← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ పద ప్రాప్తి parama pada prāpti

Original — తెలుగు
  1. “శ్రీ విష్ణో రర్చనం యేతు ప్రకుర్వంతి నరాభువి |

తేయాంతి శాశ్వతం విష్ణోరానందం పరమం పదం ||“. (విష్ణురహస్యే)

(విష్ణుని అర్చనచేయువారు విష్ణువు యొక్క శాశ్వతమైన పరమానంద మయమైన పరమ పదమును పొందుదురు),

  1. “నా యందు తలంపు నిలిపి కర్మ యోగంబునందును, భక్తి యోగంబునందును, భక్తియోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబు జెందిరి; భక్తియోగంబునంజేసి శబరి, బలి, ప్రహ్లాద ముచికుందాదులు పరమ ప్రాప్తు లైరి”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)

  1. “ఉభాభ్యామేవ పక్షాభ్యా యథా ఖే పక్షిణాం గతిః |

తధైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం ||’. (యోగవాసిష్టము)

(పక్షికి రెండు రెక్కలుండుటవలన ఎట్లు ఆకాశములో ఎగర గలుగుచున్నదో - అట్లే జ్ఞానయోగము, కర్మయోగము అను రెండింటిచేత నరులు పరమ పదమును పొందుదురు).

  1. “పశుర్మనుష్యః పక్షేవాయేచ వైష్ణవ సంశ్రయాః |

తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం ||“.

(పశువుగాని, మనిషిగాని, శ్రీమహావిష్ణువునాశ్రయించినవారు ఆ పరబ్రహ్మ అయిన విష్ణువు యొక్క ఉత్కృష్టస్థానమైన పరమ పదమను పొందుదురు).

  1. “శుద్ధ స్ఫటిక సంకాశం నిష్కలం పాపనాశనం |

లభతే యోగ యుక్తాత్మా పురుషస్తత్పరం పదం ||“. (యోగతత్వోపనిషత్)

(యోగి యైన పురుషుడు శుద్ధ స్ఫటికమువలె నుండునదిన్నీ , కలంకము లేనిదిన్నీ, పాపములను నశింపచేయునది అయిన పరమ పదమును పొందును).

  1. ” - - - సమత్వధీయుక్తాః సంత్యక్త్వా కర్మజం ఫలం |

ఈశ్వరారాధనార్థం చ కుర్వాణః కర్మ కేవలం |

ధీశుద్ధిద్వారతో వేదవాక్య జన్యాత్మధీయుతాః |

సంతో జన్మాఖ్యబంధేన వినుర్ముక్తాః అశేషతః |

ఆత్మ తత్వం పదం బ్రహ్మానందం మాయాది వర్జితం |

పురుషార్థం విమోక్షాఖ్యం ప్రాప్ను పంతీహ తాదృశాః |

త్వమప్యేతాదృశోభూత్వా గచ్ఛ విష్ణోః పరం పదం||“. (గీతాభావప్రకాశము - 2 - 523 to 525)

(కష్టసుఖములందు సమభావము కలిగి, కర్మఫలమందాశవదలి, తాము చేయు కర్మలను ఈశ్వరుని ఆరాధన కొఱకే చేయుచు, చిత్త శుద్ధి ద్వారా వేదములలో చెప్పిన బ్రహ్మ జ్ఞానమును పూర్తిగా అవగాహనము చేసుకొనినవారు మాయ లేనిదిన్నీ, ప్రకృతి సంబంధము లేనిదిన్నీ పరమ పురుషార్థరూపమైన మోక్షము అని చెప్పబడునదిన్నీ అయిన, బ్రహ్మానందమే అయిన ఆత్మ తత్వమను పదమును - కేవలముగా ఆత్మ యుండు స్థితిని, ఆత్మ ప్రకృతిలో కలియని స్థితిని పొందుదురు. నీవు (అర్జునుడైననీవు) కూడ వారివలనే ఉండి విష్ణువు యొక్క పరమపదమును పొందుము).

  1. “ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |

దృశ్యతేగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||“.

ఇతి వైష్ణవస్య పరమ పదస్య దురవగమత్వ ముక్త్వా, తదవగమార్థం యోగం దర్శయతి –

“యచ్ఛే ద్వాఙ్మనసి ప్రాజ్ఞః తద్యచ్ఛేత్ జ్ఞాని ఆత్మని |

జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్, తద్యచ్ఛేత్ శాంత ఆత్మని |”

ఇతి. ఏతదుక్తం భవతి - వాచం మనసి స యచ్ఛేత్, వాగాది బాహ్యేంద్రియ వ్యాపారం ఉత్సృజ్యమనో మాత్రేణ అవతిష్టేత. మనోపి విషయ వికల్పాభిముఖం వికల్ప దోష దర్శనేన జ్ఞానశబ్దోదితాయాం బుద్ధావధ్యవసాయ స్వభావాయాం ధారయేత్ | తామపి బుద్ధిం మహతి ఆత్మని భోక్తం అగ్ర్యాయాం వా బుద్ధౌ సూక్ష్మతా పాదనేన నియచ్ఛేత్. మహాం తంతు ఆత్మానం శాంత ఆత్మని ప్రకరణ వతి పరస్మిన్ పురుషే పరస్యాం కాష్టాయాం ప్రతిష్టాపయేత్ “ఇతి చ -”. (శ్రీ శంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే).

