“అనంత కల్యాణగుణ మహా దధేః పరస్య బ్రహ్మణః చిదచితాంచ శరీరాత్మ భావేన సంబంధిః ప్రతిపాదయంతి శ్రుతయః - బృహదారణ్యకే -”యః పృధివ్యాం తిష్టన్” ఇత్యారభ్య, “యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానం స వేద, యస్య విజ్ఞానం శరీరం. యో విజ్ఞానమంతరో యమయతి సత ఆత్మాంతర్యామ్యమృతః”ఇతి. అత్ర “యః పృధివ్యాం తిష్టన్” ఇత్యాదినా అచేతనానాం భగవదధిష్టి తత్వంచ భగవచ్ఛరీరత్వం, “యో విజ్ఞానే తిష్టన్” ఇత్యాదినా జీవానాం, భగవదధిష్టితత్వం భగవచ్ఛరీరత్వం చోక్తం. పరమాత్మనః పృధివ్యాదిషు అవస్థానంచ, తత్తదంతరాత్మతయా ఇతి దర్శయతి. “పృధివ్యాం అంతరః, విజ్ఞానాదంతరః” ఇతి చ అంతరో యమ య తీతి“. అనేన శరీర లక్షణం సర్వానుగతం ఉక్తం భవతి. అనేన”యస్య చేతనస్య యద్ద్రవ్యం సర్వాత్మనా స్వార్థే నియంతుం ధారయితుం చ శక్యం, తచ్ఛేష తైకస్వరూపం చ “తత్ తస్య శరీరం” ఇతి శరీర లక్షణం సిద్ధ్యతి. చితామ చితాంకేశ్వరేణ సర్వాత్మనా స్వార్థే నియం తుం ధారయితుం చ శక్యత్వాత్ తచ్ఛేష తైక స్వరూపత్వాత్ చ ఈశ్వర శరీరత్వం అవ్యాహతం (అంతర్యామిణః జీవాత్ వ్యతిరేకః సిద్ధః -) తథా, “యః పృధివీమంతరే సంచరన్, యస్య పృధివీ శరీరం, యం పృధివీ నవేద” ఇత్యారభ్య “యో అక్షరమంతరే సంచరన్, యస్యాక్షరం శరీరం, యమక్షరం న వేద” ఇత్యన్యత్రాపి జీవస్య పరమాత్మ శరీరత్వం శ్రుతం. ఏవం “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చ త్యచ్చా భవత్”. ఇతి జగత్సర్గ పూర్వకం - బ్రహ్మణః సర్వత్ర వ్యాప్త్యా సర్వ శరీరకత్వం శ్రూయతే - గోజఠరవత్సవత్ సర్వ వ్యాప్తస్య బ్రహ్మణః ప్రత్యేకం సర్వ వస్తుషు పుష్కల ప్రతీత్యర్హస్థితి విశేషః ఏవ అత్ర అను ప్రవేశః - తస్మాత్ శ్రుత్యాదిభిః ప్రమాణైః ప్రసిద్ధ్యత్ పరం బ్రహ్మ చిదచిచ్ఛరేరకత్వ సర్వాంతర్యామిత్వ, సత్యకామత్వ, సత్యసంకల్పత్వ నిరతిశయషాడ్గుణ్యాది విశేష విశిష్ట, మేవ ప్రసిద్ధ్యతీతి సవిశేషాద్వైతపరాణ్యేవ పూర్వోక్త వచనాని,న నిర్విశేషాద్వైత పరాణి ఇతి విశిష్టాద్వైతానాం సిద్ధాంతః ఏవం స విశేష బ్రహ్మ ద్వైతాభిప్రాయకత్వాత్ విశిష్టా ద్వైతమితి వ్యపదేశః. అయం భావః “బ్రహ్మైక మేవ తత్వం” ఇతి వైశిష్ట్యాభి ప్రాయేణ వ్యపదేశః నిష్కర్షేతు తత్వత్రయమవేతి “.
