← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరం ధామం paraṃ dhāmaṃ

Original — తెలుగు
  1. పరమం ప్రాప్యస్థానం. (శ్రేష్టమైన పొందతగిన స్థానము).

  2. పరమంపదం వైష్ణవం. (సర్వోత్తమమైన స్థానము - విష్ణువు యొక్క లోకము - వైకుంఠము).

  3. ధామ చైతన్యం - పరమం వైష్ణవపదం, మోక్షాఖ్యం -

(ఉత్కృష్టమైన వైష్ణవపదమగు మోక్షము - చైతన్యము).

  1. ధామశబ్దో జ్యోతిర్వచనః - పరంజ్యోతిః.

(దామమనగా జ్యోతిస్సు - సర్వోత్కృష్టమైన తేజస్సు - తేజోరూపము).

  1. “పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం పరమం భవాన్” (శ్రీమద్భగవద్గీత - 10 - 12)

(నీవే పరబ్రహ్మవు, పరంధామము, పవిత్రము, పరమము - నీవే).

  1. “అవిద్యాది వినిర్ముక్తం సచ్చిదానందమవ్యయం, యత్పరంధామ విష్ణ్వాఖ్యం తత్వమేవ పరమం పదం ||”.

(గీతాభావప్రకాశము - 11 - 158)

(అవిద్యా మొదలగునది లేనిది, సత్ చిత్, ఆనందము తానే అయినది, తనకంటె ఇతరవస్తువు లేనిది, విష్ణువు అను పేరుగల పరమపదము, పరమ ధామము నీవే).

  1. “పరాత్పరం బ్రహ్మ శాస్వతం ధ్రువమ వ్యయం |

నిత్యానందం నిర్వికల్పం తద్ధామ పరమం మమ ||“. (ఈశ్వర గీతాయాం)

(ఉత్కృష్టమైన చతుర్ముఖ బ్రహ్మ కన్న ఉత్కృష్టమైనదిన్నీ, నిత్యమైనదిన్నీ, చలనము లేనిదిదిన్నీ, క్షీణించనిదిన్నీ, మోక్షము అను ఆనందముతో కూడినదిన్నీ, నిర్వికల్పమైనదిన్నీ, అయిన స్థానమే పరమపదము - అదియే నా స్థానమైన పరంధామము).

  1. “అవ్యక్తో (అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం |

యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ||“. (శ్రీమద్భగవగీత - 8 - 21)

(సూక్ష్మాతి సూక్ష్మమగుటచేత అవ్యక్తమైనదిన్నీ, నాశము లేనేనటువంటిదిన్నీ, ప్రకృతికంటె (అవ్యక్తముకంటె) ఉత్కృష్టమైనదిన్నీ అయిన పరమాత్మయే పరమగతి. (అందఱు పొందవలసిన ఉత్కృష్టమైన స్థానము - అక్కడికి చేరినవారు తిరిగి రారు - తిరిగి జన్మించరు. అట్టి ఉత్కృష్టమైన స్థానమే పరంధామము - భగవంతుని స్థానము).

  1. బ్రహ్మ తత్వం, వాస్తవస్వరూపం.

(పరబ్రహ్మ యొక్క తత్వము - వాస్తవస్వరూపము - స్వస్వరూపము).

  1. సర్వోత్కృష్ట బ్రహ్మ యాథాత్మ్య స్వరూపం.

(అన్నింటికన్న ఉత్కృష్టమైన బ్రహ్మ యొక్క యాధాత్మ్యస్వరూపము - నిజరూపము).

  1. పరమం జ్యోతిః - మమ భగవతః అంశః ధామశబ్దః అత్ర ప్రాగ్వన్న నియమన స్థానపరః; అపితు, సూర్యాద్యపేక్ష ప్రతిక్షేపాత్ స్వరూపస్య ప్రకాశరూపత్వ సిద్ధేః జ్యోతిర్వాచీ “.

(ప్రకృష్టమైన జ్యోతిస్వరూపము - భగవంతుని అంశ - (తేజోంశ). ధామమనగా ఒక నియమితమైన స్థానము అని కాదు - సూర్యుడు మొదలగు ప్రకాశించు స్వరూపములు గల వాటివలెకాక తన స్వస్వరూపముచే ప్రకాశించునది కనుక జ్యోతి అని చెప్పబడినది).

