మోక్షము -
ధర్మార్థకామ మోక్ష ఖ్యేషు మోక్ష ఏవ పరమ పురుషార్థః - “న పునరావర్తతే” (ఛాందోగ్యోపనిషత్ - 8 - 15 -1)
ఇతి శ్రుత్యా తస్యా నిత్యతావగమాత్ ఇతరేషాం త్రయాణాం ప్రత్యక్షేణ “తద్య ధేహ కర్మ చితోలోకః క్షీయతే పరమే వాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే” (ఛాందోగ్యోపనిషత్ - 8 - 1 - 6)
ఇత్యాది శ్రుత్యా చా నిత్యత్వావ గమాత్ (వేదాంత పరిభాషా)
(ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్పబడు నాలుగు విధములగు పురుషార్థములలోను - పురుషుడు అర్థించవలసిన, సాధించవలసిన వాటిలో - నాలుగవది అయిన మోక్షమే పరమ పురుషార్థము - ఎందుచేత ననగా - “ఆ పరమ పురుషార్థమును పొందినవాడు” అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. ఇంతేగాక ఆ ఉపనిషత్తులోనే మిగిలిన మూడు పురుషార్థముల గురించి - “కర్మ చేయుటచేత పొందబడిన ఈ లోకములోని శుభాశుభ ఫలములు ఏ విధముగ క్షీణించునో ఆ ప్రకారముగానే పుణ్యముచేత సంపాదింపబడిన పరలోకములోని - స్వర్గలోకములోని సుఖములు క్షీణించునవియే, శాశ్వతముకావు” అని మిగిలిన మూడు పురుషార్థములు శాశ్వతములుగావని చెప్పబడియున్నది).
(పురుషునికి కోరిక దేనియందు కలదో అది పురుషార్థము అని చెప్పబడుచున్నది. ఆ కోరిక అందరికి సుఖము కలుగవలెనని, దుఃఖము పోవలెననియే కలుగును. అందుచేత అట్టివియే పురుషార్థములు. వాటిలో అత్యంతసుఖము కలుగచేయునదిన్నీ, దుఃఖమును పోగొట్టునదియును అయినది మోక్షమే - విషయభోగముల వలన కలిగిన సుఖము దోషములతో కూడియుండుటవలన అది పరమ పురుషార్థము కాదు -.
భయకారి యగుటను బరమ మోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లునండ్రు బుధులు
భువి గుణవ్యతికరమున బుట్టినట్టి యజ్జ జాతాదులకు నస్మదాదులకును
గాల విద్వాంసితాఖల క్రమముగల్గు
గలుగదెన్నడు సేయంబు; గాన వినుము
వ. మోక్షంబె పరమ పురుషార్థంబు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -)
న తు ధీ శోధకం పుణ్యం ముముక్షోరీశ్వరార్పితం |
తత్ఫల జ్ఞాన సంసిద్ధౌ కర్మమాత్తం వినశ్యతి|
అతః సమత్వధీయుక్తాః సంత్యక్త్వా కర్మజం ఫలం |
ఈశ్వరారాధనార్థంచ కుర్వాణాః కర్మ కేవలం |
ధీ శుద్ధి ద్వారతో వేదవాక్య జన్మాత్మధీయుతాః |
సంతో జన్మాఖ్య బంధేన వినిర్ముక్తాః అశేషతః |
ఆత్మ తత్వం పదం బ్రహ్మానందం మాయాదివర్జితం |
పురుషార్థం విమోక్షాఖ్యాం ప్రాప్నువం తీహ తాదృశాః ||
త్వమస్యే తాదృశో భూత్వా గచ్చ విష్ణోః పరం పదం ||“. (గీతాభావ ప్రకాశము 2 - 521 to 526)
(జన్మము కలుగచేయు పుణ్యకర్మ హేయము. దానిని చేయరాదు. ఛిత్త శుద్ధిని కలుగచేయు పుణ్యకర్మను ఈశ్వరార్పితము చేసిన యడల కర్మ నశించును. అందుచేత ఫలము కలిగినను కలుగకపోయినను సమత్వ బుద్ధితో కర్మ ఫలమును ఆశించక కేవలము పరమాత్మను ఆరాధించుటకొరకే కర్మలు చేయువారు చిత్త శుద్ధి ద్వారా వేదవాక్యములవలన కలిగిన ఆత్మ జ్ఞానము కలవారై జన్మ అను బంధముచేత నిశ్శేషముగా విడువబడిన వారై, మాయ మొదలగునవి లేనిదిన్నీ, పరమ పురుషార్థమైనటువంటిన్నీ – బ్రహ్మానంద మైనటువంటిన్నీ - ఆత్మతత్వము అను పరమ పదమును పొందుదురు. నీవునూ వారివలనే అయి విష్ణువు యొక్క పరమపదమును - పరమ పురుషార్థమును పొందుము - “తద్విష్ణోః పరమం పదం”).
