(ఇతరులకు ఉపాకారము చేయుట పుణ్యము, ఇతరులను బాధ పెట్టుట పాపము).
నహ్యా నాశస్య ధూమేన దృశ్యమానోపి సంగతిః ||“. (అష్టావక్రగీత - 4 - 3)
(ఆకాశము ధూళితో కప్పబడియున్నప్పటికి ధూళి దానినంటదు - అట్లే బ్రహ్మజ్ఞాని అయినవానికి పాపపుణ్యములు అంటవు).
మామనాధృత్య యత్పుణ్యమపి పాపాయ కల్పతే ||“.
(నా గుఱించి (భగవంతుని గుఱించి) చేసినది పాపమైనను పుణ్యమే యగును. నా కొఱకు గానిది పుణ్యమైనను పాపమే యగును).
ఉభా భ్యామేవ మనుష్య లోకం” ఇతి శ్రుతిః.
(పుణ్యము చేసిన పుణ్యలోకమును పొందును, పాపముచేసిన పాపలోకమును పొందును - పాపపుణ్యములు రెండును పొందిన మానవలోకమును పొందును).
ఉభాభ్యాం పుణ్యపాపా భ్యాం మానుష్యం లభతే(అ)వశః ||“. (నైష్కర్మ్యసిద్ధి)
(పుణ్యకర్మలు చేసిన దేవత్వమును పొందును, నిషిద్ధకర్మలను చేసిన నరకమును - పుణ్యపాపములు రెండును చేసిన అవశుడై మానుష జన్మను పొందును).
తస్మాత్ ధర్మం సుఖార్థాయ కుర్యాత్, పాపం విసర్జయేత్ ||“.
(పుణ్యకర్మచే రాజ్యము, ధనము, సుఖము, కలుగును. పాపము చేసిన దుఃఖమే కలుగును - అందుచేత సుఖము పొందుటకొఱకు పుణ్యము చేయవలయును, పాపము - పాపకర్మను విసర్జించవలెను).
నపాపఫలమిచ్ఛంతి పాపం కుర్బంతి యత్నతం ||“.
(మానవులు పుణ్యకర్మ చేయుటకోరరు, కాని పుణ్యకర్మఫలమును కోరుదురు - పాపకర్మవలన కలుగు ఫలమును కోరరు, కాని పాపము మట్టుకు చేయుదురు).
“ప్రాణులకు పుణ్యపాపంబులను భావ్యంబులు గాని యూరకపోనేరవు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా.-)
“చేసినగాని పాపములు సెందవు, చేయిదలంచినంతటన్
జేసెదనన్న మాత్రమున జెందుగదా గలివేళ బుణ్యముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 405)
మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యాను బంధంబులై
చను సౌఖ్యంబుల బొందు పద్మజుని యాజ్ఞ్యం ద్రోవగా నేటికిన్“.
వ. అని వేగంబునద్రొబ్బించిన నేను బుడమిం బడునపుడ యీ నికృష్టంబయిన యూసరవెల్లి రూపంబు గైకొంటి నింతకాలంబు తద్దోషనిమిత్తత్వంబున ని ద్దురవస్థం బొందవలసె. బ్రాణులకుబుణ్యపాపంబులను భావ్యంబులుగాని యూరకపోనేరవు. నేడు సమస్త దురిత నిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోర దుర్దశలం బాసి నిర్మలాత్మకుండనైతి’.
