← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరం తపః paraṃ tapaḥ

Original — తెలుగు
  1. పరాన్ తాపయతీతి పరంతపః; పరం శత్రుం తాపయతీతి పరంతపః, శత్రుతాపనః.

(శత్రువులను తపింపచేయువాడు).

  1. పరమ జ్ఞానశత్రుం తాపయతి ఇతి పరంతపః - అజ్ఞానశత్రు దమనః.

(పరులను అనగా శత్రువులను తపింపచేయువాడు - అజ్ఞానమను శత్రువును తపింప చేయువాడు).

  1. “పరం కామక్రోధాది రూపం శతృగణం శౌర్యేణ, బలవతా వివేకేన తపసాచ భానురివ తాపయతీతి పరంతపః , శత్రు తాపననః”

(మధుసూదనీ వ్యాఖ్యా)

(కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను శత్రువులను జయించి వివేకముచేత వేడిమి చేత సూర్యుడువలె తపింపచేయువాడు, మాడ్చివేయువాడు - శత్రువులను తపింపచేయువాడు).

  1. ఆత్మనః విపక్షభూతాః పరాః ఇతి ఉచ్యంతే; తాన్ శౌర్యతేజోగభస్తిభిః భానురివ తాపయతి ఇతి పరంతపః - శత్రుతాపనః ఇత్యర్థః

(శ్రీశంకరః)

(ఆత్మకు ప్రతిపక్షములోనున్నవారు పరులు. వారిని, శౌర్యముచేత, తేజస్సుచేత, కిరణములచేత సూర్యుడు తపింప చేయునట్లు - మాడ్చివేయునట్లు - తపింపచేయువాడు (పీడించువాడు)).

  1. “క్రోధాది శత్రుసంఘం యః శౌర్యేణ సు వివేకతః |

తాప యత్యర్కవత్సత్వమధికారీ జితేంద్రియః |

స్వర్లోకే(అ)ప్యూర్వ శీత్యాదితయా సమ్యక్పరీక్షితః |

పరే విపక్ష భూతాం స్తాన్ శౌర్య తేజోగభస్తిభిః |

తాసయత్యర్క వద్వాయం ప్రోక్తస్త్వం హి పరంతప ||“. (గీత్రాభావప్రకాశము - 4 - 18 to 20)

(క్రోధము మొదలగునవి అరిషడ్వర్గము - అనగా ఆరుగురు శత్రువులు. సూర్యుడు తన వేడిమిచేత అన్నింటినీ తపింప చేయునట్లు ఈ ఆరుగురు శత్రువులను నీవు - ఇంద్రియములను జయించినవాడవుగాన, - తపింపచేయుము - స్వర్గములో నీవు నీ దగ్గరకు వచ్చిన ఊర్వశిని పరిత్యజించినవాడవు).

  1. ఉత్కృష్టమైన తపస్సు చేసినవాడవు.
Transliteration
  1. parān tāpayatīti paraṃtapaḥ; paraṃ śatruṃ tāpayatīti paraṃtapaḥ, śatrutāpanaḥ.

(śatruvulanu tapiṃpacēyuvāḍu).

  1. parama jñānaśatruṃ tāpayati iti paraṃtapaḥ - ajñānaśatru damanaḥ.

(parulanu anagā śatruvulanu tapiṃpacēyuvāḍu - ajñānamanu śatruvunu tapiṃpa cēyuvāḍu).

  1. “paraṃ kāmakrōdhādi rūpaṃ śatṛgaṇaṃ śauryēṇa, balavatā vivēkēna tapasāca bhānuriva tāpayatīti paraṃtapaḥ , śatru tāpananaḥ”

(madhusūdanī vyākhyā)

(kāmamu, krōdhamu, lōbhamu, mōhamu, madamu, mātsaryamu anu śatruvulanu jayiṃci vivēkamucēta vēḍimi cēta sūryuḍuvale tapiṃpacēyuvāḍu, māḍcivēyuvāḍu - śatruvulanu tapiṃpacēyuvāḍu).

  1. ātmanaḥ vipakṣabhūtāḥ parāḥ iti ucyaṃtē; tān śauryatējōgabhastibhiḥ bhānuriva tāpayati iti paraṃtapaḥ - śatrutāpanaḥ ityarthaḥ

(śrīśaṃkaraḥ)

(ātmaku pratipakṣamulōnunnavāru parulu. vārini, śauryamucēta, tējassucēta, kiraṇamulacēta sūryuḍu tapiṃpa cēyunaṭlu - māḍcivēyunaṭlu - tapiṃpacēyuvāḍu (pīḍiṃcuvāḍu)).

  1. “krōdhādi śatrusaṃghaṃ yaḥ śauryēṇa su vivēkataḥ |

tāpa yatyarkavatsatvamadhikārī jitēṃdriyaḥ |

svarlōkē(a)pyūrva śītyāditayā samyakparīkṣitaḥ |

parē vipakṣa bhūtāṃ stān śaurya tējōgabhastibhiḥ |

tāsayatyarka vadvāyaṃ prōktastvaṃ hi paraṃtapa ||“. (gītrābhāvaprakāśamu - 4 - 18 to 20)

(krōdhamu modalagunavi ariṣaḍvargamu - anagā āruguru śatruvulu. sūryuḍu tana vēḍimicēta anniṃṭinī tapiṃpa cēyunaṭlu ī āruguru śatruvulanu nīvu - iṃdriyamulanu jayiṃcinavāḍavugāna, - tapiṃpacēyumu - svargamulō nīvu nī daggaraku vaccina ūrvaśini parityajiṃcinavāḍavu).

  1. utkṛṣṭamaina tapassu cēsinavāḍavu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.