(దీనిని బట్టి విష్ణువనినను, పరమ పురుషార్థమనినను, పరమ పదమనినను, మోక్షమనిను, బ్రహ్మా నందమనినను ఒకటే యని యర్థమగుచున్నది).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 88)
(ధర్మము, అర్థ్గము, కామము, మోక్షము అను నాలుగు విధములగు పురుషార్థమలలోను - అనగా పురుషులు అర్థించవలసిన, సాధించవలసినవాటిలో - మోక్షమే ఉత్కృష్టమైన పురుషార్థము - పరమ పురుషార్థమని చెప్పుటకు కారణమేమనగా - అంతకంటె మించినది, ఉత్కృష్టమైనది పురుషార్థము లేదు - ఇంతేగాక మిగిలిన పురుషార్థములవలె క్షీణించుటలేనిది కనుక - మోక్షమే పరమ పురుషార్థమని శ్రుతిలో చెప్పబడినది - “బ్రహ్మ జ్ఞానముచేత ముక్తిని పొందును, తిరిగిరాడు, తిరిగి పుట్టడు - తిరిగి జన్మించుటయను లక్షణములు గల సంసారములో పడడు”. ఈ ప్రకారముగా శ్రుతి చెప్పుటవలన మోక్షము నిత్యమై యుండునది యని అర్థము - ఈ లోకములో కృషి (వ్యవసాయము) మొదలగు కర్మలనుచేయుటవలన కలిగిన ఫలరూపములగు సస్యములు మొదలగునవి - కృతకములగుటవలన - క్షీణించునవియే. ఆ ప్రకారముగానే పుణ్య కర్మ చేయుట పరలోకమున (స్వర్గలోకమున) పొందు ఫలము - భోగము, సౌఖ్యము - క్షీణించునవియే యని శ్రుతిలో ఆ పురుషార్థములు అనిత్యములని చెప్పబడినవి కనుక, శాశ్వతమైనది, క్షీణించనది మోక్షమొకటే - అది పురుషార్థము లన్నింటిలోను పరమ పురుషార్థమని చెప్పబడినది).
mōkṣamu -
dharmārthakāma mōkṣa khyēṣu mōkṣa ēva parama puruṣārthaḥ - “na punarāvartatē” (chāṃdōgyōpaniṣat - 8 - 15 -1)
iti śrutyā tasyā nityatāvagamāt itarēṣāṃ trayāṇāṃ pratyakṣēṇa “tadya dhēha karma citōlōkaḥ kṣīyatē paramē vāmutra puṇyacitō lōkaḥ kṣīyatē” (chāṃdōgyōpaniṣat - 8 - 1 - 6)
ityādi śrutyā cā nityatvāva gamāt (vēdāṃta paribhāṣā)
(dharmamu arthamu kāmamu mōkṣamu ani ceppabaḍu nālugu vidhamulagu puruṣārthamulalōnu - puruṣuḍu arthiṃcavalasina, sādhiṃcavalasina vāṭilō - nālugavadi ayina mōkṣamē parama puruṣārthamu - eṃducēta nanagā - “ā parama puruṣārthamunu poṃdinavāḍu” ani chāṃdōgyōpaniṣattu ceppucunnadi. iṃtēgāka ā upaniṣattulōnē migilina mūḍu puruṣārthamula guriṃci - “karma cēyuṭacēta poṃdabaḍina ī lōkamulōni śubhāśubha phalamulu ē vidhamuga kṣīṇiṃcunō ā prakāramugānē puṇyamucēta saṃpādiṃpabaḍina paralōkamulōni - svargalōkamulōni sukhamulu kṣīṇiṃcunaviyē, śāśvatamukāvu” ani migilina mūḍu puruṣārthamulu śāśvatamulugāvani ceppabaḍiyunnadi).
