(జ్ఞానయోగ కర్మ యోగములద్వారా సాధించతగునది బ్రహ్మలోకము కనుక అట్టి (అదియే అయిన) ఉత్కృష్టమైన గతి - ఆత్మ స్వరూపము).
బుద్ధిశ్చ న విచేష్టేత తమాహుః పరమాం గతిం ||’. ఇతి శ్రుతిః (కఠోపనిషత్)
(పంచ జ్ఞానేంద్రియములు, విషయములందు పోక మనస్సుతో కలిసియుండి బుద్ధి ఎప్పుడు చలించకుండునో ఆ స్థితిపరమగతి యని జ్ఞానులు చెప్పుదురు).
ఇయం సా పరమా బుద్ధి రియంసా పరమాగతిః |
ఇయం సా పరమా శాంతిః, ఇయం సా నిర్వృతిః పరా |
ఇయం ప్రాప్య కృత కృత్యాస్మః ఇత్య మన్యం త వేధసః ||“. (మహాభారతము)
(దేనిని పొంది కృత కృత్యులమైతిమను తలచెదరో అదియే ’ పరమా కాష్టా ’ అన్నింటికంటె ఉత్కృష్టమైనది), పరమ కల, పరమాబుద్ధి, పరమగతి, పరమ శాంతి, పరానిర్వృత్తి).
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి |
అవ్యక్తో (అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం |
యం ప్రాప్య న నివర్తంతే తద్థామ పరమం మమ ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 20, 21)
(చూడుము - ’ పరమం స్థానం ’ - 2).
పుణ్యా వేదాః శివః పుణ్యః పుణ్యం తిర్యక్త్రిపుండ్రకం |
పంచ పుణ్యాని యో నిత్యం ప్రాతరుత్థాయ కీర్తయతే |
సర్వ పాప వినుర్ముక్తాః సయాతి పరమాం గతిః ||“. (సూత సంహితాయాం)
(లోకములో గంగానది, కాశీక్షేత్రము, వేదములు, శివుడు, త్రిపుండ్రకము, - ఈ అయిదు పుణ్యమైనవి - ఈ అయిదు పుణ్య వస్తువులను ప్రొద్దుటనే లేచి కీర్తించువాడు పాపములన్నింటిని పోగొట్టుకొని పరమగతిని పొందును).
నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 28)
(అంతట సమముగా (నిష్పక్షపాతముగా) నున్న భగవంతుని సమముగా చూచువాడు ఆత్మని ఆత్మచేత (తనలోనున్న ఆత్మచేత ఇంకొకదానిలోనున్న ఆత్మని) హింసింపడు - అందుచేత అట్టివాడు పరమగతిని పొందును).
మూర్థ్నాదా యాత్మానం ప్రాణ మాస్థితో యోగధారణాం |
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామను స్మరన్ |
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 12, 13)
“ప్రత్యాహృత్యేంద్రియ ద్వారాణ్యఖిలాని వివేకతః |
సయ్యక్సమస్తభోగేభ్యో దోష వృష్ట్యా విశేషతః |
వైరాగ్యాభ్యాస యోగేన నిర్వృత్తికం మనో యథా |
భవేత్తథా సుహృద్దేశే సం యమ్యాతి ప్రయత్నతః |
క్రియాద్వారం తథా ప్రాణం సర్వతో విని కృహ్యచ |
గురూపదిష్ట మార్గేణ తథా భూమి జయ క్రమాత్ |
స్థాపయిత్వా భృవోర్మధ్యే ధారణ మాత్మ గోచరం |
సమాధి లక్షణం కర్తుం ప్రవృత్తస్తాం సమాస్థితః ||
బ్రహ్మణో వాచకత్వా త్ప్రతీకతా త్సముచ్చరన్ |
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ సర్వ వ్యాపకమ ద్వయం |
ఓమిత్యస్యార్థ మీశానం మాంచ సమ్యగనుస్మరన్ |
నా డ్యౌ మూర్థన్యాయా దేహం త్యజన్ ధీరః ప్రయాతి యః |
స దేవయానమార్గేణ బ్రహ్మలోకముపాసకః |
గత్వా భోగావసానే చ మద్రూపాం గతిముత్తమాం |
ప్రాప్నోతి బ్రహ్మణా సార్థం సంప్రాప్తే ప్రతి సంచరే ||” (గీతాభావప్రకాశము - 8 - 81 to 87)