(ఈ ఆత్మ సమస్త భూతములందు గూఢమైనటువంటి - కంటికి కనబడనటువంటి - శరీరము, రూపముగలదై - అట్లు ఉన్నట్లు పైకి తెలుసుకొనుటకు వీలు కాకుండునట్లుండును - (సాధారణముగా సాధారణ జనులకు కనబడకుండును). కాని, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను - ఆత్మవంటి అతి సూక్ష్మమైనవస్తువులను - చూడకలుగు శక్తి గలిగినటు వంటిన్నీ, కుశాగ్రమువలె అతి తీక్ష్ణమైన బుద్ధి - (very keen intellect) గలవారిచే చూడబడుచున్నది - అట్టి శక్తి గలవారు ఆత్మవంటి సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగలుగు శక్తి కలవారు - ఆత్మను చూడగలుగు చున్నారు). ఇట్లు విష్ణువు యొక్క పరమ పదము అందరికి కనబడదు - పొంద శక్యము కానిది - అని చెప్పి, అది పొందగలుగుటకు యోగము చెప్పుచున్నారు - (అనగా, కుశాగ్రబుద్ధి, సూక్ష్మ దృష్టి ఎట్లు కలుగునో ఈ క్రిందను చెప్పడమైనది) -

(ప్రాజ్ఞుడైనవాడు వాక్కును మనసులో లయించి, మనస్సును ఆత్మలో లయించి వాక్కు మొదలగు బాహ్యేంద్రి య వ్యాపారమును విడిచి పెట్టి మనో మాత్రముగా నుండవలెను - విషయముల వలన కలుగు వికల్ప దోషమును తెలుసుకొని జ్ఞానము వలన కలిగిన బుద్ధియందు అధ్యవసాయ స్వభావమందు ధరించవలెను. తన ఆత్మని పరమ కాష్ట అయిన పరమ పురుషుని యందు నిలుపవలెను).

Transliteration
  1. “śrī viṣṇō rarcanaṃ yētu prakurvaṃti narābhuvi |

tēyāṃti śāśvataṃ viṣṇōrānaṃdaṃ paramaṃ padaṃ ||“. (viṣṇurahasyē)

(viṣṇuni arcanacēyuvāru viṣṇuvu yokka śāśvatamaina paramānaṃda mayamaina parama padamunu poṃduduru),

  1. “nā yaṃdu talaṃpu nilipi karma yōgaṃbunaṃdunu, bhakti yōgaṃbunaṃdunu, bhaktiyōgaṃbunaṃdunu vātsalyaṃbu galigi janakādulu kaivalyaṃbu jeṃdiri; bhaktiyōgaṃbunaṃjēsi śabari, bali, prahlāda mucikuṃdādulu parama prāptu lairi”

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)

  1. “ubhābhyāmēva pakṣābhyā yathā khē pakṣiṇāṃ gatiḥ |

tadhaiva jñāna karmābhyāṃ jāyatē paramaṃ padaṃ ||’. (yōgavāsiṣṭamu)

(pakṣiki reṃḍu rekkaluṃḍuṭavalana eṭlu ākāśamulō egara galugucunnadō - aṭlē jñānayōgamu, karmayōgamu anu reṃḍiṃṭicēta narulu parama padamunu poṃduduru).

  1. “paśurmanuṣyaḥ pakṣēvāyēca vaiṣṇava saṃśrayāḥ |

tēnaiva tē prayāsyaṃti tadviṣṇōḥ paramaṃ padaṃ ||“.

(paśuvugāni, maniṣigāni, śrīmahāviṣṇuvunāśrayiṃcinavāru ā parabrahma ayina viṣṇuvu yokka utkṛṣṭasthānamaina parama padamanu poṃduduru).

  1. “śuddha sphaṭika saṃkāśaṃ niṣkalaṃ pāpanāśanaṃ |

labhatē yōga yuktātmā puruṣastatparaṃ padaṃ ||“. (yōgatatvōpaniṣat)

(yōgi yaina puruṣuḍu śuddha sphaṭikamuvale nuṃḍunadinnī , kalaṃkamu lēnidinnī, pāpamulanu naśiṃpacēyunadi ayina parama padamunu poṃdunu).

