← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ బ్రహ్మ parama brahma

Original — తెలుగు
  1. “యస్మాచ్చ బృహతి బృంహయతి చ సర్వం తస్మా దుచ్యతే పరం బ్రహ్మేతి”. (శాండిల్యోపనిషత్)

(వృద్ధిపొందువాడు - సృష్టికిముందు తానొక్కడే యుండి - (ఆత్మవా అరే, ఇదమగ్ర అసీత్), తానే ఈ జగత్తు అంతటిగాను - జగత్తులోని అన్ని వస్తువులుగాను మారెను. సృష్టించిన ప్రతి వస్తువులో తాను ప్రవేశించి దానిని పెరుగునట్లు చేసెను) - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్”.

  1. “పరమం ఉత్కృష్టం బ్రహ్మ, దేశకాల వస్తు కృత పరిచ్ఛేద శూన్యం, అత ఏవ సర్వ ప్రత్యగాత్మ రూపం యదజ్ఞాతం సత్ సకల జగద్రూపేణ వివర్తతే, యచ్చ సర్వ వేదాంత ప్రతిపాద్యం యజ్జ్ఞానాత్ సకల సంసార బీజ నివృత్తిః, యచ్చ సర్వైర్ముముక్షుభిః ఆత్మత్వేన సేవ్యం తత్ పరం బ్రహ్మ ఇత్యర్థః.”

(పరమ బ్రహ్మ అనగా ఉత్కృష్టమైన బ్రహ్మ. దేశము, కాలము, వస్తువు అను మూడింటివలన కలుగు పరిమితి (త్రివిధ పరిచ్చేదము) లేనివాడు. అందువలననే అన్నింటిలోనూ ప్రత్యగాత్మ రూపములో నున్నవాడు. ఎవరికిని తెలియకుండ గనే ప్రపంచమంతయు తన రూపముగా నున్నవాడు - ప్రపంచరూపముగా నున్నవాడు - విశ్వుడు. ఉపనిషత్తు లన్నింటిలోను ప్రతిపాదింపబడినవాడు. అట్టివానిని వేదాంతము ద్వారా తెలుసుకొనగలిగిన వారికి సంసారము - ప్రవాహరూపములోనుండు జనన మరణములు - మొదలంట నశించును. మోక్షమును కఓరు సమస్తమైన వారిచేత ఆత్మయని సేవించతగినవాడు - ఇట్టి లక్షణములు గలవాడు పరబ్రహ్మ (పరమ బ్రహ్మ).

  1. “స్వాతిరిక్త అవిద్యాపద తత్కార్య జాతం యత్ర పర్యవస్యతి - అపహ్నవం భజతి - తత్పరమం, తన్మాత్రయా ఉపబృంహణాత్ బ్రహ్మ నిష్ప్రతియోగిక సన్మాత్రం.”

(పరమాత్మకంటె వేరైన అవిద్య, దానికార్యము అయినదంతయు దేనియందు పర్యవసానము పొందునో, అపహ్నవమగునో, అది ‘పరము’ అని చెప్పబడును; సత్తా మాత్రుడై తానే ప్రపంచమంతయు అగునట్లు వృద్ధి పొందినవాడు).

  1. “అహేయ మక్షరం శుద్ధ మసంభూతిం నిరంజనం |

విష్ణ్వాఖ్యం పరమం బ్రహ్మ, తద్వై పశ్యంతి సూరయః ||“. (విష్ణు ధర్మే)

(హేయోపా దేయములు లేనటువంటిన్నీ ప్రకృతి గుణములయిన సత్వరజస్తమములతో కలియకుండుటచేత పరిశుద్ధమైనటువంటిన్నీ, నిరంజనమై విష్ణువు అని పేరు కలదియే పరమ బ్రహ్మ. దానిని సూరి జనులు చూచు చుందురు).

  1. “పరం ఉత్కృష్టం సత్యజ్ఞానానందాది వాక్యైః ప్రతిపాద్యం బ్రహ్మ”.

