← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం సుఖం paramaṃ sukhaṃ

Original — తెలుగు
  1. నిరతిశయం సుఖం ఆత్మభూతం.

(అన్నింటికంటె హెచ్చు అయిన సుఖము - ఆత్మగానుండుట).

  1. అవిద్యా కల్పిత నామరూప విశేషాకారాపహృత బుద్ధీనాం అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్న తరమాత్మభూతమపి అప్రసిద్ధం, దుర్విజ్ఞేయమితి దూరమన్య దివచ ప్రతిభాతి. బాహ్యాకార నివృత్త బుద్ధీనాంతు లబ్ధ గుర్వాత్మ ప్రసాదా దీనాం నాతః పరం సుఖః సుప్రసిద్ధం సువిజ్ఞేయం చానన్యమస్తి.

(అవిద్యచేత కల్పించబడిన నామరూపములచేత భ్రాంతి చెందిన బుద్ధికలవారికి, బాగుగా, నిశ్చయముగా తెలియ తగినది, మిక్కిలి ప్రసిద్ధి పొందినది, దగ్గరగానే (తనలోనే) ఉన్నప్పటికీ తెలుసుకొన శక్యముకానిది, ఎక్కడో దూరముగా నున్నట్లు తోచునది. బాహ్య విషయములనుండి మరలించిన బుద్ధికలవారికిన్నీ, గురువు ద్వారా ఆత్మ జ్ఞానము కలిగినవారికిన్నీ, ఇంతకంటె - ఆత్మకంటె - ఉత్కృష్టమైన సుఖము లేదు అని తెలియును. అందుచేత ఆత్మజ్ఞానము కలుగుటయే ఆత్మ ప్రాప్తియే పరమ సుఖము).

Transliteration
  1. niratiśayaṃ sukhaṃ ātmabhūtaṃ.

(anniṃṭikaṃṭe heccu ayina sukhamu - ātmagānuṃḍuṭa).

  1. avidyā kalpita nāmarūpa viśēṣākārāpahṛta buddhīnāṃ atyaṃta prasiddhaṃ suvijñēyaṃ āsanna taramātmabhūtamapi aprasiddhaṃ, durvijñēyamiti dūramanya divaca pratibhāti. bāhyākāra nivṛtta buddhīnāṃtu labdha gurvātma prasādā dīnāṃ nātaḥ paraṃ sukhaḥ suprasiddhaṃ suvijñēyaṃ cānanyamasti.

(avidyacēta kalpiṃcabaḍina nāmarūpamulacēta bhrāṃti ceṃdina buddhikalavāriki, bāgugā, niścayamugā teliya taginadi, mikkili prasiddhi poṃdinadi, daggaragānē (tanalōnē) unnappaṭikī telusukona śakyamukānidi, ekkaḍō dūramugā nunnaṭlu tōcunadi. bāhya viṣayamulanuṃḍi maraliṃcina buddhikalavārikinnī, guruvu dvārā ātma jñānamu kaliginavārikinnī, iṃtakaṃṭe - ātmakaṃṭe - utkṛṣṭamaina sukhamu lēdu ani teliyunu. aṃducēta ātmajñānamu kaluguṭayē ātma prāptiyē parama sukhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.