← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచబ్రహ్మాసనము paṃcabrahmāsanamu

Original — తెలుగు
  1. బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర సదాశివాత్మక పంచబ్రహ్మాత్మకం యదాసనం తత్ దేవ్యాః -

(బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అను అయిదుగురు బ్రహ్మలుగల మంచాకారముగానున్న శ్రీదేవియొక్క ఆసనము).

  1. హృదయాది పంచస్థానాసన పంచ బ్రహ్మ తీతం పరం బ్రహ్మెవ తస్య సర్వ పరత్వేన తత్పరం నాస్తి.

(హృదయము మొదలగు అయిదు స్థానములందున్న పంచబ్రహ్మలకు అతీతమైనది పరబ్రహ్మ. అదియే అన్నిటికంటె ఉత్కృష్టమైనదగుటచేత దానికంటె ఉత్కృష్టమైనది లేదు).

  1. “శ్రీచక్రమధ్యభాగమందు అధోముఖముగానున్న విమర్శాంకకోణ పంచకము - బ్రహ్మాది సదాశివాంతపంచబ్రహ్మ మయ మంచకము - సదాశివుడు మంచకము - అదియే శ్రీదేవి ఆసనము - పంచబ్రహ్మాసనము).”

  2. “శ్రీదేవి స్థూలాకారమందున్న మూలాధార స్వాధిష్ఠానముల ఉపరిబ్రహ్మ గ్రంధియు, మణిపూరక అనావాతములపైన విష్ణుగ్రంధియు, విశుద్ధ ఆజ్ఞా కమలములపైన రుద్రగ్రంధియు, లలాటమునుండి శిరోమధ్యభాగ పర్యంతమందు ఈశ్వరస్థితియు, తదుపరి ద్వాదశాంతమందు బిందుస్థానమందు సదాశివస్థానమనియు,ఆపైని చిత్కలారూపముగా శ్రీదేవియున్నదని, కనుక పంచబ్రహ్మాకార ఆసనత్వము శ్రీదేవికి సిద్ధించినది. బిందువునకు క్రిందుగా బ్రహ్మాదులు ఆయాస్థానములందు గ్రంధిరూపముగా నిమీలితాక్షులై యున్నారు”.

Transliteration
  1. brahma viṣṇu rudrēśvara sadāśivātmaka paṃcabrahmātmakaṃ yadāsanaṃ tat dēvyāḥ -

(brahma, viṣṇuvu, rudruḍu, īśvaruḍu, sadāśivuḍu anu ayiduguru brahmalugala maṃcākāramugānunna śrīdēviyokka āsanamu).

  1. hṛdayādi paṃcasthānāsana paṃca brahma tītaṃ paraṃ brahmeva tasya sarva paratvēna tatparaṃ nāsti.

(hṛdayamu modalagu ayidu sthānamulaṃdunna paṃcabrahmalaku atītamainadi parabrahma. adiyē anniṭikaṃṭe utkṛṣṭamainadaguṭacēta dānikaṃṭe utkṛṣṭamainadi lēdu).

  1. “śrīcakramadhyabhāgamaṃdu adhōmukhamugānunna vimarśāṃkakōṇa paṃcakamu - brahmādi sadāśivāṃtapaṃcabrahma maya maṃcakamu - sadāśivuḍu maṃcakamu - adiyē śrīdēvi āsanamu - paṃcabrahmāsanamu).”

  2. “śrīdēvi sthūlākāramaṃdunna mūlādhāra svādhiṣṭhānamula uparibrahma graṃdhiyu, maṇipūraka anāvātamulapaina viṣṇugraṃdhiyu, viśuddha ājñā kamalamulapaina rudragraṃdhiyu, lalāṭamunuṃḍi śirōmadhyabhāga paryaṃtamaṃdu īśvarasthitiyu, tadupari dvādaśāṃtamaṃdu biṃdusthānamaṃdu sadāśivasthānamaniyu,āpaini citkalārūpamugā śrīdēviyunnadani, kanuka paṃcabrahmākāra āsanatvamu śrīdēviki siddhiṃcinadi. biṃduvunaku kriṃdugā brahmādulu āyāsthānamulaṃdu graṃdhirūpamugā nimīlitākṣulai yunnāru”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.