(జగత్కర్త అయిన పరమాత్మ సృష్టి చేయు నుద్దేశముతో తమోగుణమునధిష్టించి తన్మాత్రలయిన సూక్ష్మభూతములను స్థూలభూతములగా చేయుటకు సంకల్పించెను. ఒక్కొక్క భూతమునురెండు భాగములుగా విభజించి, వాటిని మరల నాలుగుగా భాగించి, ఒక్కొక్క దానియొక్క ఎనిమిదవ వంతును మిగిలినవాటితో కలిపి, ఈ ప్రకారము పంచభూతములను ఒకదానితో నొకటికలిపి - పంచీ కరణము చేసి - ఇట్లు పంచీకరణము చేయబడిన స్థూలపంచభూతములతో అనంతకోటి బ్రహ్మాండములను, ఆయా అండములకు ఉచితమైన పదునాలుగులోకములను, ఆయాలోకములకు ఉచితమైన స్థూల శరీరములను సృష్టించెను).
(ఒక్కొక్క సూక్ష్మభూతము యొక్క తమోగుణాంశమును సమముగా రెండు భాగములుగా విభజించెను -అందులో ఒక భాగమును వేరే ఉంచి, రెండవభాగమును నాలుగుభాగములుగా విభజించెను - ఈ ప్రకారం రెండవమారు విభజించగా వచ్చిన ఒక్కొక్క (1/8) భూతముయొక్క ఎనిమిదవ అంశము మిగిలిన భూతముల అర్థాంశలో (1/2 తో) కలిపెను - ఈ ప్రకారముగా చేసిన పంచీకరణమైనది.ఈ ప్రకారము చేయగా ఒక్కొక్క స్థూలభూతమందు సగము (అర్థభాగము) దాని స్వంతమైన అంశయే.మిగిలిన అర్థభాగము (1/2) మిగిలిని నాలుగు భూతములయొక్క అష్టమాంశ 1/8 కలిగియుండును.ఈ ప్రకారముగా అయిదు భూతములను ఒకదానితో నొకటి కలిపి స్థూల భూతములు పంచీకరణముచేయబడినవి. ఈ ప్రకారముగా చేయగా ప్రతి స్థూలభూతములోని సగము (అర్థభాగము) దాని అంశమే.మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతముల అంశలు కలిసి అయినది. ఉదాహరణకు - ఆకాశములోని సగము భాగము ఆకాశాంశయే. మిగిలిన సగభాగములో వాయువుయొక్క అష్టమాంశ (1/8), అగ్నియొక్క అష్టమాంశ, జలముయొక్క అష్టమాంశ, భూమియొక్క అష్టమాంశ కలిసి యున్నవి. ఈ ప్రకారముగా మిగిలిన స్థూలభూతములగుఱించి కూడా ఊహించుకొనవలసినది. ఈ విషయము క్రిందను స్పష్టము చేయబడినది : - ఆకాశము,వాయువు, అగ్ని, జలము, భూమి మొత్తము
| సూక్ష్మభూతము | ఆకాశము | వాయువు | అగ్ని | జలము | భూమి | మొత్తము | |
|---|---|---|---|---|---|---|---|
| అంశ | అంశ | అంశ | అంశ | అంశ | |||
| 1 | ఆకాశము | 1/2 | 1/8 | 1/8 | 1/8 | 1/8 | 1 |
| 2 | వాయువు | 1/8 | 1/2 | 1/8 | 1/8 | 1/8 | 1 |
| 3 | అగ్ని | 1/8 | 1/8 | 1/2 | 1/8 | 1/8 | 1 |
| 4 | జలము | 1/8 | 1/8 | 1/8 | 1/2 | 1/8 | 1 |
| 5 | భూమి | 1/8 | 1/8 | 1/8 | 1/8 | 1/2 | 1 |
ఇట్లు ఒక్కొక్క భూతమును అయిదు భాగములుగా చేసి ఒకదాని భాగములను మిగిలిన భూతములభాగములతో కలుపుటచేత పంచీకరణమని చెప్పబడినది. పంచభూతములు ఇట్లు కలిసియే యున్ననుఏ భూతముయొక్క అంశ హెచ్చుగానుండునో అది ఆ భూతము పేరుతో చెప్పబడుచున్నది. ఇట్లుసూక్ష్మ పంచభూతములు ఒకదానితో మిగిలినవి కలియుటవలన అవి స్థూలభూతములై ఇంద్రియములకు గోచరమగుచున్నవి. ఈ స్థూలభూతములే జగత్తులోని సమస్త వస్తువులుగా మారినవి. కనుకఈ జగత్తు అంతయు పంచభూతమయము - పాంచ భౌతికము).