(పరము అనగా ఉత్కృష్టమైనది. సత్యము, జ్ఞానము, ఆనందము అను మొదలగు వాక్యములచేత ప్రతి పాదించబడినది బ్రహ్మ - ఈ రెండును కలిసి పరమ బ్రహ్మ).

  1. “శివ ఏవ పరం బ్రహ్మ కారణం జగతో(అ)వ్యయం |

తతో విష్ణుస్తతస్త్వంచ బ్రహ్మన్ సర్వమ భూత్ జగత్ ||“. (బ్రహ్మాండపురాణం)

(జగత్తు అంతటికీ కారణమై అవ్యయుడైన శివుడే పరమ బ్రహ్మ - అతని నుండియే నువ్వు (చతుర్ముఖ బ్రహ్మ), విష్ణువు జగత్తు అంతయు కలిగినది.

  1. “నారాయణశ్శివో విష్ణుః విష్ణుః శంకరః పురుషోత్తమః |

ఏ తేషు నామభిర్బ్రహ్మ పరం ప్రోక్తం సనాతనం ||“.

(నారాయణుడు, శివుడు, విష్ణువు, శంకరుడు, పురుషోత్తముడు అను నీ పేర్లతో ఆ పరబ్రహ్మయే చెప్పబడుచున్నాడు).

  1. “క. పరమబ్రహ్మమనంగా

బరతత్వమునంగ బరమపదమనగ, నీ

శ్వరుడన గృష్ణుండన, జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51 - )

  1. “ఏకాక్షరం పరం బ్రహ్మ” .

(‘ఓం’ అను ఒకే అక్షరము పరబ్రహ్మము - అని ఉపాసించవలెను).

  1. యత్రా విద్యాకృతనామ రూపాది విశేష ప్రతిషేదేన అస్థూలాది శబ్దైర్బ్రహ్మోప దిశ్యతే తత్పరం; తదేవ యత్ర నామరూప విశేషాణాం కేన చిద్విశిష్ట ముపాసనయోపదిశ్యతే - “మనో మయః ప్రాణ శరీరోభా రూపః”. ఇత్యాది శబ్దైస్తదపరం

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 4 - 3 - 14)

(అవిద్య చేత కల్పించబడిన నామరూపములు మొదలగు విశేషములు లేనిదియని - ‘అస్థూలము’ మొదలగు పదములచే చెప్పబడినది పరబ్రహ్మ - అది యే నామరూపములు మొదలగు విశేషములు గలది యని చెప్పబడినదో - మనోమయము, ప్రాణశరీరము, ప్రకాశరూపము అని చెప్పబడినదో అది అపర బ్రహ్మ).

  1. “సర్వదేశంబులయందును, సర్వకాలంబునందును నేది చోదితంబైయుండు నట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 253)

  1. ” - - - అట్టి విశ్వంబై తోచు హిరణ్యగర్భాదులకంటె నన్యంబు, పరాఖ్యంబు - ఇది ముక్త రూపంబరూపంబై యుండు - - - తదాకారంబు తేట పఱచెద - - - పూర్వోక్త దేహాది రహితంబై, తద్భేదరాహిత్యంబున నిట్టి దట్టిదని విచారించుటకు గోచరంబుకాక యపక్షయాది రహితంబును, సచ్చబ్ద వాచ్యంబును నాత్మ సంవేద్యంబును నై జ్ఞానైక నిరూపణీయంబగుచు జ్ఞానశబ్ద వాచ్యంబును దానయై బ్రహ్మాత్మకంబగుట బ్రహ్మ సంజ్ఞయుం గావించి యొప్పు, మఱి భావనా త్రయాత్మక విశ్వ వైలక్షణ్యంబె లక్షణంబుగా గల ఈ రూపంబు అభ్యస్యమాన యోగుండగు యోగికిం చింతింప నశక్యంబు “.

