← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాం శాంతిం parāṃ śāṃtiṃ

Original — తెలుగు
  1. ” పరాం మోక్షాఖ్యాం శాంతి, ఉపరతిం “. (శ్రీశంకరః).

(మోక్షమను ఉత్కృష్టమైన శాంతి - ఉపరతి).

  1. “పరాం నిర్వాణం -” (శ్రీమాన్ రామానుజః)

(వాణము అనగా శరీరము - నిర్వాణము అనగా శరీరములేని - జననమరణములు, వాటి వలన కలుగు సుఖ దుఃఖములు లేని శాశ్వతమైన శాంతి - మోక్షము).

  1. “పరాం చరమాం శాంతిం అవిద్యా తత్కార్య నివృత్తి రూపాం ముక్తిం” (మధుసూదనీ వ్యాఖ్య)

(అన్నింటికంటె ఆఖరున కలుగు శాంతి, అవిద్యా, దాని కార్యములను నివృత్తి చేయునది - ముక్తి) (సంసారమునుండి విముక్తి చేయుముక్తి - మోక్షము).

  1. “ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే(అ)ర్జున తిష్టతి |

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మయయా |

త్వమేవ శరణం గచ్చ సర్వ భావేన భారత ||

తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 61, 62)

(ఈశ్వరుడు తన మాయచేత సమస్త భూత హృదయములందుండి, వాటిని యంత్రము మీదనున్న బొమ్మలు వలె భ్రమింపచేసి త్రిప్పుచుండును - అట్టి ఈశ్వరునే - భగవంతునే - అన్ని విధముల - అన్నీ అతనే యను భావముచేత, శరణము పొందుము - అతని ప్రసాదమువలన (కరుణవలన) సమస్త కర్మల ఫలమును శమింపచేయు స్థానమైన పరమశాంతి రూపమైన మోక్షమును పొందుదువు).

Transliteration
  1. ” parāṃ mōkṣākhyāṃ śāṃti, uparatiṃ “. (śrīśaṃkaraḥ).

(mōkṣamanu utkṛṣṭamaina śāṃti - uparati).

  1. “parāṃ nirvāṇaṃ -” (śrīmān rāmānujaḥ)

(vāṇamu anagā śarīramu - nirvāṇamu anagā śarīramulēni - jananamaraṇamulu, vāṭi valana kalugu sukha duḥkhamulu lēni śāśvatamaina śāṃti - mōkṣamu).

  1. “parāṃ caramāṃ śāṃtiṃ avidyā tatkārya nivṛtti rūpāṃ muktiṃ” (madhusūdanī vyākhya)

(anniṃṭikaṃṭe ākharuna kalugu śāṃti, avidyā, dāni kāryamulanu nivṛtti cēyunadi - mukti) (saṃsāramunuṃḍi vimukti cēyumukti - mōkṣamu).

  1. “īśvaraḥ sarvabhūtānāṃ hṛddēśē(a)rjuna tiṣṭati |

bhrāmayan sarvabhūtāni yaṃtrārūḍhāni mayayā |

tvamēva śaraṇaṃ gacca sarva bhāvēna bhārata ||

tatprasādātparāṃ śāṃtiṃ sthānaṃ prāpsyasi śāśvataṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 61, 62)

(īśvaruḍu tana māyacēta samasta bhūta hṛdayamulaṃduṃḍi, vāṭini yaṃtramu mīdanunna bommalu vale bhramiṃpacēsi trippucuṃḍunu - aṭṭi īśvarunē - bhagavaṃtunē - anni vidhamula - annī atanē yanu bhāvamucēta, śaraṇamu poṃdumu - atani prasādamuvalana (karuṇavalana) samasta karmala phalamunu śamiṃpacēyu sthānamaina paramaśāṃti rūpamaina mōkṣamunu poṃduduvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.