(jagatkarta ayina paramātma sṛṣṭi cēyu nuddēśamutō tamōguṇamunadhiṣṭiṃci tanmātralayina sūkṣmabhūtamulanu sthūlabhūtamulagā cēyuṭaku saṃkalpiṃcenu. okkokka bhūtamunureṃḍu bhāgamulugā vibhajiṃci, vāṭini marala nālugugā bhāgiṃci, okkokka dāniyokka enimidava vaṃtunu migilinavāṭitō kalipi, ī prakāramu paṃcabhūtamulanu okadānitō nokaṭikalipi - paṃcī karaṇamu cēsi - iṭlu paṃcīkaraṇamu cēyabaḍina sthūlapaṃcabhūtamulatō anaṃtakōṭi brahmāṃḍamulanu, āyā aṃḍamulaku ucitamaina padunālugulōkamulanu, āyālōkamulaku ucitamaina sthūla śarīramulanu sṛṣṭiṃcenu).
(okkokka sūkṣmabhūtamu yokka tamōguṇāṃśamunu samamugā reṃḍu bhāgamulugā vibhajiṃcenu -aṃdulō oka bhāgamunu vērē uṃci, reṃḍavabhāgamunu nālugubhāgamulugā vibhajiṃcenu - ī prakāraṃ reṃḍavamāru vibhajiṃcagā vaccina okkokka (1/8) bhūtamuyokka enimidava aṃśamu migilina bhūtamula arthāṃśalō (1/2 tō) kalipenu - ī prakāramugā cēsina paṃcīkaraṇamainadi.ī prakāramu cēyagā okkokka sthūlabhūtamaṃdu sagamu (arthabhāgamu) dāni svaṃtamaina aṃśayē.migilina arthabhāgamu (1/2) migilini nālugu bhūtamulayokka aṣṭamāṃśa 1/8 kaligiyuṃḍunu.ī prakāramugā ayidu bhūtamulanu okadānitō nokaṭi kalipi sthūla bhūtamulu paṃcīkaraṇamucēyabaḍinavi. ī prakāramugā cēyagā prati sthūlabhūtamulōni sagamu (arthabhāgamu) dāni aṃśamē.migilina sagamu migilina nālugu bhūtamula aṃśalu kalisi ayinadi. udāharaṇaku - ākāśamulōni sagamu bhāgamu ākāśāṃśayē. migilina sagabhāgamulō vāyuvuyokka aṣṭamāṃśa (1/8), agniyokka aṣṭamāṃśa, jalamuyokka aṣṭamāṃśa, bhūmiyokka aṣṭamāṃśa kalisi yunnavi. ī prakāramugā migilina sthūlabhūtamulaguṟiṃci kūḍā ūhiṃcukonavalasinadi. ī viṣayamu kriṃdanu spaṣṭamu cēyabaḍinadi : - ākāśamu,vāyuvu, agni, jalamu, bhūmi mottamu
| sūkṣmabhūtamu | ākāśamu | vāyuv | u a | gni ja | lamu | bhūmi mottamu | |
|---|---|---|---|---|---|---|---|
| aṃśa | aṃśa | aṃśa | aṃśa | aṃśa | |||
| 1 | ākāśamu | 1/2 | 1/8 | 1/8 | 1/8 | 1/8 | 1 |
| 2 | vāyuvu | 1/8 | 1/2 | 1/8 | 1/8 | 1/8 | 1 |
| 3 | agni | 1/8 | 1/8 | 1/2 | 1/8 | 1/8 | 1 |
| 4 | jalamu | 1/8 | 1/8 | 1/8 | 1/2 | 1/8 | 1 |
| 5 | bhūmi | 1/8 | 1/8 | 1/8 | 1/8 | 1/2 | 1 |
iṭlu okkokka bhūtamunu ayidu bhāgamulugā cēsi okadāni bhāgamulanu migilina bhūtamulabhāgamulatō kalupuṭacēta paṃcīkaraṇamani ceppabaḍinadi. paṃcabhūtamulu iṭlu kalisiyē yunnanuē bhūtamuyokka aṃśa heccugānuṃḍunō adi ā bhūtamu pērutō ceppabaḍucunnadi. iṭlusūkṣma paṃcabhūtamulu okadānitō migilinavi kaliyuṭavalana avi sthūlabhūtamulai iṃdriyamulaku gōcaramagucunnavi. ī sthūlabhūtamulē jagattulōni samasta vastuvulugā mārinavi. kanukaī jagattu aṃtayu paṃcabhūtamayamu - pāṃca bhautikamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.