  1. “పరం నియమస్థానం, అచిత్సం సర్గ వియుక్తం, స్వరూపేణావస్థితం, ముక్త స్వరూపం, - పరమం నియమనస్థాన మిత్యర్థః, తచ్చ అపునరావృత్తి రూపం. అధవా ప్రకాశవాచీ ధామశబ్దః - ప్రకాశశ్చ ఇహ జ్ఞానం అభిప్రేతం - ప్రకృతి సంస్పృష్టాత్ పరిచ్ఛిన్న జ్ఞానరూపతయా ముక్త స్వరూపం పరంధామ”. (శ్రీరామానుజః)

(ప్రకృష్టమైన ఒకానొక నియమితస్థానము, జడవస్తు సంపర్కము లేనిది - స్వస్వరూపములోనున్నది, ముక్త స్వరూపము, మోక్షమే అయిన రూపము గలది, తిరిగి జన్మ కలుగచేయని స్థానము - మరల పుట్ట నవసరములేని ఆత్మ స్థితి. లేక - ధామము అనగా ప్రకాశము, ప్రకాశము అనగా జ్ఞానము అని కూడ అర్థమగును - అందుచేత అంతులేని జ్ఞానమునకు స్థానమైనవాడు - భగవంతుడు).

  1. “నిర్మానమోహః జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |

ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖసంజ్ఞైర్గచ్ఛంత్యమూఢాః పరమవ్యయం తత్ |

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |

యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 5, 6)

(మానమోహములు లేనివారున్నూ, సంగదోషములేనివారున్నూ, ఆధ్యాత్మనిష్ఠ కలవారున్నూ, కోరికలు లేనివారున్నూ, నాశరహితమైన పధమును పొందుదురు - అక్కడ సూర్యకాంతిగాని, చంద్రకాంతిగాని, అగ్ని వెలుగుగానిప్రకా శించదు - అక్కడి ప్రకాశములో వీటికాంతి కనబడదు - పనిచేయదు - అచ్చటికి వెళ్ళినవారు తిరిగి జన్మించరు. అట్టి పరమధామము - ప్రకృష్టమైన స్థానము - నాది (భగవంతునిది) - భగవంతుడు ఉండు చోటు).

  1. ఉపాసనస్థానం; ఉపలబ్దిస్థానం -

(భక్తులు ఉపాసించవలసిన స్థానము. ఉపాసనవలన భగవంతుని పొందవలసిన స్థానము).

  1. “స్ఫురద్దివ్య వైమానికే శేషతల్పే పరంధామ మూర్తిం నిషణ్ణం నిషవే నిషవే ||”. (శ్రీరామకర్ణామృతం - 1 - 92)

(శేషతల్పమను ప్రకాశించుచున్న విమానమందు శయనించియున్న పరమధాముడు తానే అయిన శ్రీరామచంద్ర పరబ్రహ్మను సేవించెదను).

Transliteration
  1. paramaṃ prāpyasthānaṃ. (śrēṣṭamaina poṃdatagina sthānamu).

  2. paramaṃpadaṃ vaiṣṇavaṃ. (sarvōttamamaina sthānamu - viṣṇuvu yokka lōkamu - vaikuṃṭhamu).

  3. dhāma caitanyaṃ - paramaṃ vaiṣṇavapadaṃ, mōkṣākhyaṃ -

(utkṛṣṭamaina vaiṣṇavapadamagu mōkṣamu - caitanyamu).

  1. dhāmaśabdō jyōtirvacanaḥ - paraṃjyōtiḥ.

(dāmamanagā jyōtissu - sarvōtkṛṣṭamaina tējassu - tējōrūpamu).

  1. “paraṃ brahma, paraṃdhāma, pavitraṃ paramaṃ bhavān” (śrīmadbhagavadgīta - 10 - 12)

(nīvē parabrahmavu, paraṃdhāmamu, pavitramu, paramamu - nīvē).

  1. “avidyādi vinirmuktaṃ saccidānaṃdamavyayaṃ, yatparaṃdhāma viṣṇvākhyaṃ tatvamēva paramaṃ padaṃ ||”.

(gītābhāvaprakāśamu - 11 - 158)

(avidyā modalagunadi lēnidi, sat cit, ānaṃdamu tānē ayinadi, tanakaṃṭe itaravastuvu lēnidi, viṣṇuvu anu pērugala paramapadamu, parama dhāmamu nīvē).

  1. “parātparaṃ brahma śāsvataṃ dhruvama vyayaṃ |

nityānaṃdaṃ nirvikalpaṃ taddhāma paramaṃ mama ||“. (īśvara gītāyāṃ)

(utkṛṣṭamaina caturmukha brahma kanna utkṛṣṭamainadinnī, nityamainadinnī, calanamu lēnididinnī, kṣīṇiṃcanidinnī, mōkṣamu anu ānaṃdamutō kūḍinadinnī, nirvikalpamainadinnī, ayina sthānamē paramapadamu - adiyē nā sthānamaina paraṃdhāmamu).

