పొందవలసిన (ఆఖరున చేరవలసిన) స్థానము ఆ పరబ్రహ్మమేఅని శ్రుతి చెప్పుచున్నది).

  1. “సర్వే వాదాః యత్పదమానం తి” ఇతి శ్రుతిః.

(వేదములన్నియు పొందతగిన ఏ వస్తువును గుఱించి (పరమపదమును గుఱించి పరమపదము తానేఅయిన విష్ణువు గుఱించి) చెప్పుచున్నదో అని శ్రుతి వాక్యము - వేదములన్నియు పరమాత్మయేపొందతగిన వస్తువు (స్థానము, పదము), (పరమపదము) అని చెప్పుచున్నవి. సమస్తవస్తువులునుప్రళయకాలమందు పరమాత్మలోనే లీనమై పోవునదియే కనుక భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా, నిష్కామ కర్మయోగముద్వారా, లేక ఇతరమైన మార్గముద్వారా, అయినను అతనినే, అతనిస్థానమునే, అతనిలోకమునే, పరమాత్మయను అతని స్థితినే పొందవలెనని శ్రుతులు - వేదములు - చెప్పుచున్నవి.వేదములన్నియు తెలియచేయు విషయమిది యొక్కటియే. వాటి సారాంశమిదియే).

“యదక్షరం వేదవిదోవదంతి విశం త యద్యతయో వీతరాగాః |

యదిచ్ఛంతో బ్రహ్మచర్యంచ రంతి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే” –

“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ”.

(వేదమును తెలిసినవారు దేనిని నాశములేనిదని చెప్పుచున్నారో అన్నింటియంది అభిమానమువదలుకొన్న యతులు దేనిని ప్రవేశించదరో (దేనిలో కలియుదురో), దేనిని కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నాచరింతురో, ఆ పదమును - స్థానమును - నేను సంగ్రహముగా చెప్పుచున్నాను – అదియే ‘ఓం’ అను ఏకాక్షర రూపుడైన పరబ్రహ్మ).

  1. “కూటస్థమ చలం సూక్ష్మం సత్యం నిర్గుణమవ్యయం |

ఆనందమక్షరం బ్రహ్మ తాత జానీహిమత్పదం |

తత్పదం తే ప్రపశ్యంతి యేషాం భక్తిర్మయి స్థిరా |

నాన్యధా కర్మకాండైశ్చ తపోభిశ్చాతిదారుణైః ||” (ఆదిత్య పురాణము)

(కూటస్థుడు, చలనము లేనివాడు - ఎప్పుడూ ఒకే రీతిగా నుండువాడు - సూక్ష్మమైనవాడు (అణువుకన్న చిన్నవాడు), మూడుకాలములందుండువాడు, సత్వ రజస్తమో గుణములు లేనివాడు - త్రిగుణములకు అతీతుడైనవాడు నిరాకారుడు, నాశము లేనివాడు, ఆనందమే - మోక్షరూపమైన పరమపదమే రూపముగా గలవాడు అయిన పరబ్రహ్మయే నాపదము, నా స్థానము - ఎవరికి నాయందు స్థిరమైన భక్తికలదో వారే ఆ పదము అయిననన్ను చూడగలరు- కర్మలు చేయుటవలనగాని, దారుణమైనతపస్సు చేయుటవలన గాని, ఇంకేవిధముగా గాని ఆ పదమైన నన్ను చూడలేరు).

Transliteration
  1. sthānamu, nivāsasthānamu, cōṭu; pādamu; bhāgamu

  2. padyatē itipadaṃ, sthānaṃ, padanīyaṃ. (poṃda taginadi, poṃdavalasina sthānamu).

  3. “padyatē gamyatē mumukṣubhiḥ idipadaṃ”; “prāpyatē mumukṣubhiḥ itipadaṃ”. (śrī anaṃdagiri)

  4. padyatē prāpyatē cētasā iti padaṃ. (manasu cētanē, dhyānamu cētana poṃdataginadi).

“padyatē prāpyatē jñāni bhiḥ iti padaṃ”

(jñānulacēta - brahmajñānulacēta - poṃdabaḍunadi, poṃda taginadi).

  1. padyatē jñāyatē brahma iti padaṃ. (brahmanu teliyacēyuinadi - brahma jñānamu kalugacēyunadi).

  2. svamātra tayā padyatē iti padaṃ.

(svasvarūpamutō poṃdataginadi) (bhagavaṃtuni aṃśarūpamuganē poṃdataginadi - bhagavaṃtunitō aikyamaguṭa).

  1. mukta puruṣaiḥ prāpyatvēna mataṃ padaṃ. (gītābhāvaprakāśamu - 8 - 78)

(mōkṣamunu poṃdinavāriki prāptiṃcunadaguṭacēta padamu).

