(ఆత్మవలన ఆకాశము పుట్టినది, ఆకాశములోనుండివాయువు, వాయులోనుండి అగ్ని, అగ్నిలోనుండిజలము, జలములోనుండి భూమి పుట్టినది - ఈ అయిదు పంచభూతములు).
(పై దానిని బట్టి చూడగా ఈ పంచభూతములు ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టినవి. తామసాహంకారంబునుండి ఆకాశము, దానిలోనుండి, ఒకదానిలోనుండి ఒకటిగా మిగిలిన భూతములుపుట్టినవి. సూక్ష్మరూపములోనుండు తన్మాత్రలనుండి ఈ పంచభూతములు పుట్టినవి. ఇవి పుట్టుటకు కారణము ఎందులోనుండి ఒకటి పుట్టినదో అది దానికి కారణమగుచుండగా అసలు నిమిత్తకారణము భగవంతుడని స్పష్టమగుచున్నది - “భగవంతుని వీక్షణమున”, ‘అవలోకనంబున’ అను పదములు వాడుకచేయబడినవి. సృష్టి ప్రారంభములోకూడ భగవంతుని యీక్షణమే (సైక్షిత;స అకిమయత) కారణముగా చెప్పబడినది. దీనివలన తెలియవచ్చునదేమనగా - సృష్టిప్రారంభసమ యమునందువలెనే తర్వాత కూడా సృష్టిక్రమములో ప్రతితత్వము పుట్టునపుడును - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టినపుడును, అప్పటి నుండి ఇప్పటివరకు, ఇకముందుకూడా సృష్టిజరుగుచున్నదనగా భగవంతుడు ఆ వస్తువులో తన చైతన్య శక్తి (చిచ్ఛక్తి) రూపములో నుండి,దానికి ఇంకొక వస్తువును పుట్టించగల శక్తినిచ్చి అట్లు ఇంకొక వస్తువును పుట్టింప చేయుచున్నాడు. అందుచేత భగవంతుని శక్తిలేనిదే ఏ వస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టదు. ఇట్లు పుట్టుటకుకాలము అను భగవంతుని శక్తి కూడ కారణమగుచున్నది - ఆ శక్తికూడ భగవంతుని రూపమే -కాలము గడచిన కొలది యే భగవంతుని శక్తివలన ఒక వస్తువు మార్పు గలిగి ఇంకొక వస్తువుకలుగుచున్నది. భగవంతునికి, అతనిశక్తికిని భేదము లేదు) (చూడుము : - ఆత్మ - ).
“ఆత్మనః ఆకాశస్సంభూతః” అను శ్రుతి ప్రమాణానం జేసి ఆ భూతాత్మయొక్క ఈ క్షణమేకాలము - ఆ కాలముయొక్క అస్తిత్వమే ఆకాశము - ఆ ఆకాశముయొక్కవిస్తీర్ణమే వాయువు - ఆ వాయువేచుట్టి మధించగాను అగ్ని - ఆ అగ్నియొక్క ఉరుమే జలము. ఆయప్పు బలియంగాను పృధివి. ఆ పృధివికిధారణము, అప్పునకు పిండీకరణము తేజస్సుకు పచనము, వాయువునకు వ్యూహనము, ఆకాశానకు అవకాశ ప్రదానము - “ఏక లక్షణమాకాశః, ద్విలక్షణో వాయుః, త్రిలక్షణమగ్నిః, చతుర్లక్షణమాపఃపంచలక్షణా పృధివీ” - యత్సుషిరం తదాకాశం యచ్చలనం తద్వాయుః, యదుష్ణం తత్తేజః, యద్రిసంతదానః యత్కఠినం తత్ పృధివీ (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
తామసాహంకారంబు వలన శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనునవి సూక్ష్మాకారముతో పుట్టెను, ఇవియే తన్మాత్రలు - తన్మాత్రలనగా అంతమాత్రములే - అవియే, ఇంక దేనితోనుకలియనివి - ఒకదానితో నొకటి కలియనివి. వీటిలోనుండియే పంచభూతములు పుట్టినవి - ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి పుట్టినవి. అట్లు పుట్టుటచేత వాటికి ఒక్కొక్కదానికి - అది యెందులోనుండి పుట్టినదో దాని గుణము కలిగెను - ఆకాశమునకు శబ్దము, వాయువునకు స్పర్శము, అగ్నికిరూపము, జలమునకు రసము, పృధివికి గంధము గుణములు. ఇవి వీటియొక్క