(ఇంద్రియద్వారము అన్నియు వివేకము చేత ప్రత్యాహరించి, అనగా, ఇంద్రియములను వాటి వాటి విషయముల జోలికి పోకుండునట్లు కట్టి పెట్టి ఉంచి, వైరాగ్యమును అభ్యసించుటచేత, మనస్సును దాని వృత్తులనుండి మరల్చి, ప్రాణాయామము ద్వారా ప్రాణమును వశములో నుంచుకొని, భృఊమధ్యమందు నిలిపి ఆత్మ దర్శనము చేయు టకు ధారణచేసి సమాధిస్థితిలో నుండవలెను. ‘ఓం’ అనునది బ్రహ్మ యొక్క వాచకము - బ్రహ్మ పేరు - ఓం అను ఒకే అక్షరముచేత పరబ్రహ్మ చెప్పబడు చున్నాడు. అది బ్రహ్మకు ప్రతీకము, - బ్రహ్మకు బదులుగా వాడబడుచున్నది. ఈశ్వరుడనైన నేనే ’ ఓం ’ అని ఉచ్ఛరించుచు శిరస్సు ద్వారా దేహమును విడిచిపెట్టి వెళ్ళినవాడు (చనిపోయినవాడు) దేవయాన మార్గముద్వారా బ్రహ్మలోకమునకు వెళ్ళి, అక్కడ భోగముల ననుభవించిన తర్వాత నా రూపమే అయిన ఉత్తమగతిని - పరమగతిని - పొందును. ఉత్తమగతి యనినను, పరమగతి యనినను, పరమపదమనినను ఒకటే).
“యమక్షరం వేదవిదో వదంతి, విశంత యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 11)
దేనిని వేదమును తెలిసినవారు అక్షరమని (సర్వకాలములందు ఉండునది) అని చెప్పుచున్నారో, దేని యందును అనురాగము లేని యతులు దేనిని ప్రవేశించెదరో, దేనిని కోరి బ్రహ్మ చర్య వ్రతము చేయుదురో అట్టి పదమును, స్థానమును, పరమగతిని చెప్పెదను).
శ్రుణ్వన్ రామకథానాదం | కోనయాతి పరాంగతిం ||“.
(మునులలో శ్రేష్టుడైన వాల్మీకి కవి వ్రాసిన శ్రీమద్రామాయణమును వినినవాడు - వినుచు నుండువాడు - ఎవడు పరమగతిని పొందడు ?).
(jñānayōga karma yōgamuladvārā sādhiṃcatagunadi brahmalōkamu kanuka aṭṭi (adiyē ayina) utkṛṣṭamaina gati - ātma svarūpamu).
buddhiśca na vicēṣṭēta tamāhuḥ paramāṃ gatiṃ ||’. iti śrutiḥ (kaṭhōpaniṣat)
(paṃca jñānēṃdriyamulu, viṣayamulaṃdu pōka manassutō kalisiyuṃḍi buddhi eppuḍu caliṃcakuṃḍunō ā sthitiparamagati yani jñānulu ceppuduru).
iyaṃ sā paramā buddhi riyaṃsā paramāgatiḥ |
iyaṃ sā paramā śāṃtiḥ, iyaṃ sā nirvṛtiḥ parā |
iyaṃ prāpya kṛta kṛtyāsmaḥ itya manyaṃ ta vēdhasaḥ ||“. (mahābhāratamu)
(dēnini poṃdi kṛta kṛtyulamaitimanu talacedarō adiyē ’ paramā kāṣṭā ’ anniṃṭikaṃṭe utkṛṣṭamainadi), parama kala, paramābuddhi, paramagati, parama śāṃti, parānirvṛtti).
yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati |
avyaktō (a)kṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ |
yaṃ prāpya na nivartaṃtē tadthāma paramaṃ mama ||“. (śrīmadbhagavadgīta - 8 - 20, 21)
(cūḍumu - ’ paramaṃ sthānaṃ ’ - 2).
puṇyā vēdāḥ śivaḥ puṇyaḥ puṇyaṃ tiryaktripuṃḍrakaṃ |
paṃca puṇyāni yō nityaṃ prātarutthāya kīrtayatē |
sarva pāpa vinurmuktāḥ sayāti paramāṃ gatiḥ ||“. (sūta saṃhitāyāṃ)
(lōkamulō gaṃgānadi, kāśīkṣētramu, vēdamulu, śivuḍu, tripuṃḍrakamu, - ī ayidu puṇyamainavi - ī ayidu puṇya vastuvulanu prodduṭanē lēci kīrtiṃcuvāḍu pāpamulanniṃṭini pōgoṭṭukoni paramagatini poṃdunu).
