- జ్ఞానకర్మాక్షప్రాణ భూత పంచకాని, అంతఃకరణ చతుష్టయం చ ఇతిచతుర్వింశతి తత్వాని, తదుపాధికో జీవః
పంచవింశకః - “పంచవింశ ఆత్మాభవతి” ఇతిశ్రుతేః.
(జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, ప్రాణములైదు, భూతములు అయిదు, అంతఃకరణము,
బుద్ధి,మనస్సు, చిత్తము, అనునవి నాలుగు కలిసి ఇరువదినాలుగు తత్వములు - ఈ
ఇరువదినాలుగుతత్వములు ఉపాదిగా చేసుకొని వాటిలోనున్న జీవుడు ఇరువది అయిదవ తత్త్వము - ఆత్మ
ఇరువదిఅయిదవ తత్వమని శ్రుతి చెప్పుచున్నది).
- “సత్వరజస్తమసా సామ్యావస్థా ప్రకృతిః, ప్రకృతేర్మహాన్, మవతో(అ)హంకారః, అహంకారాత్పంచ
తన్మాత్రాణ్యుభయమింద్రియం, పంచ తన్మాత్రేభ్యః, స్థూలభూతాని పురుష ఇతి పంచవింశతిర్గణః”.
(సత్వరజస్తమముల సామ్యావస్థ గల ప్రకృతి, ప్రకృతిలోనుండి మహత్తత్వము పుట్టినది.
మహత్తత్వములోనుండి అహంకారము, అహంకారమునుండి
పంచతన్మాత్రలు,కర్మేంద్రియములు,జ్ఞానేంద్రియములుమనస్సు, పంచతన్మాత్రలనుండి పంచస్థూల భూతములైన
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిపుట్టినవి. ఇవి ఇరువదినాలుగు తత్వములు, ఇవి పురుషుడు -
జీవుడు - కలిసి ఇరువది అయిదు తత్వములు -
- “మూల ప్రకృతిరవికృతిః, మహదాద్యాః ప్రకృతి వికృత యస్సప్త, షోడశకశ్య వికారః నప్రకృతిర్న
వికృతిః పురుషః”. (ఇతిసాంఖ్యే)
(మూల ప్రకృతియనగా ప్రధానము, అది వికృతి లేనిది; మహదాదులు - అనగా మహత్తు - (మహిత్తత్తము)
-, అహంకారము, పంచతన్మాత్రలు, అనునీయేడును వాఃపూర్వములకు - వాటికిముందున్న వాటికి -
వికృతులు; వాటి పరములకు - వాటి తర్వాత వాటికి - ప్రకృతులు -; పృధివిమొదలగు పంచభూతములు -
(పృధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము) – దశేంద్రియములు (కర్మేంద్రియములు అయిదు,
జ్ఞానేంద్రియములైదు), మనసు అను పదియారు వికారములు - ఈ పదియారున్నూ, పైన చెప్పబడిన ఎనిమిదిన్నీ కలిసి
ఇరువదినాలుగు తత్వములు - పురుషుడు(జీవుడు) ఇరువది అయిదవ తత్వము. మొత్తము పంచవింశతి -
25 - తత్వములు).
- “పంచ వింశతి తత్వ నిర్ణయం యేలాగంటే - ఆకాశమే జ్ఞతృ వనిపించు కొనును - ఆ యాకాశమేవాయు సం
యోగాన మనస్సాయె; అగ్ని సం యోగాన బుద్ధి ఆయెను; అప్పు సంయోగాన చిత్తమాయెను;పృధ్వి సంయోగాన
అహంకారమాయెను. ఇవి ఆకాశతత్వ భేదాలు - ఇంక వాయు తత్వం యొక్క నిజాంశమే వ్యానవాయువాయెను; పృధివింగూడి
ప్రాణవాయువాయెను; జీవనముం గూడి అపానవాయువాయెను.ఇవి వాయుతత్వభేదాలు. అగ్నియొక్క నిజాంశమే చక్షుస్సాయె,
పృధివిని గూడగా ఘ్రాణమాయెను,అప్పును గూడగా రసమాయెను, వాయువునుగూడి త్వక్కాయెను, ఆకాశానగూడగా
శ్రోత్రమాయెను.ఇవి అగ్నితత్వ భేదాలు. అప్పు నిజాంశమే రసవిషయమాయెను, పృధివితో గూడగాను గంధ విషయమాయెను,
అగ్నితో గూడంగాను రూపవిషయమాయెను, ఆకాశాన గూడి శబ్దవిషయమాయెను. ఇవిజలతత్వభేదాలు. పృధ్వినిజాంశమే
సాయ్వింద్రియమాయె, జలంతో గూడి గుహ్యేంద్రియమాయె, అగ్నితోగూడిపాదేంద్రియమాయెను, వాయువుతోగూడి ఘ్రాణేంద్రియమాయెను
- ఆకాశంతోగూడి వాగింద్రియమాయె.