  1. “avyaktō (a)kṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ |

yaṃ prāpya na nivartaṃtē taddhāma paramaṃ mama ||“. (śrīmadbhagavagīta - 8 - 21)

(sūkṣmāti sūkṣmamaguṭacēta avyaktamainadinnī, nāśamu lēnēnaṭuvaṃṭidinnī, prakṛtikaṃṭe (avyaktamukaṃṭe) utkṛṣṭamainadinnī ayina paramātmayē paramagati. (aṃdaṟu poṃdavalasina utkṛṣṭamaina sthānamu - akkaḍiki cērinavāru tirigi rāru - tirigi janmiṃcaru. aṭṭi utkṛṣṭamaina sthānamē paraṃdhāmamu - bhagavaṃtuni sthānamu).

  1. brahma tatvaṃ, vāstavasvarūpaṃ.

(parabrahma yokka tatvamu - vāstavasvarūpamu - svasvarūpamu).

  1. sarvōtkṛṣṭa brahma yāthātmya svarūpaṃ.

(anniṃṭikanna utkṛṣṭamaina brahma yokka yādhātmyasvarūpamu - nijarūpamu).

  1. paramaṃ jyōtiḥ - mama bhagavataḥ aṃśaḥ dhāmaśabdaḥ atra prāgvanna niyamana sthānaparaḥ; apitu, sūryādyapēkṣa pratikṣēpāt svarūpasya prakāśarūpatva siddhēḥ jyōtirvācī “.

(prakṛṣṭamaina jyōtisvarūpamu - bhagavaṃtuni aṃśa - (tējōṃśa). dhāmamanagā oka niyamitamaina sthānamu ani kādu - sūryuḍu modalagu prakāśiṃcu svarūpamulu gala vāṭivalekāka tana svasvarūpamucē prakāśiṃcunadi kanuka jyōti ani ceppabaḍinadi).

  1. “paraṃ niyamasthānaṃ, acitsaṃ sarga viyuktaṃ, svarūpēṇāvasthitaṃ, mukta svarūpaṃ, - paramaṃ niyamanasthāna mityarthaḥ, tacca apunarāvṛtti rūpaṃ. adhavā prakāśavācī dhāmaśabdaḥ - prakāśaśca iha jñānaṃ abhiprētaṃ - prakṛti saṃspṛṣṭāt paricchinna jñānarūpatayā mukta svarūpaṃ paraṃdhāma”. (śrīrāmānujaḥ)

(prakṛṣṭamaina okānoka niyamitasthānamu, jaḍavastu saṃparkamu lēnidi - svasvarūpamulōnunnadi, mukta svarūpamu, mōkṣamē ayina rūpamu galadi, tirigi janma kalugacēyani sthānamu - marala puṭṭa navasaramulēni ātma sthiti. lēka - dhāmamu anagā prakāśamu, prakāśamu anagā jñānamu ani kūḍa arthamagunu - aṃducēta aṃtulēni jñānamunaku sthānamainavāḍu - bhagavaṃtuḍu).

  1. “nirmānamōhaḥ jitasaṃgadōṣā adhyātmanityā vinivṛttakāmāḥ |

dvaṃdvairvimuktā sukha duḥkhasaṃjñairgacchaṃtyamūḍhāḥ paramavyayaṃ tat |

na tadbhāsayatē sūryō na śaśāṃkō na pāvakaḥ |

yadgatvā na nivartaṃtē taddhāma paramaṃ mama ||“. (śrīmadbhagavadgīta - 15 - 5, 6)

(mānamōhamulu lēnivārunnū, saṃgadōṣamulēnivārunnū, ādhyātmaniṣṭha kalavārunnū, kōrikalu lēnivārunnū, nāśarahitamaina padhamunu poṃduduru - akkaḍa sūryakāṃtigāni, caṃdrakāṃtigāni, agni velugugāniprakā śiṃcadu - akkaḍi prakāśamulō vīṭikāṃti kanabaḍadu - panicēyadu - accaṭiki veḷḷinavāru tirigi janmiṃcaru. aṭṭi paramadhāmamu - prakṛṣṭamaina sthānamu - nādi (bhagavaṃtunidi) - bhagavaṃtuḍu uṃḍu cōṭu).

  1. upāsanasthānaṃ; upalabdisthānaṃ -

(bhaktulu upāsiṃcavalasina sthānamu. upāsanavalana bhagavaṃtuni poṃdavalasina sthānamu).

  1. “sphuraddivya vaimānikē śēṣatalpē paraṃdhāma mūrtiṃ niṣaṇṇaṃ niṣavē niṣavē ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 92)

(śēṣatalpamanu prakāśiṃcucunna vimānamaṃdu śayaniṃciyunna paramadhāmuḍu tānē ayina śrīrāmacaṃdra parabrahmanu sēviṃcedanu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.