  1. ” - - - samatvadhīyuktāḥ saṃtyaktvā karmajaṃ phalaṃ |

īśvarārādhanārthaṃ ca kurvāṇaḥ karma kēvalaṃ |

dhīśuddhidvāratō vēdavākya janyātmadhīyutāḥ |

saṃtō janmākhyabaṃdhēna vinurmuktāḥ aśēṣataḥ |

ātma tatvaṃ padaṃ brahmānaṃdaṃ māyādi varjitaṃ |

puruṣārthaṃ vimōkṣākhyaṃ prāpnu paṃtīha tādṛśāḥ |

tvamapyētādṛśōbhūtvā gaccha viṣṇōḥ paraṃ padaṃ||“. (gītābhāvaprakāśamu - 2 - 523 to 525)

(kaṣṭasukhamulaṃdu samabhāvamu kaligi, karmaphalamaṃdāśavadali, tāmu cēyu karmalanu īśvaruni ārādhana koṟakē cēyucu, citta śuddhi dvārā vēdamulalō ceppina brahma jñānamunu pūrtigā avagāhanamu cēsukoninavāru māya lēnidinnī, prakṛti saṃbaṃdhamu lēnidinnī parama puruṣārtharūpamaina mōkṣamu ani ceppabaḍunadinnī ayina, brahmānaṃdamē ayina ātma tatvamanu padamunu - kēvalamugā ātma yuṃḍu sthitini, ātma prakṛtilō kaliyani sthitini poṃduduru. nīvu (arjunuḍainanīvu) kūḍa vārivalanē uṃḍi viṣṇuvu yokka paramapadamunu poṃdumu).

  1. “ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmā na prakāśatē |

dṛśyatēgryayā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||“.

iti vaiṣṇavasya parama padasya duravagamatva muktvā, tadavagamārthaṃ yōgaṃ darśayati –

“yacchē dvāṅmanasi prājñaḥ tadyacchēt jñāni ātmani |

jñānamātmani mahati niyacchēt, tadyacchēt śāṃta ātmani |”

iti. ētaduktaṃ bhavati - vācaṃ manasi sa yacchēt, vāgādi bāhyēṃdriya vyāpāraṃ utsṛjyamanō mātrēṇa avatiṣṭēta. manōpi viṣaya vikalpābhimukhaṃ vikalpa dōṣa darśanēna jñānaśabdōditāyāṃ buddhāvadhyavasāya svabhāvāyāṃ dhārayēt | tāmapi buddhiṃ mahati ātmani bhōktaṃ agryāyāṃ vā buddhau sūkṣmatā pādanēna niyacchēt. mahāṃ taṃtu ātmānaṃ śāṃta ātmani prakaraṇa vati parasmin puruṣē parasyāṃ kāṣṭāyāṃ pratiṣṭāpayēt “iti ca -”. (śrī śaṃkaraḥ - brahma sūtra bhāṣyē).

(ī ātma samasta bhūtamulaṃdu gūḍhamainaṭuvaṃṭi - kaṃṭiki kanabaḍanaṭuvaṃṭi - śarīramu, rūpamugaladai - aṭlu unnaṭlu paiki telusukonuṭaku vīlu kākuṃḍunaṭluṃḍunu - (sādhāraṇamugā sādhāraṇa janulaku kanabaḍakuṃḍunu). kāni, sūkṣmāti sūkṣmamaina vastuvulanu - ātmavaṃṭi ati sūkṣmamainavastuvulanu - cūḍakalugu śakti galiginaṭu vaṃṭinnī, kuśāgramuvale ati tīkṣṇamaina buddhi - (very keen intellect) galavāricē cūḍabaḍucunnadi - aṭṭi śakti galavāru ātmavaṃṭi sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagalugu śakti kalavāru - ātmanu cūḍagalugu cunnāru). iṭlu viṣṇuvu yokka parama padamu aṃdariki kanabaḍadu - poṃda śakyamu kānidi - ani ceppi, adi poṃdagaluguṭaku yōgamu ceppucunnāru - (anagā, kuśāgrabuddhi, sūkṣma dṛṣṭi eṭlu kalugunō ī kriṃdanu ceppaḍamainadi) -

(prājñuḍainavāḍu vākkunu manasulō layiṃci, manassunu ātmalō layiṃci vākku modalagu bāhyēṃdri ya vyāpāramunu viḍici peṭṭi manō mātramugā nuṃḍavalenu - viṣayamula valana kalugu vikalpa dōṣamunu telusukoni jñānamu valana kaligina buddhiyaṃdu adhyavasāya svabhāvamaṃdu dhariṃcavalenu. tana ātmani parama kāṣṭa ayina parama puruṣuni yaṃdu nilupavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.