  2. “ఇహ యద్యపి యం కమపి పురుషార్థ మర్థయమానాః శుద్ధ బుద్ధ స్వభావః ఇత్యౌ పనిషదాః; అవిద్యా సిద్ధః ఇతి కాపిలాః; క్లేశకర్మ వివాకాశయై రపరామృష్టో నిర్మాణ కాయ మధిష్ఠాయ సంప్రదాయ ప్రవర్తకో అనుగ్రహశ్చేతి పాతంజలాః; లోక వేద విరుద్ధైరపి నిర్లేపః స్వతంత్రశ్చేతి మహా పాశుపతాః శివ ఇతి శైవాః; పురుషోత్తమ ఇతి వైష్ణవాః; పితామహ ఇతి పౌరాణికాః; యజ్ఞ పురుష ఇతి యాజ్ఞికాః ; నిరావరణ ఇతి దిగంబరాః; ఉపాస్యత్వేన దేశిక ఇతి మీమాంసకాః; యావ దుక్తోపపన్నః ఇతి నైయాయికాః; లోకవ్యవహార సిద్ధ ఇతి చార్వకాః; కిం బహునా? కారవోపి యం విశ్వకర్మేత్యుపాసితే; తస్మిన్నేవం జాతి, గోత్ర,ప్రవర, చరణ, కుల, ధర్మాదివద సంసారం ప్రసిద్ధానుభావే భగవతి భవే సందేహ ఏవ కుతః కిం నిరూపణీయం?” (న్యాయ కుసుమాంజలి)

(పురుషార్థములు మూడు విధములు, సుఖము, దుఃఖనివృత్తి, వీని ఉపాయములు - వీటిలో ఏదో ఒకటి కావలసినవారు భగవంతుని ఉపాసించెదరు - వేదాంతులు భగవంతుని శుద్ధ జ్ఞాన స్వరూపునిగా నుపాసన చేయుదురు. వీరు సుఖమును కోరెదరు; కాపిలులు భగవంతుని సృష్ట్యాదియందు బండితుడనియు, యోగానుష్ఠాన సిద్ధాణి మాద్యష్ట సిద్ధులు గలవాడనియు నుపాసన జేయుదురు - యోగ శాస్త్ర సిద్ధా విద్యాస్మితాదిరూప పంచవిధ క్లేశములచేతను, ధర్మాధర్మ హేతుభూత కర్మలచేతను, తత్ఫలములచేతను, లిప్తుడుకాడనియు, వేదోచ్చా రణ యోగ్యమగు శరీరమును ధరించి “సంప్రదాయ ప్రవర్తకః”, “సంప్రదీ యతే గురుణా శిష్యాయ” యను వ్యుత్పత్తిచే సంప్రదాయమన వేదము, దాని నుపదేశించిన వాడనియు, కార్య నిర్మాణ నియామకుండనియు యోగులు భగవంతు నుపాసన జేయుదురు, మరియు లోక విరుద్ధంబులగు గర్మలచే లిప్తుడుగాడనియు జగత్కర్తయనియు మహాపాశుపతులును; శివుడని శైవులును; పురుషోత్తముడని - విష్ణువని - వైష్ణవులును; బ్రహ్మయని పౌరాణికులును; యజ్ఞపురుషుడని యాజకులును, కర్మోపార్జిత శరీర రహితుడని దిగంబరులును, ఉపాస్యమానంబగు మంత్ర స్వరూపుడని మీమాంసకులును; బ్రమాణసిద్ధములగు ధర్మములతో కూడుకొనిన వాడని నైయాయికులును; “రాజావై పరమేశ్వరః” యను పరమేశ్వరుచే లౌకిక వ్యవహార సిద్ధులగు రాజాదులే యని చార్వా కులును; విశ్వకర్మయని కర్మకారులును, భగవంతుని ఉపాసన చేయుచున్నారు).