(puruṣuniki kōrika dēniyaṃdu kaladō adi puruṣārthamu ani ceppabaḍucunnadi. ā kōrika aṃdariki sukhamu kalugavalenani, duḥkhamu pōvalenaniyē kalugunu. aṃducēta aṭṭiviyē puruṣārthamulu. vāṭilō atyaṃtasukhamu kalugacēyunadinnī, duḥkhamunu pōgoṭṭunadiyunu ayinadi mōkṣamē - viṣayabhōgamula valana kaligina sukhamu dōṣamulatō kūḍiyuṃḍuṭavalana adi parama puruṣārthamu kādu -.
bhayakāri yaguṭanu barama mōkṣaṃbe mukhyārthamai vilasillunaṃḍru budhulu
bhuvi guṇavyatikaramuna buṭṭinaṭṭi yajja jātādulaku nasmadādulakunu
gāla vidvāṃsitākhala kramamugalgu
galugadennaḍu sēyaṃbu; gāna vinumu
va. mōkṣaṃbe parama puruṣārthaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 -)
na tu dhī śōdhakaṃ puṇyaṃ mumukṣōrīśvarārpitaṃ |
tatphala jñāna saṃsiddhau karmamāttaṃ vinaśyati|
ataḥ samatvadhīyuktāḥ saṃtyaktvā karmajaṃ phalaṃ |
īśvarārādhanārthaṃca kurvāṇāḥ karma kēvalaṃ |
dhī śuddhi dvāratō vēdavākya janmātmadhīyutāḥ |
saṃtō janmākhya baṃdhēna vinirmuktāḥ aśēṣataḥ |
ātma tatvaṃ padaṃ brahmānaṃdaṃ māyādivarjitaṃ |
puruṣārthaṃ vimōkṣākhyāṃ prāpnuvaṃ tīha tādṛśāḥ ||
tvamasyē tādṛśō bhūtvā gacca viṣṇōḥ paraṃ padaṃ ||“. (gītābhāva prakāśamu 2 - 521 to 526)
(janmamu kalugacēyu puṇyakarma hēyamu. dānini cēyarādu. chitta śuddhini kalugacēyu puṇyakarmanu īśvarārpitamu cēsina yaḍala karma naśiṃcunu. aṃducēta phalamu kaliginanu kalugakapōyinanu samatva buddhitō karma phalamunu āśiṃcaka kēvalamu paramātmanu ārādhiṃcuṭakorakē karmalu cēyuvāru citta śuddhi dvārā vēdavākyamulavalana kaligina ātma jñānamu kalavārai janma anu baṃdhamucēta niśśēṣamugā viḍuvabaḍina vārai, māya modalagunavi lēnidinnī, parama puruṣārthamainaṭuvaṃṭinnī – brahmānaṃda mainaṭuvaṃṭinnī - ātmatatvamu anu parama padamunu poṃduduru. nīvunū vārivalanē ayi viṣṇuvu yokka paramapadamunu - parama puruṣārthamunu poṃdumu - “tadviṣṇōḥ paramaṃ padaṃ”).
(dīnini baṭṭi viṣṇuvaninanu, parama puruṣārthamaninanu, parama padamaninanu, mōkṣamaninu, brahmā naṃdamaninanu okaṭē yani yarthamagucunnadi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 88)
(dharmamu, arthgamu, kāmamu, mōkṣamu anu nālugu vidhamulagu puruṣārthamalalōnu - anagā puruṣulu arthiṃcavalasina, sādhiṃcavalasinavāṭilō - mōkṣamē utkṛṣṭamaina puruṣārthamu - parama puruṣārthamani ceppuṭaku kāraṇamēmanagā - aṃtakaṃṭe miṃcinadi, utkṛṣṭamainadi puruṣārthamu lēdu - iṃtēgāka migilina puruṣārthamulavale kṣīṇiṃcuṭalēnidi kanuka - mōkṣamē parama puruṣārthamani śrutilō ceppabaḍinadi - “brahma jñānamucēta muktini poṃdunu, tirigirāḍu, tirigi puṭṭaḍu - tirigi janmiṃcuṭayanu lakṣaṇamulu gala saṃsāramulō paḍaḍu”. ī prakāramugā śruti ceppuṭavalana mōkṣamu nityamai yuṃḍunadi yani arthamu - ī lōkamulō kṛṣi (vyavasāyamu) modalagu karmalanucēyuṭavalana kaligina phalarūpamulagu sasyamulu modalagunavi - kṛtakamulaguṭavalana - kṣīṇiṃcunaviyē. ā prakāramugānē puṇya karma cēyuṭa paralōkamuna (svargalōkamuna) poṃdu phalamu - bhōgamu, saukhyamu - kṣīṇiṃcunaviyē yani śrutilō ā puruṣārthamulu anityamulani ceppabaḍinavi kanuka, śāśvatamainadi, kṣīṇiṃcanadi mōkṣamokaṭē - adi puruṣārthamu lanniṃṭilōnu parama puruṣārthamani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.