“సీ. అజినవల్కల దుకూలాంబరంబులు గట్టియైన, గట్టకయైన నలరు చుందు
ఆందోళికా రధిహయనాగములనెక్కియైన, నెక్కకయైన నరుగుచుందు
కర్పూరచందన కస్తూరికా లేపమైన, భూరజమైన నలవికొందు
భర్మ శయ్యలనైన పర్ణశిలా తృణ భస్మంబులందైన పండుచుందు
ఆ. మానయుక్తమైన, మానహీనంబైన
తీయనైన మిగులదిక్తమైన
గుడుతు, సగుణమైన గుణవర్జితంబైన
అల్పమైన జాల నధికమైన
“క. లేదని యెవ్వరినడుగను
రాదని చింతింప, పరులు రప్పించినచో
గాదని యెద్దియు మానను
ఖేదము, మోదమును లేక క్రీడింతు మదిన్
క. నిందింప పరుల నెన్నడు
నందింప, ననేక పీడ వచ్చిన మది నా
క్రందింప, విభవముల కా
నందింప ప్రకామ వర్తనంబున, నధిపా
వ. ఇట్లు కోరికలు లేక, యొక్క సమయంబున దిగంబరుడనై పిశాచంబు చందంబున నుండుచు, పెక్కు దినంబులుంగోలె పెను చాపవర్తనంబు గైకొని, నిమీలిత లోచనత్వంబున నేకాంతభావంబు విష్ణుని యందు చేర్చి, వికల్పంబు భేదగ్రాహక చిత్త వృత్తుల చిత్తంబు నర్థరూప విభ్రమంబుగల మనంబునందు, మనంబును నహంకారంబునందును, అహంకారంబును మాయయందు, మాయను ఆత్మానుభూతియందు లయంబు నొందించి, సత్యంబు దర్శించుచు, విరక్తినొంది, స్వాను భవంబున ఆత్మ స్థితుండనై యుండుదు. నీవు భగవత్పరుండవుగావున రహస్యంబైనపరమహంస ధర్మంబు స్వానుభవగోచరంబైన తెఱంగున నీకు హృద్గోచరంబగునట్లు సెప్పితి.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 13 - 437 to 440)
“sī. ajinavalkala dukūlāṃbaraṃbulu gaṭṭiyaina, gaṭṭakayaina nalaru cuṃdu
āṃdōḷikā radhihayanāgamulanekkiyaina, nekkakayaina narugucuṃdu
karpūracaṃdana kastūrikā lēpamaina, bhūrajamaina nalavikoṃdu
bharma śayyalanaina parṇaśilā tṛṇa bhasmaṃbulaṃdaina paṃḍucuṃdu
ā. mānayuktamaina, mānahīnaṃbaina
tīyanaina miguladiktamaina
guḍutu, saguṇamaina guṇavarjitaṃbaina
alpamaina jāla nadhikamaina
“ka. lēdani yevvarinaḍuganu
rādani ciṃtiṃpa, parulu rappiṃcinacō
gādani yeddiyu mānanu
khēdamu, mōdamunu lēka krīḍiṃtu madin
ka. niṃdiṃpa parula nennaḍu
naṃdiṃpa, nanēka pīḍa vaccina madi nā
kraṃdiṃpa, vibhavamula kā
naṃdiṃpa prakāma vartanaṃbuna, nadhipā
va. iṭlu kōrikalu lēka, yokka samayaṃbuna digaṃbaruḍanai piśācaṃbu caṃdaṃbuna nuṃḍucu, pekku dinaṃbuluṃgōle penu cāpavartanaṃbu gaikoni, nimīlita lōcanatvaṃbuna nēkāṃtabhāvaṃbu viṣṇuni yaṃdu cērci, vikalpaṃbu bhēdagrāhaka citta vṛttula cittaṃbu nartharūpa vibhramaṃbugala manaṃbunaṃdu, manaṃbunu nahaṃkāraṃbunaṃdunu, ahaṃkāraṃbunu māyayaṃdu, māyanu ātmānubhūtiyaṃdu layaṃbu noṃdiṃci, satyaṃbu darśiṃcucu, viraktinoṃdi, svānu bhavaṃbuna ātma sthituṃḍanai yuṃḍudu. nīvu bhagavatparuṃḍavugāvuna rahasyaṃbainaparamahaṃsa dharmaṃbu svānubhavagōcaraṃbaina teṟaṃguna nīku hṛdgōcaraṃbagunaṭlu seppiti.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 13 - 437 to 440)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.