ఈ అయిదున్నూ పృధివీతత్వ భేదాలు-” (బ్రహ్మ విద్యాసుధార్ణవము)
- చతుర్వింశతి తత్వములు, కాలము కలిసి యిరువది అయిదు తత్వములు - కాలమే పురుషుడు,పరబ్రహ్మ
- పురుషుడే కాలము -“చతుర్వింశతి తత్వాత్మకంబైన సగుణ బ్రహ్మ సంస్థానంబు సెప్పితిని, నిటమీద
కాలంబను పంచవింశక తత్వంబు సెప్పెద అని కొందఱు పురుష శబ్దవాచ్యుండైన ఈశ్వరుని పౌరుషంబు
గాలశబ్దంబున జెప్పంబడునందురు. ప్రకృతి గుణసామ్యంబునం జేసి వర్తించి నిర్విశేషుండగు భగవంతుని
చేష్టా విశేషంబు దేనివలన ఉత్పన్నంబగు నదియ కాలమని చెప్పంబడు. అదియు జీవరాశంతర్గతంబగుటం జేసి
పురుషుండనియు, వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలంబనియు జెప్పంబడును. ఆత్మమాయంజేసి తత్వాంతర్గతుండైన
జీవుని వలన క్షుభితంబయి జగత్కారణంబగు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 888)
Transliteration
- jñānakarmākṣaprāṇa bhūta paṃcakāni, aṃtaḥkaraṇa catuṣṭayaṃ ca
iticaturviṃśati tatvāni, tadupādhikō jīvaḥ paṃcaviṃśakaḥ - “paṃcaviṃśa
ātmābhavati” itiśrutēḥ.
(jñānēṃdriyamulaidu, karmēṃdriyamulaidu, prāṇamulaidu, bhūtamulu
ayidu, aṃtaḥkaraṇamu, buddhi,manassu, cittamu, anunavi nālugu kalisi
iruvadinālugu tatvamulu - ī iruvadinālugutatvamulu upādigā cēsukoni
vāṭilōnunna jīvuḍu iruvadi ayidava tattvamu - ātma iruvadiayidava
tatvamani śruti ceppucunnadi).
- “satvarajastamasā sāmyāvasthā prakṛtiḥ, prakṛtērmahān,
mavatō(a)haṃkāraḥ, ahaṃkārātpaṃca tanmātrāṇyubhayamiṃdriyaṃ, paṃca
tanmātrēbhyaḥ, sthūlabhūtāni puruṣa iti paṃcaviṃśatirgaṇaḥ”.