(శ్రీమదాంధ్రమహాభాగతవము - 10 - ఉ.భా. - 475, 476)
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతువః (శ్రీమద్భగవద్గీత - 5 - 15)
“నను శ్రుతౌ, స్మృతౌ కర్తా ప్రసిద్దో జీవ ఏవహి |
ఈశః కారయితా సిద్ధనః ద్విరుద్ధమహోచ్యతే |
మాయా (అ)విద్యా భిథా శక్తిః స్వభావా ఖ్యా ప్రవర్తతే |
యమిచ్ఛతి న ఉన్నేతుం పుణ్యం తం కారయిత్వ జః |
యమిచ్చతి త్వధోనేతుం పాపం తం కారయత్యసౌ |
అజ్ఞో జంతుర నీశో యమాత్మనః సుఖ దుఃఖ యోః |
ఈశ్వర ప్రేరితో గచ్ఛేత్స్బర్గం వా శ్వభ్రమేవవా |
ఇతి శ్రుతి స్మృతిఖ్యాం చ నిర్ణీతే నా ధ్వనాయతః |
కర్తృత్వ ప్రేరకత్వాభ్యా మాత్మనో రీశ జీవయోః |
భోక్తృత్వ భోజయితృ త్వాభ్యాం లేప స సంభవాత్ |
మైవం వస్తుత ఆత్మాయం విభుత్వాత్పరమేశ్వరః |
జీవస్య కస్య చిత్పాపం నాదత్తే సుకృతం తథా |
వస్తుతో నాస్తి కర్తృత్వం జీవస్యా సంగినో విభోః |
కారయితృత్వమవ్యేవం నేశ్వరస్యాస్తి వస్తుతః ||“. (గీతాభావప్రకాశము - 5 - 118 to 125)
(శ్రుతిలోను స్మృతులలోను కర్త జీవుడని, కారయిత (చేయించువాడు) ఈశ్వరుడని చెప్ప బడినది. కాని శ్రీమద్భగవద్గీతలో (అధ్యాయము - 5 - 15). దీనికి విరుద్ధముగా చెప్ప బడినది. మాయ, అవిద్య యను పేరుగల స్వభావమే యీ విషయమున పని చేయుచున్నది - కారణమై యున్నది - ఈశ్వరుడు ఎవనిని ఉద్ధరింప దలచునో వానిని పుణ్యముచేయు వానినిగా చేయును - ఎవనిని అధోగతికి పడద్రోయ నెంచునో వానిచే పాపములు చేయించును - జీవుడు (జంతువు - ప్రాణి) అజ్ఞుడు - జ్ఞానము లేనివాడు. తన యొక్క సుఖదుఃఖముల యడల స్వతంత్రము లేనివాడు, ఈశ్వరునిచేత ప్రేరేపింపబడి సుఖ దుఃఖములకు కారణమైన పనులను చేయుచు, స్వర్గమునకుగాని, నరకమునకుగాని పోవును - అని ఈ ప్రకారము శ్రుతి స్మృతులు చెప్పుచున్నవి. ఈ యభిప్రాయము సరియైనదికాదు - పరమార్థదృష్టితో చూడగా ఈశ్వరుడు జీవునికి ఏ విధమైన పాపమును పుణ్యమును కలిగించడు - అనగా, పాపపుణ్యములను చేయించడు. ఆ ప్రకారముగానే అసంగుడు, విభుడు అయిన జీవునకు కర్తృత్వము లేదు, ఈశ్వరునకు కారయితృత్వము లేదు).
“కృతో యః ప్రయత్నో జీవస్య ధర్మాధర్మ లక్ష్మణస్తదపేక్ష ఏవైన మీశ్వరః కారయతి. తతశ్చేతే చోదితా దోషాః న ప్రసజ్యంతే. జీవకృత ధర్మాధర్మ వైషమ్యాపేక్ష ఏవ తత్తత్ఫలాని విషమం విభజేత్. పర్జన్యవదీశ్వరో నిమిత్తత్వమాత్రేణ - యదాలోకే నానావిధానాం గుచ్ఛ గుల్మాదీనాం వ్రీహియవాదీనాం చాసాదారణేభ్య స్స్వస్వ బీజేభ్యో జాయ మానానాం సాధారణం నిమిత్తం భవతి పర్జన్యః సహ్య సతి పర్జన్యే రస పుష్ప ఫలపలాశాది వైషమ్యం తేషాం జాయతే, నాప్య సత్సు స్వస్వబీజేషు ఏవం జీవకృత ప్రయత్నాపేక్షః ఈశ్వరస్తేషాం శుభాశుభం విదధ్యాదితి శ్లిష్యతే ||”. (శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 3 - 42)
(జీవుడు ధర్మాధర్మలక్షణమైన యే ప్రయత్నముచేయునో దానిని అనిసరించియే భగవంతుడు అతనికి పాపపుణ్య ఫలములనందించును. జీవుడు చేసిన ధర్మాధర్మముల వైషమ్యమును (తారతమ్యమును) బట్టియే ఆ ఫలములు కూడా సుఖదుఃఖములలో తారతమ్యము కలిగియుండును. భగవంతుడు నిమిత్త మాత్రుడే. లోకములో అనేక విధములైన లతలు మొదలగునవి, వ్రీహి యవ ధాన్యములు మొదలగునవి వాటి వాటి అసాధారణ గుణములు - ఒక్కొక్కదానికి ఒక్కొక్క వేఱు వేఱు గుణము - కలిగియున్న బీజములవలన పుట్టుచుండగా మేఘము (వర్షము) కురిసినందువలన అవి పుట్టినట్లుగ పడుటవలన వర్షము నిమిత్త మాత్రమే యగును. వర్షము అన్ని బీజములకు ఒకే విధముగా పని చేసినను, బీజముల తారతమ్యమునుబట్టి ఆయా లతలు మొదలగునవి, రస పుష్ప ఫలములను వేఱు వేఱుగా నిచ్చుచున్నవి).