(అనంత కల్యాణ గుణములకు సముద్రుడైన భగవంతుడు ఈ చిద చిద్వస్తువులన్నింటికీ. ఆత్మ, శరీరము అయినవాడు - అని శ్రుతులు చెప్పుచున్నవి. బృహదారణ్యకోపనిషత్తులో ఈ క్రింద విధముగా చెప్పబడినది -
“పృధివి లోపల ఎవడు ఉండి” అని మొదలు పెట్టి “విజ్ఞానమందు ఎవడు ఉండుచు ఎవనిని విజ్ఞానము తెలుసు కొనలేదో, ఎవనికి ఈ విజ్ఞానము శరీరమై యుండి ఎవడు విజ్ఞానములోపలనుండి దానిని చైతన్యవంతముగా చేయునో, అతనే ఆత్మ, అంతర్యామి, అమృతుడు” - ఈ ప్రకారముగానే “పృధువియందు ఉండి - - -” అని అచేతనముల గుఱించి వాటియందు భగవంతుడధిష్టించి యున్నాడని, అవి అతనికి శరీరములని, చెప్పబడినది. పరమాత్మ పృధివి మొదలగు వాటియందు, వాటి అంతరాత్మగా నుండుటయు చెప్పబడినది - పృధివిలోపలనుండువాడు, విజ్ఞానము లోపలనుండువాడు - లోపలనుండి ప్రేరేపించువాడు అని చెప్పుటవలన శరీర లక్షణము, సర్వానుగతము చెప్పబడినది. చేతనుడైన పరమాత్మకు యే వస్తువు. తాను సమస్తమైన వాటికి ఆత్మయగుటచేత – తనకొఱకే నియమించుటకున్నూ, తాను ధరించుటకున్నూ శక్తి కలిగిఉయుండుటచేత అది - ఆ వస్తువు అతనికి శరీరము - అని శరీర లక్షణము చెప్పబడినది. చిత్ అచిత్ వస్తువులన్నింటికి ఈశ్వరుడైనవానిచే - సర్వాత్ముడగుటవలన - తన కొఱకే నియమించుటకున్నూ, తాను ధరించుటకున్నూ, శక్తి గలవాడగుటచేతను, అది నశించగా తాను మిగిలియుండు వాడగుటచేతను అది ఈశ్వరుని శరీరము అనుట అవ్యాహతము - అందుచేత వస్తువులో అంతర్యామియగు జీవునికన్న అది - శరీరము - వేరైనదనుట సిద్ధించినది. ఆ ప్రకారముగానే ఎవడు పృధివి అంతటలోపల సంచరించుచు, ఎవనికి పృధివి శరీరమో, ఎవనిని పృధివి తెలుసుకొనుటలేదో” అని మొదలుకొని, “ఎవడు అక్షరుడైన జీవుని లోపలనుండి, ఎవనికి అక్షరము శరీరమో, ఎవనిని అక్షరము తెలుసుకొనుటలేదో” అని ఇంకొకచోట జీవుడు పరమాత్మని శరీరము అని శ్రుతిలో చెప్పబడినది. ఈ ప్రకారముగానే - “దానిని సృష్టించి - ప్రపంచమును, ప్రపంచములోని ప్రతి వస్తువును - సృష్టించి, దానిలోనే ప్రవేశించెను - దానిలో ప్రవేశించి సత్, త్యత్ కూడా తానే ఆయెను -” అని చెప్పుటవలన ప్రపంచమును సృష్టించుటకు పూర్వమే పరమాత్మ అన్నింటిలోను వ్యాపించుయుండగలుగుట, అన్నింటికి తానే శరీరమగుట శ్రుతి చెప్పుచున్నది. గోవు కడుపులో పెయ్యి ఉండునట్లు - ప్రతి వస్తువులోను భగవంతుడు ప్రవేశించి యుండి పెయ్యి పెరిగినట్లే పెరుగుట, ఆ వస్తువును తన శరీరముగా చేసుకొనుట - ప్రతి వస్తువులోను భగవంతుడు ప్రవేశించియున్నాడు అనగా - అన్నింటిలోను వ్యాపించి యుండువాడగు భగవంతుడు ప్రతివస్తువునందు - ఆవు కడుపులో పెయ్యి ప్రవేశించియున్నట్లు - ప్రవేశించగల శక్తి గలవాడు అని చెప్పుటయే దీని యర్థము - ఆవు కడుపులోనున్న పెయ్యి ఆవు తినిన ఆహారము రసమే తనకు శరీరము చేసుకొన్నట్లు భగవంతుడు దేనిలో ప్రవేశించియుండిన అదియే తనకు శరీరముగా చేసుకొనును - శరీరముగా కల్పించి వాడుకొనును - ఇందుచేత శ్రుతుల ప్రమాణముచేత భగవంతుడు చిద చిత్ వస్తువులు శరీరముగా గలవాడు అనిన్నీ, అన్నింటిలోను అంతర్యామిగానుండువాడనిన్నీ, సత్యమైన (నిర్విఘ్నమైన) సంకల్పము గలవాడనిన్నీ, సత్యకాముడనిన్నీ, నిరతిశయమైన షడ్గుణైశ్వర్యములను విశేషములచేత విశిష్టుడైనవాడు అని ప్రసిద్ధికలుగుచున్నది. అందుచేత పైన చెప్పబడిన శ్రుతివాక్యములు విశేషా ద్వైతపరములు - విశిష్టాద్వైతమునే చెప్పునవి - అంతే కాని (నిర్గుణ, నిరాకార) నిర్విశేష పరబ్రహ్మ గుఱించి చెప్పబడినవి కావు - అని అభిప్రాయము కలుగుటచేత విశిష్టాద్వైతమని వ్యపదేశము - దీని భావమేమనగా - పర ‘బ్రహ్మ ఒకే తత్వం’ అనునది వైశిష్ట్యాభిప్రాయములో తత్వ త్రయము - పరమాత్మ, జీవుడు, ప్రకృతి అను మూడు తత్వములు గలది - పరమాత్మ యొక్క అంశయే జీవుడు, పరమాత్మ యొక్క శక్తి - అపరాప్రకృతియే ప్రకృతి - ఈ మూడు తత్వములు ప్రమాత్మయే కనుక - ఈమూడు తత్వములు కలిసి ప్రపంచమైనది కనుక ప్రపంచమంతటిలోను, ప్రపంచములోని ప్రతి వస్తువులోను ఉన్నది ఒకే తత్వము - అదే పరమాత్మ) (చూడుము - ’ తత్వము ’).
తత్ + త్వం = తత్వం - తత్ అని చెప్పబడు భగవంతుడే నీవు - ‘నీవు’ అనుమాట యోగాభ్యాసము చేయు మానవులకే కాక, అందఱికి, అన్ని జీవులకు, అన్ని వస్తువులకు వర్తించును - ‘తత్వత్రయారాధితం’). (శ్రీరామకర్ణామృతం - 2 - 35)
“anaṃta kalyāṇaguṇa mahā dadhēḥ parasya brahmaṇaḥ cidacitāṃca śarīrātma bhāvēna saṃbaṃdhiḥ pratipādayaṃti śrutayaḥ - bṛhadāraṇyakē -”yaḥ pṛdhivyāṃ tiṣṭan” ityārabhya, “yō vijñānē tiṣṭan vijñānādaṃtarō yaṃ vijñānaṃ sa vēda, yasya vijñānaṃ śarīraṃ. yō vijñānamaṃtarō yamayati sata ātmāṃtaryāmyamṛtaḥ”iti. atra “yaḥ pṛdhivyāṃ tiṣṭan” ityādinā acētanānāṃ bhagavadadhiṣṭi tatvaṃca bhagavaccharīratvaṃ, “yō vijñānē tiṣṭan” ityādinā jīvānāṃ, bhagavadadhiṣṭitatvaṃ bhagavaccharīratvaṃ cōktaṃ. paramātmanaḥ pṛdhivyādiṣu avasthānaṃca, tattadaṃtarātmatayā iti darśayati. “pṛdhivyāṃ aṃtaraḥ, vijñānādaṃtaraḥ” iti ca aṃtarō yama ya tīti”. anēna śarīra lakṣaṇaṃ sarvānugataṃ uktaṃ bhavati. anēna “yasya cētanasya yaddravyaṃ sarvātmanā svārthē niyaṃtuṃ dhārayituṃ ca śakyaṃ, tacchēṣa taikasvarūpaṃ ca”tat tasya śarīraṃ” iti śarīra lakṣaṇaṃ siddhyati. citāma citāṃkēśvarēṇa sarvātmanā svārthē niyaṃ tuṃ dhārayituṃ ca śakyatvāt tacchēṣa taika svarūpatvāt ca īśvara śarīratvaṃ avyāhataṃ (aṃtaryāmiṇaḥ jīvāt vyatirēkaḥ siddhaḥ -) tathā, “yaḥ pṛdhivīmaṃtarē saṃcaran, yasya pṛdhivī śarīraṃ, yaṃ pṛdhivī navēda” ityārabhya “yō akṣaramaṃtarē saṃcaran, yasyākṣaraṃ śarīraṃ, yamakṣaraṃ na vēda” ityanyatrāpi jīvasya paramātma śarīratvaṃ śrutaṃ. ēvaṃ “tat sṛṣṭvā tadēvānu prāviśat, tadanu praviśya sacca tyaccā bhavat”. iti jagatsarga pūrvakaṃ - brahmaṇaḥ sarvatra vyāptyā sarva śarīrakatvaṃ śrūyatē - gōjaṭharavatsavat sarva vyāptasya brahmaṇaḥ pratyēkaṃ sarva vastuṣu puṣkala pratītyarhasthiti viśēṣaḥ ēva atra anu pravēśaḥ - tasmāt śrutyādibhiḥ pramāṇaiḥ prasiddhyat paraṃ brahma cidaciccharērakatva sarvāṃtaryāmitva, satyakāmatva, satyasaṃkalpatva niratiśayaṣāḍguṇyādi viśēṣa viśiṣṭa, mēva prasiddhyatīti saviśēṣādvaitaparāṇyēva pūrvōkta vacanāni,na nirviśēṣādvaita parāṇi iti viśiṣṭādvaitānāṃ siddhāṃtaḥ ēvaṃ sa viśēṣa brahma dvaitābhiprāyakatvāt viśiṣṭā dvaitamiti vyapadēśaḥ. ayaṃ bhāvaḥ “brahmaika mēva tatvaṃ” iti vaiśiṣṭyābhi prāyēṇa vyapadēśaḥ niṣkarṣētu tatvatrayamavēti “.
(anaṃta kalyāṇa guṇamulaku samudruḍaina bhagavaṃtuḍu ī cida cidvastuvulanniṃṭikī. ātma, śarīramu ayinavāḍu - ani śrutulu ceppucunnavi. bṛhadāraṇyakōpaniṣattulō ī kriṃda vidhamugā ceppabaḍinadi -
“pṛdhivi lōpala evaḍu uṃḍi” ani modalu peṭṭi “vijñānamaṃdu evaḍu uṃḍucu evanini vijñānamu telusu konalēdō, evaniki ī vijñānamu śarīramai yuṃḍi evaḍu vijñānamulōpalanuṃḍi dānini caitanyavaṃtamugā cēyunō, atanē ātma, aṃtaryāmi, amṛtuḍu” - ī prakāramugānē “pṛdhuviyaṃdu uṃḍi - - -” ani acētanamula guṟiṃci vāṭiyaṃdu bhagavaṃtuḍadhiṣṭiṃci yunnāḍani, avi ataniki śarīramulani, ceppabaḍinadi. paramātma pṛdhivi modalagu vāṭiyaṃdu, vāṭi aṃtarātmagā nuṃḍuṭayu ceppabaḍinadi - pṛdhivilōpalanuṃḍuvāḍu, vijñānamu lōpalanuṃḍuvāḍu - lōpalanuṃḍi prērēpiṃcuvāḍu ani ceppuṭavalana śarīra lakṣaṇamu, sarvānugatamu ceppabaḍinadi. cētanuḍaina paramātmaku yē vastuvu. tānu samastamaina vāṭiki ātmayaguṭacēta – tanakoṟakē niyamiṃcuṭakunnū, tānu dhariṃcuṭakunnū śakti kaligiuyuṃḍuṭacēta adi - ā vastuvu ataniki śarīramu - ani śarīra lakṣaṇamu ceppabaḍinadi. cit acit vastuvulanniṃṭiki īśvaruḍainavānicē - sarvātmuḍaguṭavalana - tana koṟakē niyamiṃcuṭakunnū, tānu dhariṃcuṭakunnū, śakti galavāḍaguṭacētanu, adi naśiṃcagā tānu migiliyuṃḍu vāḍaguṭacētanu adi īśvaruni śarīramu anuṭa avyāhatamu - aṃducēta vastuvulō aṃtaryāmiyagu jīvunikanna adi - śarīramu - vērainadanuṭa siddhiṃcinadi. ā prakāramugānē evaḍu pṛdhivi aṃtaṭalōpala saṃcariṃcucu, evaniki pṛdhivi śarīramō, evanini pṛdhivi telusukonuṭalēdō” ani modalukoni, “evaḍu akṣaruḍaina jīvuni lōpalanuṃḍi, evaniki akṣaramu