← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచగురువులు paṃcaguruvulu

Original — తెలుగు
  1. జ్ఞానవృద్ధః, తపోవుద్ధః, వయోవృద్ధః తధాత్మవిత్ |

సదా విష్ణుకథాసక్తః పంచైతేగురువస్స్మృతాః (మాఘపురాణము)

(జ్ఞాన వృద్ధుడు, తపోవృద్ధుడు, వయోవృద్ధుడు, ఆత్మవిదుడు, ఎల్లపుడు విష్ణుకధలందు ఆసక్తికలవాడు - ఈ అయిదుగురు గురువులు - జ్ఞానము గలవారిలో వృద్ధుడు లేక జ్ఞానముచే వృద్ధుడైన వాడు, పండితుడైనవాడు; తపస్సు చేసినవారిలో పెద్దవాడు, లేక, తపస్సు చేయుటచే పెద్దవాడు,వయస్సులో పెద్దవాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు; ఎల్లపుడు విష్ణునికధలందు ఆసక్తి కలవాడు - ఈఅయిదుగురు గురువులని చెప్పబడుచున్నారు).

  1. రూపగంధ స్పర్శ శబ్ద రస్యైః పంచభిః విషయైః సమ్మోహితాః పతంగ, మధుకర గజ, హరిణమీనా హతాః | అతః తేషు అనాసక్తాః పంచైతే గురవః తదుక్తం -

“శ్లో||. పతంగ మాతంగ కురంగ భృంగ మీనా హతాః పంచభిరేవ పంచ |

ఏకః ప్రమాదీ సకథంనహిన్యతే యస్సేవతే పంచభిరేవ పంచ ||“.

(రూపము, గంధము, స్పర్శము, శబ్దము, రసము అని అయిదు విషయములు ఇంద్రియములను ఆకర్షించునవి. వీటిలో ఒకటి పతంగమును, ఒకటి తుమ్మెదను, ఒకటి ఏనుగును, ఒకటి లేడిని, ఒకటిచేపను ఆకర్షించునవి - వీటి అంతమునకు కారణమగుచున్నవి. ఈ అయిదింటిలోను ఒక్కొక్కటేఇంత ప్రమాదకరమైనదైనపుడు ఈ అయిదు విషయములు కలిసి ఒకదానిలోనున్న యడల వాటిచేఆకర్షింపబడుదాని సంగతి చెప్పనవసరము లేదు - ఈ అయిదు విషయములకులోనై మునిగితేలువాడు అనేక ప్రమాదములకు గురియగును. అందుచేత ఈ అయిదు విషయములందు ఆసక్తి వదలినవారు గురువులు. ఈ పతంగము, తుమ్మెద, ఏనుగు, లేడి, చేప - ఈ అయిదింటిని దృష్టిలో పెట్టుకొని(గురువులుగ తలచి) వాటికి (విషయములకు) లోనుగానివారు కూడా గురువులే).

Transliteration
  1. jñānavṛddhaḥ, tapōvuddhaḥ, vayōvṛddhaḥ tadhātmavit |

sadā viṣṇukathāsaktaḥ paṃcaitēguruvassmṛtāḥ (māghapurāṇamu)

(jñāna vṛddhuḍu, tapōvṛddhuḍu, vayōvṛddhuḍu, ātmaviduḍu, ellapuḍu viṣṇukadhalaṃdu āsaktikalavāḍu - ī ayiduguru guruvulu - jñānamu galavārilō vṛddhuḍu lēka jñānamucē vṛddhuḍaina vāḍu, paṃḍituḍainavāḍu; tapassu cēsinavārilō peddavāḍu, lēka, tapassu cēyuṭacē peddavāḍu,vayassulō peddavāḍu, brahmajñānamu kalavāḍu; ellapuḍu viṣṇunikadhalaṃdu āsakti kalavāḍu - īayiduguru guruvulani ceppabaḍucunnāru).

  1. rūpagaṃdha sparśa śabda rasyaiḥ paṃcabhiḥ viṣayaiḥ sammōhitāḥ pataṃga, madhukara gaja, hariṇamīnā hatāḥ | ataḥ tēṣu anāsaktāḥ paṃcaitē guravaḥ taduktaṃ -

“ślō||. pataṃga mātaṃga kuraṃga bhṛṃga mīnā hatāḥ paṃcabhirēva paṃca |

ēkaḥ pramādī sakathaṃnahinyatē yassēvatē paṃcabhirēva paṃca ||“.

(rūpamu, gaṃdhamu, sparśamu, śabdamu, rasamu ani ayidu viṣayamulu iṃdriyamulanu ākarṣiṃcunavi. vīṭilō okaṭi pataṃgamunu, okaṭi tummedanu, okaṭi ēnugunu, okaṭi lēḍini, okaṭicēpanu ākarṣiṃcunavi - vīṭi aṃtamunaku kāraṇamagucunnavi. ī ayidiṃṭilōnu okkokkaṭēiṃta pramādakaramainadainapuḍu ī ayidu viṣayamulu kalisi okadānilōnunna yaḍala vāṭicēākarṣiṃpabaḍudāni saṃgati ceppanavasaramu lēdu - ī ayidu viṣayamulakulōnai munigitēluvāḍu anēka pramādamulaku guriyagunu. aṃducēta ī ayidu viṣayamulaṃdu āsakti vadalinavāru guruvulu. ī pataṃgamu, tummeda, ēnugu, lēḍi, cēpa - ī ayidiṃṭini dṛṣṭilō peṭṭukoni(guruvuluga talaci) vāṭiki (viṣayamulaku) lōnugānivāru kūḍā guruvulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.