  1. నిర్గుణ బ్రహ్మ (సత్వరజస్తమోగుణములుగల ప్రకృతితో కలియని శుద్ధబ్రహ్మము), నిరాకార బ్రహ్మ (ఆకారములేని బ్రహ్మ, మూర్తముకాని బ్రహ్మ - త్రిగుణములతో కలియుటచేతనే మూర్తి లేక ఆకారము కలుగును - అట్లు వాటితో కలియనివాడు గాన నిరాకార బ్రహ్మ); చింతంపను, వచింపను, ధ్యానింపను వీలుకాని బ్రహ్మ పరమ బ్రహ్మ.
Transliteration
  1. “yasmācca bṛhati bṛṃhayati ca sarvaṃ tasmā ducyatē paraṃ brahmēti”. (śāṃḍilyōpaniṣat)

(vṛddhipoṃduvāḍu - sṛṣṭikimuṃdu tānokkaḍē yuṃḍi - (ātmavā arē, idamagra asīt), tānē ī jagattu aṃtaṭigānu - jagattulōni anni vastuvulugānu mārenu. sṛṣṭiṃcina prati vastuvulō tānu pravēśiṃci dānini perugunaṭlu cēsenu) - “tat sṛṣṭvā tadēvānu prāviśat”.

  1. “paramaṃ utkṛṣṭaṃ brahma, dēśakāla vastu kṛta paricchēda śūnyaṃ, ata ēva sarva pratyagātma rūpaṃ yadajñātaṃ sat sakala jagadrūpēṇa vivartatē, yacca sarva vēdāṃta pratipādyaṃ yajjñānāt sakala saṃsāra bīja nivṛttiḥ, yacca sarvairmumukṣubhiḥ ātmatvēna sēvyaṃ tat paraṃ brahma ityarthaḥ.”

(parama brahma anagā utkṛṣṭamaina brahma. dēśamu, kālamu, vastuvu anu mūḍiṃṭivalana kalugu parimiti (trividha pariccēdamu) lēnivāḍu. aṃduvalananē anniṃṭilōnū pratyagātma rūpamulō nunnavāḍu. evarikini teliyakuṃḍa ganē prapaṃcamaṃtayu tana rūpamugā nunnavāḍu - prapaṃcarūpamugā nunnavāḍu - viśvuḍu. upaniṣattu lanniṃṭilōnu pratipādiṃpabaḍinavāḍu. aṭṭivānini vēdāṃtamu dvārā telusukonagaligina vāriki saṃsāramu - pravāharūpamulōnuṃḍu janana maraṇamulu - modalaṃṭa naśiṃcunu. mōkṣamunu kaōru samastamaina vāricēta ātmayani sēviṃcataginavāḍu - iṭṭi lakṣaṇamulu galavāḍu parabrahma (parama brahma).

  1. “svātirikta avidyāpada tatkārya jātaṃ yatra paryavasyati - apahnavaṃ bhajati - tatparamaṃ, tanmātrayā upabṛṃhaṇāt brahma niṣpratiyōgika sanmātraṃ.”

(paramātmakaṃṭe vēraina avidya, dānikāryamu ayinadaṃtayu dēniyaṃdu paryavasānamu poṃdunō, apahnavamagunō, adi ‘paramu’ ani ceppabaḍunu; sattā mātruḍai tānē prapaṃcamaṃtayu agunaṭlu vṛddhi poṃdinavāḍu).

  1. “ahēya makṣaraṃ śuddha masaṃbhūtiṃ niraṃjanaṃ |

viṣṇvākhyaṃ paramaṃ brahma, tadvai paśyaṃti sūrayaḥ ||“. (viṣṇu dharmē)

(hēyōpā dēyamulu lēnaṭuvaṃṭinnī prakṛti guṇamulayina satvarajastamamulatō kaliyakuṃḍuṭacēta pariśuddhamainaṭuvaṃṭinnī, niraṃjanamai viṣṇuvu ani pēru kaladiyē parama brahma. dānini sūri janulu cūcu cuṃduru).

