← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచకోశములు paṃcakōśamulu

Original — తెలుగు
  1. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాః పంచకోశాః.

(అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకోశము, విజ్ఞానమయకోశము, ఆనందమయకోశముఅను అయిదుకోశములు శరీరములోనున్నవి. కోశమనగా ఆవరించియుండునది - కత్తికి ఒర కోశము -కత్తిని కనబడకుండునట్లు దాచియుంచునది. ఆ ప్రకారముగానే ఈ కోశములు ఒకదానిలోనొకటి ఇమిడియుండి, వాటి అన్నింటికి లోపలనున్న పరమాత్మను ఇవి ఆవరించియుండి కనబడకుండచేయునవి).

  1. “సవా ఏష పురుషో అన్నరసమయః, తస్మాద్వా ఏ తస్మా దన్నరసమయాత్ అన్యో అంతరాత్మా ప్రాణమియః, తస్మాదన్యో(అం)తర ఆత్మా మనోమయః, తస్మాదన్యో (అ)oతరతర ఆత్మావిజ్ఞానమయః, తస్మాద్వా ఏ తస్మాద్విజ్ఞానమయాత్ అన్యో (అ)oతర ఆత్మా ఆనందమయః” (తైత్తరీయోపనిషత్)

(ఈ పురుషుడు అన్నరసమయుడు, ఈ అన్నరసమయమైన కోశములోను, దానిలో ప్రాణమ యకోసములోను, దానికి లోపల ఆనందమయకోశములోను ఉండువాడు. ఈ కోశములు ఒకదానిలో నింకొకటియుండును. వాటిలోనుండు పురుషుడు పరమాత్మ).

  1. “శరీర త్రయే పంచ కోశాః భవంతి. కారణ శరీరే ఆనందమయకోశశ్చాంతర్భావం, సూక్ష్మ శరీరేవిజ్ఞానమయ మనోమయానాం త్రయాణాం కోశానమంతర్భావం స్థూలశరీరం అన్నమయకోశః”.

(ఈ అయిదు కోశములు మూడు విధములుగానుండు శరీరములోనున్నవి. ఎట్లనగా - స్థూలశరీరములోఉన్నది అన్నమయ కోశము - సూక్ష్మ శరీరములో నుండునది ప్రాణమయ కోశము, మనోమయకోశమువిజ్ఞానమయకోశము. కారణ శరీరములో నుండునది ఆనందమయ కోశము).

  1. “తేషాం పంచానాం వికారాః ఆధ్యాత్మకాః దేహప్రాణమనోబుద్ధి జీవాః అన్నమయాదయః పంచ కోశాః” ఇతిశ్రుతేః. అన్నం ప్రసిద్ధం, ప్రాణమనో బుద్ధయః హిరణ్యగర్భరూపాః, బింబ చైతన్యం ఈశ్వరః ఆనందమయః. (భాష్యరత్న ప్రభా)

(అధ్యాత్మకములైన దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి జీవులు తాలూకు వికారములే పంచకోశములు. అన్నమయకోశము అందఱికి తెలిసినదే స్థూలదేహము. ప్రాణము, మనస్సు, బుద్ధి(విజ్ఞానము)ఈ మూడుకోశములు - ప్రాణమయకోశము, మనోమయకోశము, విజ్ఞానమయకోశము హిరణ్యగర్భునిరూపములు - సూక్ష్మరూపము. ఈశ్వరునియొక్క ప్రతిబింబ చైతన్యము ఆనందమయకోశము).

Transliteration
  1. annamaya, prāṇamaya, manōmaya, vijñānamaya, ānaṃdamayāḥ paṃcakōśāḥ.

(annamayakōśamu, prāṇamayakōśamu, manōmayakōśamu, vijñānamayakōśamu, ānaṃdamayakōśamuanu ayidukōśamulu śarīramulōnunnavi. kōśamanagā āvariṃciyuṃḍunadi - kattiki ora kōśamu -kattini kanabaḍakuṃḍunaṭlu dāciyuṃcunadi. ā prakāramugānē ī kōśamulu okadānilōnokaṭi imiḍiyuṃḍi, vāṭi anniṃṭiki lōpalanunna paramātmanu ivi āvariṃciyuṃḍi kanabaḍakuṃḍacēyunavi).

  1. “savā ēṣa puruṣō annarasamayaḥ, tasmādvā ē tasmā dannarasamayāt anyō aṃtarātmā prāṇamiyaḥ, tasmādanyō(aṃ)tara ātmā manōmayaḥ, tasmādanyō (a)otaratara ātmāvijñānamayaḥ, tasmādvā ē tasmādvijñānamayāt anyō (a)otara ātmā ānaṃdamayaḥ” (taittarīyōpaniṣat)

(ī puruṣuḍu annarasamayuḍu, ī annarasamayamaina kōśamulōnu, dānilō prāṇama yakōsamulōnu, dāniki lōpala ānaṃdamayakōśamulōnu uṃḍuvāḍu. ī kōśamulu okadānilō niṃkokaṭiyuṃḍunu. vāṭilōnuṃḍu puruṣuḍu paramātma).

  1. “śarīra trayē paṃca kōśāḥ bhavaṃti. kāraṇa śarīrē ānaṃdamayakōśaścāṃtarbhāvaṃ, sūkṣma śarīrēvijñānamaya manōmayānāṃ trayāṇāṃ kōśānamaṃtarbhāvaṃ sthūlaśarīraṃ annamayakōśaḥ”.

(ī ayidu kōśamulu mūḍu vidhamulugānuṃḍu śarīramulōnunnavi. eṭlanagā - sthūlaśarīramulōunnadi annamaya kōśamu - sūkṣma śarīramulō nuṃḍunadi prāṇamaya kōśamu, manōmayakōśamuvijñānamayakōśamu. kāraṇa śarīramulō nuṃḍunadi ānaṃdamaya kōśamu).

  1. “tēṣāṃ paṃcānāṃ vikārāḥ ādhyātmakāḥ dēhaprāṇamanōbuddhi jīvāḥ annamayādayaḥ paṃca kōśāḥ” itiśrutēḥ. annaṃ prasiddhaṃ, prāṇamanō buddhayaḥ hiraṇyagarbharūpāḥ, biṃba caitanyaṃ īśvaraḥ ānaṃdamayaḥ. (bhāṣyaratna prabhā)

(adhyātmakamulaina dēhamu, prāṇamu, manassu, buddhi jīvulu tālūku vikāramulē paṃcakōśamulu. annamayakōśamu aṃdaṟiki telisinadē sthūladēhamu. prāṇamu, manassu, buddhi(vijñānamu)ī mūḍukōśamulu - prāṇamayakōśamu, manōmayakōśamu, vijñānamayakōśamu hiraṇyagarbhunirūpamulu - sūkṣmarūpamu. īśvaruniyokka pratibiṃba caitanyamu ānaṃdamayakōśamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.