(satvarajastamamula sāmyāvastha gala prakṛti, prakṛtilōnuṃḍi
mahattatvamu puṭṭinadi. mahattatvamulōnuṃḍi ahaṃkāramu, ahaṃkāramunuṃḍi
paṃcatanmātralu,karmēṃdriyamulu,jñānēṃdriyamulumanassu,
paṃcatanmātralanuṃḍi paṃcasthūla bhūtamulaina ākāśamu, vāyuvu, agni,
jalamu, bhūmipuṭṭinavi. ivi iruvadinālugu tatvamulu, ivi puruṣuḍu -
jīvuḍu - kalisi iruvadi ayidu tatvamulu -
- “mūla prakṛtiravikṛtiḥ, mahadādyāḥ prakṛti vikṛta yassapta,
ṣōḍaśakaśya vikāraḥ naprakṛtirna vikṛtiḥ puruṣaḥ”. (itisāṃkhyē)
(mūla prakṛtiyanagā pradhānamu, adi vikṛti lēnidi; mahadādulu - anagā
mahattu - (mahittattamu) -, ahaṃkāramu, paṃcatanmātralu, anunīyēḍunu
vāḥpūrvamulaku - vāṭikimuṃdunna vāṭiki - vikṛtulu; vāṭi paramulaku -
vāṭi tarvāta vāṭiki - prakṛtulu -; pṛdhivimodalagu paṃcabhūtamulu -
(pṛdhivi, jalamu, agni, vāyuvu, ākāśamu) – daśēṃdriyamulu
(karmēṃdriyamulu ayidu, jñānēṃdriyamulaidu), manasu anu padiyāru
vikāramulu - ī padiyārunnū, paina ceppabaḍina enimidinnī kalisi
iruvadinālugu tatvamulu - puruṣuḍu(jīvuḍu) iruvadi ayidava tatvamu.
mottamu paṃcaviṃśati - 25 - tatvamulu).
- “paṃca viṃśati tatva nirṇayaṃ yēlāgaṃṭē - ākāśamē jñatṛ vanipiṃcu
konunu - ā yākāśamēvāyu saṃ yōgāna manassāye; agni saṃ yōgāna buddhi
āyenu; appu saṃyōgāna cittamāyenu;pṛdhvi saṃyōgāna ahaṃkāramāyenu. ivi
ākāśatatva bhēdālu - iṃka vāyu tatvaṃ yokka nijāṃśamē vyānavāyuvāyenu;
pṛdhiviṃgūḍi prāṇavāyuvāyenu; jīvanamuṃ gūḍi apānavāyuvāyenu.ivi
vāyutatvabhēdālu. agniyokka nijāṃśamē cakṣussāye, pṛdhivini gūḍagā
ghrāṇamāyenu,appunu gūḍagā rasamāyenu, vāyuvunugūḍi tvakkāyenu,
ākāśānagūḍagā śrōtramāyenu.ivi agnitatva bhēdālu. appu nijāṃśamē
rasaviṣayamāyenu, pṛdhivitō gūḍagānu gaṃdha viṣayamāyenu, agnitō
gūḍaṃgānu rūpaviṣayamāyenu, ākāśāna gūḍi śabdaviṣayamāyenu.
ivijalatatvabhēdālu. pṛdhvinijāṃśamē sāyviṃdriyamāye, jalaṃtō gūḍi
guhyēṃdriyamāye, agnitōgūḍipādēṃdriyamāyenu, vāyuvutōgūḍi
ghrāṇēṃdriyamāyenu - ākāśaṃtōgūḍi vāgiṃdriyamāye.
ī ayidunnū pṛdhivītatva bhēdālu-” (brahma vidyāsudhārṇavamu)
- caturviṃśati tatvamulu, kālamu kalisi yiruvadi ayidu tatvamulu -
kālamē puruṣuḍu,parabrahma - puruṣuḍē kālamu -“caturviṃśati
tatvātmakaṃbaina saguṇa brahma saṃsthānaṃbu seppitini, niṭamīda
kālaṃbanu paṃcaviṃśaka tatvaṃbu seppeda ani koṃdaṟu puruṣa
śabdavācyuṃḍaina īśvaruni pauruṣaṃbu gālaśabdaṃbuna jeppaṃbaḍunaṃduru.
prakṛti guṇasāmyaṃbunaṃ jēsi vartiṃci nirviśēṣuṃḍagu bhagavaṃtuni cēṣṭā
viśēṣaṃbu dēnivalana utpannaṃbagu nadiya kālamani ceppaṃbaḍu. adiyu
jīvarāśaṃtargataṃbaguṭaṃ jēsi puruṣuṃḍaniyu, vāni bahirbhāga vyāptiṃ
jēsi kālaṃbaniyu jeppaṃbaḍunu. ātmamāyaṃjēsi tatvāṃtargatuṃḍaina jīvuni
valana kṣubhitaṃbayi jagatkāraṇaṃbagu” - (śrīmadāṃdhramahābhāgavatamu -
3 - 26 - 888)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.