(కార్యకారణములకంటె వేరై నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావముకలవాడు పరబ్రహ్మ - ఉత్కృష్టమైనఆత్మ అయినవాడు).
(ఉత్కృష్టమైన ఆత్మ - ఉత్కృష్టుడు, ఆత్మ అయినవాడు - సమస్త జీవాత్మలకంటె ఉత్కృష్టమైనవాడు.)
(అన్నింటికంటె ఉత్కృష్టమైన స్వరూపము గలవాడు).
( ఉత్కృష్టమైనవాడు, ఆత్మ అయినవాడు - సూక్ష్ములైన జీవులకంటె పరుడు - ఉత్కృష్టమైనవాడు - వారి కంటె సూక్ష్ముడైనవాడు). సూక్ష్ములైన జీవాత్మలకంటె సూక్ష్మమైన ఆత్మ అయినవాడు).
(ఉత్కృష్టమైన ఆత్మ).
(దేహము మొదలగువాటికంటె ఉత్కృష్తమైనవాటికంటె, ఉత్కృష్టమైన పరబ్రహ్మమే పరమాత్మ - వ్యష్టి స్థూల దేహముకంటె, సూక్ష్మములగు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకంటెను, మనో బుద్ధులకంటెను, సమష్టి రూపములగు హిరణ్యగర్భుడు, మహత్తత్వములకంటె ఉత్కృష్టము, గొప్పది యగు ఆత్మ యగుటవలన పరమాత్మ యని చెప్పబడినది).
తైరేవ విగతః శుద్ధః - పరమాత్మా నిగద్యతే ||“.
(ప్రకృతి గుణములైన సత్వరజస్తమములతో కూడి యున్న క్షేత్రజ్ఞుడు - జీవుడు - ఆత్మ - ఆ గుణములు లేనివాడు - ప్రకృతి సంబంధములేనివాడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు).
(పరమ పురుషుడే పరమాత్మ - అతనికంటె ఉత్కృష్టమైనది లేదు కనుక - “పురుషుని కంటె ఉత్కృష్టమైనది ఏదియులేదు”. అతనే ‘కాష్టా’ (అత్యుత్తమైనది), అతనే పరమగతి, పరమపదము, మోక్షస్థానము, వైకుంఠము అయినవాడు - అని చెప్పబడియున్నది కనుక).
క్షరాణి సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే |
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోక త్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 16,17)
(ఈ లోకమందు పురుషులు రెండు విధములుగానున్నారు - క్షరపురుషుడు, అక్షరపురుషుడు. క్షరపురుషుడనగా నశించునట్టి సమస్త భూతములు - అక్షరపురుషుడనగా నశించునట్టి నశించనటువంటి కూటస్థుడు - జీవుడు - ఈ రెండింటికంటె ఉత్తమమైన పురుషుడున్నాడు - అతనే వ్యయరహితుడు, ప్రపంచమంతటిలోనూ వ్యాపించి దానిని భరించువాడైన పరమాత్మయని చెప్పబడుచున్నాడు).
“వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞానవైరాగ్యంబుల తోడంగూడిన భక్తిచేత దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మయందు బరమాత్మం బొడగందురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 2 - )
ప్రత్యగభిన్నః -
(ప్రత్యగాత్మకన్న వేరు కానివాడు).
(శ్రీ శంకరః)
(దేహము మొదలు అవ్యక్తము వఱకు గల వస్తువులన్నింటికీ అవిద్యచేత ప్రత్యగాత్మగా కల్పించబడిన వస్తువులన్నింటికంటెను ఉత్కృష్టమైన ఉపద్రష్ట లక్షణములుగల ఆత్మయే పరమాత్మ).