  1. “paraṃ utkṛṣṭaṃ satyajñānānaṃdādi vākyaiḥ pratipādyaṃ brahma”.

(paramu anagā utkṛṣṭamainadi. satyamu, jñānamu, ānaṃdamu anu modalagu vākyamulacēta prati pādiṃcabaḍinadi brahma - ī reṃḍunu kalisi parama brahma).

  1. “śiva ēva paraṃ brahma kāraṇaṃ jagatō(a)vyayaṃ |

tatō viṣṇustatastvaṃca brahman sarvama bhūt jagat ||“. (brahmāṃḍapurāṇaṃ)

(jagattu aṃtaṭikī kāraṇamai avyayuḍaina śivuḍē parama brahma - atani nuṃḍiyē nuvvu (caturmukha brahma), viṣṇuvu jagattu aṃtayu kaliginadi.

  1. “nārāyaṇaśśivō viṣṇuḥ viṣṇuḥ śaṃkaraḥ puruṣōttamaḥ |

ē tēṣu nāmabhirbrahma paraṃ prōktaṃ sanātanaṃ ||“.

(nārāyaṇuḍu, śivuḍu, viṣṇuvu, śaṃkaruḍu, puruṣōttamuḍu anu nī pērlatō ā parabrahmayē ceppabaḍucunnāḍu).

  1. “ka. paramabrahmamanaṃgā

baratatvamunaṃga baramapadamanaga, nī

śvaruḍana gṛṣṇuṃḍana, jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51 - )

  1. “ēkākṣaraṃ paraṃ brahma” .

(‘ōṃ’ anu okē akṣaramu parabrahmamu - ani upāsiṃcavalenu).

  1. yatrā vidyākṛtanāma rūpādi viśēṣa pratiṣēdēna asthūlādi śabdairbrahmōpa diśyatē tatparaṃ; tadēva yatra nāmarūpa viśēṣāṇāṃ kēna cidviśiṣṭa mupāsanayōpadiśyatē - “manō mayaḥ prāṇa śarīrōbhā rūpaḥ”. ityādi śabdaistadaparaṃ

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 4 - 3 - 14)

(avidya cēta kalpiṃcabaḍina nāmarūpamulu modalagu viśēṣamulu lēnidiyani - ‘asthūlamu’ modalagu padamulacē ceppabaḍinadi parabrahma - adi yē nāmarūpamulu modalagu viśēṣamulu galadi yani ceppabaḍinadō - manōmayamu, prāṇaśarīramu, prakāśarūpamu ani ceppabaḍinadō adi apara brahma).

  1. “sarvadēśaṃbulayaṃdunu, sarvakālaṃbunaṃdunu nēdi cōditaṃbaiyuṃḍu naṭṭidiya parabrahmasvarūpaṃbu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 253)

  1. ” - - - aṭṭi viśvaṃbai tōcu hiraṇyagarbhādulakaṃṭe nanyaṃbu, parākhyaṃbu - idi mukta rūpaṃbarūpaṃbai yuṃḍu - - - tadākāraṃbu tēṭa paṟaceda - - - pūrvōkta dēhādi rahitaṃbai, tadbhēdarāhityaṃbuna niṭṭi daṭṭidani vicāriṃcuṭaku gōcaraṃbukāka yapakṣayādi rahitaṃbunu, saccabda vācyaṃbunu nātma saṃvēdyaṃbunu nai jñānaika nirūpaṇīyaṃbagucu jñānaśabda vācyaṃbunu dānayai brahmātmakaṃbaguṭa brahma saṃjñayuṃ gāviṃci yoppu, maṟi bhāvanā trayātmaka viśva vailakṣaṇyaṃbe lakṣaṇaṃbugā gala ī rūpaṃbu abhyasyamāna yōguṃḍagu yōgikiṃ ciṃtiṃpa naśakyaṃbu “.

