← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమార్థ సత్యము paramārtha satyamu

Original — తెలుగు

“యత్ర యద్వస్తు అన్యదృష్ట్వా ప్రతీయతే తత్ర తద్వస్తు పరమార్థతః నాస్తి యస్య వస్తునః యద్రూపం అన్యదృష్టిం వినా స్వతః ఏవ ప్రతీయతే తదేవతస్య పారమార్థికం స్వరూపం - యథాకస్మిన్శ్చిత్ పురుషే పితృదృష్ట్యా పుత్రత్వం, పితామహ దృష్ట్వా పౌత్రత్వం ప్రతీయమానం న తస్య పరమార్థ ధర్మః, కింతు పురుషత్వమేవ తస్య పరమార్థ ధర్మః. తథా స్థూల సూక్ష్మకారణోపాధి, దృష్ట్యా భాస మాన విశ్వత్వ, తైజసత్వ, ప్రాజ్ఞత్వాదయః న పరమార్థ ధర్మాః, పరంతు, మిధ్యైవతే చైతన్యమాత్రం పరమార్థ్గ సత్యం”. (విచారసాగరము)

(ఏ వస్తువు ఇతరుల దృష్టిలో ప్రతీయమానమగుచున్నదో ఆ వస్తువు పరమార్థ దృష్టిలో లేనిదే. ఏ వస్తువు ఇతరుల దృష్టిలోకాక స్వయముగా ప్రకాశమానమగుచున్నదో అది దాని పారమార్థిక స్వరూపము - ఒక పురుషుడు తండ్రి దృష్టిలో కొడుకున్నూ తాత దృష్టిలో మనుమడున్నూ అగుట అతని పరమార్థ ధర్మముకాదు. అతడు పురుషుడు అనునదియే పరమార్థ ధర్మము - ఈ ప్రకారముగానే స్థూల సూక్ష్మకారణోపాధి గలవారు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనుట పరమార్థధర్మముకాదు. ఇవి మిధ్యయే - ఆ ఉపాధులలోనుండు పరబ్రహ్మ యొక్క చైతన్యము పరమార్థ ధర్మము - అదియే పరమార్థ సత్యము - మూడు కాలములందుండునది).

Transliteration

“yatra yadvastu anyadṛṣṭvā pratīyatē tatra tadvastu paramārthataḥ nāsti yasya vastunaḥ yadrūpaṃ anyadṛṣṭiṃ vinā svataḥ ēva pratīyatē tadēvatasya pāramārthikaṃ svarūpaṃ - yathākasminścit puruṣē pitṛdṛṣṭyā putratvaṃ, pitāmaha dṛṣṭvā pautratvaṃ pratīyamānaṃ na tasya paramārtha dharmaḥ, kiṃtu puruṣatvamēva tasya paramārtha dharmaḥ. tathā sthūla sūkṣmakāraṇōpādhi, dṛṣṭyā bhāsa māna viśvatva, taijasatva, prājñatvādayaḥ na paramārtha dharmāḥ, paraṃtu, midhyaivatē caitanyamātraṃ paramārthga satyaṃ”. (vicārasāgaramu)

(ē vastuvu itarula dṛṣṭilō pratīyamānamagucunnadō ā vastuvu paramārtha dṛṣṭilō lēnidē. ē vastuvu itarula dṛṣṭilōkāka svayamugā prakāśamānamagucunnadō adi dāni pāramārthika svarūpamu - oka puruṣuḍu taṃḍri dṛṣṭilō koḍukunnū tāta dṛṣṭilō manumaḍunnū aguṭa atani paramārtha dharmamukādu. ataḍu puruṣuḍu anunadiyē paramārtha dharmamu - ī prakāramugānē sthūla sūkṣmakāraṇōpādhi galavāru viśvuḍu, taijasuḍu, prājñuḍu anuṭa paramārthadharmamukādu. ivi midhyayē - ā upādhulalōnuṃḍu parabrahma yokka caitanyamu paramārtha dharmamu - adiyē paramārtha satyamu - mūḍu kālamulaṃduṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.