← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ ముక్తి parama mukti

Original — తెలుగు

అన్యాసా యుజ్య రూపోక్తా సుఖ దుఃఖ వివర్జితా |

షడ్భావ విక్రియా హీనా శుభా శుభ వివర్జితా |

సర్వ ద్వంద్వ వినిర్ముక్తా సత్య విజ్ఞాన రూపిణీ |

కేవలం బ్రహ్మరూపోక్తా సర్వదా సుఖ లక్షణా |

సదా యా నా మ్యపాదేయా సర్వ సంబంధ వర్జితా |

నదృష్టా, నశ్రుతా, విష్ణో, న చా స్వాద్యో, నతర్కితా |

సర్వావరణ నిర్ముక్తా సర్వ లక్షణ వర్జితా |

సర్వేషాం ప్రాణినాం సాక్షాదాత్మభూతా స్వయం ప్రభా |

ప్రతి బంధ వినిర్ముక్తా సర్వదా పరమార్థ తః |

అవిచార దశాయాంతు ప్రతిబద్ధా స్వమాయయా |

ఏ షైవ పరమా ముక్తః ప్రోక్తా వేదాంత వేదిభిః ||“. (సూతసంహితాయాం)

(సాయుజ్య ముక్తి యనగా - సుఖ దుఃఖములు లేనిది, ఆరు విధములైన వికారములు లేనిది, శుభాశుభములు లేనిది, సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములు లేనిది, సత్య విజ్ఞానమే రూపముగా గలగి, కేవలము బ్రహ్మ రూపమే అయినది, నిత్య సుఖమే లక్షణముగా గలది; ఉపాదేయము లేనిది, ఏ విధమైన సంబంధము లేనిది, ఎవరూ చూడనిది, విననిది, తర్కించుటకు వీలుకానిది, ఏ విధమైన ఆవరణలు లేనిది, ఏ విధమైన లక్షణములు లేనిది, ప్రాణులందరికి సాక్షాత్తు ఆత్మ అయినది, స్వయముగా ప్రకాశించునది, ప్రతిబంధములు లేనిది, విచారము చేయని సమయమందు తన మాయచేత బంధింపబడునది, ఇదియే పరమ ముక్తి యని వేదాంతులు - ఉపనిషదర్థము తెలిసిన వారు చెప్పుదురు).

Transliteration

anyāsā yujya rūpōktā sukha duḥkha vivarjitā |

ṣaḍbhāva vikriyā hīnā śubhā śubha vivarjitā |

sarva dvaṃdva vinirmuktā satya vijñāna rūpiṇī |

kēvalaṃ brahmarūpōktā sarvadā sukha lakṣaṇā |

sadā yā nā myapādēyā sarva saṃbaṃdha varjitā |

nadṛṣṭā, naśrutā, viṣṇō, na cā svādyō, natarkitā |

sarvāvaraṇa nirmuktā sarva lakṣaṇa varjitā |

sarvēṣāṃ prāṇināṃ sākṣādātmabhūtā svayaṃ prabhā |

prati baṃdha vinirmuktā sarvadā paramārtha taḥ |

avicāra daśāyāṃtu pratibaddhā svamāyayā |

ē ṣaiva paramā muktaḥ prōktā vēdāṃta vēdibhiḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(sāyujya mukti yanagā - sukha duḥkhamulu lēnidi, āru vidhamulaina vikāramulu lēnidi, śubhāśubhamulu lēnidi, sukha duḥkhamulu modalagu dvaṃdvamulu lēnidi, satya vijñānamē rūpamugā galagi, kēvalamu brahma rūpamē ayinadi, nitya sukhamē lakṣaṇamugā galadi; upādēyamu lēnidi, ē vidhamaina saṃbaṃdhamu lēnidi, evarū cūḍanidi, vinanidi, tarkiṃcuṭaku vīlukānidi, ē vidhamaina āvaraṇalu lēnidi, ē vidhamaina lakṣaṇamulu lēnidi, prāṇulaṃdariki sākṣāttu ātma ayinadi, svayamugā prakāśiṃcunadi, pratibaṃdhamulu lēnidi, vicāramu cēyani samayamaṃdu tana māyacēta baṃdhiṃpabaḍunadi, idiyē parama mukti yani vēdāṃtulu - upaniṣadarthamu telisina vāru ceppuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.