అసాధారణగుణములు - విశేషగుణములు. ఈ పంచభూతములు ఒకదానిలోనుండి ఒకటిపుట్టుటవలన ఒక్కొక్కదానికిదాని అసాధారణగుణమేకాక దానికి ముందు పుట్టిన భూతముల గుణములు కూడా కలిగియుండును. ఇందువలన ఆకాశమునకు శబ్దము ఒకటే గుణము, వాయువునకు శబ్దము,స్పర్శము, అను రెండు గుణములు, అగ్నికి శబ్దము, స్పర్శము, రూపము అనుగుణములు, జలమునకు శబ్దము,స్పర్శము,రూపము,రసము అను నాలుగుగుణములు; పృధివికి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అను అయిదు గుణములుగలవి యగుచున్నవి. ఈ అయిదు భూతములు ఒకదానితో ఒకటికలియగా పంచీకరణము అనిచెప్ప బడుచున్నది - (చూడుము : - “పంచీకరణము”). (చూడుము :- శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
“సద్యో జాతస్తధా భూమీ వామదేవాత్ భవేత్ జలం |
అఘోరాద్వహ్నిరుత్పన్నః తత్పురుషాత్ వాయురుచ్యతే |
ఈశానాద్గగనాకారం పంచ బ్రహ్మమయం జగత్ ||“.
(ఈశానుడు, తత్పురుషుడు, అఘోరము, వాసుదేవుడు, సద్యోజాతుడు అని పంచబ్రహ్మలు. ఈ అయిదు బ్రహ్మల వలన ఆకాశము, వాయువు, వహ్ని, జలము, భూమి పుట్టినవి. ఈ అయిదు భూతములు కలిసి ఈ జగత్తు అయినది.కనుక ఇదంతయు పంచబ్రహ్మ మయమే).
(ātmavalana ākāśamu puṭṭinadi, ākāśamulōnuṃḍivāyuvu, vāyulōnuṃḍi agni, agnilōnuṃḍijalamu, jalamulōnuṃḍi bhūmi puṭṭinadi - ī ayidu paṃcabhūtamulu).
(pai dānini baṭṭi cūḍagā ī paṃcabhūtamulu okadānilō nuṃḍi okaṭigā puṭṭinavi. tāmasāhaṃkāraṃbunuṃḍi ākāśamu, dānilōnuṃḍi, okadānilōnuṃḍi okaṭigā migilina bhūtamulupuṭṭinavi. sūkṣmarūpamulōnuṃḍu tanmātralanuṃḍi ī paṃcabhūtamulu puṭṭinavi. ivi puṭṭuṭaku kāraṇamu eṃdulōnuṃḍi okaṭi puṭṭinadō adi dāniki kāraṇamagucuṃḍagā asalu nimittakāraṇamu bhagavaṃtuḍani spaṣṭamagucunnadi - “bhagavaṃtuni vīkṣaṇamuna”, ‘avalōkanaṃbuna’ anu padamulu vāḍukacēyabaḍinavi. sṛṣṭi prāraṃbhamulōkūḍa bhagavaṃtuni yīkṣaṇamē (saikṣita;sa akimayata) kāraṇamugā ceppabaḍinadi. dīnivalana teliyavaccunadēmanagā - sṛṣṭiprāraṃbhasama yamunaṃduvalenē tarvāta kūḍā sṛṣṭikramamulō pratitatvamu puṭṭunapuḍunu - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭinapuḍunu, appaṭi nuṃḍi ippaṭivaraku, ikamuṃdukūḍā sṛṣṭijarugucunnadanagā bhagavaṃtuḍu ā vastuvulō tana caitanya śakti (cicchakti) rūpamulō nuṃḍi,dāniki iṃkoka vastuvunu puṭṭiṃcagala śaktinicci aṭlu iṃkoka vastuvunu puṭṭiṃpa cēyucunnāḍu. aṃducēta bhagavaṃtuni śaktilēnidē ē vastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭadu. iṭlu puṭṭuṭakukālamu anu bhagavaṃtuni śakti kūḍa kāraṇamagucunnadi - ā śaktikūḍa bhagavaṃtuni rūpamē -kālamu gaḍacina koladi yē bhagavaṃtuni śaktivalana oka vastuvu mārpu galigi iṃkoka vastuvukalugucunnadi. bhagavaṃtuniki, ataniśaktikini bhēdamu lēdu) (cūḍumu : - ātma - ).