śarīramō, evanini akṣaramu telusukonuṭalēdō” ani iṃkokacōṭa jīvuḍu paramātmani śarīramu ani śrutilō ceppabaḍinadi. ī prakāramugānē - “dānini sṛṣṭiṃci - prapaṃcamunu, prapaṃcamulōni prati vastuvunu - sṛṣṭiṃci, dānilōnē pravēśiṃcenu - dānilō pravēśiṃci sat, tyat kūḍā tānē āyenu -” ani ceppuṭavalana prapaṃcamunu sṛṣṭiṃcuṭaku pūrvamē paramātma anniṃṭilōnu vyāpiṃcuyuṃḍagaluguṭa, anniṃṭiki tānē śarīramaguṭa śruti ceppucunnadi. gōvu kaḍupulō peyyi uṃḍunaṭlu - prati vastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃci yuṃḍi peyyi periginaṭlē peruguṭa, ā vastuvunu tana śarīramugā cēsukonuṭa - prati vastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃciyunnāḍu anagā - anniṃṭilōnu vyāpiṃci yuṃḍuvāḍagu bhagavaṃtuḍu prativastuvunaṃdu - āvu kaḍupulō peyyi pravēśiṃciyunnaṭlu - pravēśiṃcagala śakti galavāḍu ani ceppuṭayē dīni yarthamu - āvu kaḍupulōnunna peyyi āvu tinina āhāramu rasamē tanaku śarīramu cēsukonnaṭlu bhagavaṃtuḍu dēnilō pravēśiṃciyuṃḍina adiyē tanaku śarīramugā cēsukonunu - śarīramugā kalpiṃci vāḍukonunu - iṃducēta śrutula pramāṇamucēta bhagavaṃtuḍu cida cit vastuvulu śarīramugā galavāḍu aninnī, anniṃṭilōnu aṃtaryāmigānuṃḍuvāḍaninnī, satyamaina (nirvighnamaina) saṃkalpamu galavāḍaninnī, satyakāmuḍaninnī, niratiśayamaina ṣaḍguṇaiśvaryamulanu viśēṣamulacēta viśiṣṭuḍainavāḍu ani prasiddhikalugucunnadi. aṃducēta paina ceppabaḍina śrutivākyamulu viśēṣā dvaitaparamulu - viśiṣṭādvaitamunē ceppunavi - aṃtē kāni (nirguṇa, nirākāra) nirviśēṣa parabrahma guṟiṃci ceppabaḍinavi kāvu - ani abhiprāyamu kaluguṭacēta viśiṣṭādvaitamani vyapadēśamu - dīni bhāvamēmanagā - para ‘brahma okē tatvaṃ’ anunadi vaiśiṣṭyābhiprāyamulō tatva trayamu - paramātma, jīvuḍu, prakṛti anu mūḍu tatvamulu galadi - paramātma yokka aṃśayē jīvuḍu, paramātma yokka śakti - aparāprakṛtiyē prakṛti - ī mūḍu tatvamulu pramātmayē kanuka - īmūḍu tatvamulu kalisi prapaṃcamainadi kanuka prapaṃcamaṃtaṭilōnu, prapaṃcamulōni prati vastuvulōnu unnadi okē tatvamu - adē paramātma) (cūḍumu - ’ tatvamu ’).
tat + tvaṃ = tatvaṃ - tat ani ceppabaḍu bhagavaṃtuḍē nīvu - ‘nīvu’ anumāṭa yōgābhyāsamu cēyu mānavulakē kāka, aṃdaṟiki, anni jīvulaku, anni vastuvulaku vartiṃcunu - ‘tatvatrayārādhitaṃ’). (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 35)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.