← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరధర్మః paradharmaḥ

Original — తెలుగు
  1. ప్రకృతి సంసృష్టేన పురుషేణ ఇంద్రియ వ్యాపార రూపః కర్మ యోగాత్మకో ధర్మః స్వధర్మః,తస్మాత్ పరః ధర్మః - ఇంద్రియ జయ నిపుణ పురుష ధర్మః, జ్ఞాన యోగః సకలేంద్రియ నియమన రూపతయా న ప్రమాదః

(ప్రకృతివలన కలిగిన శరీరము గల పురుషునిచే ఇంద్రియములతో చేయబడు కర్మయోగమునకు చెందిన కర్మలన్నియు స్వధర్మము, ఇవి కానివి పరధర్మము - ఇంద్రియ జయమును సంపాదించు నిపుణుడైన పురుషుని ధర్మము జ్ఞానయోగమునకు సంబంధించినది. పరధర్మము - ప్రమాదముతో కూడినది. ఇంద్రియ జయము సంపా దించుటకు చేయు ప్రయత్నములో అవకతవకలున్న యడల దాని వలన ప్రమాదము సంభవించును - కనుక యోగులు కానివారికి పరధర్మము భయావహము).

  1. ఇతరుల ధర్మము, దృశ్య సంబంధమైన ధర్మము - శబ్దాది విషయములవలన కలుగు సౌఖ్యము.

  2. “శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 35)

“పరధర్మస్తు లోకానామిహా కీర్తి కరో యతః |

పరత్రానర్థదోషో నరకాది ప్రదానతః |

తస్మాద్రాగాది వదన్య ధర్మో హేయో ముముక్షుభిః ||“. (గీతాభావప్రకాశము - 3 - 230)

(శాస్త్రములో తనకు విహితముకాని ధర్మము పరధర్మము - ఈ పరధర్మము జనులకు ఈ లోకముమందు కీర్తిని చేకూర్చదు, ఘోరనరకము మొదలగువాటిని కూర్చునది కనుక పరలోకములో అనర్థకారణము. అందుచేత రాగము మొదలగువాటివలె మోక్షము కోరువారికిది హేయము - వారు పరధర్మమును అసహించు కొనవలెను, విడనాడవలెను).

  1. స్వధర్మమునకు విరుద్ధమైనదంతయు పరధర్మమే.
Transliteration
  1. prakṛti saṃsṛṣṭēna puruṣēṇa iṃdriya vyāpāra rūpaḥ karma yōgātmakō dharmaḥ svadharmaḥ,tasmāt paraḥ dharmaḥ - iṃdriya jaya nipuṇa puruṣa dharmaḥ, jñāna yōgaḥ sakalēṃdriya niyamana rūpatayā na pramādaḥ

(prakṛtivalana kaligina śarīramu gala puruṣunicē iṃdriyamulatō cēyabaḍu karmayōgamunaku ceṃdina karmalanniyu svadharmamu, ivi kānivi paradharmamu - iṃdriya jayamunu saṃpādiṃcu nipuṇuḍaina puruṣuni dharmamu jñānayōgamunaku saṃbaṃdhiṃcinadi. paradharmamu - pramādamutō kūḍinadi. iṃdriya jayamu saṃpā diṃcuṭaku cēyu prayatnamulō avakatavakalunna yaḍala dāni valana pramādamu saṃbhaviṃcunu - kanuka yōgulu kānivāriki paradharmamu bhayāvahamu).

  1. itarula dharmamu, dṛśya saṃbaṃdhamaina dharmamu - śabdādi viṣayamulavalana kalugu saukhyamu.

  2. “śrēyān svadharmō viguṇaḥ paradharmātsvanuṣṭitāt |

svadharmē nidhanaṃ śrēyaḥ paradharmō bhayāvahaḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 35)

“paradharmastu lōkānāmihā kīrti karō yataḥ |

paratrānarthadōṣō narakādi pradānataḥ |

tasmādrāgādi vadanya dharmō hēyō mumukṣubhiḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 230)

(śāstramulō tanaku vihitamukāni dharmamu paradharmamu - ī paradharmamu janulaku ī lōkamumaṃdu kīrtini cēkūrcadu, ghōranarakamu modalaguvāṭini kūrcunadi kanuka paralōkamulō anarthakāraṇamu. aṃducēta rāgamu modalaguvāṭivale mōkṣamu kōruvārikidi hēyamu - vāru paradharmamunu asahiṃcu konavalenu, viḍanāḍavalenu).

  1. svadharmamunaku viruddhamainadaṃtayu paradharmamē.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.