← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం మహత్తపః paramaṃ mahattapaḥ

Original — తెలుగు
  1. తపతి ఆజ్ఞాపయతీతి తపః.

(ఎవడు పరమ తపస్సు, అనగా తపించువాడు - తపింప చేయువాడు, ఆజ్ఞాపించువాడో అట్టివాడు).

  1. “య ఇమం చ లోకం, పరమంచ లోకం, సర్వాణి చ భూతాని, యో అంతరో యమ యతి”. (బృహదారణ్యకోపనిషత్)

(ఎవడు ఈ లోకమును, పరలోకమును, సమస్త భూతములను, - వాటిలోపల నుండి - నియమించు చున్నాడో, అట్టి సర్వ నియంత)

  1. “భీషా అస్మాత్ వాతః పవతే, భీషోవేతి సూర్యః, భీషా అస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్థావతి పంచమః”. (తైత్తిరీయోపనిషత్)

(ఇతని వలన భయముచేతనే వాయువు వీచుచున్నది, ఇతని భయమువలననే సూర్యుడు ఉదయించు చున్నాడు, ఇతనికి భయపడి అగ్ని దహించుచున్నది, ఇంద్రుడు వర్షించుచున్నాడు, మృత్యువు పారిపోవుచున్నది).

  1. “తదైశ్వర్యం అవిచ్ఛిన్నమితి మహత్”.

(ఇతని ఐశ్వర్యము అపరిమితము కాన మహత్తుకలవాడు ’ మహత్తపః ’ అని చెప్పబడినాడు - ” ఏష సర్వేశ్వరః ” (మాండూకోపనిషత్). ఇతడు సర్వేశ్వరుడు కనుక ఇట్లు చెప్పబడినది).

Transliteration
  1. tapati ājñāpayatīti tapaḥ.

(evaḍu parama tapassu, anagā tapiṃcuvāḍu - tapiṃpa cēyuvāḍu, ājñāpiṃcuvāḍō aṭṭivāḍu).

  1. “ya imaṃ ca lōkaṃ, paramaṃca lōkaṃ, sarvāṇi ca bhūtāni, yō aṃtarō yama yati”. (bṛhadāraṇyakōpaniṣat)

(evaḍu ī lōkamunu, paralōkamunu, samasta bhūtamulanu, - vāṭilōpala nuṃḍi - niyamiṃcu cunnāḍō, aṭṭi sarva niyaṃta)

  1. “bhīṣā asmāt vātaḥ pavatē, bhīṣōvēti sūryaḥ, bhīṣā asmādagniścēṃdraśca mṛtyurthāvati paṃcamaḥ”. (taittirīyōpaniṣat)

(itani valana bhayamucētanē vāyuvu vīcucunnadi, itani bhayamuvalananē sūryuḍu udayiṃcu cunnāḍu, itaniki bhayapaḍi agni dahiṃcucunnadi, iṃdruḍu varṣiṃcucunnāḍu, mṛtyuvu pāripōvucunnadi).

  1. “tadaiśvaryaṃ avicchinnamiti mahat”.

(itani aiśvaryamu aparimitamu kāna mahattukalavāḍu ’ mahattapaḥ ’ ani ceppabaḍināḍu - ” ēṣa sarvēśvaraḥ ” (māṃḍūkōpaniṣat). itaḍu sarvēśvaruḍu kanuka iṭlu ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.