(itarulaku upākāramu cēyuṭa puṇyamu, itarulanu bādha peṭṭuṭa pāpamu).
nahyā nāśasya dhūmēna dṛśyamānōpi saṃgatiḥ ||“. (aṣṭāvakragīta - 4 - 3)
(ākāśamu dhūḷitō kappabaḍiyunnappaṭiki dhūḷi dāninaṃṭadu - aṭlē brahmajñāni ayinavāniki pāpapuṇyamulu aṃṭavu).
māmanādhṛtya yatpuṇyamapi pāpāya kalpatē ||“.
(nā guṟiṃci (bhagavaṃtuni guṟiṃci) cēsinadi pāpamainanu puṇyamē yagunu. nā koṟaku gānidi puṇyamainanu pāpamē yagunu).
ubhā bhyāmēva manuṣya lōkaṃ” iti śrutiḥ.
(puṇyamu cēsina puṇyalōkamunu poṃdunu, pāpamucēsina pāpalōkamunu poṃdunu - pāpapuṇyamulu reṃḍunu poṃdina mānavalōkamunu poṃdunu).
ubhābhyāṃ puṇyapāpā bhyāṃ mānuṣyaṃ labhatē(a)vaśaḥ ||“. (naiṣkarmyasiddhi)
(puṇyakarmalu cēsina dēvatvamunu poṃdunu, niṣiddhakarmalanu cēsina narakamunu - puṇyapāpamulu reṃḍunu cēsina avaśuḍai mānuṣa janmanu poṃdunu).
tasmāt dharmaṃ sukhārthāya kuryāt, pāpaṃ visarjayēt ||“.
(puṇyakarmacē rājyamu, dhanamu, sukhamu, kalugunu. pāpamu cēsina duḥkhamē kalugunu - aṃducēta sukhamu poṃduṭakoṟaku puṇyamu cēyavalayunu, pāpamu - pāpakarmanu visarjiṃcavalenu).
napāpaphalamicchaṃti pāpaṃ kurbaṃti yatnataṃ ||“.
(mānavulu puṇyakarma cēyuṭakōraru, kāni puṇyakarmaphalamunu kōruduru - pāpakarmavalana kalugu phalamunu kōraru, kāni pāpamu maṭṭuku cēyuduru).
“prāṇulaku puṇyapāpaṃbulanu bhāvyaṃbulu gāni yūrakapōnēravu” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā.-)
“cēsinagāni pāpamulu seṃdavu, cēyidalaṃcinaṃtaṭan
jēsedananna mātramuna jeṃdugadā galivēḷa buṇyamul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 405)
munu duṣkarmaphalaṃbu noṃdi pidapaṃ buṇyānu baṃdhaṃbulai
canu saukhyaṃbula boṃdu padmajuni yājñyaṃ drōvagā nēṭikin”.
va. ani vēgaṃbunadrobbiṃcina nēnu buḍamiṃ baḍunapuḍa yī nikṛṣṭaṃbayina yūsaravelli rūpaṃbu gaikoṃṭi niṃtakālaṃbu taddōṣanimittatvaṃbuna ni dduravasthaṃ boṃdavalase. brāṇulakubuṇyapāpaṃbulanu bhāvyaṃbulugāni yūrakapōnēravu. nēḍu samasta durita nistārakaṃbayina bhavadīya pādāraviṃda saṃdarśanaṃbunaṃ jēsi yī ghōra durdaśalaṃ bāsi nirmalātmakuṃḍanaiti’.