(దేశముచేతగాని, కాలముచేతగాని, స్వరూపము - వస్తువు - చేతగాని పరిచ్ఛిన్నముకాక (త్రివిధపరిచ్ఛేదరహితుడై అంతటను, అన్నింటిలోను వ్యాపించియుండువాడు - అని పరమాత్మ పదమునకు - పరమాత్మ అనుమాటకు - నిర్వచనము - అర్థము). (సర్వవ్యాపకుడైన ఆత్మ కనుక పరమాత్మ).
“మూడుమూర్తులకు మూలంబగు పరమాత్మవు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )
“కారణాతీ తత్వంబువలన బరమాత్ముండ వయ్యును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.-
“తస్మిన్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవ స్థితః |
స బ్రహ్మ, స శివస్స హరిస్యేంద్రస్సో (అ)క్షరః పరమస్వరాట్ ||“. (మంత్రపుష్పము).
(జీవ శరీరములోని జఠరాగ్ని జ్వాలమధ్యమున పరమాత్మ యున్నాడు - అతనే బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అక్షరుడు, పరముడు, స్వరాట్టున్నూ.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)
“ద్రష్టయు, దృక్కును దృశ్యంబనందగు నీమూటి యందునొకటి లేకున్న నొకటి గానరాదు. ఈత్రితయంబెవ్వండెఱుంగు నతండు సర్వ లోకాశ్రయుండైయుండు అతండె పరమాత్మ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -10 - 288)
“పరా = ఉత్తమరాలైన, మా = మహాలక్ష్మి - ఉత్తమరాలైన మహాలక్ష్మి గలవాడే పరమాత్మ”.
“ఏకస్తు సూర్యో బహుధా జలాధారేషు దృశ్యతే |
ఆ భాతి పరమాత్మాచ సర్వోపాధిషు సంస్థితః ||“.
(ఒకడే అయిన సూర్యుడు జలాధారములందు అనేకముగా కనబడును. ఆ ప్రకారముగానే పరమాత్మాన్ని ఉపాధులందు ఉన్నాడు).
(kāryakāraṇamulakaṃṭe vērai nitya śuddha, buddha, mukta svabhāvamukalavāḍu parabrahma - utkṛṣṭamainaātma ayinavāḍu).
(utkṛṣṭamaina ātma - utkṛṣṭuḍu, ātma ayinavāḍu - samasta jīvātmalakaṃṭe utkṛṣṭamainavāḍu.)
(anniṃṭikaṃṭe utkṛṣṭamaina svarūpamu galavāḍu).
( utkṛṣṭamainavāḍu, ātma ayinavāḍu - sūkṣmulaina jīvulakaṃṭe paruḍu - utkṛṣṭamainavāḍu - vāri kaṃṭe sūkṣmuḍainavāḍu). sūkṣmulaina jīvātmalakaṃṭe sūkṣmamaina ātma ayinavāḍu).
(utkṛṣṭamaina ātma).
(dēhamu modalaguvāṭikaṃṭe utkṛṣtamainavāṭikaṃṭe, utkṛṣṭamaina parabrahmamē paramātma - vyaṣṭi sthūla dēhamukaṃṭe, sūkṣmamulagu jñānēṃdriya karmēṃdriyamulakaṃṭenu, manō buddhulakaṃṭenu, samaṣṭi rūpamulagu hiraṇyagarbhuḍu, mahattatvamulakaṃṭe utkṛṣṭamu, goppadi yagu ātma yaguṭavalana paramātma yani ceppabaḍinadi).
tairēva vigataḥ śuddhaḥ - paramātmā nigadyatē ||“.
(prakṛti guṇamulaina satvarajastamamulatō kūḍi yunna kṣētrajñuḍu - jīvuḍu - ātma - ā guṇamulu lēnivāḍu - prakṛti saṃbaṃdhamulēnivāḍu paramātma ani ceppabaḍucunnāḍu).