  1. “padyatē gamyatē itivyutpatyāpadaśabdaḥ prāpya svarūpavācī” (śrīraṃga rāmānujaḥ)

samasta hēyarahitaṃ viṣṇvākhyaṃ paramaṃ padaṃ ityādivat.

(poṃdabaḍucunnadi ganuka padamu anu vyutpatyarthamunu baṭṭi prāpya vastuvu - poṃda taginavastuvu - poṃdabaḍunadi - ani arthamu. hēyamaina eṭuvaṃṭi vastuvulu lēnidi. viṣṇuvu anu pērugala parama padamu, atyutkṛṣṭasādhanamu. vaikuṃṭhamu - vaikuṃṭhamē viṣṇuvu (vaikuṃṭhuḍu),viṣṇuvē (vaikuṃṭhuḍē) vaikuṃṭhamu - idiyē prāpya vastuvu).

  1. padanīyaṃ gamanīyaṃ, dēhōdau ahaṃ buddhiṃ vihāya mumukṣubhiḥ brahmaiva pratyagātmatayāgaṃ tavya mityarthaḥ.

dēhamu modalagu anātma vastuvulaṃdu avi nēnu ahaṃkāramunu vadali mōkṣamunu kōruvāricēpratyagātmayē brahma anu buddhitō poṃdataginadi).

  1. “tadēta dpadanīyamasya sarvasya” iti śrutēḥ -

(ī samastamunaku jagattu aṃtaṭikī poṃdavalasina (ākharuna cēravalasina) sthānamu ā parabrahmamēani śruti ceppucunnadi).

  1. “sarvē vādāḥ yatpadamānaṃ ti” iti śrutiḥ.

(vēdamulanniyu poṃdatagina ē vastuvunu guṟiṃci (paramapadamunu guṟiṃci paramapadamu tānēayina viṣṇuvu guṟiṃci) ceppucunnadō ani śruti vākyamu - vēdamulanniyu paramātmayēpoṃdatagina vastuvu (sthānamu, padamu), (paramapadamu) ani ceppucunnavi. samastavastuvulunupraḷayakālamaṃdu paramātmalōnē līnamai pōvunadiyē kanuka bhakti dvārā, jñānamu dvārā, niṣkāma karmayōgamudvārā, lēka itaramaina mārgamudvārā, ayinanu ataninē, atanisthānamunē, atanilōkamunē, paramātmayanu atani sthitinē poṃdavalenani śrutulu - vēdamulu - ceppucunnavi.vēdamulanniyu teliyacēyu viṣayamidi yokkaṭiyē. vāṭi sārāṃśamidiyē).

“yadakṣaraṃ vēdavidōvadaṃti viśaṃ ta yadyatayō vītarāgāḥ |

yadicchaṃtō brahmacaryaṃca raṃti tattēpadaṃ saṃgrahēṇa pravakṣyē” –

“ōmityēkākṣaraṃ brahma”.

(vēdamunu telisinavāru dēnini nāśamulēnidani ceppucunnārō anniṃṭiyaṃdi abhimānamuvadalukonna yatulu dēnini pravēśiṃcadarō (dēnilō kaliyudurō), dēnini kōrinavāru brahmacaryavratamu nācariṃturō, ā padamunu - sthānamunu - nēnu saṃgrahamugā ceppucunnānu – adiyē ‘ōṃ’ anu ēkākṣara rūpuḍaina parabrahma).

  1. “kūṭasthama calaṃ sūkṣmaṃ satyaṃ nirguṇamavyayaṃ |

ānaṃdamakṣaraṃ brahma tāta jānīhimatpadaṃ |

tatpadaṃ tē prapaśyaṃti yēṣāṃ bhaktirmayi sthirā |

nānyadhā karmakāṃḍaiśca tapōbhiścātidāruṇaiḥ ||” (āditya purāṇamu)

(kūṭasthuḍu, calanamu lēnivāḍu - eppuḍū okē rītigā nuṃḍuvāḍu - sūkṣmamainavāḍu (aṇuvukanna cinnavāḍu), mūḍukālamulaṃduṃḍuvāḍu, satva rajastamō guṇamulu lēnivāḍu - triguṇamulaku atītuḍainavāḍu nirākāruḍu, nāśamu lēnivāḍu, ānaṃdamē - mōkṣarūpamaina paramapadamē rūpamugā galavāḍu ayina parabrahmayē nāpadamu, nā sthānamu - evariki nāyaṃdu sthiramaina bhaktikaladō vārē ā padamu ayinanannu cūḍagalaru- karmalu cēyuṭavalanagāni, dāruṇamainatapassu cēyuṭavalana gāni, iṃkēvidhamugā gāni ā padamaina nannu cūḍalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.