“ātmanaḥ ākāśassaṃbhūtaḥ” anu śruti pramāṇānaṃ jēsi ā bhūtātmayokka ī kṣaṇamēkālamu - ā kālamuyokka astitvamē ākāśamu - ā ākāśamuyokkavistīrṇamē vāyuvu - ā vāyuvēcuṭṭi madhiṃcagānu agni - ā agniyokka urumē jalamu. āyappu baliyaṃgānu pṛdhivi. ā pṛdhivikidhāraṇamu, appunaku piṃḍīkaraṇamu tējassuku pacanamu, vāyuvunaku vyūhanamu, ākāśānaku avakāśa pradānamu - “ēka lakṣaṇamākāśaḥ, dvilakṣaṇō vāyuḥ, trilakṣaṇamagniḥ, caturlakṣaṇamāpaḥpaṃcalakṣaṇā pṛdhivī” - yatsuṣiraṃ tadākāśaṃ yaccalanaṃ tadvāyuḥ, yaduṣṇaṃ tattējaḥ, yadrisaṃtadānaḥ yatkaṭhinaṃ tat pṛdhivī (brahmavidyā sudhārṇavamu)
tāmasāhaṃkāraṃbu valana śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu anunavi sūkṣmākāramutō puṭṭenu, iviyē tanmātralu - tanmātralanagā aṃtamātramulē - aviyē, iṃka dēnitōnukaliyanivi - okadānitō nokaṭi kaliyanivi. vīṭilōnuṃḍiyē paṃcabhūtamulu puṭṭinavi - ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi puṭṭinavi. aṭlu puṭṭuṭacēta vāṭiki okkokkadāniki - adi yeṃdulōnuṃḍi puṭṭinadō dāni guṇamu kaligenu - ākāśamunaku śabdamu, vāyuvunaku sparśamu, agnikirūpamu, jalamunaku rasamu, pṛdhiviki gaṃdhamu guṇamulu. ivi vīṭiyokka asādhāraṇaguṇamulu - viśēṣaguṇamulu. ī paṃcabhūtamulu okadānilōnuṃḍi okaṭipuṭṭuṭavalana okkokkadānikidāni asādhāraṇaguṇamēkāka dāniki muṃdu puṭṭina bhūtamula guṇamulu kūḍā kaligiyuṃḍunu. iṃduvalana ākāśamunaku śabdamu okaṭē guṇamu, vāyuvunaku śabdamu,sparśamu, anu reṃḍu guṇamulu, agniki śabdamu, sparśamu, rūpamu anuguṇamulu, jalamunaku śabdamu,sparśamu,rūpamu,rasamu anu nāluguguṇamulu; pṛdhiviki śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu anu ayidu guṇamulugalavi yagucunnavi. ī ayidu bhūtamulu okadānitō okaṭikaliyagā paṃcīkaraṇamu aniceppa baḍucunnadi - (cūḍumu : - “paṃcīkaraṇamu”). (cūḍumu :- śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
“sadyō jātastadhā bhūmī vāmadēvāt bhavēt jalaṃ |
aghōrādvahnirutpannaḥ tatpuruṣāt vāyurucyatē |
īśānādgaganākāraṃ paṃca brahmamayaṃ jagat ||“.
(īśānuḍu, tatpuruṣuḍu, aghōramu, vāsudēvuḍu, sadyōjātuḍu ani paṃcabrahmalu. ī ayidu brahmala valana ākāśamu, vāyuvu, vahni, jalamu, bhūmi puṭṭinavi. ī ayidu bhūtamulu kalisi ī jagattu ayinadi.kanuka idaṃtayu paṃcabrahma mayamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.