(parama puruṣuḍē paramātma - atanikaṃṭe utkṛṣṭamainadi lēdu kanuka - “puruṣuni kaṃṭe utkṛṣṭamainadi ēdiyulēdu”. atanē ‘kāṣṭā’ (atyuttamainadi), atanē paramagati, paramapadamu, mōkṣasthānamu, vaikuṃṭhamu ayinavāḍu - ani ceppabaḍiyunnadi kanuka).
kṣarāṇi sarvāṇi bhūtāni kūṭasthō akṣara ucyatē |
uttamaḥ puruṣastvanyaḥ paramātmētyudāhṛtaḥ |
yō lōka trayamāviśya bibhartya vyaya īśvaraḥ ||“. (śrīmadbhagavadgīta - 15 - 16,17)
(ī lōkamaṃdu puruṣulu reṃḍu vidhamulugānunnāru - kṣarapuruṣuḍu, akṣarapuruṣuḍu. kṣarapuruṣuḍanagā naśiṃcunaṭṭi samasta bhūtamulu - akṣarapuruṣuḍanagā naśiṃcunaṭṭi naśiṃcanaṭuvaṃṭi kūṭasthuḍu - jīvuḍu - ī reṃḍiṃṭikaṃṭe uttamamaina puruṣuḍunnāḍu - atanē vyayarahituḍu, prapaṃcamaṃtaṭilōnū vyāpiṃci dānini bhariṃcuvāḍaina paramātmayani ceppabaḍucunnāḍu).
“vēdāṃta śravaṇaṃbuna grahiṃpabaḍi jñānavairāgyaṃbula tōḍaṃgūḍina bhakticēta datparulaina peddalu kṣētrajñuṃḍaina yātmayaṃdu baramātmaṃ boḍagaṃduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 2 - )
pratyagabhinnaḥ -
(pratyagātmakanna vēru kānivāḍu).
(śrī śaṃkaraḥ)
(dēhamu modalu avyaktamu vaṟaku gala vastuvulanniṃṭikī avidyacēta pratyagātmagā kalpiṃcabaḍina vastuvulanniṃṭikaṃṭenu utkṛṣṭamaina upadraṣṭa lakṣaṇamulugala ātmayē paramātma).
(dēśamucētagāni, kālamucētagāni, svarūpamu - vastuvu - cētagāni paricchinnamukāka (trividhaparicchēdarahituḍai aṃtaṭanu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - ani paramātma padamunaku - paramātma anumāṭaku - nirvacanamu - arthamu). (sarvavyāpakuḍaina ātma kanuka paramātma).
“mūḍumūrtulaku mūlaṃbagu paramātmavu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )
“kāraṇātī tatvaṃbuvalana baramātmuṃḍa vayyunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.-
“tasmin śikhāyā madhyē paramātmā vyava sthitaḥ |
sa brahma, sa śivassa harisyēṃdrassō (a)kṣaraḥ paramasvarāṭ ||“. (maṃtrapuṣpamu).
(jīva śarīramulōni jaṭharāgni jvālamadhyamuna paramātma yunnāḍu - atanē brahma, atanē śivuḍu, atanē viṣṇuvu, atanē iṃdruḍu, akṣaruḍu, paramuḍu, svarāṭṭunnū.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)
“draṣṭayu, dṛkkunu dṛśyaṃbanaṃdagu nīmūṭi yaṃdunokaṭi lēkunna nokaṭi gānarādu. ītritayaṃbevvaṃḍeṟuṃgu nataṃḍu sarva lōkāśrayuṃḍaiyuṃḍu ataṃḍe paramātma”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -10 - 288)
“parā = uttamarālaina, mā = mahālakṣmi - uttamarālaina mahālakṣmi galavāḍē paramātma”.
“ēkastu sūryō bahudhā jalādhārēṣu dṛśyatē |
ā bhāti paramātmāca sarvōpādhiṣu saṃsthitaḥ ||“.
(okaḍē ayina sūryuḍu jalādhāramulaṃdu anēkamugā kanabaḍunu. ā prakāramugānē paramātmānni upādhulaṃdu unnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.