  2. “iha yadyapi yaṃ kamapi puruṣārtha marthayamānāḥ śuddha buddha svabhāvaḥ ityau paniṣadāḥ; avidyā siddhaḥ iti kāpilāḥ; klēśakarma vivākāśayai raparāmṛṣṭō nirmāṇa kāya madhiṣṭhāya saṃpradāya pravartakō anugrahaścēti pātaṃjalāḥ; lōka vēda viruddhairapi nirlēpaḥ svataṃtraścēti mahā pāśupatāḥ śiva iti śaivāḥ; puruṣōttama iti vaiṣṇavāḥ; pitāmaha iti paurāṇikāḥ; yajña puruṣa iti yājñikāḥ ; nirāvaraṇa iti digaṃbarāḥ; upāsyatvēna dēśika iti mīmāṃsakāḥ; yāva duktōpapannaḥ iti naiyāyikāḥ; lōkavyavahāra siddha iti cārvakāḥ; kiṃ bahunā? kāravōpi yaṃ viśvakarmētyupāsitē; tasminnēvaṃ jāti, gōtra,pravara, caraṇa, kula, dharmādivada saṃsāraṃ prasiddhānubhāvē bhagavati bhavē saṃdēha ēva kutaḥ kiṃ nirūpaṇīyaṃ?” (nyāya kusumāṃjali)

(puruṣārthamulu mūḍu vidhamulu, sukhamu, duḥkhanivṛtti, vīni upāyamulu - vīṭilō ēdō okaṭi kāvalasinavāru bhagavaṃtuni upāsiṃcedaru - vēdāṃtulu bhagavaṃtuni śuddha jñāna svarūpunigā nupāsana cēyuduru. vīru sukhamunu kōredaru; kāpilulu bhagavaṃtuni sṛṣṭyādiyaṃdu baṃḍituḍaniyu, yōgānuṣṭhāna siddhāṇi mādyaṣṭa siddhulu galavāḍaniyu nupāsana jēyuduru - yōga śāstra siddhā vidyāsmitādirūpa paṃcavidha klēśamulacētanu, dharmādharma hētubhūta karmalacētanu, tatphalamulacētanu, liptuḍukāḍaniyu, vēdōccā raṇa yōgyamagu śarīramunu dhariṃci “saṃpradāya pravartakaḥ”, “saṃpradī yatē guruṇā śiṣyāya” yanu vyutpatticē saṃpradāyamana vēdamu, dāni nupadēśiṃcina vāḍaniyu, kārya nirmāṇa niyāmakuṃḍaniyu yōgulu bhagavaṃtu nupāsana jēyuduru, mariyu lōka viruddhaṃbulagu garmalacē liptuḍugāḍaniyu jagatkartayaniyu mahāpāśupatulunu; śivuḍani śaivulunu; puruṣōttamuḍani - viṣṇuvani - vaiṣṇavulunu; brahmayani paurāṇikulunu; yajñapuruṣuḍani yājakulunu, karmōpārjita śarīra rahituḍani digaṃbarulunu, upāsyamānaṃbagu maṃtra svarūpuḍani mīmāṃsakulunu; bramāṇasiddhamulagu dharmamulatō kūḍukonina vāḍani naiyāyikulunu; “rājāvai paramēśvaraḥ” yanu paramēśvarucē laukika vyavahāra siddhulagu rājādulē yani cārvā kulunu; viśvakarmayani karmakārulunu, bhagavaṃtuni upāsana cēyucunnāru).

  1. nirguṇa brahma (satvarajastamōguṇamulugala prakṛtitō kaliyani śuddhabrahmamu), nirākāra brahma (ākāramulēni brahma, mūrtamukāni brahma - triguṇamulatō kaliyuṭacētanē mūrti lēka ākāramu kalugunu - aṭlu vāṭitō kaliyanivāḍu gāna nirākāra brahma); ciṃtaṃpanu, vaciṃpanu, dhyāniṃpanu vīlukāni brahma parama brahma.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.