nahinastyātmanātmānaṃ tatō yāti parāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 13 - 28)
(aṃtaṭa samamugā (niṣpakṣapātamugā) nunna bhagavaṃtuni samamugā cūcuvāḍu ātmani ātmacēta (tanalōnunna ātmacēta iṃkokadānilōnunna ātmani) hiṃsiṃpaḍu - aṃducēta aṭṭivāḍu paramagatini poṃdunu).
mūrthnādā yātmānaṃ prāṇa māsthitō yōgadhāraṇāṃ |
ōmityēkākṣaraṃ brahma vyāharanmāmanu smaran |
yaḥ prayāti tyajandēhaṃ sa yāti paramāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 8 - 12, 13)
“pratyāhṛtyēṃdriya dvārāṇyakhilāni vivēkataḥ |
sayyaksamastabhōgēbhyō dōṣa vṛṣṭyā viśēṣataḥ |
vairāgyābhyāsa yōgēna nirvṛttikaṃ manō yathā |
bhavēttathā suhṛddēśē saṃ yamyāti prayatnataḥ |
kriyādvāraṃ tathā prāṇaṃ sarvatō vini kṛhyaca |
gurūpadiṣṭa mārgēṇa tathā bhūmi jaya kramāt |
sthāpayitvā bhṛvōrmadhyē dhāraṇa mātma gōcaraṃ |
samādhi lakṣaṇaṃ kartuṃ pravṛttastāṃ samāsthitaḥ ||
brahmaṇō vācakatvā tpratīkatā tsamuccaran |
ōmityēkākṣaraṃ brahma sarva vyāpakama dvayaṃ |
ōmityasyārtha mīśānaṃ māṃca samyaganusmaran |
nā ḍyau mūrthanyāyā dēhaṃ tyajan dhīraḥ prayāti yaḥ |
sa dēvayānamārgēṇa brahmalōkamupāsakaḥ |
gatvā bhōgāvasānē ca madrūpāṃ gatimuttamāṃ |
prāpnōti brahmaṇā sārthaṃ saṃprāptē prati saṃcarē ||” (gītābhāvaprakāśamu - 8 - 81 to 87)
(iṃdriyadvāramu anniyu vivēkamu cēta pratyāhariṃci, anagā, iṃdriyamulanu vāṭi vāṭi viṣayamula jōliki pōkuṃḍunaṭlu kaṭṭi peṭṭi uṃci, vairāgyamunu abhyasiṃcuṭacēta, manassunu dāni vṛttulanuṃḍi maralci, prāṇāyāmamu dvārā prāṇamunu vaśamulō nuṃcukoni, bhṛūmadhyamaṃdu nilipi ātma darśanamu cēyu ṭaku dhāraṇacēsi samādhisthitilō nuṃḍavalenu. ‘ōṃ’ anunadi brahma yokka vācakamu - brahma pēru - ōṃ anu okē akṣaramucēta parabrahma ceppabaḍu cunnāḍu. adi brahmaku pratīkamu, - brahmaku badulugā vāḍabaḍucunnadi. īśvaruḍanaina nēnē ’ ōṃ ’ ani ucchariṃcucu śirassu dvārā dēhamunu viḍicipeṭṭi veḷḷinavāḍu (canipōyinavāḍu) dēvayāna mārgamudvārā brahmalōkamunaku veḷḷi, akkaḍa bhōgamula nanubhaviṃcina tarvāta nā rūpamē ayina uttamagatini - paramagatini - poṃdunu. uttamagati yaninanu, paramagati yaninanu, paramapadamaninanu okaṭē).
“yamakṣaraṃ vēdavidō vadaṃti, viśaṃta yadyatayō vītarāgāḥ |
yadicchaṃtō brahacaryaṃ caraṃti, tattē padaṃ saṃgrahēṇa pravakṣyē ||“. (śrīmadbhagavadgīta - 8 - 11)
dēnini vēdamunu telisinavāru akṣaramani (sarvakālamulaṃdu uṃḍunadi) ani ceppucunnārō, dēni yaṃdunu anurāgamu lēni yatulu dēnini pravēśiṃcedarō, dēnini kōri brahma carya vratamu cēyudurō aṭṭi padamunu, sthānamunu, paramagatini ceppedanu).
śruṇvan rāmakathānādaṃ | kōnayāti parāṃgatiṃ ||“.
(munulalō śrēṣṭuḍaina vālmīki kavi vrāsina śrīmadrāmāyaṇamunu vininavāḍu - vinucu nuṃḍuvāḍu - evaḍu paramagatini poṃdaḍu ?).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.