(śrīmadāṃdhramahābhāgatavamu - 10 - u.bhā. - 475, 476)
ajñānēnāvṛtaṃ jñānaṃ tēna muhyaṃti jaṃtuvaḥ (śrīmadbhagavadgīta - 5 - 15)
“nanu śrutau, smṛtau kartā prasiddō jīva ēvahi |
īśaḥ kārayitā siddhanaḥ dviruddhamahōcyatē |
māyā (a)vidyā bhithā śaktiḥ svabhāvā khyā pravartatē |
yamicchati na unnētuṃ puṇyaṃ taṃ kārayitva jaḥ |
yamiccati tvadhōnētuṃ pāpaṃ taṃ kārayatyasau |
ajñō jaṃtura nīśō yamātmanaḥ sukha duḥkha yōḥ |
īśvara prēritō gacchētsbargaṃ vā śvabhramēvavā |
iti śruti smṛtikhyāṃ ca nirṇītē nā dhvanāyataḥ |
kartṛtva prērakatvābhyā mātmanō rīśa jīvayōḥ |
bhōktṛtva bhōjayitṛ tvābhyāṃ lēpa sa saṃbhavāt |
maivaṃ vastuta ātmāyaṃ vibhutvātparamēśvaraḥ |
jīvasya kasya citpāpaṃ nādattē sukṛtaṃ tathā |
vastutō nāsti kartṛtvaṃ jīvasyā saṃginō vibhōḥ |
kārayitṛtvamavyēvaṃ nēśvarasyāsti vastutaḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 118 to 125)
(śrutilōnu smṛtulalōnu karta jīvuḍani, kārayita (cēyiṃcuvāḍu) īśvaruḍani ceppa baḍinadi. kāni śrīmadbhagavadgītalō (adhyāyamu - 5 - 15). dīniki viruddhamugā ceppa baḍinadi. māya, avidya yanu pērugala svabhāvamē yī viṣayamuna pani cēyucunnadi - kāraṇamai yunnadi - īśvaruḍu evanini uddhariṃpa dalacunō vānini puṇyamucēyu vāninigā cēyunu - evanini adhōgatiki paḍadrōya neṃcunō vānicē pāpamulu cēyiṃcunu - jīvuḍu (jaṃtuvu - prāṇi) ajñuḍu - jñānamu lēnivāḍu. tana yokka sukhaduḥkhamula yaḍala svataṃtramu lēnivāḍu, īśvarunicēta prērēpiṃpabaḍi sukha duḥkhamulaku kāraṇamaina panulanu cēyucu, svargamunakugāni, narakamunakugāni pōvunu - ani ī prakāramu śruti smṛtulu ceppucunnavi. ī yabhiprāyamu sariyainadikādu - paramārthadṛṣṭitō cūḍagā īśvaruḍu jīvuniki ē vidhamaina pāpamunu puṇyamunu kaligiṃcaḍu - anagā, pāpapuṇyamulanu cēyiṃcaḍu. ā prakāramugānē asaṃguḍu, vibhuḍu ayina jīvunaku kartṛtvamu lēdu, īśvarunaku kārayitṛtvamu lēdu).
“kṛtō yaḥ prayatnō jīvasya dharmādharma lakṣmaṇastadapēkṣa ēvaina mīśvaraḥ kārayati. tataścētē cōditā dōṣāḥ na prasajyaṃtē. jīvakṛta dharmādharma vaiṣamyāpēkṣa ēva tattatphalāni viṣamaṃ vibhajēt. parjanyavadīśvarō nimittatvamātrēṇa - yadālōkē nānāvidhānāṃ guccha gulmādīnāṃ vrīhiyavādīnāṃ cāsādāraṇēbhya ssvasva bījēbhyō jāya mānānāṃ sādhāraṇaṃ nimittaṃ bhavati parjanyaḥ sahya sati parjanyē rasa puṣpa phalapalāśādi vaiṣamyaṃ tēṣāṃ jāyatē, nāpya satsu svasvabījēṣu ēvaṃ jīvakṛta prayatnāpēkṣaḥ īśvarastēṣāṃ śubhāśubhaṃ vidadhyāditi śliṣyatē ||”. (śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 3 - 42)
(jīvuḍu dharmādharmalakṣaṇamaina yē prayatnamucēyunō dānini anisariṃciyē bhagavaṃtuḍu ataniki pāpapuṇya phalamulanaṃdiṃcunu. jīvuḍu cēsina dharmādharmamula vaiṣamyamunu (tāratamyamunu) baṭṭiyē ā phalamulu kūḍā sukhaduḥkhamulalō tāratamyamu kaligiyuṃḍunu. bhagavaṃtuḍu nimitta mātruḍē. lōkamulō anēka vidhamulaina latalu modalagunavi, vrīhi yava dhānyamulu modalagunavi vāṭi vāṭi asādhāraṇa guṇamulu - okkokkadāniki okkokka vēṟu vēṟu guṇamu - kaligiyunna bījamulavalana puṭṭucuṃḍagā mēghamu (varṣamu) kurisinaṃduvalana avi puṭṭinaṭluga paḍuṭavalana varṣamu nimitta mātramē yagunu. varṣamu anni bījamulaku okē vidhamugā pani cēsinanu, bījamula tāratamyamunubaṭṭi āyā latalu modalagunavi, rasa puṣpa phalamulanu vēṟu vēṟugā niccucunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.