← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరబ్రహ్మ parabrahma

Original — తెలుగు
  1. “వ. ఉత్పత్తి స్థితి లయంబు లెందణంగుచు బ్రకాశింపబడునది యాశ్రయంబనంబడు. అదియ పర మాత్మ - బ్రహ్మ శబ్దవాచ్యంబు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

  1. “వ. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులయిన ఘటపటాదులందు బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులయిన సర్వకార్యములందు సత్వాది రూపంబులం బ్రవేశించి యుండుదు - - - సర్వ దేశంబుల యందును, సర్వకాలంబునందును నేది బోదితంబై యుండు నట్టిదియ పరబ్రహ్మ స్వరూపంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 253)

  2. “సీ. అరయంగ నేమిటి యందు నీ విశ్వంబు విదితమై యుండు, నీ విశ్వమందు

నేది ప్రకాశించు నెప్పుడు నట్టి స్వయం జ్యోతి నిత్యంబు నవ్యయంబు

నాకాశమును బోలి యవిరళ వ్యాపకమగు నాత్మ తత్వంబు నధిక మహిమ

నమరు పరబ్రహ్మ మగు - - - ”

ఆ. మరల మరల బెక్కుమారులీ విశ్వంబు

జననవృద్ధి విలయ సంగతులను

నంద జేయుచుండునట్టి యీశ్వరుడవై

తనరు నిన్ను నాత్మ తత్వముగను

వ. తెలియుదుము . (ఆ ఆత్మతత్వమే పరబ్రహ్మము). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 720, 721). (చూడుము - ‘బ్రహ్మ’)

  1. “నారాయణ పరబ్రహ్మ” (మంత్ర పుష్పము)

(నారాయణుడే పరబ్రహ్మ)

  1. చతుర్ముఖ బ్రహ్మ కన్న తండ్రి యగుటచేత అతని కంటె అతనికంటె ఉత్కృష్టమైన బ్రహ్మ - పరబ్రహ్మ -

  2. “మాయా గుణానుగతుడై

పాయక నానా విధ ప్రపంచం బితడే

చేయునని తోచు, నేమియు

జేయడ సంగుడ కర్త సిద్ధము వత్సా“. (శ్రీ సీతారామాంజనేయ సంవాదము - 1 - 83)

Transliteration
  1. “va. utpatti sthiti layaṃbu leṃdaṇaṃgucu brakāśiṃpabaḍunadi yāśrayaṃbanaṃbaḍu. adiya para mātma - brahma śabdavācyaṃbu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

  1. “va. ē prakāraṃbuna mahābhūtaṃbulu bhautikaṃbulayina ghaṭapaṭādulaṃdu bravēśiṃci yuṃḍu nā prakāraṃbuna nēnu nī bhūta bhautikaṃbulayina sarvakāryamulaṃdu satvādi rūpaṃbulaṃ bravēśiṃci yuṃḍudu - - - sarva dēśaṃbula yaṃdunu, sarvakālaṃbunaṃdunu nēdi bōditaṃbai yuṃḍu naṭṭidiya parabrahma svarūpaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 253)

  2. “sī. arayaṃga nēmiṭi yaṃdu nī viśvaṃbu viditamai yuṃḍu, nī viśvamaṃdu

nēdi prakāśiṃcu neppuḍu naṭṭi svayaṃ jyōti nityaṃbu navyayaṃbu

nākāśamunu bōli yaviraḷa vyāpakamagu nātma tatvaṃbu nadhika mahima

namaru parabrahma magu - - - ”

ā. marala marala bekkumārulī viśvaṃbu

jananavṛddhi vilaya saṃgatulanu

naṃda jēyucuṃḍunaṭṭi yīśvaruḍavai

tanaru ninnu nātma tatvamuganu

va. teliyudumu . (ā ātmatatvamē parabrahmamu). (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 720, 721). (cūḍumu - ‘brahma’)

  1. “nārāyaṇa parabrahma” (maṃtra puṣpamu)

(nārāyaṇuḍē parabrahma)

  1. caturmukha brahma kanna taṃḍri yaguṭacēta atani kaṃṭe atanikaṃṭe utkṛṣṭamaina brahma - parabrahma -

  2. “māyā guṇānugatuḍai

pāyaka nānā vidha prapaṃcaṃ bitaḍē

cēyunani tōcu, nēmiyu

jēyaḍa saṃguḍa karta siddhamu vatsā”. (śrī sītārāmāṃjanēya saṃvādamu - 1 - 83)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.